#BhaiDooj #bhaiduj #భగినీహస్తభోజనం
"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో, సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము. ఇది ఒక సనాతన, కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము. ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ...
అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి, చేయించాలి.ప్ర్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్ర అనుబంధాలు, ఆప్యాయతలు మెండుగా ఉండేవి. పండుగులకు, పబ్బాలకు, ఉత్సవాలకు, గ్రామ వేడుకలకు, ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు.
అది ఎంతో మంచి సంప్రదాయము. నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక, టైం లేదని వాపోతుంటారు. మన సంస్కృతిలోని పురాణ కథలు, వ్రతాలు, నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు,
చరిత్రలు మన తరువాత తరమువారికి అందించే భాద్యత మన అందరిపైనా ఉన్నది.తోడబుట్టిన స్త్రీ సంతానాన్ని " భగిని" అంటారు . ఆమె హస్తము తో చేసిన (చేతితో వండిన)భోజనాన్ని చేయడాన్ని భగినీహస్త భోజనము అంటారు. కార్తీక మాసము ప్రవేశించిన 2 వ రోజున ఈ బోజనాలు చేయాలన్నది శాస్త్రము.
ఇక్కడ రెండు వేరు వేరు కాలలో చెప్పబడిన కదనాలు ఉన్నాయి. ఒక కాలము లో బలిచక్రవర్తిని, ఇంకోకాలము లో యమధర్మరాజుని వారి వారి చెల్లి, లేదా అక్క (ఇక్కడ అన్నా-చెల్లెలు, అక్కా-తమ్ముడు ... అంటే తమ సోదరుల్ని (సమానమైన ఉదరము అంటే ఒకే తల్లి గర్భము నుండి పుట్టిన వాళ్ళని ) తమ ఇంటికి కనీసము
ఏడాదికి ఒకసారైనా వచ్చి తమ చేతి భోజనము తిని వెళ్ళవలసిందిగా కోరారట. కార్తీక శుద్ద విదియ నాడు వస్తామని ఆ ఇద్దరూ ఒకప్పుడు మాటినిచ్చి అలాగే జీవితాంతము చేశారని పురాణం లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు తమ సోదరి (ల) ఇంటికి వెళ్ళి భోజనము చేసి కానుకలు, వస్త్రాలు పెట్టి --
అక్క ఇంటికెళ్తే ఆమె ఆశీర్వాదాన్ని పొందాలని , చెల్లిలయితే ఆమె ను ఆశీర్వదించి రావాలని ... ఓ నియమము చేసింది శాస్త్రము. ... అదే " భగినీ హస్తభోజనము "
దీపావళి పండుగ తరువాత వచ్చే విదియ యమద్వితీయ, లేక భ్రాతృద్వితీయ. ఆ రోజు ప్రతి పురుషుడు తమ చెల్లెలు ఇంటనో ... చెల్లెలు లేనట్లైతే చెల్లెలు వరస ఇంటనో , అక్క ఇంటనో భోజనము చేయాలి. ఈ పండుగ నియమ నిభందనాలలో ఇదొకటి . సూర్య భగవానుని సంతానమైన యమున (కూతురు) యమధర్మరాజు కవలపిల్లలు ...
చెల్లెలు తన ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా పని భారముతో యముడు వెళ్ళడం కుదరలేదు . . . చివరకు ఒకరోజు అనగా దీపావళి తరువాత విదియ నాడు వెళ్ళి చెల్లెలి ఆతిద్యం స్వీకరించి భోజనం చేసి ... వస్త్రాభరణాలు, కట్న, కానుకలు ఇచ్చాడంటారు. అలా ప్రతిసంవత్సరమూ చేస్తూఉంటాడని నమ్మకము.
కార్తీక శుద్ధవిదియనాడు భ్రాతృపూజ అని ఈ ఆచారానిని అంటారు.దీనితో పాటు, మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించిన తరువాత నేరుగా తన సోదరైన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి, తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది.
యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. హరియాణా , మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు. మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా – దుజ్’ అని పిలుస్తారు.
నేపాల్ ప్రాంతం లో భాయి – టికా అని పిలుస్తారు. పంజాబ్ ప్రాంతం లో ఈపండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు..
జీవితాన్నీ , ఈ జన్మనీ పొందింది అక్కడెక్కడో శరీర -ఇంద్రియ -ప్రాణాలని ఫణము గా పెట్టి ఉద్యోగము చేస్తూ గడిపేయడానికేనా?.. కాదు. ఒక అన్నా లేదా తమ్ముడూ ఓ సోదరి ఇంటికి వెళ్తే ఆమె ఇంటి పరిస్థితి ఎలాఉందో, మేనళ్ళుడూ ,మేనకోడలూ ఎలా ఉన్నారో, తమ సోదరి పట్ల బావగారు లేదా
బావమరిది ప్రవర్తన ఎలా ఉందో, ఇలా అన్నివిషయాలు ప్రత్యక్షము గా తెలుస్తోంది. మరి అన్న లేదా తమ్ముడే ఎందుకు వెళ్ళాలి అంటే తమని కన్న అమ్మకుడా ఓ సోదరుడుకి సోదరే కాబట్టి .. ఆయన రావలసిన రోజున అమ్మ తన కూతురు సంసారము చూడానికి వెళ్తే ఎలా?
ఇంట్లో ఉండే పెద్దన్న తండ్రి తరువాత తండ్రంతటివాడు. అలాగే ఇంట్లో ఉండే తోబుట్టువు అమ్మ తరువాత అమ్మంతటిది. అంటే దీనర్ధము భగినీ హస్తభోజనానికి తల్లిదండ్రులు గతించిన వాళ్ళే వెళ్ళాలని కాదు.
అంతేకాదు ఇలా సోదరినుండి తన సంసార పరిస్థితిని గమనించిన సోదరుడు ఆ సంసార పరిస్థితి మొత్తాన్ని తమ తండ్రికి చెప్పలన్నదే దీనిలోని నేపధ్యము. కుటుంబాలు విడిపోకుండా ఉండేందుకు ఇదో సాంప్రదాకమైన పద్దతి.
#Bhaidooj #Tikka

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

5 Nov
శ్రామికుల పక్షాన నిలిచిన కవి
దోపిడీ సంస్కృతిని నిరసించిన కవి
ఒక ధృడమైన సంకల్పం వున్న కవి
చేతిలో కలమే ఆయుధం
అలాంటి సంకల్పం వున్న కవి
మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి
ఆయన జయంతి సందర్భంగా.....🌹💐🌺🌼🇮🇳

జననం 5 నవంబరు 1925
మరణం 9 సెప్టెంబరు 1978
కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు.
కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు.
Read 4 tweets
5 Nov
నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా
#Kedarnath #Pushpagiri #AdiShankaracharya
#KedarnathDham #Kadapa
కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏
#AdiShankaracharya
#Kedarnath #Pushpagiri
*ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని ఏకైక శంకర ఆద్వైత పీఠం పుష్పగిరి పీఠం. ఇక్కడ అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. చంద్రమౌళీశ్వర లింగాన్ని పీఠంలో ఉంచారు. పుష్పగిరి కడపజిల్లాలోని చెన్నూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ హరిహర క్షేత్రం
Read 16 tweets
5 Nov
#GunPowderDay 💥
గన్ పౌడర్ అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం, పెట్లుప్పు) మిశ్రమం. ఇది నల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని నల్ల మందు అని కూడా అంటారు. దీనిని మందుగుండు సామాగ్రి, బాణాసంచా తయారీ లోను, తుపాకులలోను ఉపయోగిస్తారు.ముఖ్యముగా దీనిని తుపాకులలో ఉపయోగిస్తారు కనుక #gunpowder
దీనికి తుపాకి మందు అనే పేరు వచ్చింది. ఇది చాలా వేగంగా మండుతుంది, వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి.
గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి తుపాకి లోపల వుండే తూటా నుండి బుల్లెట్ ను
Read 8 tweets
5 Nov
#fountainpen #FountainPenDay
సిరా కలము దినోత్సవం ✍️🖋️✒️
ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా మరియు గురుత్వాకర్షణ మరియు
కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై నిక్షేపమయ్యేలా చేస్తుంది. ఈ పెన్నును లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ కనిపెట్టాడు. ఫౌంటెన్ నుంచి నీరు పైకి చిమ్ముతున్నట్లుగా ఈ పెన్ నిబ్ యొక్క రంధ్రం నుంచి ఇంక్ వెలువడుతుంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అంటారు.
ఫౌంటెన్ పెన్నుల యొక్క కొన్ని రిజర్వాయర్లలో ఇంక్ ను నేరుగా పోయవలసి ఉంటుంది, కొన్ని పెన్నులలో ఒత్తివదలడం పద్ధతి ద్వారా పీల్చుకునే రిజర్వాయర్ ఉంటుంది.
Read 15 tweets
5 Nov
#GovardhanPuja
శ్రీకృష్ణ పరమాత్మ దేవాధిదేవుడు. సమస్త జీవరాశుల సంరక్షకుడు. ప్రతి జీవి కర్మఫలాలను పరిపూర్తి చేసుకునేందుకు వీలుగా ఏర్పడినవే ప్రకృతి నియమాలు. అవన్నీ భగవానుడి ఆదేశానుసారాలే. ఆ విధంగా ప్రతి జీవికీ ఆయన రక్షణ ఉంటుంది. #JaiSriKrishna #govardhanpooja #govardhanpuja2021
అయితే అన్యదా శరణం నాస్తి అనే విశుద్ధ భక్తుల సంరక్షణ మాత్రం శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. ప్రకృతి నియమాలను తిరగరాసైనా సరే, చేసిన శపథాలను పక్కన పెట్టయినా సరే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భక్తులకు తన ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. తానే సర్వస్వం అని భావించే తన భక్తులను
ఎలా కాపాడుకోగలడో తెలియజెప్పేదే గోవర్ధన లీల. గోవర్ధన పర్వతానికి గిరిరాజు అని కూడా పేరు. గిరిరాజ చాలీసా ప్రకారం ఒకసారి గోవర్ధనుడనే మహానుభావుడు పులస్త్య మహామునితో కలిసి బృందావనాన్ని సందర్శించాడు. అక్కడి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. అక్కడే స్థిరంగా ఉండాలని ప్రార్థించాడు.
Read 6 tweets
4 Nov
#CandyDay #Candy మిఠాయి , స్వీట్స్ లేదా లాలీస్ అని కూడా పిలుస్తారు, చక్కెరను ప్రధాన పదార్ధంగా కలిగి ఉన్న ఒక మిఠాయి. చక్కెర మిఠాయి అని పిలువబడే ఈ వర్గంలో చాక్లెట్ , చూయింగ్ గమ్ మరియు షుగర్ మిఠాయిలతో సహా ఏదైనా తీపి మిఠాయి ఉంటుంది.
చక్కెరతో మెరుస్తున్న మరియు పూసిన కూరగాయలు, పండ్లు లేదా గింజలు క్యాండీ అని అంటారు. క్యాండీలు సాధారణంగా భోజనం మధ్య అల్పాహారంగా, సాధారణంగా వేళ్ళతో తింటారు. చెక్కర మిఠాయి దినోత్సవం🍡🍭🍬 #CandyDay

కాండీ యొక్క మూలాలు ప్రధానంగా ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి.
చక్కెర అనే పదం సంస్కృత పదం షార్కర నుండి వచ్చింది.పురాతన భారతదేశంలో చెరకు రసాన్ని ఉడకబెట్టడం ద్వారా చక్కెర ముక్కలు ఉత్పత్తి చేయబడ్డాయి మరియు ఖండాగా వినియోగించబడతాయి.

చిన్నప్పుడు నాకు ఆరెంజ్ మిఠాయి అంటే భలే ఇష్టంగా ఉండేది.
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(