Father Of Hindutva గా ,
సుమారు 50 సంవత్సరాల పాటు భారత స్వతంత్రఉద్యమాన్ని, రాజకీయాలను ప్రభావితం చేసిన అనన్య సామాన్యుడు, హిందూ సమాజం ఐక్యత కి స్పష్టమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు సావర్కర్...
అతి చిన్న వయసులోనే సావర్కర్ ముగ్గురు సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ , నారాయణ దామోదర్ సావర్కర్ లు ఆ నాటి బ్రిటిషు క్రైస్తవ అరాచకపాలనలో భారతీయలు పడుతున్న కష్టాలకి చలించి తమ కుల దేవత అష్టభుజాదేవి మందిరం లో తమ దేహం లో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం,
దేశ ప్రజల కోసం స్వాతంత్రం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు..ఆ ప్రతిజ్ఞ కి కట్టుబడి ప్రాణం పోయేంతవరకు తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో శిక్షలు అనుభవించి స్వాతంత్రం కోసం పోరాడారూ. ఆ ముగ్గురిలో ఒకరే వినాయక్ దామోదర్ సావర్కర్ ,
పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేని వయసులో రవి అస్తగమించని సామ్రాజ్యాన్ని తన రచన తో హడలెత్తించాడు. 1857 ఉవ్వెత్తున ఎగసిన స్వాతంత్ర సంగ్రామాన్ని ఒక సాధారణ సిపాయిల తిరుగుబాటుగా ప్రజలను నమ్మించి, మోసగించి, ప్రచారం చేసి 50 ఏళ్ళు మభ్యపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వాన్నీ ఉలిక్కి పడేలా చేస్తూ
"ఇండియా వార్ ఏ ఇండిపెండెన్స్ 1857 " అనే పుస్తకం రాసాడు. ఆ పుస్తకమే బోస్, భగత్ సింగ్, మదన్ లాల్, ఆజాద్ లాంటి స్వాతంత్ర్య సమర యోధులకు స్ఫూర్తిదాయకం అయింది.. ఆ పుస్తకానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంత భయపడింది అంటే ఆ పుస్తకాన్ని అచ్చువేయమని లండన్ నుండి సావర్కర్ అన్నయ్య బాబారావు గారికి
పంపిస్తే ఆ పుస్తక ప్రతులు ఉన్న కారణంగా ఆయన మీద దేశ ద్రోహ కేసు పెట్టేంతగా... 30 ఏళ్ళు కూడా నిండని వయసులో లండన్ వెళ్లి భారతమాత కోసం ప్రాణాలకు తెగించే విప్లవకారులను తయారుచేసి నాసిక్ కి తుపాకులు పంపి భారతీయులను హింసించే బ్రిటిష్ అధికారులను మట్టుపెట్టించాడు..
బ్రిటిష్ యువరాణికి తలొగ్గక, తన బారిస్టర్ పట్టాను త్యజించాడు..
ఎవరూ ఆలోచించడానికి, సాహసించని విధంగా బ్రిటిషు వారు అరెస్ట్ చేసి అండమాన్ తరలిస్తుండగా ఫ్రాన్స్ లో ఓడలో డ్రైనేజీ గొట్టం నుండి సముద్రం లోకి దూకి ఈదుకుంటూ తప్పించుకోబోయాడు..
ఇంతకుముందు ఎవరికీ వేయని విధంగా రెండుసార్లు యవజ్జివ శిక్ష పడ్డ ఖైదీ గా అండమాన్ లోని కలపాని జైల్ లో చిత్రహింసలకు గురై కూడా రాళ్లనే కలం గా మార్చుకుని జైలు గోడలపై ఆరువేల దేశభక్తి కవితలు రాసి,అవి కంఠస్థం చేసి అక్కడి ఖైదీలతో పాడించి జైలు లో ఖైదీల్లో దేశభక్తి రగిలించాడు..
జైలు జీవితం లోనే "హిందూత్వ హు ఐస్ హిందూ" అనే పుస్తకాన్ని రచించి హిందువులకు మార్గనిర్దేశం చేశాడు.
‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే.
అని హిందుత్వానికి స్పష్టమైన నిదర్శనం ఇచ్చి హైందవ జాతికి మార్గనిర్దేశకత్వం చేసాడు.. శుద్ధి కార్యక్రమం ద్వారా ఎంతో మంది మతం మారిన వారిని హిందువులుగా మార్చి, హిందూత్వం లో అసమానతలు అస్పృశ్యత పై పోరాడి హిందువులందరికీ ఆలయ ప్రవేశం పై పోరాటం చేసి, పతిత పావన మందిరాన్ని నిర్మించారు...
ఎంతో మంది విప్లవ వీరులను తయారుచేసి రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో హిందువులందరిని బ్రిటిషు సైన్యం లో చేర్చి తరవాతి కాలం లో వారితోనే బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేసేలా రాచబాట వేసి నేతాజీ కల ను సుగమం చేశారు...
ఒక కవిగా, ఒక రచయితగా, ఒక రాజకీయ నాయకుడుగా, స్వాతంత్ర సమరవీరుడిగా, విప్లవకారుడిగా , తత్వవేత్తగా ఎన్నో ప్రజ్ఞలు ఉన్నా తన సమస్తాన్ని కేవలం దేశం కోసం ధర్మం కోసమే తప్ప ఇంకా దేనికీ ఉపయోగించని త్యాగశీలి.. తన రచనల ద్వారా , ప్రసంగాల ద్వారా దేశ యువకుల్లో దేశభక్తి ని రగిలించాడు...
మన దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న దౌర్భాగ్య స్థితిని
అంటే "ఎన్నికల హక్కులు, పదవులు, ఉద్యోగాలు, పనుల్లో మతాల ప్రస్తావన లేకుండా భారతదేశాన్ని బారతీయంగా ఉంచాలని " దూరదృష్టి తో ఆయన చెప్పినవి ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు...
హైదరాబాద్ సంస్థానం లో నిజామ్ కి వ్యతిరేఖంగా హైదరాబాద్ విముక్తి సత్యాగ్రహం లో పోరాడాడు.. అయినా మనకి ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే,
స్వాతంత్రం తెచ్చింది గాంధీ , నెహ్రూలే అని మనల్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తే....
దేశం కోసం ఏమీ చేయకపోవడం #మరణంతో సమానం అని నినదించిన సావర్కర్ మాటలు మన చెవికి ఎలా చేరుతాయి....!
ఆ మాట మన చెవిన పడితే, ఆయన స్ఫూర్తి మనలో రగిలితే, ఆయన తన జీవితం అంతా పేరు కోసం, పదవి కోసం, డబ్బు కోసం కాకుండా సంపూర్ణ హిందు రాష్ట్రం కోసం త్యాగం చేసాడని మనకు తెలిస్తే, బ్రిటిష్ వాడు స్థాపించిన
INDIAN NATIONAL CONGRESS అనే పార్టీ ఈ దేశం లో ఇప్పటివరకు బతికి బట్టగలదా,
ఎప్పుడో జాతీయవాదుల పిడికిళ్ల తో కూకటివేళ్ళతో సహా పేకళించి వేయబడేది, ఆ విషయం వాళ్ళకి తెలుసు
అందుకే వాళ్లు మనకి చెప్పరు.
జీవిత చరమాంకం లో సావర్కర్ రాసిన
భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు అనే పుస్తకం మన మెదళ్లను తాకితే మనలో విప్లవజ్వాలలు రేగుతాయని....
ఆ మంటల్లో దేశద్రోహులు దహింపబడతారని వాళ్ళకి తెలుసు.. అందుకే వాళ్ళు మనకు చెప్పరు..
సావర్కర్ " సద్గుణ వికృతి " గా చెప్పిన మాటలు మన మస్తిష్కాలను స్పృశిస్తే తరతరాలు గా హిందువుల మెదళ్ళకి పట్టిన బూజు వదిలిపోతుందని వాళ్ళకి తెలుసు.. అందుకే వాళ్ళు మనకు చెప్పరు...
అలాంటి స్వాతంత్ర వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడు స్మరణతో ఈ దినాన్ని పవిత్ర పరిపూర్ణ దినం గా మార్చుకుందాం.
"వాల్మీకి, వ్యాసుడు, శుక్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి ఎందరో మహాపురుషులను మహా భక్తులుగా మలచిన వాడే నారదుడు. సత్పురుషుల సాంగత్యం మనలను ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దిగలదు అనడానికి నారదమహర్షి జీవితమే ఉదాహరణ.
నారదుడు పూర్వజన్మలో దాసీ పుత్రుడు. అతని తల్లి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఊడిగం చేసేది, ప్రతి రోజు ఆమె వెంట యజమాని ఇంటికి వెళ్ళేవాడు నారదుడు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేదవేదాంగాలను వింటూ తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష చేయడానికి ఆ ఇంటికి వస్తారు,
వారికి నారదుడు భక్తితో సపర్యలు చేస్తాడు.
దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదునికి ""ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని"" ఉపదేశించాడంతో పాటు జ్ఞాన బోధ చేస్తారు వారు, అవి అతని మనసులో బలంగా నాటుకున్నాయి. పాముకాటు కారణంగా తన తల్లి చనిపోయాక ఈశ్వరాన్వేషణ చేస్తూ.......
#ప్రహ్లాద్_జానీ_స్మృత్యంజలి
(1929 - 2020) #Read_Thread
గుజరాత్ రాష్ట్రం మెహ్సానా జిల్లాలోని చారదా గ్రామంలో వీరు జన్మించారు. ఏడు సంవత్సరాల వయసులోనే ఇంటిని వదిలి అడవులలో జీవించడానికి వెళ్లారు. 12 సంవత్సరాల వయసులో వారికి దుర్గాదేవి ప్రత్యక్షమై వారి కపాల కుహరంలో
అమృత బిందువులు జారవిడిచింది అని చెప్తారు. అప్పటి నుంచి వారి శరీరానికి అన్న పానీయాల ఆవశ్యకత లేకుండా పోయిందని చెప్పేవారు. మన యోగ శాస్త్రములలో ""ఖేచరి ముద్ర"" గురించి చెప్పబడింది. ఖేచరి ముద్ర సిద్ధించిన సాధకులకు కపాలం నుంచి అమృత బిందువులు అంగిలి లోకి పడతాయని, వాటిని సేవించడం వల్ల
శరీరానికి ఆకలి, దప్పికలు లేక శరీరం కృశించక తేజస్సు కలిగి ఉంటుందని తెలియజేయబడింది. యోగులు సుదీర్ఘకాలంపాటు శరీరానికి ఎటువంటి ఆటంకమూ లేకుండా తపస్సు చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రహ్లాద్ జానీ కూడా వారి జీవితంలో ఎక్కువ సమయం తపస్సు లోనే గడుపుతూ గుప్తంగా జీవించేవారు.
"విష్ణు భగవానుని దశావతారములలో రెండవది కూర్మావతారము. దూర్వాస మహర్షి శాప ప్రభావం చేత దేవతల శక్తి క్షీణించడం వల్ల అదే అదునుగా భావించిన అసురులు దేవతలతో యుద్ధము చేసి వారిని ఓడిస్తారు, దీంతో దేవతలందరూ తమని కాపాడమని శ్రీమహావిష్ణువుని వేడుకొనగా....
సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించమని శ్రీ మహావిష్ణువు వారికి ఉపదేశం చేస్తారు.
ఆ కార్యాన్ని సాధించడానికి వారి బలం ఒక్కటే సరిపోదు అని గ్రహించిన దేవతలు రాక్షసులతో సంధి కుదుర్చుకుంటారు. అలా దేవదానవులు ఇరువురూ కలిసి మందర పర్వతం కవ్వంగా చేసి,
వాసుకి త్రాడుగా మలచి క్షీరసాగర మథనం మొదలుపెడతారు. కానీ మందరపర్వతం పాల సముద్రంలో మునిగి పోసాగింది. దీంతో దేవతలందరూ ఆ దేవదేవుడైన శ్రీ మహా విష్ణువుని వేడుకొనగా తాను కూర్మావతారం ధరించి మందరపర్వతం సముద్రగర్భంలో మునిగిపోకుండా దాని బరువును మోస్తూ వారి కార్యాన్ని సుగమం చేసి దేవతలకు
"ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
C/N
అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని చాటిన భారత జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాము.
C/N
ఆ మహనీయులు పుట్టిన బెంగాల్ రాష్ట్రంలోని నేటి హిందువుల దుర్భర పరిస్థితులను చూస్తే, ఆ విశ్వకవి ఇప్పుడు జన్మించి ఉంటే తను రచించిన గీతాంజలి కి బదులుగా మృత్యు అంజలి రచించే వారేమో. మొన్నటి బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి హిందువుల దుకాణాలు లూటీ చేయబడ్డాయి,
"తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామందికి ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, విలువిద్య మరియు మూలికా వైద్యం లో కూడా సిద్ధహస్తులు.
C/N
ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.
C/N
సాధారణంగా మన దృష్టిలో సన్యాసి అంటే అన్నింటినీ త్యజించి ముక్కు మూసుకుని ఏదో ఒక మూల తపస్సు చేసుకునేవారనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఒకసారి చరిత్ర పరికించి చూస్తే చుట్టూ ఉన్న సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.....