🙏 త్య్రంబకా🙏🔱
అమ్మ వారి సహస్ర నామాల్లో మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *త్య్రంబకాయై నమః* అని పలుకుతారు.
త్రి + అంబకా = త్య్రంబకా = మూడు కన్నులు కలది.
'అంబకము' అంటే ' కన్ను' అని ఒక అర్థం. ' బాణం' అని మరో అర్ధం కూడా ఉన్నాయి. ' కన్ను' అనే అర్ధం తీసుకుంటే 'మూడు కన్నులు కలది' అని - ఈ నామానికి అర్థం.
అమ్మవారి కుడికన్ను - సూర్యాత్మకం. ఎడమ కన్ను - చంద్రాత్మకం. ఫాలనేత్రం - అనలాత్మకం. (అగ్నితత్త్వం). సూర్య, చంద్ర, అగ్నులు సూచించే ఈ మూడు కళ్లూ వరుసగా, 1) పగలు, 2) రాత్రి 3) సంధ్యా కాలాలను గూడా సూచిస్తాయి.
కన్ను - దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం. 'దృష్టి' - అంటే 'చూడడం' అని అర్ధం. ఈ చూడటం కాలపరంగా చెప్పుకుంటే ఈ నామానికి (భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞానాన్ని సూచించే 'నేత్రత్రయాన్ని కలిగిన ది' అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును.
“ అంబకము' అంటే 'బాణము' అని అర్థం చెప్పుకున్నాం. బాణము - చోటులోకి దూసుకుపోయే లక్షణము కలది. ఇలా చోటు(space) లోకి - భూతభవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా దూసుకుపోయే చూపులు కలిగిన మూడు కన్నులు కలది - అని ఈ అర్ధాన్ని ఇంకా విపులంగా చెప్పుకోవచ్చును.
త్య్రంబకత్వం - ఒక్క శివునికే ఉంది. అందుకే రుద్రనమకంలో వచ్చే మృత్యుంజయ మంత్రంలో 'త్య్రంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనమ్ ....' అని వస్తుంది కాబట్టి, శివుని నేత్ర లక్షణాలతో సారూప్యమైనది' అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును.
1) మూడు కన్నులు కలది. 2) భూత భవిష్యత్ వర్తమాన కాలానుగుణంగా (చోటులోకి బాణం లాగా దూసుకుపోగల) చూపులు కలగిన మూడు కన్నులు కలది.
మీ నక్షత్రం సంబంధించిన నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని మీరు రోజు 9 సార్లు అంత కన్నా ఎక్కువగా జపించడం ఆటంకాలు తొలగిస్తుంది. కనీసం మనస్సుని ప్రశాంతముగా ఉంచటంలో సహకరిస్తుంది.
ఎవరైతే పుండరీకాక్షుడిని (మనసారా) స్మరిస్తారో - అంతవరకు అపవిత్రుడైన వారు బాహ్యంగానూ లోలోపలాకూడా శుచిత్వాన్ని పొందుతాడు; అన్ని అవస్థలకూ అతీతుడౌతాడు
వేదాంత పరిభాషలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 అవస్థలున్నాయి.సాధారణంగా మనం మెలకువ స్థితినే నిజమైనదానినిగా నమ్ముతాం. కానీ, ‘అది కాదు తురీయమే_సత్యం, మిగతా మూడు మిథ్య, అందులోమొదటి మూడూ లీనమైపోతాయి’ అంటుంది వేదాంతం.
మనసారా దేవుడిని స్మరిస్తే, ఆ నిజమైన ‘అవస్థ’ కలుగుతుంది
తిధి ప్రాముఖ్యత
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది.
ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15,మరల కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు.రవిచంద్రులమధ్య దూరం 0డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి.
చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.
ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి, 12. శుక్ల ద్వాదశి, 13. శుక్ల త్రయోదశి, 14. శుక్ల చతుర్దశి, 15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి, 2. కృష్ణ విదియ, 3. కృష్ణ తదియ, 4. కృష్ణ చవితి, 5. కృష్ణ పంచమి.
🌟 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. . ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది.
ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో 'ఒడ్డియాన పీఠం' వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో 'వడ్యాణం' అంటారు.
🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట.