#HouseWifesDay#HouseWife
సామాన్య లేదా మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటి చాకిరి అంతా ఇల్లాలిపైనే పడుతుంది. సూర్యుడు కన్నా ముందుగా నిద్రలేస్తుంది గృహిణి. అంతా తనే చూసుకుంటుందన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్న పతిదేవుని, పిల్లలను నిద్రలేపాలి. వాళ్లు ఒక పట్టాన నిద్రలేవరు.
అదే సమయంలో పొయ్యి మీద పెట్టిన పాలు ఎక్కడ పొంగుతాయనే ఆదుర్దాలో సూపర్‌సోనిక్ విమానం కన్నా వేగంగా వంటింట్లోకి పరిగెత్తి నువ్వా నేనా అన్నట్లు శివుని శిరస్సు నుంచి నేల మీదకు దూకుతున్న గంగ వలె కాచుకున్న పాలపొంగును స్టవ్ కట్టేయడం ద్వారా పాలు కింద పడకుండా ఆపి ఒలింపిక్స్‌లో పతాకం
సాధించిన పరుగులరాణి పీటీ ఉషలా ఆనందపడుతుంది. ఆ ముచ్చట తీరకముందే బెడ్‌రూమ్ నుంచి పతిదేవుని గావుకేక. రాత్రి చేయగా మిగిలిపోయిన హోమ్ వర్క్‌ను చేయకుండా పోట్లాడుకుంటూ గోల చేస్తున్న పిల్లలు.
వాళ్లకు కావాల్సినవన్నీ అమర్చి కాసేపు కుర్చీలో కూర్చుందామనుకంటే చాలు... శ్రీవారు ఒక రకంగా చూసి " మధ్యాహ్నమంతా ఖాళీయే కదా... అప్పుడు రెస్టు తీసుకుందువు గానీ... ముందు నాకు కర్చీఫ్ వెదికిపెట్టు", అనేసి టిఫిన్ కోసమని కుర్చీలో కూర్చుని మరోసారి న్యూస్ పేపర్‌ను చదవడం మొదలుపెడతారు.
మోటర్ సైకిల్ ఉన్నా కూడా పిల్లలను స్కూల్లో దింపాలంటే శ్రీవారికి మా చెడ్డ చిరాకు... ప్రతిరోజూ ఆఫీసులో అర్జెంట్ పని ఉందంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా మోటర్ సైకిల్ మీద ఎవరో తరుముతున్నట్లుగా వెళ్లిపోతారు.
పిల్లలను స్కూల్ దగ్గర దించి వచ్చేసరికి వంటింట్లో అంట్ల గిన్నెలు, హాలులో చిందరవందరగా పడేసి ఉన్న పుస్తకాలు, స్నానం చేసి తుడుచుకున్న టవళ్లు మా సంగతేమిటన్నట్లు చూస్తుంటాయి.
ఇక అన్ని పనులు ముగించేసి భోజనం చేసి కాసేపు కునుకు తీద్దామనుకునేలోగా ఎల్కేజీ చదువుతున్న నానీని స్కూల్ నుంచి తీసుకు రావలసిన సమయం ఆసన్నమవుతుంది. ఇంటికి తెచ్చీరాగానే అన్నం తిననని మారాం చేస్తాడు. దాంతో ఏదో ఒక అల్పాహారం చేయాల్సి వస్తుంది.
ఈలోగా మేడమీది మీనాక్షమ్మ గారికి ఊసుపోక కబుర్లతో కాలక్షేపం చేద్దామని కిందకు వస్తారు. పనిలో ఉన్నానని ఇప్పుడు కాదని చెప్తామంటే ఆవిడ ఫీల్ అవుతుంది. పైగా ఇంటి ఓనరమ్మ కూడాను. ఆమె ఆగ్రహించిందంటే కొత్త ఇంటిని వెదుక్కునే అదనపు పని కూడా ఆ ఇల్లాలి ఖాతాలో వచ్చి చేరుతుంది.
మీనాక్షమ్మ అలా ఒక రెండు గంటలు తిష్టవేసి కబుర్లతో కడుపు నింపుకుని మేడ మీదకు వెళ్లిపోతారు. మధ్యలో ఎనిమిదో తరగతి చదువుతున్న బుజ్జి కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. రెప్పపాటులోనే సాయంత్రమవుతుంది.
సాయంత్రమయ్యేసరికి పిల్లల స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్, మేజోళ్లు ఇంట్లో ఉండాల్సిన చోట ఉండక హాలులో చిందరవందరగా పడేసి ఉంటాయి. వాటిని సర్దే కార్యక్రమానికి బదులుగా మరో ముఖ్యమైన ఇంటి పనులు పెట్టుకుంటే ఇల్లాలి పని అంతే సంగతి.
ఆఫీసులో తలనొప్పులన్నీ ఇంటి దాకా మోసుకు వచ్చే పతిదేవుడు వాటిని చూసాడా... ఆ ఇల్లాలి కోర్టు మార్షల్ మొదలవుతుంది. వీటిన్నింటి నుంచి కాస్త విశ్రాంతి కోసం కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లి వస్తానని ఆమె చెప్పడం ఆలస్యం ఎల్కేజీ చదివే నానీ నుంచి ఎనిమిదవ తరగతి చదివే బుజ్జి వరకు
తమ సమస్యల చిట్టా విప్పుతారు. " అమ్మా నువ్వు ఊరికెళితే మాకు టిఫిన్ ఎవరు చేసిపెడతారు? మా యూనిఫామ్ ఎవరు ఉతికి పెడతారు? అందుకని నువ్వు ఊరికెళ్లొద్దు..." ఇక ఇక్కడ శ్రీవారు మరో విధంగా ఆమె ప్రయాణాన్ని అడ్డుకునే మాటల మంత్రాలు వల్లె వేస్తారు, " పదిహేను రోజుల క్రితం బుక్ చేసిన
గ్యాస్ సిలిండర్ మరో రెండు మూడు రోజుల్లో వస్తుంది. ఇంట్లో ఎవరూ లేరని సిలిండర్ వాడు వెళ్లిపోతే మళ్లీ తెప్పించుకోవడానికి మహా యజ్ఞమే చెయ్యాలి. నీపాటికి నువ్వు వెళ్లిపోతే నానీ హోమ్ వర్క్ ఎవరు చేసిపెడతారు? అయినా నువ్వు అక్కడకు వెళ్లి చేసేదేముంటుంది. ఈ సారి ఎప్పుడైనా వెళ్దువుగాని..."
ఉద్యోగం చేయాలనే ఆశను వదులుకుని ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకున్న భార్య లేదా గృహలక్ష్మి ద్వారా ఎవరైతే చదువు చెప్పించుకుంటున్నారో, తమ అవసరాలను తీర్చుకుంటున్నారో వారు అనే మాటలివి. ఆమె ఆలోచనలకు, ఆశలకు ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వకుండా తమ పబ్బం గడుపుకునేందుకు చెప్పే సాకులివి.
తాను లేని సమయంలో కుటుంబ సభ్యులు చెప్పే కష్టాలను కన్నుల ముందు ఒక్కసారిగా ఊహించుకున్న ఆ ఇల్లాలు అంతటితో తన పుట్టింటి ప్రయాణానికి స్వస్తి చెప్తుంది. అయితే ఆ గృహిణికి అప్పుడప్పుడు మెరుపు కలలు వస్తుంటాయి. అది నిజమవుతుందా లేదా అన్నేది పక్కన పెట్టి ఇల్లాలి కలను ఒకసారి వీక్షిద్దాం.
ఉద్యోగం చేయాలనే ఆశను వదులుకుని ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకున్న భార్య లేదా గృహలక్ష్మి ద్వారా ఎవరైతే చదువు చెప్పించుకుంటున్నారో, తమ అవసరాలను తీర్చుకుంటున్నారో వారు అనే మాటలివి. ఆమె ఆలోచనలకు, ఆశలకు ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వకుండా తమ పబ్బం గడుపుకునేందుకు చెప్పే సాకులివి.
తాను లేని సమయంలో కుటుంబ సభ్యులు చెప్పే కష్టాలను కన్నుల ముందు ఒక్కసారిగా ఊహించుకున్న ఆ ఇల్లాలు అంతటితో తన పుట్టింటి ప్రయాణానికి స్వస్తి చెప్తుంది. అయితే ఆ గృహిణికి అప్పుడప్పుడు మెరుపు కలలు వస్తుంటాయి. అది నిజమవుతుందా లేదా అన్నేది పక్కన పెట్టి ఇల్లాలి కలను ఒకసారి వీక్షిద్దాం.
తనతో పాటు కుటుంబ సభ్యులందరూ పెందలకడనే నిద్ర లేస్తారు!!! ఆమె వాకిలి ముంగిట నీళ్లు చల్లి ముగ్గు వేసి వచ్చేసరికి పతిదేవుడు, పిల్లలు తమంతట తాముగానే బ్రష్ మీద పేస్టు వేసుకుని దంతధావనం చేసుకుని హాల్లో కూర్చుని ఉంటారు. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందంటే...
ఎల్కేజీ చదువుతున్న నానీకి ఎనిమిదో తరగతి చదువుతున్న బుజ్జీ హోమ్ వర్క్ చేయిస్తుంటుంది. ప్రతిరోజూ లేవగానే న్యూస్ పేపర్లో తలదూర్చి కాఫీ కోసం ఉష్ట్రపక్షిలా అప్పడప్పుడూ తలపైకెత్తి గావు కేకలు పెట్టే పతిదేవుడు... అందుకు భిన్నంగా పిల్లల షూలకు పాలిష్ పెడుతూ కనిపించారు.
అక్కడితో స్వప్నం సమాప్తం కాలేదు. పిల్లలకు బూస్టు, ఇంటాయనకు కాఫీ కలుపుకు వచ్చేసరికి హాల్లో ఎవరూ లేరు. ఏమయ్యారా అని వెతికితే... పక్క గుడ్డలను మడతేసి చక్కగా అలమరలో పెడుతూ కనిపించారు శ్రీవారు. పిల్లలేమైపోయారా అని చూస్తే బాత్ రూమ్‌లో కనపడిన దృశ్యం మరింత మనోహరంగా ఉంది..
నానీకి స్నానం చేయిస్తోంది బుజ్జీ.... అలా అలా సాగిపోతున్న స్వప్నం మిగిలిపోయిన పనులు గుర్తుకురావడంతో ఒక్కసారిగా కనుమరుగైపోతుంది.
వేడి నిట్టూర్పు విడిచి తిరిగి పనుల్లో నిమగ్నమైపోతుంది సగటు భారతీయ సామాన్య మధ్యతరగతి ఇల్లాలు. కలలు కనండి... నిజం చేసుకోండి...
అని ప్రజలకు పిలుపునిచ్చే వారికి కొదవలేదు మన సమాజంలో... కానీ కుటుంబ అవసరాలు తీర్చడం ద్వారా సమసమాజ నిర్మాణంలో కొవ్వొత్తుల కరిగిపోతూ త్యాగానికి మారుపేరుగా నిలుస్తున్న భారతీయ గృహిణి కలలను గురించి అడిగేవారే లేరు. ఇల్లాలి కలలను నిజం చేయడానికి విజన్ 2050 కూడా సరిపోదేమో....
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#BhaiDooj#bhaiduj#భగినీహస్తభోజనం
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో, సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము. ఇది ఒక సనాతన, కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము. ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ...
అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి, చేయించాలి.ప్ర్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్ర అనుబంధాలు, ఆప్యాయతలు మెండుగా ఉండేవి. పండుగులకు, పబ్బాలకు, ఉత్సవాలకు, గ్రామ వేడుకలకు, ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు.
అది ఎంతో మంచి సంప్రదాయము. నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక, టైం లేదని వాపోతుంటారు. మన సంస్కృతిలోని పురాణ కథలు, వ్రతాలు, నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు,
శ్రామికుల పక్షాన నిలిచిన కవి
దోపిడీ సంస్కృతిని నిరసించిన కవి
ఒక ధృడమైన సంకల్పం వున్న కవి
చేతిలో కలమే ఆయుధం
అలాంటి సంకల్పం వున్న కవి
మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి
ఆయన జయంతి సందర్భంగా.....🌹💐🌺🌼🇮🇳
జననం 5 నవంబరు 1925
మరణం 9 సెప్టెంబరు 1978
కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు.
కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు.
నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా #Kedarnath#Pushpagiri#AdiShankaracharya #KedarnathDham#Kadapa
కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏 #AdiShankaracharya #Kedarnath#Pushpagiri
*ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని ఏకైక శంకర ఆద్వైత పీఠం పుష్పగిరి పీఠం. ఇక్కడ అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. చంద్రమౌళీశ్వర లింగాన్ని పీఠంలో ఉంచారు. పుష్పగిరి కడపజిల్లాలోని చెన్నూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ హరిహర క్షేత్రం
#GunPowderDay 💥
గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం, పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని నల్ల మందు అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను, తుపాకులలోను ఉపయోగిస్తారు.ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక #gunpowder
దీనికి తుపాకి మందు అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి.
గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి తుపాకి లోపల వుండే తూటా నుండి బుల్లెట్ ను
#fountainpen#FountainPenDay
సిరా కలము దినోత్సవం ✍️🖋️✒️
ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా మరియు గురుత్వాకర్షణ మరియు
కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై నిక్షేపమయ్యేలా చేస్తుంది. ఈ పెన్నును లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ కనిపెట్టాడు. ఫౌంటెన్ నుంచి నీరు పైకి చిమ్ముతున్నట్లుగా ఈ పెన్ నిబ్ యొక్క రంధ్రం నుంచి ఇంక్ వెలువడుతుంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అంటారు.
ఫౌంటెన్ పెన్నుల యొక్క కొన్ని రిజర్వాయర్లలో ఇంక్ ను నేరుగా పోయవలసి ఉంటుంది, కొన్ని పెన్నులలో ఒత్తివదలడం పద్ధతి ద్వారా పీల్చుకునే రిజర్వాయర్ ఉంటుంది.
#GovardhanPuja
శ్రీకృష్ణ పరమాత్మ దేవాధిదేవుడు. సమస్త జీవరాశుల సంరక్షకుడు. ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు. అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే. ఆ విధంగా ప్రతి జీవికీ ఆయన రక్షణ ఉంటుంది. #JaiSriKrishna#govardhanpooja#govardhanpuja2021
అయితే అన్యదా శరణం నాస్తి అనే విశుద్ధ భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే, చేసిన శపథాలను పక్కన పెట్టయినా సరే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. తానే సర్వస్వం అని భావించే తన భక్తులను
ఎలా కాపాడుకోగలడో తెలియజెప్పేదే గోవర్ధన లీల. గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు. గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడనే మహానుభావుడు పులస్త్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు. అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు.