తలనొప్పి - రోగులు వైద్యుల దగ్గరికి వచ్చే ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ తలనొప్పి రెండు రకాలు - ప్రాథమిక ( ఎటువంటి ఇతర కారణం లేనివి ) లేదా పర్యవసాన ( ఇతర కారణాల వలన). అయితే ఈ తలనొప్పికి భయపడాలా ! వద్దా !
జలుబుతో వచ్చే తలనొప్పి చాల సాధారణం కానీ ప్రమాదం లేనిది అలాగే
ప్రాణాపాయ తలనొప్పి అరుదు కానీ దానిని గుర్తించి వెంటనే చికిత్స చెయ్యాలి. ఎలా గుర్తించాలి ఇటువంటివి అంటే కింద తలనొప్పి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి అశ్రధ్ధ చెయ్యకుండా.
1.హఠాత్తుగా వచ్చిన తలనొప్పి ( అంటే సెకండ్ల వ్యవధిలో )
2.మొదటిసారి వచ్చిన తీవ్రమైన తలనొప్పి
3.ఇంతవరకు వచ్చిన తలనొప్పుల్లో ఇదే అధమం అయినప్పుడు
4.రోజులు లేదా వారం వ్యవధిలో అంతకంతకు పెరిగే తలనొప్పి
5.వంగినప్పుడు,బరువులెత్తినపుడు,దగ్గినప్పుడు వచ్చే తలనొప్పి
6.నింద్రాభంగం కలిగించే నొప్పి లేదా నిద్ర లేచిన వెంటనే వచ్చే తలనొప్పి
7.ఏదైనా శారీరిక రోగంతో పాటు వచ్చే నొప్పి - ఉదా గుండె ,కాలేయం ,మూత్రపిండాల జబ్బు
8.55ఏళ్ళ తరువాత వచ్చే తలనొప్పి
9.జ్వరం తో కూడిన తలనొప్పి
10. వాంతి తరువాత వచ్చే తలనొప్పి
11. కణతలో నొప్పితో వచ్చే తలనొప్పి.
సాధారణంగా ప్రాథమిక తలనొప్పితో డెబ్బై శాతం ఒత్తిడి తలనొప్పి ఉంటుంది. ఇది ఆందోళన, దిగులు మొదలైన మానసిక కారణాల వలన వస్తుంది. ఈ నొప్పి తల చుట్టూ బిరుసుగా ఒక పట్టీ కట్టినట్లు ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఈ నొప్పి వలన ప్రాణాపాయం ఏమీ ఉండదు.
ఆ తరువాత మరో పదహారు శాతం పార్శ్వ నొప్పి దీనినే మైగ్రైన్ అంటారు. దీనిదో పెద్ద కథ. ఆకలి,నిద్ర లేమి, కాంతి, ఒత్తిడి, అతి నిద్ర, చాకోలెట్లు,వాతావరణ అల్పపీడనం మొదలైన సవాలక్ష విషయాలు ఈ నొప్పిని తీసుకొస్తాయి. ఇది ముఖానికి,తలకి ఓక వైపు ఉంటుంది సాధారణంగా, అలాగే ఈ నొప్పితో పాటు వికారం,
వాంతులు, కళ్ళలో రంగుల రింగులు తిరగడం మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి కూడా విశ్రాంతి తీసుకుని సాధారణ నొప్పి మాత్రలు వేసుకుంటే తగ్గుతుంది. మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అలాగే కొంతమందిలో వ్యాయామం తర్వాత తలనొప్పి వస్తుంది కానీ ఇది అరుదు.
ఇకపోతే ఇన్ఫెక్క్షన్ల వలన వచ్చే తలనొప్పి పర్యవసాన తలనొప్పుల్లో 63శాతం ఉంటుంది. అది సాధారణ జలుబు నుండి మెదడువాపు వ్యాధి వరకు కొన్ని వందల రకాల కారణాలు ఉంటాయి. అవి వైరస్, బాక్టీరియా, ఫంగల్ లేదా పారసైట్ ఇన్ఫెక్షన్లు ఏవైనా కావచ్చు. ఆ తర్వాతి వరసలో తలకి గాయం వలన వచ్చే తలనొప్పి, అలాగే
రక్తనాళాల సమస్యల వలన వచ్చే తలనొప్పులు అరుదు అయినా ఇవి ప్రమాదకరం. అయితే మెదడులో కణుతుల వలన వచ్చే తలనొప్పి 0.1శాతం. కాబట్టి తలనొప్పి రాగానే కాన్సర్ వచ్చేసింది అనుకొని కంగారు పడిపోకూడదు అలాగే గూగుల్ చెయ్యకూడదు. గూగుల్ అందరికి అన్నిటికి కాన్సర్ అనే చెప్తుంది.
తలనొప్పి కి మెదడు,దానిచుట్టూ ఉండే పొరలు,రక్తనాళాలు,కళ్ళు,చెవులు, ముక్కు,ముక్కు చుట్టూ ఉండే గాలి గదులు,తలపైనుండే చర్మం, రక్త పోటు, కపాలం ,దవడలు,పళ్ళు, అంగిలి, మెదడులో నీరు, ముఖ కండరాలు, వాటికి వెళ్లే నరాలు,అన్నిటికి మించి మనసు ఇలా ఇవన్నీ కారణాలు కావచ్చు. వీటిలో ఏది కారణం అన్నది
కాసేపు కూర్చుని మాట్లాడి, పరీక్ష చేసే వైద్యుడి వలనే సాధ్యం. కేవలం స్కానింగ్ వలన సులువుగా తెలిసిపోతుంది అన్నది అపోహ. మనసుకి తెలియనిది కళ్ళు చూడలేవు, కాబట్టి ఫలానాది కారణం కావచ్చు అన్న అనుమానం లేనప్పుడు అది కారణం ఉన్నా కూడా స్కానింగ్ చూసే వైద్యుడికి కనపడదు. అన్ని తలనొప్పులకు
స్కానింగ్ అవసరం లేదు. ఎవరికైతే నాడీ వ్యవస్థ పరీక్షలో లోపాలు కనపడతాయో, అలాగే ఇటీవల వచ్చిన తీవ్రమైన తలనొప్పికి స్కానింగ్ తీసినపుడు లోపల ఏదైనా తేడా ఉంటే కనిపిస్తుంది అందరికీ కనిపించదు. అలాగే కొన్నిసార్లు వెన్ను నీరు తీసి కూడా పరీక్షించాలి.
మందుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అధికంగా మందులు తీసుకోవడం వలన తలనొప్పి అధికం అయ్యే అవకాశం ఉంది. అలాగే అధిక నొప్పి మాత్రల వలన కడుపులో పుళ్లు రావడం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. తలనొప్పి రాకుండా కొన్ని మందులు ఉంటాయి, అవి వైద్యుడి సలహా మేరకు క్రమం తప్పక వాడాలి.
చాలా సార్లు చక్కటి నిద్ర, వ్యాయామం, యోగ, ధ్యానం చెయ్యటం, మద్యం మరియు ధూమపానానికి దూరంగా ఉండటం బాగా సహాయపడతాయి. భారతీయుల్లో దిగులు వ్యాధి ఎక్కువగా తలనొప్పితో మొదలవుతుంది వీరికి మానసిక చికిత్స అవసరం. ఇప్పటికి ఇదంతా చదివి తలనొప్పి రాకపోతే అదే చాలు. మెదడు, మనసు జాగ్రత్త.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Dr Srikanth Miriyala

Dr Srikanth Miriyala Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @miryalasrikanth

17 Sep
ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం ఈ సందర్బంగా గుండెని పదిలంగా ఉంచుకోడానికి కొన్ని చెప్తాను. అవి చెప్పేముందు గుండెజబ్బు గురించి కొన్ని విషయాలు. అసలు గుండె అనేది ఒక కండరం. ఈ కండరం లోపల ఖాళీలో రక్తం ఉంటుంది అది పెద్ద ధమనుల ద్వారా ఒంట్లో అవయవాలకి, ఊపిరితిత్తులకు పంపబడుతుంది.
ఈ గుండె కండరం పని చెయ్యటానికి హృదయ ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇవి చాల సున్నితమైనవి పైగా సన్నటివి. గుండె నిరంతరం పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడుకి 0.6సెకండ్ల విశ్రాంతి తీసుకుంటుంది, ఆ సమయంలో దానికి కావాల్సిన రక్తం తీసుకుంటుంది, అయితే మనం పరిగెత్తినపుడు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా
శృంగారంలో పాల్గొన్నప్పుడు గుండె వేగం పెరిగి గుండె విశ్రాంతి తీసుకునే సమయం 0.2సెకండ్లకి పడిపోతుంది అంటే ఆ సమయంలోనే దానికి కావలసిన రక్తాన్ని ఈ సన్నటి ధమనులు ఇస్తాయి. ఈ ధమనులు ఆరోగ్యముగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ వాటి లోపల కొవ్వు పేరుకుపోయి ఇరుకు అయినప్పుడు గుండె కి కావాల్సినంత
Read 13 tweets
11 Sep
సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి.
2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం.
5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.
Read 6 tweets
27 Aug
జననాంగాల గురించి తెలుసుకుందాం
వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో పని చేస్తాయి. ఇవి శుక్రకణాలను తయారు చెయ్యడమే కాకుండా మగ వారి లైంగిక పటుత్వానికి అలాగే మిగిలిన క్రియలకు అవసరం అయిన టెస్టోస్టెరోన్ హార్మోను ని ఉత్పత్తి చేస్తాయి.
ఇందుకోసం ఇవి శరీరం బయట వదులైన సంచిలో ఉంటాయి .అయితే చాలా మంది బిగుతైన లోదుస్తులు వేసుకువడం , ఒడిలో లాప్టాప్ పెట్టుకుని ఎక్కువసేపు పని చెయ్యటం వంటి వాటి వలన వృషణాల పనితీరు తగ్గుతుంది. ఇది సంతాన లేమికి దారి తీయొచ్చు. గత ఇరవై ఏళ్లలో వీర్యం నాణ్యత దాదాపు సగానికి పడిపోయింది.
అయితే ఒత్తిడి , కాలుష్యం, ఆహారం ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఇతమిద్దంగా ఇవే అని తెలీదు. ఇక పోతే అంగాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ముందు చర్మం వెనక్కి లాగి శిశ్నము దగ్గర పేరుకుపోయిన స్మేగ్మాని కడగాలి. స్మెగ్మా అనేది చనిపోయిన కణాలు, మట్టి, వీర్యం మొదలైన
Read 12 tweets
10 Aug
మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగా
కొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగా
కొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది.
Read 13 tweets
5 Aug
లైటర్
మాస్టారు అగ్గిపెట్టుందా ?
ఏం ఏ కొంపకి నిప్పెట్టేద్దామనీ ? అన్నాన్నేను అది వినగానే ...
అదేంటండీ అలా అంటారు ? మీక్కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువే , పళ్ళు రాలిపోకుండా చూసుకోండి అని జేబులో సిగరెట్టు తీసి సుతారంగా అప్పటికే నల్లబడిపోయిన పెదాల చివర నొక్కి పట్టాడు . వెధవకి నిండా
పాతికేళ్ళు లేవు.
సర్లేవోయ్ , నేనేదో సరదాకి అన్నాను , కుర్రాడివి కదా తట్టుకోలేకపోయావ్ . సరే ఇంద అని జేబులోంచి లైటర్ తీసి సప్ మని వెలిగించి అతని సిగరెట్ కి నిప్పు అందించాను . అతను ఒకసారి బాగా లోపలికి లాగి బిగబట్టి హా అని వదిలాడు . నా వంక చూసాడు, అతని కళ్ళలో ఒక రిలాక్సేషన్ .
కింగ్స్ పాకెట్ తీసి నాకొకటి ఇవ్వబోయాడు . నేనిప్పుడే ఒకటి తాగా అని చెప్పి మరో గంట తర్వాతే అని వద్దన్నాను . మళ్ళీ లోపల పెట్టేశాడు . ఏదైనా నాలుక జివ్వున లాగుతున్నప్పుడు సిగరెట్టు తాగితే వచ్చే కిక్కు వేరు, ఒక అమ్మాయి పెట్టే తొలి ముద్దు లా ! అన్నాన్నేను.
Read 23 tweets
31 Jul
Dr Ananthram was an MBBS graduate who secured state 1st rank in AP PG entrance test and he wanted to join Radiology in Osmania medical college, however he was denied that seat because the so called seat was reserved for some category in rostered system.
Distraught Dr Ananthram had filed a case against Dr NTR University of health sciences and voiced his demand -“Is there anything else other than first rank to secure radiology seat in Osmania medical college? If so I am ready to achieve that!”,the court has ruled in favour of him.
The University cancelled the counselling and allocated the seat to Dr Ananthram. This incident happened while I was still studying MBBS. In this background I would like to tell few of my experiences during my PG preparation. I was shortlisted for interview for admission into +
Read 12 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(