🌸 *చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు* 🌸
'' ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి , '' అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ' ఆమె మన అతిథి . ఆమె టీ , కాఫీ తాగరట. పాలు ఇవ్వు ,
' అని ఆ కూలీ అంటే ' మన పాప కు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది , ' అంది ఆమె. ' అయినా పరవాలేదు , సగం పాలకు సగం నీళ్ళు కలిపి , చక్కెరతో ఇవ్వు, 'అన్నాడు ఆయన.
ఒరియా తెలిసిన సుధా మూర్తి కి అది వినపడింది. ' ఈ రోజు బుధవారం ,
నేను ఉపవాసం. ఏమీ తీసుకోను , ' అంది ఆమె. ' అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ? అని అతనంటే ' అవును. నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను , ' అన్నారు ఆమె.
ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు. గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నాదేశం
లో వుండగా , నేను పాలు తాగడమా ? వద్దు అని ఆనాటి నుండి ఆమె పాలు తాగడం మానేసారు.
TATA వారి TELCO లో భారతదేసపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా ఆమె ప్రవేశించినా , 2 , 21 , 501 మంది employees తో ఏటా 2.48 బిలియన్ US Dollars ఆదాయం కలిగిన Infosys నడిపే Infosys Foundation కు Chair Person
అయినా , సుధా మూర్తి simplicity కి మారుపేరులా వుంటారు. అమె దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే అంటే మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు. చివరగా ఆమె చీర కొన్నది 1998 లోనే.
ఒక మారు ప్రపంచ ప్రసిద్ధ London Heathrow Airport లో అక్కడి ఇంగ్లీష్ ఆమె సాధారణ దుస్తుల్లో వున్న సుధా మూర్తి ని
చూసి ' ఇది ధనవంతులు ప్రయాణించే Business class నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే Economy class వుంది వెళ్ళు ' అంటే , చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధా ముర్తి. కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక UNO సదస్సులో President హోదా లో అనర్గళంగా ఇంగ్లీష్ లో
మాట్లాడుతుంటే అవాక్కయింది ఆ ఇంగ్లీష్ వనిత.
నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు , అదే వారి గొప్పతనం, '' అంటాడు చైనా కు చెందిన లా తజు అనే ఒక ఫిలాసఫర్.
కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం
20 000 పుస్తకాలు కలిగివున్నారు.
*తన ఆదాయాన్ని పేదలచదువుకు కు , అనాథలకు , ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆమె*.
బతకడం వేరు , జీవించడం వేరు.
Do compare the present day rulers in the country.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది.
ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం,
ఆ ఆంగ్లేయుడు గమనించాడు.*
*తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.*
*మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు.
'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? '
' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో పడుక్కోడానికన్నమాట'
కోవిడ్ దెబ్బకు అన్నీ ఆన్ లైన్ విచారణలు జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఐతే ఈ ఆన్ లైన్ లో కూడా న్యాయవాదులు కోర్టుకు వచ్చినట్లుగానే బ్యాండ్, కోటు, గౌను ధరించాల్సిందే. అలా కాకుండా అపియర్ అయిన వాళ్ళను కేకలేసి కేసు వాయిదా వేసిన సంఘటనలు
కోకొల్లలు.
అలా ఉన్న సమయంలో ఒక సీనియర్ న్యాయవాది గారు సమయం మించిపోతోందని హడావిడిగా కోటు, గౌను, బ్యాండు తగిలించుకుని ఆన్ లైన్ లోకి వచ్చారు, ఆయన తన వాదన వినిపిస్తున్నారు,
మధ్యలో ఆ లాయరు గారి భార్య టిఫిన్ పట్టుకొచ్చి "తినకుండా కూర్చుంటే ఎలా? అడ్డం పడితే చెయ్యడానికి ఎవరూ లేరు" అంటూ
టిఫిన్ ప్లేటు కంప్యూటర్ ముందు పెట్టేసిందట. అనుకోని సంఘటనతో లాయరు గారు బిక్క చచ్చిపోయారు. ఆన్ లన్ లో అవతల ఉన్నది సుప్రీమ్ కోర్టు జడ్జీలు. వాళ్ళు కూడా అవాక్కైపోయారట.
ఐతే లాయరుగారు వెంటనే తేరుకుని "Me Lords, it is easier to face Contempt of Court than Contempt of Housewife" అన్నారట.
*తెలుగు భాష లో దాగి ఉన్న వ్యాయామం గురించి తెలుసుకుందాం.*
☘☘
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.*
🌸🌸🌸
*తేట తేట తెనుగులా.*
🌸🌸🌸
*మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది.*
🌸🌸🌸
*ఏలాఅంటే.*
🌸🌸🌸
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:*
🌸🌸🌸
*ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.*
🌸🌸🌸
*క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం.*
🌸🌸🌸
*చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం.*
🌸🌸🌸
*ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం.*
🌸🌸🌸
*త థ ద ధ న……నాలుక కొస భాగం.*
🌸🌸🌸
*ప ఫ బ భ మ……..పెదవులకు.*
🌸🌸🌸
*య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా.*
🌸🌸🌸
చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చుగాని పిండి మరకెళ్ళాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదు. ఆసాంతం చదివి మీరే అవునో, కాదో చెప్పండి. నా బాల్యంలో కొంత కాలం అవనిగడ్డ, గిద్దలూరు, ఇచ్చాపురం వంటి చిన్న ఊళ్ళల్లో గడిచింది. అప్పట్లో అన్నపూర్ణా ఆటాలు,ఆశీర్వాద్ ఆటా ఆశీర్వాదాలు
మాకు దొరకని కష్టకాలమాయే. అందరూ గోధుమలు, ధాన్యం, పప్పులు మర ఆడించుకోవల్సిందే. ఈ పనికోసం అమ్మలు, అమ్మమ్మలు మమ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమరకు తోలేవాళ్ళు. మాకు ఇప్పటి పిల్లలంత అవేర్నెస్ లేకపోవడంతో కార్మిక శాఖకు కంప్లైట్ చేయాలని తెలియదు.
మేము అలా పిండిమర దారిపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జల్లులా మరకు పోయి వస్తే పావలానో, పదిపైసలో ఆకర్ష్ పథకానికి ఆశ పడి ఈ సాహసానికి సిద్దపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా వద్దు.
ప్రతిరోజూ ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి, కళ్ళు మూసుకుని,
చేతులు ముడుచుకుని, కొన్ని నిమిషాలు ఏదో గొణుక్కుంటోంది. తరవాత కళ్ళు తెరిచి నమస్కరించి, నవ్వి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయేది.
ఇది రోజువారీ వ్యవహారం.
పూజారి ఆమెని గమనిస్తూ ఉన్నారు.
ఆ పిల్ల ఏమి
చేస్తోందో అని ఆసక్తి మొదలైంది.
ఆయన ఆలోచించాడు, మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఆమె చాలా చిన్నది,
ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు.
అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏమి చేస్తోంది?
పదిహేను రోజులు గడిచాయి. పూజారి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవడానికి
ఆలోచన చేస్తున్నారు.
ఒకరోజు ఉదయం, పూజారి ఆ పాప కంటే ముందే
అక్కడికి చేరుకుని ఆమె కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి...
ఆమె తలపై చేయి వేసి, “చిట్టి తల్లి, గత పదిహేను రోజుల నుండి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడకు రావడాన్ని
నేను చూస్తున్నాను. ఏమి చేస్తున్నావు రోజూ?"