Chronogram - ఒక విశిష్ట సాహితీ శాసన ప్రక్రియ
ఈ కింది పద్య పదాలను చూడండి

అద్రిగజాగ్నిసోములన్‌
లుడు దేవనిధినయనేందు
రసర్తు నయనేందుభిః

ఈ మూడు పద్య పాదాలు వరుసగా క్రీ. శ 1465, క్రీ.శ 1369, క్రీ.శ 1344 సంవత్సరాలను సూచిస్తాయి.
ఈ విధంగా కాలాన్ని/ సంవత్సరాలను అంకెలలో కాక సంకేత పదాలతో వాక్యాలతో తెలియజేయడాన్ని chronogram అంటారు.

శాసనాలలో / కావ్యాలలో మొదట సంవత్సరం / కాలం సూచించేవారు కాదు. ఆ తరువాత పలానా రాజు పట్టాభిషిక్తుడై పలనా సంవత్సరాలు అయిన తరువాత అని వాడేవారు. ఆ తరువాత ‘శక’ సంవత్సరాలు మొదలయ్యాయి.
శాసనాలలో శాలివాహక శకంతో పాటు 1126, 1232 అంటూ అంకెలు పేర్కొని ఆయా కాలాన్ని సూచించేవారు.

అయితే కొందరు కవులు, శాసన కర్తలు తమ కావ్యాలలో, శాసనాలలో కాలాన్ని నేరుగా అంకెలలో సూచించకుండా పైన చెప్పిన విధంగా Chronograms వాడి వాక్యాలలో తెలియజేసేవారు.
“అరయ శాలివాహన శకాబ్దముల్‌ అద్రిగజాగ్నిసోములన్‌ తారణ వత్సరంబున” అన్న వాక్యంలో పదాలు అంకెలను ఈ విధంగా సూచిస్తాయి

అద్రి = పర్వతం = సప్త పర్వతాలు = 7
గజ = అష్టదిగ్గజాలు = 8 దిక్కులకు కాపలా ఉండే 8 ఏనుగులు = 8
అగ్ని = త్రేతాగ్నులు = 3
సోము = చంద్రుడు = 1
అయితే ‘అంకానాం వామతో గతి’ అంటే అంకెల గతి కుడి నుండి ఎడమకు అని అర్థం. అంటే ఆ అంకెలను 7831 అని కాకుండా 1387 అని చదువుకోవాలి. అప్పుడు అది శక సంవత్సరం 1387 అవుతుంది. శాలివాహక శక సంవత్సరాన్ని మన ప్రస్తుత సంవత్సరాలలోకి మార్చుకోవాలి అంటే 78 కలపవలసి ఉంటుంది. అప్పుడు 1387 + 78 = 1465)
అలానే భీమకవి తన బసవపురాణము శాలివాహనశకము 1291 కి సరియైన సౌమ్యసంవత్సర శ్రావణబహుళ దశమి ముగించానని చెప్పడానికి ఈ కింది పద్యం చెప్పాడు

కోవిదరు కేళొళ్ళి తెన “లుడు
దేవనిధినయనేందు” సంఖెగ
ళోవి శకవరుషం గళాగలు సౌమ్య వత్సరద
శ్రావణ బహుళపక్షదశమీ
ఇందులో
ఉడుమ దేవ (చంద్ర) = 1;
నిధి = 9 (నవ నిధులు )
నయన=2 (రెండు కన్నులు )
ఇందు=1 (చంద్రుడు )

ఇక్కడ కూడా "అంకానాం వామతో గతి" అనే సూత్రం ప్రకారంఅది శక సంవత్సరం 1291 అంటే CE 1369వ సంవత్సరం అవుతుంది (1291 + 78 = 1369 CE)
అలాగే నాచన సోముడికి మొదటి బుక్కరాయలు పెంచుకలదిన్నె అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చిన కాలాన్ని హోసూరు తామ్ర శాసనం ‘అలంకృత శకస్యాబ్ధే రసర్తు నయనేందుభిః’ అని పేర్కొంటుంది

రసర్తు = 6 రసాలు = 6
రుతు= 6 రుతువులు = 6
నయన= రెండు కన్నులు = 2
ఇందు = ఒక చంద్రుడు =1
"అంకానాం వామతో గతి" అనే సూత్రం ప్రకారంఅది శక సంవత్సరం 1266 అంటే CE 1344 వ సంవత్సరం అవుతుంది (1266 + 78 = 1344CE)

Chronogram లో వివిధ అంకెలను సూచించడానికి వాడే పదాలు
0 = అభ్రము (ఆకాశం, శూన్యం)
1 = చంద్రుడు, భూమి, సూర్యుడు
2 = నయనం
3 = అగ్ని
4= అంబుధి / సముద్రం, దిక్కులు
5= కన్యలు, కావ్యాలు
6= ఋతువులు, రసాలు
7= పర్వతాలు
8= అష్టదిగ్గజములు
9= నవనిధులు, అజ

#సీమశాసనాలు #సీమకవులు #సీమచరిత్ర

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

Jan 24
#సీమశాసనాలు #సీమచరిత్ర

పశ్చిమ చాళుక్య / కళ్యాణి చాళుక్య రాజు మూడవ సోమేశ్వరుడి పెద్దతుంబలం శాసనం

Sōmēśvara III inscription from Pedda Tumbaḷam,Kurnool District, Andhra Pradesh

ASI received photograph of this inscription from Sri. S. Ravikumar Reddy, engraved on a slab
found in a ruined Narasimha temple in the village Pedda Tumbaḷam, Adoni mandalam, Kurnool district, Andhra Pradesh.

It is written in Kannaḍa language and characters, dated Year 12, Pingala, Bhādrapada, amāvāsya, Solar eclipse = 1137 C.E. November 15.
It records the gift of the village Bādambeyyamgēri in Tumbaḷu 30 as sarvamānya to the god Narasimhadēva of Tuṁbaḷabīḍu in Sindavāḍi-paṭṭana by Hiriyadaṇḍanāyaka Kādimayya for the renovation of the temple, provide food offerings, conduct worship, burn the perpetual lamps
Read 4 tweets
Jan 9
గండికోట ఏకైక పాలకురాలు - మదీనా బీబీ

సుమారు వెయ్యి సంవత్సరాల గండికోట చరిత్రలో అనేక మంది పాలకులు గండికోటను పాలించారు. ఒకప్పుడు స్వతంత్ర కాయస్థ రాజ్యానికి రాజధానిగా ఉండి విజయనగర సామ్రాజ్యంలోని శత్రుదుర్భేద్యమైన దుర్గాలలో ఒకటిగా నిలిచిన గండికోటను పాలించిన ఏకైక మహిళ మదీనా బీబీ.
మదీనా బీబీ కడప సుబాను పాలించిన అతిగొప్ప మాయాణా నవాబు అబ్దుల్ నబీ ఖాన్ కోడలు మరియు కడప నవాబు అయిన మోచ మియ్యా భార్య. మదీనా బీబీ గండికోట పాలనపై కడప కైఫియత్తు మరియు గండికోట కైఫియత్తుల కథనాలలో కొంచెం వైరుధ్యం ఉంది.
అయినప్పటికీ దాదాపు రెండు కైఫియత్తులు గండికోట జాగీర్దార్ గా మదీనా బీబీని, ఆమె చేసిన యుద్ధాలను స్పష్టం చేస్తున్నాయి

విజయనగర సామ్రాజ్యం పతనానంతరం కడప మొదట గోల్కొండ ఆ తరవాత మొఘలుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. కడప సుబాలో మాయణా నవాబులుగా పిలవబడ్డ కడప నవాబులు పాలన మొదలయ్యింది.
Read 14 tweets
Jan 8
#సీమశాసనాలు #సీమచరిత్రలోస్త్రీలు #సీమచరిత్ర

వెలుగులోకి వచ్చిన రాణి లక్ష్మీదేవి (లక్కుమదేవి) గుండ్లూరు (చిత్తూరు జిల్లా) శాసనం -13 వ శతాబ్దం

రాణి లక్ష్మీదేవి చంద్రగిరి రాజధానిగా చిత్తూరు ప్రాంతాన్ని పాలించిన యాదవరాయ వంశం వారి ఆడపడుచు. నెల్లూరు చోడరాజు తిక్కచోడుడి భార్య
Yādavarāya king Vīra-Nārasingadēva inscription from Gunḍlūru, Andhra Pradesh

This inscription is engraved on a slab kept in front of the Chēnnakēśava temple in Gunḍlūru,Kalikiri Mandalam,Chittoor district,AP.
It is written in Tamil language and characters dated Śaka 1167 (1245 C.E),Vīśvāvasu, Makarasaṅkrānti.

It records the gift of taxfree lands in the village Araisamputtai to the god Kēśavaperumāḷ in Gunḍalūr of Kilaimarayarpaḍi-nāḍu in Iraṭṭapāḍikoṅḍa Chōḷa maṇḍalam by
Read 5 tweets
Oct 7, 2021
Vijayanagara inscription of Sadāśivarāya from Errakottavāripalli, Andhra Pradesh

It is engraved on a boulder lying near the village Errakottavāripalli in Kalakada mandalam, Chittoor district, Andhra Pradesh.
It is in Telugu language and characters, dated in cyclic year Śobhakṛit, Kārttīka śu. 15 and mentions the rule of mahāmaṇḍalēśvara Jillela Narasiṁharājayyadēva, a subordinate of Vijayanagara king Sadāśivadēvarāya.
Based on this the cyclic year Śobhakṛit falls in Śaka 1465 and the date corresponds to 1543 CE, November 11, Sunday.

It records the gift of dasavadanaṁ and some taxes for the maintenance of a tank constructed at Mustūri by mahāmaṇḍalēśvara Jillēla Narasinghrājayyadēva.
Read 4 tweets
Apr 8, 2021
మనం మరచిన ధర్మదాతలు - యాదాల్ల నాగమ్మ

కడప పట్టణానికి చెందిన ధర్మాత్మురాలు. వైశ్య ప్రముఖులు. (వీరి వంశం పేరనే కడపలో YV స్ట్రీట్ కి ఆ పేరు వచ్చింది). వీరి గురించి పరిశోధించే క్రమంలోనే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో పరిచయం ఏర్పడింది.
యాదాల్ల వారు బళ్లారి చెందిన ప్రముఖ వర్తక కుటుంబమట. అప్పట్లోనే బర్మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారట. ఏ కారణంతో వలస వచ్చారో తెలీదు కానీ బళ్లారి నుండి కడపాకు వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో యాదాల్ల నాగమ్మ గారు , యాదాల్ల రంగమ్మ గారు ధర్మదాతలుగా పేరుపొందారు.
నాగమ్మ గారు చేతికి వెన్నెముక లేనట్టు దానాలు చేసేవారని, పేద పిల్లల చదువులకి భూరి విరాళాలు ఇచ్చారని, కరువుకాటకాల సమయంలో పేదలను భోజనం పెట్టి ఆదుకున్నారని చెప్తారు. నేటికీ కడప చుట్టుపక్కల పల్లెలలో యాదాల్ల నాగమ్మ గారి పేరు చెబితే పెద్దలు తమ జ్ఞాపకాలు చెబుతారు.
Read 4 tweets
Dec 16, 2020
వెలుగోటివారి వంశావళి

వెలుగోడు ఎక్కడ ఉంది ? అసలు వెలుగోటివారు అంటే ఎవరు ?

అనుమనగంటి వారు రేచర్ల వారు ఎందుకయ్యారు ?

రేచర్ల వారు వెలుగోటి వారు ఎందుకయ్యారు ?

వారి రాజధాని దేవరకొండ ను వదిలేసి వెలుగోడుకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు ?

వెలుగోడు అంటే అర్థం ఏమిటి ?
వెంకటగిరి రాజులకు బొబ్బిలి జమీందార్లకు వెలుగోడుతో ఉన్న సంబంధం ఏమిటి ?

బొబ్బిలి జమీందార్ల మూల పురుషుడి గా ఎవరిని భావిస్తారు ?

వెంకటగిరిఅసలు పేరు/ మొదటి పేరు ఏమిటి ?

రేచర్ల పద్మనాయకులలో/వెంకటగిరి రాజుల పేర్లలో యాచెంద్ర / యచమ నాయుడు/యాచ అన్న పదం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?
వెలుగోటివారైన వెంకటగిరిరాజులకు, కాళహస్తి జమీందారులైన దామెర / దామెర్ల పద్మనాయకులకు సంబంధం ఏమిటి ?

కర్నూలు జిల్లాలోని ఒక చారిత్రక గ్రామం వెలుగోడు. వెలుగోడు జలాశయం ఇక్కడే ఉంది. రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఈ వెలుగోడును రాజధానిగా చేసుకుని పాలించారు.
Read 34 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(