*కార్తీకమాసం*
కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులనుఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును
*ఆదివారం* పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు
*సోమవారం* అరటి దూట తో నేసిన వత్తులు నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి
*మంగళవారం* కుంకుమ నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు Image
*బుధవారం* - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*గురువారం* - కొబ్బరి నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*శుక్రవారం* - పసుపు నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*శనివారం* - తామర తూడు తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు.
కార్తీకమాసం లో చేయకూడనిపనులు.
ఇంగువ,వుల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగిదుంప,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం
కంచుపాత్ర్తలో భోజనమ,ఆదివారంకోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగావుండాలి
మాసపురాణం వినాలి
కార్తీక స్నాన మంత్రము :-
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!
*కార్తీకమాసం*
కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది.
తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం...ఒకటేమిటి?
ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన కార్తీకమాసం.
ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము.
_*కార్తీకస్నానం :*_
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి
అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.
ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన
ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.
కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్ని గాని, పండువంటి ఘనపదార్థాన్ని గాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం
చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.
_*దీపారాధన :*_
కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనా సరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు
వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి.
కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.
దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన
స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది.
సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.
కార్తీకమాసములో కొన్ని వస్తువులు
నిషేధించడమైనది. అవి వాడరాదు.
ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటి పూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి,
కార్తీక పురాణము చదివిన వారికి, వినిన వారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.
_*ధాత్రీపూజ :*_
ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి.
(సేకరణ)

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాధిక

రాధిక Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

5 Nov
*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం
కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట.
*కార్తీక మాసం మహత్యం*
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. Image
కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే
Read 18 tweets
10 Oct
ప్రతిరోజూ అన్నపూర్ణా దేవిని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదు.
అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం, అన్నపూర్ణా దేవి అనుగ్రహం వలననే మనకు అన్నపానీయాలు లభిస్తున్నాయి, ఇవే కాక జ్ఞానాన్నీ, వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి.
శ్రీ అన్నపూర్ణాష్టకం(ఆది శంకరాచార్య విరచితం)
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
Read 9 tweets
9 Oct
*శ్రీ గాయత్రి దేవి..
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః!!
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్!! గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్!! శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే!!
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం.తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటారు.. అవి..ముక్త, విద్రుమ,
హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తారు.
పురాణాల ప్రకారం.. ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపలో రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింప బడుతుంది.
గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత
Read 10 tweets
8 Oct
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼
లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ
నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం
కోసం బాలార్చన చేస్తారు.
అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.
Read 6 tweets
7 Oct
నవ దుర్గా స్తోత్రమ్
ఈ స్తోత్రము ను ప్రతివారు ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రులలో సాయంకాల సమయమందు పఠించిన విశేష ఫలితములు సమకూరును .
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ
చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
Read 5 tweets
7 Oct
మాతర్మే మధుకైట భఘ్ని మహిషప్రాణాపహారోద్యమే
*హేలానిర్మిత ధూమ్రలోచన వథే , హేచండ ముండార్దినిృ*
*నిశ్శేషీకృత రక్తబీజ దనుజేృ నిత్యేృ నిశుంభావహే*
*శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే - నమస్తేంబికృే'*

దసరా శరన్నవరాత్రోత్సవాలలో ఆది పూజలందుకునే అమ్మవారు.🙏 Image
. *స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవి రూపంలో* భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ధర్మం నాలుగుపాదాల ఉండేటట్లుగా అత్యంత జనప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. ఒక రోజు రాజకుమారుడు నగర సందర్శనం
చేస్తుండగా అతని రథచక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తూ పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు దుఃఖించి రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడంతో పాటూ
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(