ఉచిత_సలహా

'చచ్చిపోయేమనుకో.. అప్పుడు ఏమవుతుందంటావ్?'

'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది'

'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'

'ఏమీ అవ్వదు.. నిన్న ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో..మంచి బేరం పోయిందే.
సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు'

'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసేను కదా.. స్వర్గానికి పోతానంటావా?'

'స్వర్గం అంటే ఏమిటో?'

'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, మేనకా డాన్సాడుతూంటారూ..'

'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? '

' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో పడుక్కోడానికన్నమాట'

' మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని? '
' సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా? '

' ఛఛ.. మా ఆవిడ పతివ్రత.. '

' అంటే.. నువ్వు వెధవ్వన్నమాట'

' సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో..
యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా? '

' నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి? పోనీ.. వేయించేడే అనుకో... వేయించి ఏం చేస్తాడూ? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు.. '

' అంటే వేయించడంటావా? '
' ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా? '

' అంటే.. స్వర్గం, నరకం లేవంటావు? '

' ఎందుకు లేవూ?... స్వర్గం, నరకం చస్తే ఉండవు... బతికుండగానే ఉంటాయి ..
ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో... అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.... అది నరకం'

#నీతి : ఎవరికి ఏం అర్దమయితే అది

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

13 Sep
👍*అయ్యరు గారి.. IQ*🤔

*భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.*

*ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది.
ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం,
ఆ ఆంగ్లేయుడు గమనించాడు.*

*తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.*

*మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు.
Read 11 tweets
11 Sep
Just for fun:
సుప్రీమ్ కోర్టు సరదాలు

కోవిడ్ దెబ్బకు అన్నీ ఆన్ లైన్ విచారణలు జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఐతే ఈ ఆన్ లైన్ లో కూడా న్యాయవాదులు కోర్టుకు వచ్చినట్లుగానే బ్యాండ్, కోటు, గౌను ధరించాల్సిందే. అలా కాకుండా అపియర్ అయిన వాళ్ళను కేకలేసి కేసు వాయిదా వేసిన సంఘటనలు
కోకొల్లలు.

అలా ఉన్న సమయంలో ఒక సీనియర్ న్యాయవాది గారు సమయం మించిపోతోందని హడావిడిగా కోటు, గౌను, బ్యాండు తగిలించుకుని ఆన్ లైన్ లోకి వచ్చారు, ఆయన తన వాదన వినిపిస్తున్నారు,

మధ్యలో ఆ లాయరు గారి భార్య టిఫిన్ పట్టుకొచ్చి "తినకుండా కూర్చుంటే ఎలా? అడ్డం పడితే చెయ్యడానికి ఎవరూ లేరు" అంటూ
టిఫిన్ ప్లేటు కంప్యూటర్ ముందు పెట్టేసిందట. అనుకోని సంఘటనతో లాయరు గారు బిక్క చచ్చిపోయారు. ఆన్ లన్ లో అవతల ఉన్నది సుప్రీమ్ కోర్టు జడ్జీలు. వాళ్ళు కూడా అవాక్కైపోయారట.
ఐతే లాయరుగారు వెంటనే తేరుకుని "Me Lords, it is easier to face Contempt of Court than Contempt of Housewife" అన్నారట.
Read 4 tweets
11 Sep
🌸 *చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు* 🌸

'' ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి , '' అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ' ఆమె మన అతిథి . ఆమె టీ , కాఫీ తాగరట. పాలు ఇవ్వు ,
' అని ఆ కూలీ అంటే ' మన పాప కు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది , ' అంది ఆమె. ' అయినా పరవాలేదు , సగం పాలకు సగం నీళ్ళు కలిపి , చక్కెరతో ఇవ్వు, 'అన్నాడు ఆయన.

ఒరియా తెలిసిన సుధా మూర్తి కి అది వినపడింది. ' ఈ రోజు బుధవారం ,
నేను ఉపవాసం. ఏమీ తీసుకోను , ' అంది ఆమె. ' అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ? అని అతనంటే ' అవును. నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను , ' అన్నారు ఆమె.

ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు. గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నాదేశం
Read 8 tweets
11 Sep
*తెలుగు భాష లో దాగి ఉన్న వ్యాయామం గురించి తెలుసుకుందాం.*
☘☘
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.*
🌸🌸🌸
*తేట తేట తెనుగులా.*
🌸🌸🌸
*మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది.*
🌸🌸🌸
*ఏలాఅంటే.*
🌸🌸🌸
*అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:*
🌸🌸🌸
*ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.*
🌸🌸🌸
*క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం.*
🌸🌸🌸
*చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం.*
🌸🌸🌸
*ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం.*
🌸🌸🌸
*త థ ద ధ న……నాలుక కొస భాగం.*
🌸🌸🌸
*ప ఫ బ భ మ……..పెదవులకు.*
🌸🌸🌸
*య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా.*
🌸🌸🌸
Read 6 tweets
7 Sep
చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు. ఆసాంతం చ‌దివి మీరే అవునో, కాదో చెప్పండి. నా బాల్యంలో కొంత కాలం అవ‌నిగ‌డ్డ‌, గిద్ద‌లూరు, ఇచ్చాపురం వంటి చిన్న ఊళ్ళ‌ల్లో గ‌డిచింది. అప్ప‌ట్లో అన్న‌పూర్ణా ఆటాలు,ఆశీర్వాద్ ఆటా ఆశీర్వాదాలు
మాకు దొర‌క‌ని క‌ష్ట‌కాల‌మాయే. అంద‌రూ గోధుమ‌లు, ధాన్యం, ప‌ప్పులు మ‌ర ఆడించుకోవ‌ల్సిందే. ఈ ప‌నికోసం అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు మ‌మ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమ‌ర‌కు తోలేవాళ్ళు. మాకు ఇప్ప‌టి పిల్ల‌లంత అవేర్‌నెస్ లేక‌పోవ‌డంతో కార్మిక శాఖ‌కు కంప్లైట్ చేయాల‌ని తెలియ‌దు.
మేము అలా పిండిమ‌ర దారిప‌ట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ జ‌ల్లులా మ‌ర‌కు పోయి వ‌స్తే పావలానో, ప‌దిపైస‌లో ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆశ ప‌డి ఈ సాహ‌సానికి సిద్ద‌ప‌డితే మేము ప‌డ్డ క‌ష్టాలు ప‌గోడికి కూడా వ‌ద్దు.

గోధుమ‌లో మ‌రొక‌టో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు ర‌మ్మ‌ని చెపుతూ
Read 24 tweets
3 Sep
ప్రతిరోజూ ఉదయాన్నే ఓ చిన్నారి ఓ దేవాలయానికి వచ్చి భగవంతుని ముందు నిలబడి, కళ్ళు మూసుకుని,
చేతులు ముడుచుకుని, కొన్ని నిమిషాలు ఏదో గొణుక్కుంటోంది. తరవాత కళ్ళు తెరిచి నమస్కరించి, నవ్వి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయేది.
ఇది రోజువారీ వ్యవహారం.

పూజారి ఆమెని గమనిస్తూ ఉన్నారు.
ఆ పిల్ల ఏమి
చేస్తోందో అని ఆసక్తి మొదలైంది.
ఆయన ఆలోచించాడు, మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి ఆమె చాలా చిన్నది,
ఆమెకు ఎలాంటి ప్రార్థనలు తెలియవు.
అయితే ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏమి చేస్తోంది?
పదిహేను రోజులు గడిచాయి. పూజారి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి మరింత తెలుసుకోవడానికి
ఆలోచన చేస్తున్నారు.

ఒకరోజు ఉదయం, పూజారి ఆ పాప కంటే ముందే
అక్కడికి చేరుకుని ఆమె కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి...
ఆమె తలపై చేయి వేసి, “చిట్టి తల్లి, గత పదిహేను రోజుల నుండి నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడకు రావడాన్ని
నేను చూస్తున్నాను. ఏమి చేస్తున్నావు రోజూ?"
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(