మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగా
కొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగా
కొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది.
అయితే దానికి మూత్రపిండాలు వాటి సామర్ధ్యాన్ని దాటి మూడు నాలుగు రెట్లు పనిచేయాలి. అలా ఎక్కువ కాలం పనిచేయటం కుదరదు. ఈలోగా గుండె బలంగా కొట్టడానికి దాంట్లో ఉన్న కండరం సరిపోదు అందువలన కొత్త కండరాన్ని గుండె తయారు చేసుకుని దిట్టంగా తయారవుతుంది. అయితే అలా లావు అయ్యే క్రమంలో గుండె జఠరిక
లో ఉండే చోటు తగ్గిపోయి గుండె పంపు చేసే పంపు చేసే రక్తం తగ్గిపోతుంది. అలాగే గుండె పనిచేయాలంటే గుండెకీ రక్తం కావాలి కాబట్టి గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అంతటి మందమైన గుండెకి రక్తాన్ని అందంచలేవు. అపుడు మనం ఏమాత్రం గుండె మీద భారం వేసినా అంటే పరిగెత్తినా, కడుపునిండా తిన్నా
చివరికి శృంగారంలో పాల్గొన్నా గుండెకి రక్తం సరిపోక ఛాతీ లో నొప్పి వస్తుంది. ఇంకాస్త ఎక్కువైతే గుండెపోటు వస్తుంది. ఈలోగా మెదడులో రక్త నాళాలు చాలా చిన్నవి మరియు సున్నితమైనవి. ఇవి కొన్ని సార్లు ఈ ఒత్తిడికి మూసుకుపోయి ఆ రక్తనాళం వెళ్లే మెదడు కణజాలం రక్తం అందక చనిపోతుంది. అయితే అలా
చనిపోయేవి చుక్కంత ఉంటాయి. కానీ ఒక పది ఇరవై ఏళ్లలో ఈ చుక్కలన్నీ కలిసి మెదడు పనితీరు బాగా దెబ్బతీసి మతిమరుపు, డెమెన్షియా మొదలైన ఇబ్బందులు వస్తాయి. ఇవి కాక ఒకేసారి రక్త పీడనం పెరిగి మెదడులో రక్తనాళం పగిలి అక్కడ రక్త స్రావం అయ్యి పక్షవాతం రావచ్చు, లేదా మెదడులో ఒకేసారి ఒత్తిడి పెరిగి
ఊపిరి ఆగొచ్చు. ఈలోగా మూత్రపిండాలు కూడా బాగా పని చేసి చేసి అలసిపోయి ఇక పనిచేయటం మానేస్తాయి. దాంతో రక్తం లో నీరు ఒంట్లో కి చేరి ఒళ్ళు ఉబ్బుతుంది. అలాగే యూరియా, క్రియాటినిన్ లు పెరిగి ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తులు ఊది ఊది అలసిపోయి ఇక ఊపిరి తీయటం మానేస్తాయి.కాబట్టి ఉప్పు తినాలా వద్దా
ఉప్పు రోజుకి ఐదు గ్రాములకి మించి తినకూడదు. పది గ్రాములు మనం సాధారణంగా తింటాం. లవణ ప్రియులు ఇరవై గ్రాములవరకు తింటారు. ఉప్పు తక్కువ తినటానికి కొన్ని చిట్కాలు.
1. ముందు తినే బల్ల మీద ఉప్పు తీసెయ్యాలి అంటే కూర, చారులో ఉండే ఉప్పు చాలు. మళ్ళీ పెరుగులో, సరిపోలేదని అన్నంలో వేసుకోకూడదు. బదులు నిమ్మకాయ వాడొచ్చు.
2. యూట్యూబ్ లో చెప్పారని వండేటప్పుడు తగినంత ఉప్పు కాకుండా తక్కువ ఉప్పు వెయ్యండి, మెల్లిగా అలవాటు అవుతుంది.
3. పోపుల డబ్బాలో ఒక గిన్నెలో ఉప్పు వేసి పసుపు, కారం వెయ్యటానికి వాడే చిన్న చెంచా వాడండి. ఉప్పు వంటలో పిడికిలితో వెయ్యొద్దు.
4.ఆవకాయ లేనిదే తెలుగువాళ్ళకు ముద్ద దిగదు,ఒప్పుకుంటాను కానీ మూత్రపిండాలు ఒప్పుకోవు.కాబట్టి వారానికి ఒకసారి ముద్దపప్పుతో అంతే కానీ ప్రతి దోశకి ఒకజాడీ తినొద్దు
5. అన్ని పచ్చళ్లకు పై నియమం పాటించాలి.
6.చిప్సు పొట్లంలో అందులో కనిపించని గాలి ఎంతో కనిపించని ఉప్పు అంత అలాగే, ఫ్రెంచి ఫ్రైసు, పాప్ కార్ను కూడా.
7. వంటలో ఉప్పు వేసేటప్పుడు అవి తినే అమ్మా నాన్నని,మీభోజనంలో ఉప్పు వేసుకునేటప్పుడు మీపిల్లల్ని తలుచుకోండి,అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది
8. చివరిగా ఉప్పు కొనేటప్పుడు ఉప్పు కోసం పిడికిలి బిగించి రక్తం చిందించిన గాంధీ తాతని గుర్తుకు తెచ్చుకోండి. గాంధీ తాతలాగే మీరు కూడా ఈ దేశానికి అవసరం. జై హింద్.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Dr Srikanth Miriyala

Dr Srikanth Miriyala Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @miryalasrikanth

5 Aug
లైటర్
మాస్టారు అగ్గిపెట్టుందా ?
ఏం ఏ కొంపకి నిప్పెట్టేద్దామనీ ? అన్నాన్నేను అది వినగానే ...
అదేంటండీ అలా అంటారు ? మీక్కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువే , పళ్ళు రాలిపోకుండా చూసుకోండి అని జేబులో సిగరెట్టు తీసి సుతారంగా అప్పటికే నల్లబడిపోయిన పెదాల చివర నొక్కి పట్టాడు . వెధవకి నిండా
పాతికేళ్ళు లేవు.
సర్లేవోయ్ , నేనేదో సరదాకి అన్నాను , కుర్రాడివి కదా తట్టుకోలేకపోయావ్ . సరే ఇంద అని జేబులోంచి లైటర్ తీసి సప్ మని వెలిగించి అతని సిగరెట్ కి నిప్పు అందించాను . అతను ఒకసారి బాగా లోపలికి లాగి బిగబట్టి హా అని వదిలాడు . నా వంక చూసాడు, అతని కళ్ళలో ఒక రిలాక్సేషన్ .
కింగ్స్ పాకెట్ తీసి నాకొకటి ఇవ్వబోయాడు . నేనిప్పుడే ఒకటి తాగా అని చెప్పి మరో గంట తర్వాతే అని వద్దన్నాను . మళ్ళీ లోపల పెట్టేశాడు . ఏదైనా నాలుక జివ్వున లాగుతున్నప్పుడు సిగరెట్టు తాగితే వచ్చే కిక్కు వేరు, ఒక అమ్మాయి పెట్టే తొలి ముద్దు లా ! అన్నాన్నేను.
Read 23 tweets
31 Jul
Dr Ananthram was an MBBS graduate who secured state 1st rank in AP PG entrance test and he wanted to join Radiology in Osmania medical college, however he was denied that seat because the so called seat was reserved for some category in rostered system.
Distraught Dr Ananthram had filed a case against Dr NTR University of health sciences and voiced his demand -“Is there anything else other than first rank to secure radiology seat in Osmania medical college? If so I am ready to achieve that!”,the court has ruled in favour of him.
The University cancelled the counselling and allocated the seat to Dr Ananthram. This incident happened while I was still studying MBBS. In this background I would like to tell few of my experiences during my PG preparation. I was shortlisted for interview for admission into +
Read 12 tweets
30 Jul
నేను ఎంబీబీస్ చదివే రోజుల్లో ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీస్ చదివిన డా అనంత రామ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్షలో ఒకటో ర్యాంక్ సాధించారు . ఈయన స్వయానా మన వీ వీ ఎస్ లక్ష్మణ్ గారికి బావమరిది . ఆయనకు రేడియాలజీ పీజీ చెయ్యాలని ఉండేది. అయితే ఆ సీట్లు చాలా తక్కువ,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో +
మొత్తం మూడో నాలుగో సీట్లు ఉండేవి. అయన లోకల్ ఏరియా ఒస్మానియా కాబట్టి అక్కడే సీట్ తీసుకోవాలి ,అయితే రోస్టర్ సిస్టం మూలానా ఉన్న ఒక్క సీటు కూడా ఒక రిసర్వుడు వర్గానికి కేటాయించారు . ఎలా చూసినా ఆయనకి ఆ సీట్ రాదు. దాంతో ఆయన చాలా బాధ పడి హై కోర్టుకి వెళ్లారు .+
అక్కడ ఆయన "నేను రేడియాలజీ చదవాలంటే ఒకటో ర్యాంక్ ని మించి ఇంకేదైనా ర్యాంక్ ఉంటే చెప్పండి అది సాధిస్తాను "అని వాదించారు , చేసేది లేక కోర్టు ఒకటో ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఏ సీటు కోరుకుంటే అదివ్వాలని ,రోస్టర్ వ్యవస్థ రెండో ర్యాంక్ నుంచి అమలు పరచాలని తీర్పు ఇచ్చింది .
Read 15 tweets
21 Jul
ఈరోజు మనం వ్యక్తిత్వ లోపాల గురించి తెలుసుకుందాం , వీటినే పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు . అంటే ఒక వ్యక్తి స్వాభావిక ప్రవర్తన అక్కడి కాల మాన పరిస్థితుల కు అనుకూలంగా కాకుండా దీర్ఘకాలం పాటు వారు ఇతరులతో మసలుకునే తీరులో తీవ్రమైన ఇబ్బందులు ఉండటం. ఈ ఇబ్బంది వారికి కానీ లేదా వారి +
చుట్టూ ఉన్నవారికి కానీ. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి అబ్సెసివ్ పర్సనాలిటీ దీనినే చాదస్తం అనొచ్చు. అలాగే పారనాయిడ్ - అనుమానం జాస్తి , ఎమోషనల్లీ అన్ స్టేబుల్ - భావోద్వేగాలను నియంత్రించ లేకపోవటం ఇలా చెప్తూ పోతే ఒక పది పన్నెండు ఉన్నాయి. వీటిలో ఒకరిలోనే రెండు మూడు రకాలు
కలిసి ఉండొచ్చు . అందుకనే ఈ మధ్య ఈ పేర్లన్నీ తీసేసి కేవలం వ్యక్తిత్వ లోపం అని ఒక్కటే ఉంచారు. ఇవి ఇంతవరకు చేసిన అధ్యయనాల ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉంటుంది అని తేలింది అయితే వీటి తీవ్రతతో తేడా ఉండటం వలన అందరూ మనకు కనిపించరు. ఈ లోపాలు అనేవి స్వల్ప స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు
Read 9 tweets
5 Jun
మీకు తెలుసా దిగులు ( depression) వ్యాధి, మధుమేహం (diabetes) కంటే సాధారణ మైన వ్యాధి అని? అలాగే ఇది నూటికి ఎనభై మందిలో నయం అవుతుందని తెలుసా? కొన్ని విషయాలు గమనిద్దాం.
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ర్యాంకింగ్స్లో గుండెజబ్బులకు తలదన్ని డిప్రెషన్ మొదటి స్థానంలో ఉంది, అంటే ఒక వ్యాధి ప్రపంచ ప్రజల్ని ఎంత పీడిస్తోంది అన్నదానికి ఒక సూచిక ఇది. అలాగే ఉత్పాదక వయసులో ఉన్నవాళ్ళలో (20-60) రోడ్డుప్రమాదాల తర్వాత అత్యధిక మరణాలు ఆత్మహత్యల వలన జరుగుతున్నాయి.
డిప్రెషన్ లో స్వల్ప స్థాయి/తీవ్ర స్థాయి అని రెండు రకాలు ఉంటాయి. ప్రతీ రోగికి ఉండే లక్షణాల తీవ్రతని బట్టి ఇది ఉంటుంది.దీనికి వైద్యం మూడు రకాలు.
1. కౌన్సిలింగ్
2. మందులు
3. జీవనవిధానంలో మార్పులు
4. ECT- ఎలక్ట్రో కన్స్వుల్సివ్ థెరపీ ( షాక్ ట్రీట్మెంట్)-ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు.
Read 8 tweets
21 May
స్కిజోఫ్రీనియా అవగాహన వారం.
ఇదొక మానసిక వ్యాధి. వెయ్యి మందిలో ఒకరిద్దరి కి వస్తుంది. కాబట్టి చాలా సాధారణమైన వ్యాధి. చికిత్సతో దాదాపు డెబ్భై శాతం మంది కోలుకుని బాగవుతారు. వ్యాధిని ఎంత ముందుగా కనిపెట్టి వైద్యం చేస్తే అంత బాగయ్యే అవకాశం ఉంది. దీనికి ఇదే కారణం అంటూ ఏమీ లేదు.
వంశపారంపర్యం,తల్లికి గర్భంతో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం, వైరల్ ఇన్ఫక్షన్లు, నెలలు నిండక ముందే పుట్టడం, కాన్పు కష్టమయి బిడ్డకి ఆక్సిజన్ అందకపోవడం, జన్యు లోపాలు, తలకి గాయం అవటం, హార్మోన్లు హెచ్చు తగ్గులు, చిన్నవయసులో లైంగిక పరమైన , శారీరక పరమైన దాడికి గురవటం ఇలా చాలా మటుకు విషయాలు
స్కిజో ఫ్రీనియా రావటానికి దారి తీస్తాయి. అలాగే మూర్ఛ రోగం, గంజాయి, కొకైన్, మద్యం మొదలైనవి కూడా. ఈ వ్యాధి సాధారణంగా 15-25 ఏళ్ల మధ్య మొదలవుతుంది. ముఖ్య లక్షణాలు భయం, అనుమానం, ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు వినిపించడం, శుభ్రంగా ఉండకపోవటం, మతిమరుపు, అసందర్భంగా మాట్లాడటం, నిరాసక్తి, దిగులు
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(