తిధి ప్రాముఖ్యత
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది.
ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15,మరల కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు.రవిచంద్రులమధ్య దూరం 0డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి.
చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.
ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి, 12. శుక్ల ద్వాదశి, 13. శుక్ల త్రయోదశి, 14. శుక్ల చతుర్దశి, 15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి, 2. కృష్ణ విదియ, 3. కృష్ణ తదియ, 4. కృష్ణ చవితి, 5. కృష్ణ పంచమి.
మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి, 7. శుక్ల సప్తమి, 8. శుక్ల అష్టమి, 9. శుక్ల నవమి, 10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి, 7. కృష్ణ సప్తమి, 8. కృష్ణ అష్టమి, 9. కృష్ణ నవమి, 10. కృష్ణ దశమి.
సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి. ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’ రెండవ తిధి అని చెప్పాలి.
తిధి సంధి:- పంచమి, షష్ఠి లయొక్కయు, దశమి, ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును. ఈ సంధిన జననమైన యెడల పితృగండం.
గండతిధి:- పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు, నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి. శుభకార్యాలు చేయరాదు.
పంచ పర్వతిధులు :- అష్టమి, చతుర్ధశి, అమావాస్య, పౌర్ణమి, సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు. ఇవి శుభకార్యాలకు పనికిరావు.
పక్ష రంధ్ర తిధులు:- చవితి మొదటి 8 ఘడియలు, షష్ఠి మొదటి 9 ఘడియలు, అష్టమి మొదటి 14 ఘడియలు, నవమి మొదటి 25 ఘడియలు, ద్వాదశి మొదటి 10 ఘడియలు, చతుర్ధశి మొదటి 5 ఘడియలు. ఈ ఘడియలలో వివాహం చేయరాదు. మిగిలిన ఘడియలు శుభప్రధములు.
పితృ కార్యములకు తిధి:- అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం, రెండవ భాగం సంగమ కాలం, మూడవ భాగం మధ్యాన్నం, నాల్గవ భాగం అపరాహ్నం, ఐదోభాగం సాయంకాలం. ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.
Source : ఋషిపీఠం
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మీ నక్షత్రం సంబంధించిన నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని మీరు రోజు 9 సార్లు అంత కన్నా ఎక్కువగా జపించడం ఆటంకాలు తొలగిస్తుంది. కనీసం మనస్సుని ప్రశాంతముగా ఉంచటంలో సహకరిస్తుంది.
ఎవరైతే పుండరీకాక్షుడిని (మనసారా) స్మరిస్తారో - అంతవరకు అపవిత్రుడైన వారు బాహ్యంగానూ లోలోపలాకూడా శుచిత్వాన్ని పొందుతాడు; అన్ని అవస్థలకూ అతీతుడౌతాడు
వేదాంత పరిభాషలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 అవస్థలున్నాయి.సాధారణంగా మనం మెలకువ స్థితినే నిజమైనదానినిగా నమ్ముతాం. కానీ, ‘అది కాదు తురీయమే_సత్యం, మిగతా మూడు మిథ్య, అందులోమొదటి మూడూ లీనమైపోతాయి’ అంటుంది వేదాంతం.
మనసారా దేవుడిని స్మరిస్తే, ఆ నిజమైన ‘అవస్థ’ కలుగుతుంది
🙏 త్య్రంబకా🙏🔱
అమ్మ వారి సహస్ర నామాల్లో మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *త్య్రంబకాయై నమః* అని పలుకుతారు.
త్రి + అంబకా = త్య్రంబకా = మూడు కన్నులు కలది.
'అంబకము' అంటే ' కన్ను' అని ఒక అర్థం. ' బాణం' అని మరో అర్ధం కూడా ఉన్నాయి. ' కన్ను' అనే అర్ధం తీసుకుంటే 'మూడు కన్నులు కలది' అని - ఈ నామానికి అర్థం.
అమ్మవారి కుడికన్ను - సూర్యాత్మకం. ఎడమ కన్ను - చంద్రాత్మకం. ఫాలనేత్రం - అనలాత్మకం. (అగ్నితత్త్వం). సూర్య, చంద్ర, అగ్నులు సూచించే ఈ మూడు కళ్లూ వరుసగా, 1) పగలు, 2) రాత్రి 3) సంధ్యా కాలాలను గూడా సూచిస్తాయి.
🌟 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. . ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది.
ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో 'ఒడ్డియాన పీఠం' వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో 'వడ్యాణం' అంటారు.
🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట.