"వాల్మీకి, వ్యాసుడు, శుక్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి ఎందరో మహాపురుషులను మహా భక్తులుగా మలచిన వాడే నారదుడు. సత్పురుషుల సాంగత్యం మనలను ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దిగలదు అనడానికి నారదమహర్షి జీవితమే ఉదాహరణ.
నారదుడు పూర్వజన్మలో దాసీ పుత్రుడు. అతని తల్లి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఊడిగం చేసేది, ప్రతి రోజు ఆమె వెంట యజమాని ఇంటికి వెళ్ళేవాడు నారదుడు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేదవేదాంగాలను వింటూ తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష చేయడానికి ఆ ఇంటికి వస్తారు,
వారికి నారదుడు భక్తితో సపర్యలు చేస్తాడు.
దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదునికి ""ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని"" ఉపదేశించాడంతో పాటు జ్ఞాన బోధ చేస్తారు వారు, అవి అతని మనసులో బలంగా నాటుకున్నాయి. పాముకాటు కారణంగా తన తల్లి చనిపోయాక ఈశ్వరాన్వేషణ చేస్తూ.......
అరణ్యానికి వెళ్లి రావి చెట్టు కింద కూర్చొని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తుంటాడు. తన భక్తికి ప్రసన్నుడైన శ్రీమన్నారాయణడు లీలా మాత్రంగా దర్శనమిచ్చి సత్పురుషుల తో తిరిగిన అదృష్టం వల్ల నీకు లీలామాత్రంగా దర్శనం ఇచ్చాను.
ఈ జన్మాంతరం నీవు బ్రహ్మ కుమారుడిగా జన్మించి నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు అని వరాన్ని అనుగ్రహిస్తాడు.
శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే కల్పాంతం తరువాత తన కుమారుడి గా నారదుని సృష్టించాడు బ్రహ్మ. అప్పటి నుంచి తను మహతి అనే వీణను మ్రోగిస్తూ....
నారాయణ నామం చెబుతూ లోక కళ్యాణ కార్యాలను చేసేవాడు. నారదమహర్షి ని దేవతలే కాకుండా రాక్షసులు సైతం గౌరవించేవారు. ఈ మహనీయుని జ్ఞాన బోధల ఆధారంగా ఈ లోకానికి ""నారద పురాణం, నారద భక్తి సూత్రాలు, నారదోపనిషత్తు"" వంటి మహత్తర గ్రంధాలు అనుగ్రహించబడ్డాయి. "
జై శ్రీమన్నారాయణ
🙏🙏🙏🙏🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Father Of Hindutva గా ,
సుమారు 50 సంవత్సరాల పాటు భారత స్వతంత్రఉద్యమాన్ని, రాజకీయాలను ప్రభావితం చేసిన అనన్య సామాన్యుడు, హిందూ సమాజం ఐక్యత కి స్పష్టమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు సావర్కర్...
అతి చిన్న వయసులోనే సావర్కర్ ముగ్గురు సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ , నారాయణ దామోదర్ సావర్కర్ లు ఆ నాటి బ్రిటిషు క్రైస్తవ అరాచకపాలనలో భారతీయలు పడుతున్న కష్టాలకి చలించి తమ కుల దేవత అష్టభుజాదేవి మందిరం లో తమ దేహం లో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం,
దేశ ప్రజల కోసం స్వాతంత్రం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు..ఆ ప్రతిజ్ఞ కి కట్టుబడి ప్రాణం పోయేంతవరకు తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో శిక్షలు అనుభవించి స్వాతంత్రం కోసం పోరాడారూ. ఆ ముగ్గురిలో ఒకరే వినాయక్ దామోదర్ సావర్కర్ ,
#ప్రహ్లాద్_జానీ_స్మృత్యంజలి
(1929 - 2020) #Read_Thread
గుజరాత్ రాష్ట్రం మెహ్సానా జిల్లాలోని చారదా గ్రామంలో వీరు జన్మించారు. ఏడు సంవత్సరాల వయసులోనే ఇంటిని వదిలి అడవులలో జీవించడానికి వెళ్లారు. 12 సంవత్సరాల వయసులో వారికి దుర్గాదేవి ప్రత్యక్షమై వారి కపాల కుహరంలో
అమృత బిందువులు జారవిడిచింది అని చెప్తారు. అప్పటి నుంచి వారి శరీరానికి అన్న పానీయాల ఆవశ్యకత లేకుండా పోయిందని చెప్పేవారు. మన యోగ శాస్త్రములలో ""ఖేచరి ముద్ర"" గురించి చెప్పబడింది. ఖేచరి ముద్ర సిద్ధించిన సాధకులకు కపాలం నుంచి అమృత బిందువులు అంగిలి లోకి పడతాయని, వాటిని సేవించడం వల్ల
శరీరానికి ఆకలి, దప్పికలు లేక శరీరం కృశించక తేజస్సు కలిగి ఉంటుందని తెలియజేయబడింది. యోగులు సుదీర్ఘకాలంపాటు శరీరానికి ఎటువంటి ఆటంకమూ లేకుండా తపస్సు చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రహ్లాద్ జానీ కూడా వారి జీవితంలో ఎక్కువ సమయం తపస్సు లోనే గడుపుతూ గుప్తంగా జీవించేవారు.
"విష్ణు భగవానుని దశావతారములలో రెండవది కూర్మావతారము. దూర్వాస మహర్షి శాప ప్రభావం చేత దేవతల శక్తి క్షీణించడం వల్ల అదే అదునుగా భావించిన అసురులు దేవతలతో యుద్ధము చేసి వారిని ఓడిస్తారు, దీంతో దేవతలందరూ తమని కాపాడమని శ్రీమహావిష్ణువుని వేడుకొనగా....
సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించమని శ్రీ మహావిష్ణువు వారికి ఉపదేశం చేస్తారు.
ఆ కార్యాన్ని సాధించడానికి వారి బలం ఒక్కటే సరిపోదు అని గ్రహించిన దేవతలు రాక్షసులతో సంధి కుదుర్చుకుంటారు. అలా దేవదానవులు ఇరువురూ కలిసి మందర పర్వతం కవ్వంగా చేసి,
వాసుకి త్రాడుగా మలచి క్షీరసాగర మథనం మొదలుపెడతారు. కానీ మందరపర్వతం పాల సముద్రంలో మునిగి పోసాగింది. దీంతో దేవతలందరూ ఆ దేవదేవుడైన శ్రీ మహా విష్ణువుని వేడుకొనగా తాను కూర్మావతారం ధరించి మందరపర్వతం సముద్రగర్భంలో మునిగిపోకుండా దాని బరువును మోస్తూ వారి కార్యాన్ని సుగమం చేసి దేవతలకు
"ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
C/N
అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని చాటిన భారత జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాము.
C/N
ఆ మహనీయులు పుట్టిన బెంగాల్ రాష్ట్రంలోని నేటి హిందువుల దుర్భర పరిస్థితులను చూస్తే, ఆ విశ్వకవి ఇప్పుడు జన్మించి ఉంటే తను రచించిన గీతాంజలి కి బదులుగా మృత్యు అంజలి రచించే వారేమో. మొన్నటి బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి హిందువుల దుకాణాలు లూటీ చేయబడ్డాయి,
"తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామందికి ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, విలువిద్య మరియు మూలికా వైద్యం లో కూడా సిద్ధహస్తులు.
C/N
ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.
C/N
సాధారణంగా మన దృష్టిలో సన్యాసి అంటే అన్నింటినీ త్యజించి ముక్కు మూసుకుని ఏదో ఒక మూల తపస్సు చేసుకునేవారనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఒకసారి చరిత్ర పరికించి చూస్తే చుట్టూ ఉన్న సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.....