#MotherInLawDay#motherinlaw
అత్తగారు అనగానే చాలామందికి కోడల్ని తిడుతూ నిష్ఠూరాలాడే సూర్యకాంతం పాత్ర కళ్లముందు కదులుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడు అమ్మతో ఉండే సాన్నిహిత్యం, అక్క దగ్గరుండే చనువూ అత్తగారితోనూ ఏర్పడుతున్నాయి. మెట్టినిల్లూ పుట్టినిల్లుగా మారిపోతోంది.
ఈరోజు అత్తగార్ల దినోత్సవం సందర్భంగా అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు.
తల్లి సోదరుడి భార్యను, నాన్న సోదరిని కూడా అత్త అంటారు.నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.
సంబంధాలు:-
మేనత్త తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
మేనమామ
తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు. ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్తలు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు
గొడవలకు కారణాలు
కోడలికి చాకిరీ చేయటం అత్తకు, అత్తకు చాకిరీ చేయటం కోడలికి ఇష్టం లేక.
ఒంటరిగా ఉండాలనే కోరికతో కావాలనే గొడవపెట్టుకోవటం, వెళ్ళగొట్టటం
కొడుకు తనకి దూరమై మరొక స్త్రీ (కోడలు) ని ఇష్టపడుతున్నాడు అనే అభధ్రతా భావం.
తన భర్త తనే లోకంగా ఉండాలి అమ్మని మర్చిపోవాలి అనే ధోరణి.
అత్తలకు గమనిక సలహాలు...
- కొత్త కోడళ్లకు కొన్నాళ్ల వరకు ఇంటి పద్ధతుల గురించి వివరించడం వరకు పర్వాలేదు. అయితే, అడగకున్నా నిత్యం సలహాలిస్తూ ఉండటం సరికాదు.
- కోడలు కోరినప్పుడు సలహా ఇస్తే దానికి విలువ ఉంటుంది.
చాడీలు...
- కొడుకు తన మాటే వినాలని.. కోడలి మీద కొడుక్కి చాడీలు చెబుతుంటారు. ఈ తరహా ప్రవర్తన కొడుకు కోడళ్ల మధ్య అగాథాలు ఏర్పడతాయి.
- కొడుకు దగ్గర కోడలు చేసే పనులను మెచ్చుకుంటే, అనుబంధాలు బలపడతాయి.
కష్టం నుంచి సులువు...
- చుట్టుపక్కల వారితో చనువుగా, మృదువుగా మాట్లాడే అత్తలు, కోడలి దగ్గరికొచ్చేసరికి స్వరం పెంచుతారు. కరకు మాటలు ఎదుటివారిని గాయపరుస్తాయని మరువకూడదు.
- ఇంటి కష్ట సుఖాలు, పుట్టింటివారి బాగోగుల గురించి కోడలితో అప్పుడప్పుడైనా మాట్లాడుతుంటే ఇద్దరి మధ్య అనుబంధం మెరుగుపడుతుంది.
విమర్శ...
- ఇంటి పెత్తనం పోతుందనే భయంతో కొందరు అత్తలు కోడలు చేసే ప్రతిపనినీ తప్పు పడుతుంటారు. బంధువుల ముందూ తేలిక చేసి మాట్లాడుతుంటారు. ఇదే తీరు కొనసాగిస్తే అందరూ మిమ్మల్నే వేలెత్తి చూపుతారు.
- కోడలిని ఆదరంగా చూసుకుంటూ, ఆమె చేసే మంచి పనులను నలుగురిలోనూ మెచ్చుకుంటూ ఉంటే మీ ఇంటి గౌరవం పెరుగుతుంది. మీ తీరు బాగుంటేనే మీ కూతురికైనా, మరో కొడుకుకైనా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
కోడళ్లకు గమనిక
కోపం...
- చిన్న చిన్న విషయాలకే అత్త మీద కోపాన్ని చేతిలోని వస్తువుల మీద చూపుతుంటారు. అకారణంగా పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు.
- అర్థంలేని ఇలాంటి కోపాన్ని అదుపు చేసుకుంటే ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది.
అగౌరవం...
- అత్తగారు ఏదైనా చెబితే ‘సలహా’ అని తిట్టుకుంటూ ముఖం ముడుచుకుంటారు.
- అనుభవమున్న వారు మన మంచికే చెబుతారు అనుకుంటే సమస్యే ఉండదు. ‘మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు చెప్పిన పనులు నాకు అంత త్వరగా రాకపోవచ్చు.
మెల్లగా నేర్చుకుంటాను’ అని అనునయంగా చెబితే అత్త మనసును కష్టపెట్టకుండా తర్వాత మీకు నచ్చిన పనినే చేసే అవకాశాలు ఉంటాయి.
అపార్థం...
- అత్తలు చెప్పే మాటలను కొందరు కోడళ్లు చప్పున అపార్థం చేసేసుకుంటారు. ఇలాంటి అపార్థాలు అనర్థాలకు దారితీస్తాయి.
- అత్త కూడా అమ్మలాంటిదే అని గ్రహించాలి. తమ పుట్టింట్లో అమ్మ తన కోడళ్ల పట్ల ఎలా ఉంటుందో గుర్తుతెచ్చుకోవాలి. అత్తగారిలో అమ్మను చూసుకుంటే సమస్యే ఉండదు.
అనాలోచన...
- అత్త ఎప్పుడూ తప్పులు పట్టడానికే ఉంటుంది అనే ఆలోచన పెళ్లికి ముందు నుంచే అమ్మాయిల్లో ఉంటుంది. మన సంస్కృతిలో అత్తా-కోడళ్ల మధ్య బంధాలు అలాంటి ఆలోచనను లేపడం సహజం.
- మీ అత్తగారి కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకోండి. అప్పుడు అత్తగారిని మీ దారిలోకి తెచ్చుకోవడం తేలికవుతుంది.
ఎదురు మాటలు...
- అత్త ఏదైనా చెప్పబోతే ‘నాకు చెప్పేటంత దానివా..? చదువు, ఉద్యోగం.. అన్నీ నీకన్నా ఎక్కువే’ అనే తలబిరుసు మాటలు అత్తా కోడళ్ల మధ్య దూరం పెంచుతాయి.
- అత్త చెప్పేది మన మంచికే అనే ఆలోచనతో వింటే ఎలాంటి సమస్యలు ఉండవు.
అత్తల హక్కుల సంక్షేమ సంఘం 498 (ఎ) సెక్షన్ కోడళ్ల చేతిలో వజ్రాయుధంగా మారిన నేపథ్యంలో అత్తలకు బాసటగా నిలబడేందుకు, అత్తలకు కూడా గృహహింస నుంచి రక్షణ కల్పించటం కోసం, అత్తలు సామాజిక వివక్ష, గృహహింసలకు బలవకుండా, అత్తలకు తగిన రక్షణ, సంక్షేమం కోసం
ఆంధ్రప్రదేశ్ మదర్స్-ఇన్-లా ప్రొటక్షన్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) ఆవిర్భావించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేప్రకారం 1.7 శాతం మహిళలు అత్తల చేతిలో హింసని అనుభవిస్తుంటే, 13.7 శాతం మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.
మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.కోడళ్లతో నరకాన్ని అనుభవిస్తున్న అత్తలు 9704683163, 9573605415 నెంబర్లలో సంప్రదించ వచ్చు.
అత్తపై సామెతలు
అత్తా ఒకింటి కోడలే
అత్తలేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం #UnitedNationsDay
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.
అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
#SnowLeopardDay ❄🐆 #Snow
మీరు చిరుత పులుల గురించి వినే ఉంటారు.కానీ మంచు చిరుతల గురించి ఎప్పుడైనా విన్నారా? భారత దేశంలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీటి అరుదైన దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. @LakshmiManchu@HeroManoj1@iVishnuManchu
మంచు చిరుతలు
'ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్ ఇదే'...
ఇండియాలో కనిపించిన మంచు చిరుత...
ఘోస్ట్ ఆఫ్ మౌంటెన్' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి.
మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి.
కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఈ అందమైన మంచు చిరుత పులుల యొక్క దృశ్యాలను భారత విదేశాంగ సేవ అధికారి ఆకాశ్ కుమార్ వర్మ తన ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.
బువ్వ గంజిపడ్తాంటే...
సిల్వర డబ్బాలోని ఓ పిరికెడు రాగిపిండిని...
ఆ తపాల్లో వేసేది..
బాగా కల్పుకున్నాక..
టైముచూసి పొయ్యిమీదనుంచి దింపేసి...
సంగటి తెడ్డుతో గెలికేది.
మా నాయినకో ముద్ద...
టోపీ గిన్నెలో నాకు రెండు సంగటిముద్దలేసశేది..
ఆతర్వాత మా చెల్లెలికి...
చివరన మాయమ్మ చిన్న పల్లెంలోకి
రాగి సంగటి వేసేది.
నిమ్మట్లోకి బ్యాల్లపుల్పు చేసేది.
#CradleDay#Cradle
ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.
ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.
#DosaDay 🥘🍳 #Dosa#dosarecipes
దోశ/అట్టు, దక్షిణభారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు. దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం.
దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అని కూడా ప్రాంతాల వారిగా అంటూ ఉంటారు. అంతేకాదు అట్లకోసం ఒక పండుగ కూడా ఉంది. అదే అట్ల తద్ది.అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు. వివాహము అయిన తరువాత ఈ నోము తప్పక తీర్చుకోవడం కొంత మందిలో
ఆనవాయితీగా వస్తుంది. స్త్రీలు అట్లతద్ది నాడు శుచిగా అట్లు పోసి వాటి మధ్య పప్పు, బెల్లం, నెయ్యి ఉంచి ఇంటి సింహద్వారం పూజించి అట్లను నైవేద్యంగా ఉంచి నమస్కరిస్తారు.