#NutDay#NutsDay 🌰🥜
NutDay #Nuts 🌰🥜
మీ రోజువారీ ఆహారంలో నట్స్ ను చేర్చుకోవాలి ఎందుకంటే అవి మానవ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించే విస్తృతమైన పోషకాలను కలిగి ఉంటాయి.
అవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులను, ఫైబర్ మరియు ప్రోటీన్ల వంటి మూలాలతో పాటు, అనేక విటమిన్లను మరియు ఖనిజాలైన, మెగ్నీషియం మరియు విటమిన్ E లను కూడా కలిగి ఉంటాయి.
రోజుకు కనీసం 20 గ్రాముల నట్స్ను (గింజలను) తినే ప్రజలు దాదాపు 30 శాతం హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, అకాల మరణాలను 22 శాతం, క్యాన్సర్ను 15 శాతం తగ్గింప చేస్తున్నాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.నట్స్, కాలానుగుణంగా వచ్చే ఊబకాయ ప్రమాదాన్ని తగ్గించడానికి
అవసరమైన శక్తిని కలిగి ఉంటాయి మరియు అవి శక్తిని కూడా అందించగలిగేవిగా ఉంటాయి, మీరు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును (waistline) తగ్గించుకోవలసిన శ్రమ పడవలసిన అవసరం లేకుండానే, కావలసిన ప్రయోజనాలను వీటిద్వారా పొందవచ్చు.నట్స్ అనేవి శరీర జీవక్రియకు సంబంధించి ఉన్న
అధిక రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు గురికాకుండా ఉండే ప్రమాద స్థాయిలను తగ్గించవచ్చు.మీరు మీ ఆహారంకు నట్స్ను (గింజలను) జోడించాలనుకుంటే,
మెరుగైన ఆరోగ్యానికి అవసరమైన 10 ఉత్తమ రకాల నట్స్ను (గింజలను) గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ క్రింద వివరించిన అంశాలను పూర్తిగా చదవండి.
1. బాదం :
విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫైబర్, కార్బొహైడ్రేట్, ప్రోటీన్ మరియు మాంగనీస్ లాంటి అనేక పోషకాలను - బాదం కలిగి ఉంటుంది. విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం వంటివి LDL అనే (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించగలవు.
బాదంలో కనిపించే మరొక సమ్మేళనం, సరైనరీతిలో మెదడు అభివృద్ధి చెందేందుకు కీలకమైన పాత్రను పోషిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
2. పిస్తా :
పొటాషియం, విటమిన్ B6, కాపర్ మరియు మాంగనీస్ వంటి అద్భుతమైన మూలాలను పిస్తాపప్పులలో పుష్కలంగా ఉన్నాయి.
పిస్తాపప్పు రక్తంలో గల చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు వాటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఊబకాయమును, వాపును మరియు గ్లైసెమిక్ వంటి వాటిని నియంత్రణ చేసే, ప్రయోజనకరమైన ప్రభావాలను ఇందులో కలిగి ఉన్నాయి.
ఇందులో కొలెస్ట్రాలు అస్సలు లేకపోవడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి చాలా చాలా ఉపయోగకారిగా ఉన్నది.
3. వాల్నట్స్ :
వాల్నట్స్ (అక్రోట్లు) అనేవి రూపంలో మానవ మెదడును ప్రతిబింబించేలా ఉంటాయి, అందువల్ల అవి మెదడు శక్తిని పెంపొందించేదిగా అత్యంత ప్రజాదరణనను పొందాయి. వాల్నట్లలో "ఒమేగా -3 కొవ్వులను" ఎక్కువగా కలిగి ఉంది - ఫైబర్లను తక్కువ మోతాదులో కలిగి ఉంటాయి మరియు క్యాన్సర్ను నిరోధించే
అత్యధికమైన అనామ్లజనకాలను కలిగి ఉంటాయి. నట్స్ (గింజలు) కూడా శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి మరియు గుండెపోటుకు కారణమైన 'కరోనరీ' చర్యకు వ్యతిరేకంగా పోరాడటానికి ఇవి చాలా సహాయపడతాయి.
4. జీడిపప్పు :
జీడిపప్పులు మాత్రమే ఒంటరిగా తినేందుకు ప్రీతికరమైన పదార్థంగా ఉంటుంది మరియు జీవక్రియ యొక్క లక్షణాలను మెరుగుపరిచేదిగా పిలుస్తారని మనకి బాగా తెలుసు. ఇవి అనాకార్డిక్ ఆమ్లమును కలిగి ఉండటం వల్ల, ఇవి ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి మరియు దీర్ఘకాలిక నొప్పులను
నిరోధించడంలో సహాయపడుతుంది. జీడిపప్పులో గొప్ప ఖనిజాలైన - జింక్, సెలీనియం మరియు రాగి వంటి మూల పదార్థాల సమ్మేళనాలు కూడా జీడిపప్పులో ఉన్నాయి.
5. పీకన్స్ :
పీకన్స్ లో అనామ్లజనకాలుగా పనిచేసే పాలీఫెనోల్స్ ను కలిగి ఉన్న చాలా అద్భుతమైన గింజలు. ఇవి విటమిన్ E కి ఒక మంచి మూల పదార్థంగా ఉంటూ, ఇది హానికరమైన చర్మ ఆక్సిడెంట్ల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
పీకన్స్ లో వివిధ రకాలైన విటమిన్లను మరియు ఖనిజాలను, అనగా ఫోలిక్ ఆమ్లమును, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి వాటిని కలిగి ఉన్నాయి.
6. మకాడమియా నట్స్ :
మకాడమియా గింజలలో గుండెకు ప్రయోజనాలను కలిగించే 'మోనోసాండరేట్' అనే కొవ్వులను కలిగి ఉంటాయి. ఈ గింజలు పామిటోలెలిక్ ఆమ్లమును కలిగి ఉండటం వల్ల శరీర జీవక్రియ రేటును పెంచే ఆమ్లాలను కలిగి, శరీరంలో అదనపు కొవ్వు నిల్వను నిరోధిస్తుంది.
మకాడమియా గింజలలో పోషకాలనే కాక, ఫైబర్ మరియు ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ మరియు జింక్ వంటి పోషకాలను కలిగి ఉన్నాయి.
7. బ్రెజిల్ నట్స్ :
సెలీనియం అనే గొప్ప వనరు కారణంగా బ్రెజిల్ గింజలను తరచుగా ప్రతిపాదించడం వల్ల, అవి క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడేదిగి సూచించబడినది. ఈ గింజలు కూడా నాడీ వ్యవస్థను మరియు కండరాల వ్యవస్థను మెరుగుపరిచేదిగా ఉంటూ, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు నిర్విషీకరణ (శరీరంలో ఉన్న చెడును తొలగించేదిగా), వాపు మరియు థైరాయిడ్ పనితీరుల నియంత్రణకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి ఉంటాయి.
8. హాజెల్ నట్స్ :
హాజెల్ నట్స్ కేవలం పుష్టికరమైనవే కాదు, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగకారిగా ఉంటాయి.
అవి విటమిన్ E, మాంగనీస్, థయామిన్, ఫోలేట్ మరియు కొవ్వు ఆమ్లాలు వంటి అనేక ముఖ్యమైన పోషకాల సమ్మేళనంగా వుంటూ, మెదడు మరియు జ్ఞాన శక్తి యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి.
9. పీనట్స్ : పల్లీ
పీనట్స్ లను వేరుశనగలని కూడా పిలుస్తారు మరియు పచ్చి వేరుశనగలను తినడం వల్ల చర్మాన్ని మరింత
కాంతివంతంగా చెయ్యవచ్చు. దానిలో ఉన్న అనేక ఆరోగ్య ప్రయోజనాలు కారణంగా, వేరుశెనగలను ఒక ప్రముఖమైన అల్పాహారంగా (చిరుతిండిగా) తీసుకుంటారు. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంలో సహాయపడే మాంగనీస్ను అధిక స్థాయిలో కలిగి ఉన్నాయి.
10. చెస్ట్-నట్స్ :
చెస్ట్నట్ లో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు క్వెర్సేటిన్ వంటి ఫ్లేవానాయిడ్లను కలిగి ఉండటం వల్ల డయాబెటిస్, క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి మానవదేహాన్ని రక్షిస్తుంది. దాని వింత రుచి మరియు శక్తివంతమైన ప్రయోజనాలు
శరీరంలో దెబ్బతిన్న రక్తనాళాలను మరియు రక్త కేశనాళికల చికిత్సలో సహాయపడతాయి. చెస్ట్నట్, పళ్ళను బలంగా కాపాడుతూ, మరోపక్క శ్వాసకోశ వ్యాధులను నిర్మూలిస్తుంది.
Nuts have the ability to reduce the risk of metabolic syndrome, such as high blood pressure and cholesterol levels.
It also reduces the risk of other chronic diseases and can also reduce the risk of certain cancers. If you want to add nuts to your diet, read on to know more about the 10 best nuts to eat for better health.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం #UnitedNationsDay
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.
అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
#MotherInLawDay#motherinlaw
అత్తగారు అనగానే చాలామందికి కోడల్ని తిడుతూ నిష్ఠూరాలాడే సూర్యకాంతం పాత్ర కళ్లముందు కదులుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడు అమ్మతో ఉండే సాన్నిహిత్యం, అక్క దగ్గరుండే చనువూ అత్తగారితోనూ ఏర్పడుతున్నాయి. మెట్టినిల్లూ పుట్టినిల్లుగా మారిపోతోంది.
ఈరోజు అత్తగార్ల దినోత్సవం సందర్భంగా అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు.
తల్లి సోదరుడి భార్యను, నాన్న సోదరిని కూడా అత్త అంటారు.నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.
సంబంధాలు:-
మేనత్త తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
#SnowLeopardDay ❄🐆 #Snow
మీరు చిరుత పులుల గురించి వినే ఉంటారు.కానీ మంచు చిరుతల గురించి ఎప్పుడైనా విన్నారా? భారత దేశంలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీటి అరుదైన దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. @LakshmiManchu@HeroManoj1@iVishnuManchu
మంచు చిరుతలు
'ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్ ఇదే'...
ఇండియాలో కనిపించిన మంచు చిరుత...
ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి.
మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి.
కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఈ అందమైన మంచు చిరుత పులుల యొక్క దృశ్యాలను భారత విదేశాంగ సేవ అధికారి ఆకాశ్ కుమార్ వర్మ తన ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.
బువ్వ గంజిపడ్తాంటే...
సిల్వర డబ్బాలోని ఓ పిరికెడు రాగిపిండిని...
ఆ తపాల్లో వేసేది..
బాగా కల్పుకున్నాక..
టైముచూసి పొయ్యిమీదనుంచి దింపేసి...
సంగటి తెడ్డుతో గెలికేది.
మా నాయినకో ముద్ద...
టోపీ గిన్నెలో నాకు రెండు సంగటిముద్దలేసశేది..
ఆతర్వాత మా చెల్లెలికి...
చివరన మాయమ్మ చిన్న పల్లెంలోకి
రాగి సంగటి వేసేది.
నిమ్మట్లోకి బ్యాల్లపుల్పు చేసేది.
#CradleDay#Cradle
ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.
ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.