లైటర్
మాస్టారు అగ్గిపెట్టుందా ?
ఏం ఏ కొంపకి నిప్పెట్టేద్దామనీ ? అన్నాన్నేను అది వినగానే ...
అదేంటండీ అలా అంటారు ? మీక్కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువే , పళ్ళు రాలిపోకుండా చూసుకోండి అని జేబులో సిగరెట్టు తీసి సుతారంగా అప్పటికే నల్లబడిపోయిన పెదాల చివర నొక్కి పట్టాడు . వెధవకి నిండా
పాతికేళ్ళు లేవు.
సర్లేవోయ్ , నేనేదో సరదాకి అన్నాను , కుర్రాడివి కదా తట్టుకోలేకపోయావ్ . సరే ఇంద అని జేబులోంచి లైటర్ తీసి సప్ మని వెలిగించి అతని సిగరెట్ కి నిప్పు అందించాను . అతను ఒకసారి బాగా లోపలికి లాగి బిగబట్టి హా అని వదిలాడు . నా వంక చూసాడు, అతని కళ్ళలో ఒక రిలాక్సేషన్ .
కింగ్స్ పాకెట్ తీసి నాకొకటి ఇవ్వబోయాడు . నేనిప్పుడే ఒకటి తాగా అని చెప్పి మరో గంట తర్వాతే అని వద్దన్నాను . మళ్ళీ లోపల పెట్టేశాడు . ఏదైనా నాలుక జివ్వున లాగుతున్నప్పుడు సిగరెట్టు తాగితే వచ్చే కిక్కు వేరు, ఒక అమ్మాయి పెట్టే తొలి ముద్దు లా ! అన్నాన్నేను.
మీలో మంచి రసవత్తరమైన వ్యసనపరుడు ఉన్నాడండీ, ఇంకా చెప్పండి వింటాను అన్నాడు మరోసారి పొగంతా గుండెల నిండా నింపుకుంటూ. సరే అలాగే , పద అక్కడ మర్రి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం అని అక్కడికి వెళ్లి ఇద్దరం కూర్చున్నాం. ఇప్పుడు నా కథ ప్రారంభించాను.
నాకిప్పుడు నలభై ఐదు, సరిగ్గా పాతికేళ్ల క్రితం కాలేజీలో ఇప్పుడైతే బట్టతల వచ్చి ఇలా ఉన్నాకానీ అప్పట్లో సంజయ్ దత్ లాంటి క్రాఫు ఉండేది. తెల్లకోటు భుజంపై వేసుకుని యమహా ఆర్ ఎక్స్ జడ్ బండి సైడు స్టాండు వేసి దాని మీద వాలి నిల్చొని వేళ్ళ మధ్యన అప్పట్లో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టు తాగుతూ మా
మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ముందు నిల్చొని స్నేహితులతో సరదా కబుర్లు చెబుతూ ఉంటే, మా క్లాసుమేట్స్ తో పాటు , జూనియర్లు , సీనియర్లు తేడా లేకుండా అసలు ముఖం తిప్పి చూడని అమ్మాయి లేదంటే నమ్ముతావా !
ఏంటి సార్ మీరు డాక్టరా అని అడిగాడు కుర్రాడు ఒకసారి పొగంతా వదులుతూ...అవునయ్యా అదేం పెద్ద
విశేషం కాదులే అని చెప్పి నేను కొనసాగించాను. అలా చూసిన అమ్మాయిల్లో ఒకరు మరో నాలుగేళ్ళ ప్రేమ తరువాత నా భార్య అయింది, కానీ నాకిప్పటికీ గుర్తు మా కాలేజీ ఆడిటోరియం దగ్గర మేము కలుసుకున్నప్పుడు ఆమె పెట్టిన ముద్దు నేను మెడికల్ కాలేజీ మొదటి ఏడాది చేరినప్పుడు తాగిన మొదటి సిగరెట్టు
తో వచ్చిన కిక్కును గుర్తు చేసింది. అందుకే ఆవిడని , ఈ సిగరెట్టు ని వదల్లేదు అప్పట్నుంచి.
సార్, మంచి రొమాంటిక్ గా ఉంది ఇంకా చెప్పండి సార్! అని ఉత్సుకతతో అడిగాడు. నేను చెప్తున్నాను, ఆమె నడిచి వస్తుంటే మా బయోకెమిస్ట్రీ డిపార్టుమెంట్ ముందున్న తురాయి చెట్టు ఆమె కోసమే పూలు రాల్చి ఆ
రోడ్డంతా ఎర్రతివాచీ పరిచేదా అన్నట్లు ఉండేది. ఆమె నవ్వులో కనిపించే వెలుగు వెన్నెలని తలదన్నేలా, ఆమె మాటలు హాస్టల్లో రావిచెట్టు పైనుంచి కూసే కోకిల అసూయ పడేలా ఉండేది. ఆమె జడ అరకులోయ లో జలపాతం నల్ల సిరాగా మారిపోతే ఎలా ఉంటుందో ఆలా ఉండేది. ఇక ఆమె వర్చస్సు గంధం, బంగారం ముద్దకట్టి
వడపోస్తే వచ్చే వర్ణం తో మెరిసేది. ఆమె గడ్డం కింద చెయ్యి పెట్టి లైబ్రరీలో ఎక్కువ పేజీలున్న హారిసన్ పుస్తకం చదవడంలో లీనమైపోతే ఆమెను చూస్తూ ఆ సమయం నాకు స్తంభించిపోవాలని నాకు మరే ఆకలి నిద్ర వద్దని అనిపించేది. ఆమెంతో తెలివైంది , ఇష్టపడి చదివేది. ఆమె ప్రేమలో నాకు మరో లోకం ఉండేది.
ఇదిలా ఉంటే మా ఇద్దరి ఎంబీబీయస్ అయిపోగానే మా నాన్నకి కాన్సర్ రావటం ఆయన చనిపోకముందే మాకు పెళ్లి కావటం చక చకా జరిగిపోయాయి. మా నాన్నగారికి వైద్యం చేయించినప్పటికీ ఎంతోకాలం బ్రతకలేదు. ఇదిగో మన సిగరెట్ తాగటం వలనే ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చి చనిపోయారు. కాన్సర్ ఒక గమ్మత్తయిన జబ్బు
అది చివరి స్థాయికి వచ్చేవరకు బయటపడదు , బయటపడింతర్వాత బతికి బట్ట కట్టనివ్వదు. అందుకే నేను డాక్టర్ అయినా ఆయనకి కాన్సర్ వచ్చిన విషయాన్నీ కనిపెట్టలేకపోయాను. అయితే నేనేం పెద్ద చదవలేదు అనుకో ఎదో అలా పరీక్షల ముందు చదివి గట్టెక్కటం వరకు వచ్చు. అయన పోయిన తరువాత నా భార్యకి పీజీ సీటు
ప్రెగ్నెసీ రెండూ ఒకేసారి వచ్చాయి.మాకు చాలా ఆనందం వేసింది.అయితే నాకే ఇంకా సీటు రావాలి దాంతో ఆవిడ డ్యూటీకి వెళ్తే నేను ఇంట్లో వంట వార్పు చేస్తూ చదువుకునే వాడిని. బాగా ఒత్తిడి ఫీల్ అయ్యేవాడిని,ఆ సమయంలో నాకు సిగరెట్టే పెద్ద నేస్తం.రోజుకి ఎలా లేదన్నా ఒక రెండు మూడు పెట్టెలు తాగేవాడిని
అయితే నా భార్యకి ఐదో నెల వచ్చేసరికి వాళ్ళ ప్రొఫెసర్ రొటీన్ చెక్ చేస్తూ కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని ఇకనుంచి రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పారు. పీజీ చదువుతున్నపుడు అసలు సెలవులే దొరకవు అలాంటిది ఆవిడ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుని ప్రసవం తరువాత మళ్ళీ డ్యూటీ చేరామనటం మేము
చాలా అదృష్టంగా భావించాం. నా భార్య ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు మాత్రం ఒత్తిడి తగ్గలేదు, నేను సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాను. నా భార్యకి కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గటం లేదు. ఈలోగా నెలలు నిండుతున్నాయి. నాకు కూడా పిజి పరీక్ష తేదీ దగ్గరపడుతోంది. ఈలోపు నా భార్యకి కాళ్ళ పొంగులు వచ్చాయి.
మా ప్రొఫెసర్ చూసారు, రక్త పరీక్ష, నీరుడి పరీక్ష చేసారు. ఇప్పుడు నెలలు నిండి ప్రసవానికి దగ్గర అవుతుండటం మూలాన జాగ్రత్తగా ఉండాలని, ముందులు ఇస్తున్నా బ్లడ్ ప్రెషర్ తగ్గటం లేదని చెప్పారు. కొంచెం ఆందోళన పడినా ఏం కాదులే అని ఒకరికొకరం చెప్పుకున్నాం .
ఒక మనిషి ఆశాభావం ఏంటంటే ఎందరికి ఎన్ని కష్టాలు వచ్చినా నాకు అవి రావులే అనుకుంటాడు అందువలన అవి వస్తేఎలా ఎదుర్కోవాలో తెలీకుండా సమయం గడిపేస్తాడు.సరిగ్గా అలాంటిదే నా జీవితంలో జరిగింది.ఎల్లుండి తనని ఆసుపత్రిలో చేర్చాలి అనగా ఈరోజు నేను పీజీ పరీక్షకు వెళ్ళాను. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది
నేను పొద్దున్న వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరేసరికి నాభార్య స్పృహలేకుండా హాల్లో పడిఉంది,హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ప్రెగ్నెన్సీ లో వచ్చే హై బ్లడ్ ప్రెషర్ వలన ఎక్లమ్ప్సియా అనే సమస్య వచ్చి మూర్ఛ వచ్చి పడిపోయింది. ఆమె కోమా లోకి వెళ్లి తిరిగిరాలేదు, లోపలి బిడ్డ కూడా దక్కలేదు
నేనింక ఏమీ దిక్కుతోచని స్థితిలో ఆమెపై పడి రోదిస్తుంటే మాప్రొఫెసర్ వచ్చి ఓదార్చారు.ఆమె మాట్లాడుతుండగా నా షర్ట్ అంతా సిగరెట్ వాసన ఉండటం గమనించారు.అప్పుడామె చెప్పారు నేను విపరీతంగా ఇంట్లో సిగరెట్లు కాల్చటం వలన నాభార్య పాసివ్ స్మోకింగ్ కి గురైందని అందువలన ఆమె బ్లడ్‌ప్రెషర్ తగ్గలేదని
తద్వారా అది ఫిట్స్ కి దారి తీసిందని. అంతే అది విని నేను హతాశుడయ్యాను. నేను తేరుకోడానికి చాలా రోజులు పట్టింది . ఆమెను దూరం చేసిన సిగరెట్ ను అక్కడితో ఈ సిగరెట్ వదిలేసాను. చాలా రోజులు నా స్టయిల్ నచ్చి ఇష్టపడింది అనుకున్న నాకు మాకు పెళ్ళైన ఏడాది నా పుట్టినరోజు కి పంపిన వీడియోలో
మా హాస్పిటల్లో చేరిన ఎవరూలేని ఒక ముసలావిడకి అన్నీ నేనే అయ్యి చేసిన సేవ చూసి నేను నచ్చానని,తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అని ఆశపడింది అని చెప్పింది. నావలనే ఆమె చనిపోతుంది అని ఊహించలేని మూర్ఖుడిని.అని చెప్పడం ముగించాను. ఈలోపు కుర్రవాడు సిగరెట్టు ధ్యాస మరిచేసరికి చెయ్యికాలింది
అతని కళ్ళలో నీళ్లు తిరుగుతూ అడిగాడు , కానీ మీరింకా సిగరెట్టు కలుస్తున్నారు అని , దానికి నేను అవునయ్యా ఇలా అగ్గిపెట్టె ఉందా అని అడిగేవాళ్లందరికీ నా కథ ను చెప్పటానికి ఈ లైటర్ పెట్టుకు తిరుగుతుంటాను, నేను వాళ్ళకి వెలిగించి ఇచ్చే సిగరెట్ వాళ్ళు కాల్చే ఆఖరిది అని నేను కోరుకుంటాను.
వాళ్ళ కుటుంబం లో ఈ పొగ యే ప్రాణాన్ని తీయకపోతే చాలు అని ఆశిస్తుంటాను. అని చెప్పి ముందుకు కదిలాను. వెంటనే ఆ అబ్బాయి నా చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో సిగరెట్టు పెట్టె విసిరేసి " మాస్టారు , నాకో లైటర్ కొంటారా !!" అని అడిగాడు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Dr Ananthram was an MBBS graduate who secured state 1st rank in AP PG entrance test and he wanted to join Radiology in Osmania medical college, however he was denied that seat because the so called seat was reserved for some category in rostered system.
Distraught Dr Ananthram had filed a case against Dr NTR University of health sciences and voiced his demand -“Is there anything else other than first rank to secure radiology seat in Osmania medical college? If so I am ready to achieve that!”,the court has ruled in favour of him.
The University cancelled the counselling and allocated the seat to Dr Ananthram. This incident happened while I was still studying MBBS. In this background I would like to tell few of my experiences during my PG preparation. I was shortlisted for interview for admission into +
నేను ఎంబీబీస్ చదివే రోజుల్లో ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీస్ చదివిన డా అనంత రామ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్షలో ఒకటో ర్యాంక్ సాధించారు . ఈయన స్వయానా మన వీ వీ ఎస్ లక్ష్మణ్ గారికి బావమరిది . ఆయనకు రేడియాలజీ పీజీ చెయ్యాలని ఉండేది. అయితే ఆ సీట్లు చాలా తక్కువ,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో +
మొత్తం మూడో నాలుగో సీట్లు ఉండేవి. అయన లోకల్ ఏరియా ఒస్మానియా కాబట్టి అక్కడే సీట్ తీసుకోవాలి ,అయితే రోస్టర్ సిస్టం మూలానా ఉన్న ఒక్క సీటు కూడా ఒక రిసర్వుడు వర్గానికి కేటాయించారు . ఎలా చూసినా ఆయనకి ఆ సీట్ రాదు. దాంతో ఆయన చాలా బాధ పడి హై కోర్టుకి వెళ్లారు .+
అక్కడ ఆయన "నేను రేడియాలజీ చదవాలంటే ఒకటో ర్యాంక్ ని మించి ఇంకేదైనా ర్యాంక్ ఉంటే చెప్పండి అది సాధిస్తాను "అని వాదించారు , చేసేది లేక కోర్టు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఏ సీటు కోరుకుంటే అదివ్వాలని ,రోస్టర్ వ్యవస్థ రెండో ర్యాంక్ నుంచి అమలు పరచాలని తీర్పు ఇచ్చింది .
ఈరోజు మనం వ్యక్తిత్వ లోపాల గురించి తెలుసుకుందాం , వీటినే పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు . అంటే ఒక వ్యక్తి స్వాభావిక ప్రవర్తన అక్కడి కాల మాన పరిస్థితుల కు అనుకూలంగా కాకుండా దీర్ఘకాలం పాటు వారు ఇతరులతో మసలుకునే తీరులో తీవ్రమైన ఇబ్బందులు ఉండటం. ఈ ఇబ్బంది వారికి కానీ లేదా వారి +
చుట్టూ ఉన్నవారికి కానీ. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి అబ్సెసివ్ పర్సనాలిటీ దీనినే చాదస్తం అనొచ్చు. అలాగే పారనాయిడ్ - అనుమానం జాస్తి , ఎమోషనల్లీ అన్ స్టేబుల్ - భావోద్వేగాలను నియంత్రించ లేకపోవటం ఇలా చెప్తూ పోతే ఒక పది పన్నెండు ఉన్నాయి. వీటిలో ఒకరిలోనే రెండు మూడు రకాలు
కలిసి ఉండొచ్చు . అందుకనే ఈ మధ్య ఈ పేర్లన్నీ తీసేసి కేవలం వ్యక్తిత్వ లోపం అని ఒక్కటే ఉంచారు. ఇవి ఇంతవరకు చేసిన అధ్యయనాల ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉంటుంది అని తేలింది అయితే వీటి తీవ్రతతో తేడా ఉండటం వలన అందరూ మనకు కనిపించరు. ఈ లోపాలు అనేవి స్వల్ప స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు
మీకు తెలుసా దిగులు ( depression) వ్యాధి, మధుమేహం (diabetes) కంటే సాధారణ మైన వ్యాధి అని? అలాగే ఇది నూటికి ఎనభై మందిలో నయం అవుతుందని తెలుసా? కొన్ని విషయాలు గమనిద్దాం.
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ర్యాంకింగ్స్‌లో గుండెజబ్బులకు తలదన్ని డిప్రెషన్ మొదటి స్థానంలో ఉంది, అంటే ఒక వ్యాధి ప్రపంచ ప్రజల్ని ఎంత పీడిస్తోంది అన్నదానికి ఒక సూచిక ఇది. అలాగే ఉత్పాదక వయసులో ఉన్నవాళ్ళలో (20-60) రోడ్డుప్రమాదాల తర్వాత అత్యధిక మరణాలు ఆత్మహత్యల వలన జరుగుతున్నాయి.
డిప్రెషన్ లో స్వల్ప స్థాయి/తీవ్ర స్థాయి అని రెండు రకాలు ఉంటాయి. ప్రతీ రోగికి ఉండే లక్షణాల తీవ్రతని బట్టి ఇది ఉంటుంది.దీనికి వైద్యం మూడు రకాలు. 1. కౌన్సిలింగ్ 2. మందులు 3. జీవనవిధానంలో మార్పులు 4. ECT- ఎలక్ట్రో కన్స్వుల్సివ్ థెరపీ ( షాక్ ట్రీట్మెంట్)-ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు.
స్కిజోఫ్రీనియా అవగాహన వారం.
ఇదొక మానసిక వ్యాధి. వెయ్యి మందిలో ఒకరిద్దరి కి వస్తుంది. కాబట్టి చాలా సాధారణమైన వ్యాధి. చికిత్సతో దాదాపు డెబ్భై శాతం మంది కోలుకుని బాగవుతారు. వ్యాధిని ఎంత ముందుగా కనిపెట్టి వైద్యం చేస్తే అంత బాగయ్యే అవకాశం ఉంది. దీనికి ఇదే కారణం అంటూ ఏమీ లేదు.
వంశపారంపర్యం,తల్లికి గర్భంతో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం, వైరల్ ఇన్ఫక్షన్లు, నెలలు నిండక ముందే పుట్టడం, కాన్పు కష్టమయి బిడ్డకి ఆక్సిజన్ అందకపోవడం, జన్యు లోపాలు, తలకి గాయం అవటం, హార్మోన్లు హెచ్చు తగ్గులు, చిన్నవయసులో లైంగిక పరమైన , శారీరక పరమైన దాడికి గురవటం ఇలా చాలా మటుకు విషయాలు
స్కిజో ఫ్రీనియా రావటానికి దారి తీస్తాయి. అలాగే మూర్ఛ రోగం, గంజాయి, కొకైన్, మద్యం మొదలైనవి కూడా. ఈ వ్యాధి సాధారణంగా 15-25 ఏళ్ల మధ్య మొదలవుతుంది. ముఖ్య లక్షణాలు భయం, అనుమానం, ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు వినిపించడం, శుభ్రంగా ఉండకపోవటం, మతిమరుపు, అసందర్భంగా మాట్లాడటం, నిరాసక్తి, దిగులు
శ్రేయస్సు కోసం ఐదు మార్గాలు. 1. చురుకుగా ఉండండి 2. కొత్తవి నేర్చుకోండి 3. సాయం చేయండి 4. కలుపుగోరుగా ఉండండి 5. పరిసరాలను గమనించండి
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ లో ప్రచురితమైన ఒక వ్యాసంలో వీటి గురించి వివరంగా చర్చించారు. ఆస్ట్రేలియా లో వీటిని జనబాహుళ్యంలో కి తీసుకురావటానికి
ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. ఇవి చాలా సులభంగా అందరూ పాటించదగినవి. వీటివలన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నిరూపితం అయింది. వీటిని ఆంగ్లంలో ఫైవ్ వేస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు.
1. చురుకుగా ఉండటం - అంటే శారీరక శ్రమ కలిగిన, ఏదైనా ఉల్లాసవంతమైన పని చెయ్యటం. ఉదాహరణకు స్నేహితులతో ఆడటం, వ్యాహ్యాళికి వెళ్ళటం. పిల్లలతో బయట ఆడటం. వ్యాయామం చెయ్యటం. వీటివలన విటమిన్ డి స్థాయి పెరగటం, ఎముకలు దృఢం అవ్వటం, మనసు తేలిక పడటం మొదలైన లాభాలు ఉన్నాయి.