*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం
కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట.
*కార్తీక మాసం మహత్యం*
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము.
కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే
ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.
పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా
ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.
అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు.
అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.
మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు
పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని
వివరించారు.
దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ?
ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత
ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.
*కార్తీక వ్రతవిధానం*
*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన
పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి
ప్రారంభించాలి”* అని వివరించారు.
వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో
మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది.
తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన
ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి.
తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా…
వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.
*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*

మొదటి రోజు పారాయణము సమాప్తం.🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాధిక

రాధిక Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

7 Nov
*కార్తీకపురాణం - 3 వ అధ్యాయము*

*కార్తీక మాస స్నాన మహిమ*
*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

జనక మహరాజా ! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ , అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. Image
కానీ , కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక , కార్తీక స్నానములు చేయక , అవినీతి పరులై , భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క , పిల్లిగా జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు అయిననూ స్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది
జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకింపుము.

*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

ఈ భారత ఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు , తపశాలి , జ్ఞానశాలి , సత్య వ్యాక్య
Read 20 tweets
6 Nov
*కార్తీకపురాణం - 2 వ అధ్యాయం
*సోమవార వ్రత మహిమ*
*కుక్క కైలాసానికి వెళ్లుట*
వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు *”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం Image
నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.
*”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం
చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.*నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు
Read 22 tweets
3 Nov
*కార్తీకమాసం*
కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులనుఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును
*ఆదివారం* పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు
*సోమవారం* అరటి దూట తో నేసిన వత్తులు నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి
*మంగళవారం* కుంకుమ నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు Image
*బుధవారం* - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*గురువారం* - కొబ్బరి నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*శుక్రవారం* - పసుపు నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*శనివారం* - తామర తూడు తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు.
కార్తీకమాసం లో చేయకూడనిపనులు.
ఇంగువ,వుల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగిదుంప,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం
కంచుపాత్ర్తలో భోజనమ,ఆదివారంకోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగావుండాలి
Read 14 tweets
10 Oct
ప్రతిరోజూ అన్నపూర్ణా దేవిని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదు.
అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం, అన్నపూర్ణా దేవి అనుగ్రహం వలననే మనకు అన్నపానీయాలు లభిస్తున్నాయి, ఇవే కాక జ్ఞానాన్నీ, వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి.
శ్రీ అన్నపూర్ణాష్టకం(ఆది శంకరాచార్య విరచితం)
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
Read 9 tweets
9 Oct
*శ్రీ గాయత్రి దేవి..
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః!!
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్!! గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్!! శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే!!
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం.తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటారు.. అవి..ముక్త, విద్రుమ,
హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తారు.
పురాణాల ప్రకారం.. ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపలో రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింప బడుతుంది.
గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత
Read 10 tweets
8 Oct
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼
లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ
నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం
కోసం బాలార్చన చేస్తారు.
అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(