ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ప్రజా జీవితంలో అతను అలంకరించిన పదవిని బట్టి ఉండదు. చరిత్రలో అతను కలగజేసిన దీర్ఘకాలిక ప్రభావం, కాల క్రమంలో అతని ఉనికి యొక్క అవసరం మీద ఆధారపడి ఉంటుంది.
ఒక చిన్న మర్రి విత్తనం నుంచి మహావృక్షం ఉద్భవించినట్లు డాక్టర్ జి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే మహావృక్షం ఉద్భవించింది. ఆ మహా వృక్షపు నీడలో భరతజాతి సుమారు శతాబ్ద కాలంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది.
తను చదివిన వైద్యశాస్త్రం తో కొందరి రుగ్మతలను మాత్రమే పోగొట్టగలనని కానీ సామాజిక రుగ్మతలను పోగొట్టడం దానిని మించిన సేవ అని భావించిన డాక్టర్ జీ తన పూర్తి జీవితాన్ని భరతమాత చరణాలకు అర్పించారు. వీరు మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉగాది పర్వదినాన జన్మించారు.
వీరి పూర్తి పేరు కేశవరావు బలీరాం హెడ్గేవార్. చిన్ననాటి నుంచే ఆయన దేశభక్తుడు, బ్రిటిష్ పాలకుల పద్ధతులపై ధైర్యంగా నిరసన వ్యక్తం చేసేవారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతుండగా విక్టోరియా రాణి పాలన 60వ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు పంచిపెట్టిన మిఠాయిలను ముట్టుకోనని శపథం చేశారు,
అంతేకాకుండా బ్రిటిష్ పాలకుల ఆదేశాలకు విరుద్ధంగా వందేమాతరం గీతాన్ని ధైర్యంగా ఆలపించారు.కళాశాలలో చదువుతున్న రోజుల్లో అనుశీలన సమితి లో సభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.
స్వాతంత్ర పోరాటంలో రెండుసార్లు అరెస్ట్ అయ్యి మొత్తం 19 నెలల కాలాన్ని జైలులో గడిపారు.
ఆ సమయంలో దేశంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు వారిని ఆలోచింపజేశాయి. హిందూ సమాజ బలహీనత వల్లే వేల సంవత్సరాల బానిస బ్రతుకు జాతికి శాపంగా పరిణమించిందని, హిందూ సమాజంలోని అనైక్యతను తొలగించి హిందువులందరూ సోదరులలాగా ఎదిగితే భారతదేశం అగ్రగామిగా నిలబడుతుందని దృఢ నమ్మకం ఏర్పడింది వారికి.
దానికితోడు దేశంలో ఆ సమయంలో జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమం కూడా వారి ఆలోచనలను మరింత బలపడేలా చేసింది. స్వాతంత్రం అంటూ వస్తే అది పూర్ణ స్వాతంత్రం అవ్వాలి. అంటే ఈ జాతి యొక్క అస్తిత్వం నిలబడేలా,దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడి వారు స్వేచ్ఛగా ఆచరించుకునేలా పరిపూర్ణ స్వాతంత్ర్యం కావాలి,
దానికి హిందూ సంఘటన ఒక్కటే మార్గం అని భావించి 1925వ సంవత్సరం విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు.
హిందూ సమాజంలో జాతీయ భావాలను, సంస్కారాలను, సమాజ ఉన్నతి కోసం నిస్వార్ధంగా పనిచేయాలనే భావాన్ని నింపాలని డాక్టర్ జి భావించారు.
అటువంటి ఉన్నత భావాలు నిండిన వ్యక్తులు తమ ఆచరణ ద్వారా హిందూ సమాజంలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం నింపి సంపూర్ణ సమాజాన్ని సంఘటితం, చైతన్యవంతం చేయగలరని వారు భావించారు. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆ భావాలతోనే నిస్వార్థంగా పని చేస్తోంది.
ఇటువంటి దూరదృష్టి, దార్శనికత కలిగిన డాక్టర్ జి నేడు మన మధ్య లేకపోయినా సంఘ కార్యం ద్వారా ఈ జాతి నిలిచి ఉన్నంత వరకూ వారు సజీవులే. ఇటువంటి మహనీయుల ముందు చూపు వల్ల నేడు భారతదేశంలో హిందూ సమాజం వేల సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా బలంగా నిలబడి తన ఉనికిని చాటుకుంటుందంటే అతిశయోక్తి కాదు.
ప్రతి ఒక్క హిందువు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గురించి తప్పక తెలుసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సంఘ శాఖకు వెళ్లి వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవడంతో పాటు వారి జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం కొంతైనా కేటాయించాలని కోరుకుంటూ శివశక్తి....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
"దేశ స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి ఎంతో మంది జాతీయ నాయకులను అందించిన రాష్ట్రమైన బెంగాల్ లోని కలకత్తా నగరంలో 1901 వ సంవత్సరంలో జన్మించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ. అతని విద్యాభ్యాసం అంతా కలకత్తా నగరంలోనే జరిగింది.
1924 లో న్యాయవాద విద్య పూర్తిచేసి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ కు పయనమై 1927 లో బారిష్టర్ పట్టా పొందారు. 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించబడి 1938 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
స్వాతంత్రోద్యమ కాలంలో బెంగాల్ లో పరిస్థితులు క్షీణించాయి. ముస్లింలీగ్ అండతో హిందువుల పై దారుణమైన అత్యాచారాలు, హత్యాకాండ కొనసాగింది. దోపిడీదారులైన ముస్లింలకు ప్రత్యేక దేశం నినాదంతో దేశవ్యాప్తంగా హత్యా రాజకీయాలకు తెరతీశారు ముస్లింలు.
"వందల సంవత్సరాల ఇస్లామిక్ మతోన్మాద దోపిడీదారుల పాలనలో వేల సంఖ్యలో దేవాలయాలు ధ్వంసం కాబడ్డాయి, కోట్ల మంది భారతీయుల మాన, ప్రాణాలు దోచుకోబడ్డాయి.
అటువంటి విపత్కర పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులను అసాధారణ సైన్యంగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపి ముస్లిం మతోన్మాదుల పీచమణచారు చత్రపతి శివాజీ మహారాజ్. స్వామి సమర్థ రామదాసు మార్గదర్శనంలో ఒకవైపు తన కంటే బలమైన సైన్యమున్న ఢిల్లీలోని మొగలు సైన్యం తోనూ,
మరోవైపు బీజాపూర్ సుల్తాన్ ల తోను తనదైన రీతిలో పోరాటం చేసి విజయం సాధించారు.తనదైన యుద్ధ వ్యూహాలతో, గెరిల్లా యుద్ధ తంత్రాలతో 300కు పైగా కోటలను ధర్మ పరిపాలనలోకి తీసుకువచ్చారు ఆయన. భారతీయుల గుండెల్లో స్వాభిమాన జ్వాలలు రగిలించి, విదేశీ మతాల దాడులను, కుట్రలను, కుతంత్రాలను ఎదిరించి,
Father Of Hindutva గా ,
సుమారు 50 సంవత్సరాల పాటు భారత స్వతంత్రఉద్యమాన్ని, రాజకీయాలను ప్రభావితం చేసిన అనన్య సామాన్యుడు, హిందూ సమాజం ఐక్యత కి స్పష్టమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు సావర్కర్...
అతి చిన్న వయసులోనే సావర్కర్ ముగ్గురు సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ , నారాయణ దామోదర్ సావర్కర్ లు ఆ నాటి బ్రిటిషు క్రైస్తవ అరాచకపాలనలో భారతీయలు పడుతున్న కష్టాలకి చలించి తమ కుల దేవత అష్టభుజాదేవి మందిరం లో తమ దేహం లో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం,
దేశ ప్రజల కోసం స్వాతంత్రం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు..ఆ ప్రతిజ్ఞ కి కట్టుబడి ప్రాణం పోయేంతవరకు తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో శిక్షలు అనుభవించి స్వాతంత్రం కోసం పోరాడారూ. ఆ ముగ్గురిలో ఒకరే వినాయక్ దామోదర్ సావర్కర్ ,
"వాల్మీకి, వ్యాసుడు, శుక్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి ఎందరో మహాపురుషులను మహా భక్తులుగా మలచిన వాడే నారదుడు. సత్పురుషుల సాంగత్యం మనలను ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దిగలదు అనడానికి నారదమహర్షి జీవితమే ఉదాహరణ.
నారదుడు పూర్వజన్మలో దాసీ పుత్రుడు. అతని తల్లి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఊడిగం చేసేది, ప్రతి రోజు ఆమె వెంట యజమాని ఇంటికి వెళ్ళేవాడు నారదుడు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేదవేదాంగాలను వింటూ తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష చేయడానికి ఆ ఇంటికి వస్తారు,
వారికి నారదుడు భక్తితో సపర్యలు చేస్తాడు.
దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదునికి ""ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని"" ఉపదేశించాడంతో పాటు జ్ఞాన బోధ చేస్తారు వారు, అవి అతని మనసులో బలంగా నాటుకున్నాయి. పాముకాటు కారణంగా తన తల్లి చనిపోయాక ఈశ్వరాన్వేషణ చేస్తూ.......
#ప్రహ్లాద్_జానీ_స్మృత్యంజలి
(1929 - 2020) #Read_Thread
గుజరాత్ రాష్ట్రం మెహ్సానా జిల్లాలోని చారదా గ్రామంలో వీరు జన్మించారు. ఏడు సంవత్సరాల వయసులోనే ఇంటిని వదిలి అడవులలో జీవించడానికి వెళ్లారు. 12 సంవత్సరాల వయసులో వారికి దుర్గాదేవి ప్రత్యక్షమై వారి కపాల కుహరంలో
అమృత బిందువులు జారవిడిచింది అని చెప్తారు. అప్పటి నుంచి వారి శరీరానికి అన్న పానీయాల ఆవశ్యకత లేకుండా పోయిందని చెప్పేవారు. మన యోగ శాస్త్రములలో ""ఖేచరి ముద్ర"" గురించి చెప్పబడింది. ఖేచరి ముద్ర సిద్ధించిన సాధకులకు కపాలం నుంచి అమృత బిందువులు అంగిలి లోకి పడతాయని, వాటిని సేవించడం వల్ల
శరీరానికి ఆకలి, దప్పికలు లేక శరీరం కృశించక తేజస్సు కలిగి ఉంటుందని తెలియజేయబడింది. యోగులు సుదీర్ఘకాలంపాటు శరీరానికి ఎటువంటి ఆటంకమూ లేకుండా తపస్సు చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రహ్లాద్ జానీ కూడా వారి జీవితంలో ఎక్కువ సమయం తపస్సు లోనే గడుపుతూ గుప్తంగా జీవించేవారు.
"విష్ణు భగవానుని దశావతారములలో రెండవది కూర్మావతారము. దూర్వాస మహర్షి శాప ప్రభావం చేత దేవతల శక్తి క్షీణించడం వల్ల అదే అదునుగా భావించిన అసురులు దేవతలతో యుద్ధము చేసి వారిని ఓడిస్తారు, దీంతో దేవతలందరూ తమని కాపాడమని శ్రీమహావిష్ణువుని వేడుకొనగా....
సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించమని శ్రీ మహావిష్ణువు వారికి ఉపదేశం చేస్తారు.
ఆ కార్యాన్ని సాధించడానికి వారి బలం ఒక్కటే సరిపోదు అని గ్రహించిన దేవతలు రాక్షసులతో సంధి కుదుర్చుకుంటారు. అలా దేవదానవులు ఇరువురూ కలిసి మందర పర్వతం కవ్వంగా చేసి,
వాసుకి త్రాడుగా మలచి క్షీరసాగర మథనం మొదలుపెడతారు. కానీ మందరపర్వతం పాల సముద్రంలో మునిగి పోసాగింది. దీంతో దేవతలందరూ ఆ దేవదేవుడైన శ్రీ మహా విష్ణువుని వేడుకొనగా తాను కూర్మావతారం ధరించి మందరపర్వతం సముద్రగర్భంలో మునిగిపోకుండా దాని బరువును మోస్తూ వారి కార్యాన్ని సుగమం చేసి దేవతలకు