Vijayanagara inscription of Sadāśivarāya from Errakottavāripalli, Andhra Pradesh
It is engraved on a boulder lying near the village Errakottavāripalli in Kalakada mandalam, Chittoor district, Andhra Pradesh.
It is in Telugu language and characters, dated in cyclic year Śobhakṛit, Kārttīka śu. 15 and mentions the rule of mahāmaṇḍalēśvara Jillela Narasiṁharājayyadēva, a subordinate of Vijayanagara king Sadāśivadēvarāya.
Based on this the cyclic year Śobhakṛit falls in Śaka 1465 and the date corresponds to 1543 CE, November 11, Sunday.
It records the gift of dasavadanaṁ and some taxes for the maintenance of a tank constructed at Mustūri by mahāmaṇḍalēśvara Jillēla Narasinghrājayyadēva.
కడప పట్టణానికి చెందిన ధర్మాత్మురాలు. వైశ్య ప్రముఖులు. (వీరి వంశం పేరనే కడపలో YV స్ట్రీట్ కి ఆ పేరు వచ్చింది). వీరి గురించి పరిశోధించే క్రమంలోనే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో పరిచయం ఏర్పడింది.
యాదాల్ల వారు బళ్లారి చెందిన ప్రముఖ వర్తక కుటుంబమట. అప్పట్లోనే బర్మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారట. ఏ కారణంతో వలస వచ్చారో తెలీదు కానీ బళ్లారి నుండి కడపాకు వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో యాదాల్ల నాగమ్మ గారు , యాదాల్ల రంగమ్మ గారు ధర్మదాతలుగా పేరుపొందారు.
నాగమ్మ గారు చేతికి వెన్నెముక లేనట్టు దానాలు చేసేవారని, పేద పిల్లల చదువులకి భూరి విరాళాలు ఇచ్చారని, కరువుకాటకాల సమయంలో పేదలను భోజనం పెట్టి ఆదుకున్నారని చెప్తారు. నేటికీ కడప చుట్టుపక్కల పల్లెలలో యాదాల్ల నాగమ్మ గారి పేరు చెబితే పెద్దలు తమ జ్ఞాపకాలు చెబుతారు.
కర్నూలు జిల్లాలోని ఒక చారిత్రక గ్రామం వెలుగోడు. వెలుగోడు జలాశయం ఇక్కడే ఉంది. రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఈ వెలుగోడును రాజధానిగా చేసుకుని పాలించారు.
1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ మనకు ఎన్నో చారిత్రక విషయాలు చెబుతుంది. అవేంటో చూద్దాం
1. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు
2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.
3. కడప జిల్లా - ఇప్పుడు కడప జిల్లా చిన్నగా రాష్ట్ర / దేశ సరిహద్దు
లేని జిల్లా కానీ 1840లలో కడప చాలా పెద్ద జిల్లా. ఒకవైపు మైసూరు, మరోవైపు ఆర్కాటు రాజ్యం /గుంటూరు, నెల్లూరు సరిహద్దుగా విస్తరించిన జిల్లా. ఇప్పుడు అనంతపురం లో ఉండే కదిరి, చిత్తూరు జిల్లాలో ఉండే మదనపల్లి, వాయలపాడు, పుంగనూరు, కర్నూలు జిల్లాలో ఉండే కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలోని కంభం,
శీతలా దేవి సర్వ రోగ ప్రశమని. జ్వరం, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు ఇలా ఏ జబ్బు వచ్చినా, అంటువ్యాధులు వచ్చి ఊర్లకు ఊర్లు వాటి బారిన పడినా ప్రజలను ఆదుకునే తల్లి శీతలా దేవి. 'శీతల' అంటే చల్లదనాన్ని చేకూర్చునది అని అర్థం.
చిత్రం : సీతాలమ్మ తల్లి /యంత్రపు రాయి
శీతలా దేవిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మనం అమ్మవారినే అంకాలమ్మ, నూకలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ వంటి పేర్లతో గ్రామదేవతలుగా పూజిస్తూ ఉంటాం. శీతాలాదేవికి విగ్రహాలు ఉంటాయి కానీ చాలా చోట్ల గ్రామదేవతలకు / అక్కదేవతలకు విగ్రహాలు ఉండవు.
ఒక్కో దేవత ప్రతిమగా ఒక్కో రాయిని పెట్టి, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు.
ఈ గ్రామ దేవతలు ఊరిలోకి ఏ చీడ పీడలు రాకుండా అంటువ్యాధులు కలుగ జేసే ఏ మహమ్మారులు పొలిమేర దాటకుండా ఊరికి రక్షణగా ఉంటారు. అందుకే వీరి గుడులు ఊరి పొలిమేర వద్ద ఉండేవి.
తరువాత సీమ ఫ్యాక్షన్ నేపథ్యమే కథగా సినిమాలు తీయడం ప్రారంభించారు (కథానాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరూ సీమవారే)
ఆ తరువాత కేవలం విలన్ నేపథ్యాన్ని రాయలసీమకు పరిమితం చేస్తూ సినిమాలు తీశారు
(ఇటువంటి సినిమాల్లో సాధారణంగా విలన్ రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా ఉంటాడు, హీరో సీమేతర వ్యక్తిగా ఉంటాడు). సీమకు చెందిన విలన్ సీమేతర హీరో చేతిలో బకారా అవ్వడమో, తుక్కుతుక్కుగా తన్నులు తినడమో చేస్తుంటాడు
అప్పటికీ ఎవరూ అడ్డుచెప్పకపోయే సరికి హద్దులు దాటి చిత్రవిచిత్ర వేషధారణతో, యాసతో సీమ విలన్లను నరరూప రక్షసులుగా, సైకోలుగా చూపడం మొదలుపెట్టారు. సీమ పాత్రలను వెకిలి హాస్యానికి వాడుకున్నారు.
ఇంకొందరు మరింత మసాలా దట్టించి సీమ ఆడవారిని గయ్యాలుగా, హత్యలకు ప్రోత్సహించేవారిగా చూపారు
గురువు గారు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో నా పరిచయం
కడప పట్టణానికి చెందిన ధర్మదాత యాదాల్ల నాగమ్మ గారి గురించి పరిశోధన చేసే క్రమంలో గురువుగారు పరిచయం అయ్యారు. అప్పుడే వారి గురించి తెలిసింది అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారని మరియు అన్నమయ్య కీర్తనలు, కైఫీయత్తులు, కడప
చరిత్ర మీద వారికి ఎంతో ఆసక్తి మరియు పట్టు ఉంది అని. 'యాదాల్ల' వారి చరిత్ర సేకరించడంతో పాటు నేను తయారుచేసిన 'అన్నమాచార్య సర్క్యూట్' ఆలోచనను వారికి వినిపించాను.
అన్నమాచార్య సర్క్యూట్ : తాళ్ళపాక అన్నమయ్య తిరుమల శ్రీవారి మీద కాకుండ చెప్పలి, సాంబటూరు, నందలూరు, వెయ్యినూతుల కోన..
ఇలా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణాదిన దాదాపు 40 క్షేత్రాలు పర్యటించి ఆయా దేవుళ్లపై కీర్తనలు రచించారు. అన్నమయ్య దర్శించిన 'చెప్పలి' వంటి క్షేత్రాల్లో నిధులు లేక కూలిపోయిన గోపురం బాగుచేయించలేని పరిస్థితి. కొందరు చరిత్రకారులకు, పరిశోధకులకు తప్ప ఆయా ఆలయాలను అన్నమయ్య దర్శించారని