#CradleDay#Cradle
ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.
ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.
ప్రకృతిలో పొడుగ్గా బలమైన ప్రాకే మొక్కల కాండం క్రిందకి ఊగుతుంటే వాటిమీద కూర్చొని ఊగడం అడవులలోని చిన్నచిన్న గ్రామాలలో చూడవచ్చును.
సంస్కృతి
తెలుగువారు బిడ్డపుట్టిన తర్వాత జరిపే బాలసారె పండుగలో మొట్టమొదటగా పట్టుచీరతో కట్టిన ఉయ్యాలలో వేస్తారు.
అట్లతద్ది పండుగనాడు యువతులు, ముత్తైదువలు ఉయ్యాల లూగడం ఒక సంప్రదాయం.ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు.
ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం #UnitedNationsDay
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.
అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
#MotherInLawDay#motherinlaw
అత్తగారు అనగానే చాలామందికి కోడల్ని తిడుతూ నిష్ఠూరాలాడే సూర్యకాంతం పాత్ర కళ్లముందు కదులుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడు అమ్మతో ఉండే సాన్నిహిత్యం, అక్క దగ్గరుండే చనువూ అత్తగారితోనూ ఏర్పడుతున్నాయి. మెట్టినిల్లూ పుట్టినిల్లుగా మారిపోతోంది.
ఈరోజు అత్తగార్ల దినోత్సవం సందర్భంగా అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు.
తల్లి సోదరుడి భార్యను, నాన్న సోదరిని కూడా అత్త అంటారు.నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.
సంబంధాలు:-
మేనత్త తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
#SnowLeopardDay ❄🐆 #Snow
మీరు చిరుత పులుల గురించి వినే ఉంటారు.కానీ మంచు చిరుతల గురించి ఎప్పుడైనా విన్నారా? భారత దేశంలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీటి అరుదైన దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. @LakshmiManchu@HeroManoj1@iVishnuManchu
మంచు చిరుతలు
'ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్ ఇదే'...
ఇండియాలో కనిపించిన మంచు చిరుత...
ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి.
మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి.
కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఈ అందమైన మంచు చిరుత పులుల యొక్క దృశ్యాలను భారత విదేశాంగ సేవ అధికారి ఆకాశ్ కుమార్ వర్మ తన ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.
బువ్వ గంజిపడ్తాంటే...
సిల్వర డబ్బాలోని ఓ పిరికెడు రాగిపిండిని...
ఆ తపాల్లో వేసేది..
బాగా కల్పుకున్నాక..
టైముచూసి పొయ్యిమీదనుంచి దింపేసి...
సంగటి తెడ్డుతో గెలికేది.
మా నాయినకో ముద్ద...
టోపీ గిన్నెలో నాకు రెండు సంగటిముద్దలేసశేది..
ఆతర్వాత మా చెల్లెలికి...
చివరన మాయమ్మ చిన్న పల్లెంలోకి
రాగి సంగటి వేసేది.
నిమ్మట్లోకి బ్యాల్లపుల్పు చేసేది.
#DosaDay 🥘🍳 #Dosa#dosarecipes
దోశ/అట్టు, దక్షిణభారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు. దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం.
దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అని కూడా ప్రాంతాల వారిగా అంటూ ఉంటారు. అంతేకాదు అట్లకోసం ఒక పండుగ కూడా ఉంది. అదే అట్ల తద్ది.అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు. వివాహము అయిన తరువాత ఈ నోము తప్పక తీర్చుకోవడం కొంత మందిలో
ఆనవాయితీగా వస్తుంది. స్త్రీలు అట్లతద్ది నాడు శుచిగా అట్లు పోసి వాటి మధ్య పప్పు, బెల్లం, నెయ్యి ఉంచి ఇంటి సింహద్వారం పూజించి అట్లను నైవేద్యంగా ఉంచి నమస్కరిస్తారు.