#GunPowderDay 💥
గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం, పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని నల్ల మందు అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను, తుపాకులలోను ఉపయోగిస్తారు.ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక #gunpowder
దీనికి తుపాకి మందు అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి.
గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి తుపాకి లోపల వుండే తూటా నుండి బుల్లెట్ ను
అత్యంత వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తుంది. అయితే తూటాలో ఏర్పడిన ఒత్తిడి తుపాకి బారెల్ (దీర్ఘ లోహ గొట్టం) ను నాశనం చేసేంత అధిక మొత్తంలో ఉండదు. గన్ పౌడర్ ను తూటాలో బుల్లెట్ వెనుకున్న కార్ట్రిడ్జి అనబడే లోహ స్తంభాలలో నింపుతారు.
ఈ కార్ట్రిడ్జిని పిన్ లేదా సుత్తి గట్టిగా తాకినప్పుడు పేలుతుంది.
గన్ పౌడర్ ను చైనీయులు కనిపెట్టారు, ఇది నల్లమందు యొక్క మొదటి సూచన, ఇది 9 వ శతాబ్దాపు గన్ పౌడర్ యొక్క రూపం. నల్లమందు సూత్రాన్ని రోజర్ బేకన్ వివరించాడు.
గన్ పౌడర్ తయారీకి బరువు ప్రకారం రసాయన పదార్థాల నిష్పత్తి:
74.8% పెట్లుప్పు లేదా సురేకారం లేదా పొటాషియంనైట్రేట్ (saltpeter or Potassium nitrate)
13.3% కర్రబొగ్గు (charcoal)
11.9% గంధకం (sulfur)
చిన్నప్పుడు కొట్టు దగ్గరికి వెళ్లి సోమియా అట్ట, పేక ముక్కలు తెచ్చుకొని, మైదా తెచ్చుకొని ఉడక పెట్టి, వెదురు కర్రని చివర చెక్కుకొని ,
గుల్లలు తయారీ చేసుకొని, జిల్లేడు కర్రలు తెచ్చి, వాటిని కాల్చి భూమిలో పాతి పెట్టి, 2 రోజులు తరువాత తీసి బొగ్గును నలిపి పౌడర్ చేసి, గుడ్డలో జల్లెడ పట్టి, సురేకారం, గందకం 2:7:1 నిష్పత్తిలో (సరిగా గుర్తులేదు) కలిపి వాటిని గుళ్ళల్లో కూరడం ఒక ఎత్తు అయ్యితే అవి చీదేయకుండా
చివర నొక్కడం ఒక ఎత్తు. కొంత మంది పెద్దలు టపాకాయలు, అవుట్లు కట్టేవారు, దసరా వెళ్లినప్పటి నుండి కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట డాం, డాం అని శబ్దాలు.దీపావళి కి ఇక చెప్పక్కర్లేద్దు. నాగుల చవితి వరకు అలాగే ఉండేది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#BhaiDooj#bhaiduj#భగినీహస్తభోజనం
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో, సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము. ఇది ఒక సనాతన, కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము. ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ...
అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి, చేయించాలి.ప్ర్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్ర అనుబంధాలు, ఆప్యాయతలు మెండుగా ఉండేవి. పండుగులకు, పబ్బాలకు, ఉత్సవాలకు, గ్రామ వేడుకలకు, ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు.
అది ఎంతో మంచి సంప్రదాయము. నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక, టైం లేదని వాపోతుంటారు. మన సంస్కృతిలోని పురాణ కథలు, వ్రతాలు, నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు,
శ్రామికుల పక్షాన నిలిచిన కవి
దోపిడీ సంస్కృతిని నిరసించిన కవి
ఒక ధృడమైన సంకల్పం వున్న కవి
చేతిలో కలమే ఆయుధం
అలాంటి సంకల్పం వున్న కవి
మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి
ఆయన జయంతి సందర్భంగా.....🌹💐🌺🌼🇮🇳
జననం 5 నవంబరు 1925
మరణం 9 సెప్టెంబరు 1978
కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు.
కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు.
నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా #Kedarnath#Pushpagiri#AdiShankaracharya #KedarnathDham#Kadapa
కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏 #AdiShankaracharya #Kedarnath#Pushpagiri
*ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని ఏకైక శంకర ఆద్వైత పీఠం పుష్పగిరి పీఠం. ఇక్కడ అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. చంద్రమౌళీశ్వర లింగాన్ని పీఠంలో ఉంచారు. పుష్పగిరి కడపజిల్లాలోని చెన్నూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ హరిహర క్షేత్రం
#fountainpen#FountainPenDay
సిరా కలము దినోత్సవం ✍️🖋️✒️
ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా మరియు గురుత్వాకర్షణ మరియు
కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై నిక్షేపమయ్యేలా చేస్తుంది. ఈ పెన్నును లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ కనిపెట్టాడు. ఫౌంటెన్ నుంచి నీరు పైకి చిమ్ముతున్నట్లుగా ఈ పెన్ నిబ్ యొక్క రంధ్రం నుంచి ఇంక్ వెలువడుతుంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అంటారు.
ఫౌంటెన్ పెన్నుల యొక్క కొన్ని రిజర్వాయర్లలో ఇంక్ ను నేరుగా పోయవలసి ఉంటుంది, కొన్ని పెన్నులలో ఒత్తివదలడం పద్ధతి ద్వారా పీల్చుకునే రిజర్వాయర్ ఉంటుంది.
#GovardhanPuja
శ్రీకృష్ణ పరమాత్మ దేవాధిదేవుడు. సమస్త జీవరాశుల సంరక్షకుడు. ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు. అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే. ఆ విధంగా ప్రతి జీవికీ ఆయన రక్షణ ఉంటుంది. #JaiSriKrishna#govardhanpooja#govardhanpuja2021
అయితే అన్యదా శరణం నాస్తి అనే విశుద్ధ భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే, చేసిన శపథాలను పక్కన పెట్టయినా సరే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. తానే సర్వస్వం అని భావించే తన భక్తులను
ఎలా కాపాడుకోగలడో తెలియజెప్పేదే గోవర్ధన లీల. గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు. గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడనే మహానుభావుడు పులస్త్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు. అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు.
#CandyDay#Candy మిఠాయి , స్వీట్స్ లేదా లాలీస్ అని కూడా పిలుస్తారు, చక్కెరను ప్రధాన పదార్ధంగా కలిగి ఉన్న ఒక మిఠాయి. చక్కెర మిఠాయి అని పిలువబడే ఈ వర్గంలో చాక్లెట్ , చూయింగ్ గమ్ మరియు షుగర్ మిఠాయిలతో సహా ఏదైనా తీపి మిఠాయి ఉంటుంది.
చక్కెరతో మెరుస్తున్న మరియు పూసిన కూరగాయలు, పండ్లు లేదా గింజలు క్యాండీ అని అంటారు. క్యాండీలు సాధారణంగా భోజనం మధ్య అల్పాహారంగా, సాధారణంగా వేళ్ళతో తింటారు. చెక్కర మిఠాయి దినోత్సవం🍡🍭🍬 #CandyDay
కాండీ యొక్క మూలాలు ప్రధానంగా ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి.
చక్కెర అనే పదం సంస్కృత పదం షార్కర నుండి వచ్చింది.పురాతన భారతదేశంలో చెరకు రసాన్ని ఉడకబెట్టడం ద్వారా చక్కెర ముక్కలు ఉత్పత్తి చేయబడ్డాయి మరియు ఖండాగా వినియోగించబడతాయి.
చిన్నప్పుడు నాకు ఆరెంజ్ మిఠాయి అంటే భలే ఇష్టంగా ఉండేది.