ఆ ఇంట్లో అక్కా చెల్లెళ్లు ఐదుగురూ కలెక్టర్లే! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలెక్టర్ కావాలన్న తమ తండ్రి కోరిక మేరకు వారంతా సివిల్స్‌కు ప్రిపేర్ అయి.. అనుకున్నది సాధించారు. తమ తండ్రి కోరికను నెరవేర్చేలా చేశారు. అయితే ఆ కుటుంబంలో తొలుత ఇద్దరు..
తర్వాత ఇప్పుడు ఏకంగా ముగ్గురు కలెక్టర్లుగా మారారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రాజస్థాన్‌లోని హనుమాఘర్‌కు చెందిన సహదేవ్ సహరన్ ఒక సాదాసీదా రైతు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు. వీరికి రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్ అని
పేర్లు పెట్టారు. తనకు కొడుకులు లేరని సహదేవ్ ఏనాడూ కుంగిపోలేదు. అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా... ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు
ఉన్నత చదువులు చదవడమే కాకుండా... కలెక్టర్లుగా ఎంపికై తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
2018లో నిర్వహించిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా... అందులో అన్షు, రీతు, సుమన్‌లు ఎంపిక అయ్యారు
. రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌కు ఏకకాలంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎంపిక కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యావత్ భారతావని దృష్టిని.. తమ వైపునకు ఆకర్షించేలా చేశారు ఈ యువతులు.
సహదేవ్ సహరన్ ఇంట్లో ఇప్పటికే రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు.
తాజాగా అన్షు, రీతు, సుమన్‌లు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక అయ్యారు. దీంతో సహదేవ్ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం.
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
పరగడుపునే నిమ్మరసం తీసుకుంటే....??
చాలా మంది ఉదయాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగి రోజు మొదలు పెడతారు. దీంతో నిద్ర మత్తు వదిలి యాక్టివ్‌గా ఉండవచ్చని వారి భావన. అయితే ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ను తాగడం అంత మంచిది కాదు.
వీటితో జీర్ణ సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే
శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. 2. జీర్ణ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు రావు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.
.
వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది.
వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో
సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి.
గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని
వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా
చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.
రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం,
ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.
ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను
గుడి అవసరంలేని దేవుళ్ళు !
వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా?
కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి.
వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD , ఆమె MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా
వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి.
1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర , MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తీగా
వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు : '' ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి
ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది..
అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ' చదువు
సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!' అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది.
అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.
మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.
కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది.