*కార్తీకపురాణం - 3 వ అధ్యాయము*

*కార్తీక మాస స్నాన మహిమ*
*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

జనక మహరాజా ! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ , అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు.
కానీ , కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక , కార్తీక స్నానములు చేయక , అవినీతి పరులై , భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క , పిల్లిగా జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు అయిననూ స్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది
జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకింపుము.

*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

ఈ భారత ఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు , తపశాలి , జ్ఞానశాలి , సత్య వ్యాక్య
పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్షంబు పై భయంకర ముఖములతోను , దీర్ఘ కేశములతోను , బలిష్టంబులైన కోరలతోను , నల్లని బాన పొట్టలతోను , చూచువారుకి అతి భయంకర
రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ , ఆ దారిన పోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయకంపితము చెయుచుండిరి. తీర్ధ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి
యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు
సమయమున , బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటించుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ ! అనాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని , నిండు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి
ద్రౌపదిని , బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - ఈ పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ ! అని వేడుకొనగా , ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి *'మహానుభావా ! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు'*
యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని *' ఓయీ ! మీరెవరు ? ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను ? మీ వృత్తాంతము తెలుపుడు'* అని పలుకగా వారు *'విప్ర పుంగవా ! మీరు పూజ్యులు , ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు , మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము
కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు'* అని అభయమిచ్చి , అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం బ్రహ్మనుడను నేను మహా పండితుడనని గర్వము గలవాడినై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని పసువునై ప్రవర్తించితిని , బాటసారుల వద్ద , అమాయకపు
గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకోనుచు , దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక , పండితులను అవమానపరచుచు , లుబ్దుడనై లోక కంటకుడిగ నుంటిని.
ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన
నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చేను. వచ్చిన పండితుని నేను దూషించి , కొట్టి అతని వద్ద ఉన్న ధనము , వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంటి వేచితిని. అందులకు విప్రునకు కోపము వచ్చి *'ఓరి నీచుడా ! అన్యక్రాంతముగ డబ్బు కూడా బెట్టినది చాలక ,
మంచి చెడ్డలు తెలియక , తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి , నివు రాక్షసుడవై , నరభక్షకుడవై నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు' గాక !* అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును
తప్పించలేము గదా ! కాన నా అపరాదము క్షమింపుమని వారిని ప్రార్దించితిని. అందులకతడు దయతలచి' ఓయీ ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము గలదు. నివందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదువు గాక' అని వేడలిపోయాను. ఆనాటి నుండి నేని రాక్షస స్వరుపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ,
ఓ విప్రోతమ ! నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు - ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి ,
వారి యెదుటనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచుండేడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి ఎరుగను , నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కావున , నాకీ రాక్షస సత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్దరింపుము' అని బ్రాహ్మణుని
పాదములపై పడి పరి పరి విధముల వేడుకొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా ! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక , కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడి వాడను భగవంతునికి
ధూప దీప నైవేద్యము లైనను అర్పించక , భక్తులు గొనితేచ్చిన సంభావమును నా వుంపుడు గత్తెకు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణనంతరము ఈ రూపము ధరించితిని , కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు' మని ప్రార్ధించెను. ఓ జనక మహారాజ ! తపోనిష్టుడగు ఆ విప్రుడు
పిశాచములు దినలపము లాలకించి *'ఓ బ్రహ్మ రాక్షసులరా ! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును'* అని , వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో
స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది , వారికీ సకలైశ్వర్యములు ప్రసాదించుదురు.
అందువలన , ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*
*మూడవ అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాధిక

రాధిక Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

6 Nov
*కార్తీకపురాణం - 2 వ అధ్యాయం
*సోమవార వ్రత మహిమ*
*కుక్క కైలాసానికి వెళ్లుట*
వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు *”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం
నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.
*”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం
చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.*నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు
Read 22 tweets
5 Nov
*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం
కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట.
*కార్తీక మాసం మహత్యం*
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము.
కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే
Read 18 tweets
3 Nov
*కార్తీకమాసం*
కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులనుఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును
*ఆదివారం* పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు
*సోమవారం* అరటి దూట తో నేసిన వత్తులు నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి
*మంగళవారం* కుంకుమ నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు Image
*బుధవారం* - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*గురువారం* - కొబ్బరి నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*శుక్రవారం* - పసుపు నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*శనివారం* - తామర తూడు తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు.
కార్తీకమాసం లో చేయకూడనిపనులు.
ఇంగువ,వుల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగిదుంప,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం
కంచుపాత్ర్తలో భోజనమ,ఆదివారంకోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగావుండాలి
Read 14 tweets
10 Oct
ప్రతిరోజూ అన్నపూర్ణా దేవిని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదు.
అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం, అన్నపూర్ణా దేవి అనుగ్రహం వలననే మనకు అన్నపానీయాలు లభిస్తున్నాయి, ఇవే కాక జ్ఞానాన్నీ, వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి.
శ్రీ అన్నపూర్ణాష్టకం(ఆది శంకరాచార్య విరచితం)
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
Read 9 tweets
9 Oct
*శ్రీ గాయత్రి దేవి..
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః!!
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్త త్వార్ధ వర్ణాత్మికామ్!! గాయత్రీం వరదా భయాంకుశ కశాశ్శుభ్రమ్కపాలం గదామ్!! శంఖం చక్రమధార విందం యుగళమ్హ సైర్వహం తీం భజేే!!
గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం.తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటారు.. అవి..ముక్త, విద్రుమ,
హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తారు.
పురాణాల ప్రకారం.. ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపలో రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రి గానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింప బడుతుంది.
గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత
Read 10 tweets
8 Oct
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼
లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ
నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.
త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం
కోసం బాలార్చన చేస్తారు.
అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి.....అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు...ఆది దంపతులు...వారి తత్వము కుడా అటువంటిది.
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(