కర్నూలు జిల్లాలోని ఒక చారిత్రక గ్రామం వెలుగోడు. వెలుగోడు జలాశయం ఇక్కడే ఉంది. రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఈ వెలుగోడును రాజధానిగా చేసుకుని పాలించారు.
వెలుగోడు రాజధానిగా పాలించారు కాబట్టి వెలుగోటివారయ్యారు. వెంకటగిరిజమీందార్లు, బొబ్బిలి జమీందార్లు వెలుగోటివారే . వీరి వంశ చరిత్రను వందిమాగధులు పాడుకుంటూ ఉంటే, కల్నల్ మెకంజీ 19వ శతాబ్దం మొదట్లో సేకరించి పెట్టారు. దాన్నే వెంకటరమణయ్య గారు వెలుగోటివారి వంశావళి పేరుతో గ్రంథస్థం చేసారు
మధ్యయుగంలో తెలుగు ప్రాంతాన్ని ఏలిన ముఖ్యమైన రాజవంశాలలో రేచర్ల పద్మనాయక వంశానిది ప్రముఖ పాత్ర. కాకతీయుల పాలనలో కీలక భూమిక పోషించిన రేచర్ల పద్మనాయకులు కాకతీయుల పతనానంతరం ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా ముసునూరి నాయకుల ఆధ్వర్యంలో కూటమిగా ఏర్పడి ఢిల్లీ సుల్తానులను తెలుగు గడ్డపై
ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత కొంతకాలం స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పటికీ బహ్మనీలకు, విజయనగరరాజులకు సామంతులుగా కొనసాగారు.
రేచర్ల పద్మనాయకుల మూలపురుషుడు చెవిరెడ్డి. ఇతని తండ్రి పోలిరెడ్డి. వీరి గోత్రం అనుమనగంటి. చెవిరెడ్డి తెలంగాణలోని నల్గొండజిల్లా అనుమనగల్లు గ్రామస్థుడు
చెవిరెడ్డికి ‘రేచ’ అనే సేవకుడు ఉండేవాడు. ఒకనాడు చెవిరెడ్డి పొలంలో దున్నుతుండగా ఒక నిధి బయటపడింది. అయితే నరబలి ఇస్తేనే నిధిదొరుకుతుంది అని ఆశరరీరవాణి పలకడంతో చెవిరెడ్డి సేవకుడు ‘రేచ’, తన యజమానికోసం కోసం ప్రాణత్యాగం చేయగా చెవిరెడ్డకి అపార నిధి సొంతం అవుతుంది.
రేచడి కుఇచ్చిన మాట ప్రకారం, అతని గౌరవార్థం అనుమనగంటి వారు రేచర్ల వారు అయ్యారు.
ఈ రేచర్ల చెవిరెడ్డి మహా పరాక్రమవంతుడు.ఒకనాటి సాయంకాలం ఒకమర్రిచెట్టులో ఉన్న బేతాళుడు దాడిచేయబోతే చెవిరెడ్డి ధైర్యంగా ఎదురుకున్నాడు. అప్పటినుండి చెవిరెడ్డిని జనం బేతాళ నాయుడు అని పిలవడం ప్రారంభించారు.
ఈ చెవిరెడ్డి / బేతాళనాయుడు శౌర్య పరాక్రమాల గురించి విన్న కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు బేతాళనాయుణ్ణి ఓరుగల్లుకు పిలిచి తనని సత్కరించి కొంత రాజ్యభాగము నాయంకరంగా ఇచ్చినాడు. అది మొదలు రేచెర్ల వంశస్తులు మొదట కాకతీయుల రాజ్యంలో వివిధ హోదాల్లో చేసి
వారి పతనానంతరం కొంతకాలం స్వతంత్య్ర రాజ్య స్థాపన చేసి తరువాత విజయనగర, బహమనీ, గోల్కొండ, మొఘలులుకు సామంతులుగాను, బ్రిటీషు వారి హయాంలో జమీందార్లుగాను ఉన్నారు.
ఈ రేచర్ల వంశంలో రేచర్ల ప్రసాదిత్యుడు, సింగమనాయకుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, అనపోతా నాయకుడు వంటి గొప్ప రాజులు ఉన్నారు. తెలంగాణలోని రాచకొండ, దేవరకొండలను రాజధానిగా చేసుకుని పాలించారు. పలనాటి బ్రహ్మనాయుడు కూడా రేచర్ల పద్మనాయకుడే.
దేవరకొండ, రాచకొండలు బహమనీల పరం అవ్వడంతో వారు కృష్ణానది దాటి దక్షిణానికి వచ్చారు. రేచర్ల వంశస్తులలో 15వ తరం రాజు రేచర్ల రాయప్ప / నిర్వాణ రాయప్ప / పెద్ద రాయడు. ఈ నిర్వాణ రాయప్ప సమయంలోనే రేచర్ల వెలుగోడులో స్థిరపడి రేచర్లవారు వెలుగోటివారైనారు
వెలుగోడు ప్రాంతం కపిలేశ్వర గజపతి పాలనలో ఉన్నప్పుడు వెలుగోటికోటపై దాడి జరిగినపుడు శత్రువులను ఓడించి కోటపై తెల్లధ్వజమును చేపట్టి నిలిచాడని, అతని శౌర్యపరాక్రమాలను మెచ్చిన గజపతి, నిర్వాణరాయప్పకు ‘వెలుగోడురాజా’ ( వెల్ల(=తెలుపు)గొడుగు→ వెలుగోడు)) అని బిరుదు ఇచ్చినాడని ఒక కథనం కాగా
శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలుగోటి కోటపై మహమ్మదీయుల దాడి జరిగినపుడు వారిని ఓడించి తన గెలుపుకు చిహ్నంగా శత్రువుకు చెందిన తెల్ల ధ్వజమును చేపట్టినాడని, అతని శౌర్యానికి మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు నిర్వాణ రాయుడికి ‘వెలుగోడు’ రాజా అనే బిరుదు ఇచ్చినాడని మరో కథనం (వెలుగోటివారి వంశచరిత్ర)
నిర్వాణ రాయప్ప తరువాతి కూడా వెలుగోటివారు విజయనగరసామ్రాజ్య విజయాలలో కీలక భూమిక పోషించారు.
వెలుగోటివారైన వెంకటగిరిరాజులకు, కాళహస్తి జమీందారులైన దామెర్ల పద్మనాయకులకు సంబంధం ఏమిటి ?
మద్రాస్ మహానగరం / చెన్నపట్నం దామెర్ల చెన్నప్ప నాయకుడి పేరు మీద ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.
దామెర్ల చెన్నప్ప నాయకుడు విజయనగర రాజ్యంలో (అరవీటి వంశ పాలనలో) గొప్ప ప్రాబల్యం కలిగిన సైనికనాయకులలో ఒకడు. దామెర్ల వారు కూడా రేచర్ల వారి లాగే పద్మనాయకులు. వీరు కూడా మొదట కాకతీయుల రాజ్యంలో పని చేసి తరువాత విజయనగర రాజుల వద్ద సామంతులుగా / సైన్యాధిపతులుగా చేశారు.
ఆరవీటి ప్రభువుల విజయాలలో వెలుగోటి వారు, దామెర్ల వారి పాత్ర శ్లాఘనీయం. రేచర్ల వారికి, దామెర్ల వారికి అనేక తరాలుగా బంధుత్వం ఉండేది. వెలుగోటి యాచమ నాయుడి కుమారుడు వెలుగోటి కస్తూరి రంగప్ప నాయుడు.కస్తూరి రంగప్ప నాయుడి కొడుకు వెలుగోటి పెద్ద యాచమ నాయుడు, కుమార్తె అక్కమ్మ.
వెలుగోటి యింటివారి ఆడబిడ్డ అయిన అక్కమ్మను దామెర్ల చెన్నప్ప నాయుడు వివాహమాడాడు. అనగా వెలుగోటివారిలో 20వ తరానికి చెందిన పెద యాచమ నాయుడు, దామెర్ల చెన్నప్ప నాయుడు బావా - బామ్మర్దులు. ఆ విధంగా వెంకటగిరిరాజాలు, కాళహస్తి జమీందార్ల మధ్య బంధుత్వం ఉండేది.
వెలుగోటి వారి పేర్లలో 'యాచ' అన్న పేరు ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది అన్నదాని వెనుక ఒక కథ ఉంది. రేచర్లవారు వెలుగోడుకు వచ్చాక ఒక కోట నిర్మించ తలపెట్టారు. అయితే ఈ కోట శాశ్వతంగా నిలిచిపోవాలని రాజా వారి కోడళ్లు 7 మంది వారి పిల్లలతో సహా ప్రాణత్యాగనికి ఉపక్రమించారు.
అయితే అందులో ఒకరికి సంతానం లేదు. ఆవిడ వీధిలో దొరికిన 'యాచన్న' ఒక అనాథ శిశివును పెంచుకునేది. ప్రాణత్యాగం చేసే సమయంలో 7 మంది కోడళ్లు, మిగతా పిల్లలతో పాటు యాచన్న కూడా ప్రాణత్యాగం చేశాడు. ఈ బాలుడి గౌరవార్థం వెలుగోటి వారు 'యాచ' అనే పేరు వాడటం మొదలుపెట్టారు.
ఈ కథ కర్నూలు మాన్యువల్ లో పొందుపరచబడింది. అయితే రేచర్ల వారు వెలుగోడు రాకముందు నుంచే 'యాచమ' అన్న పేర్లు వారిలో కనిపిస్తుంది. అందువలన ఈ కథ వెలుగోడుకు చెందినది కాకుండా దేవరకొండ / రాచకొండ కు చెందిన కథ అయ్యుండాలి
బొబ్బిలి రాజులు - వెలుగోటివారు
బొబ్బిలి రాజ్య స్థాపకుడు ఎవరు అన్నదానిపై ఏకాభిప్రాయం లేదు. బొబ్బిలి జమీందార్ల చరిత్ర, విశాఖపట్నం మాన్యువల్, వెలుగోటివారి వంశావళి వంటి వివిధ పుస్తకాలలో ఒక్కో విధంగా ఉంది.
బొబ్బిలి రాజ్య స్థాపన 1652లో జరిగింది అని, మొఘలుల ఫౌజ్ దార్ / శ్రీకాకుళం నవాబు అయిన షేర్ మహమ్మద్ ఖాన్, యుద్ధంలో తన కుమారుడిని కాపాడినందుకు పెద్దరాయడికి రంగారావు అన్న బిరుదు తో పాటు రాజాం ప్రాంతాన్ని జాగీర్గా ఇచ్చాడని, ఈ పెద్దరాయడు అక్కడ ఒక కోట కట్టి, ఒక పట్టణాన్ని నెలకొల్పి
దానికి తన యజమాని అయిన షేర్ మహమ్మద్ పేరును బెబ్బులి (షేర్ = బెబ్బులి) అని పేరు పెట్టాడని, అదే కాలక్రమంలో బొబ్బిలి అయిందని విశాఖపట్నం మాన్యువల్ చెప్తుంది. ఈ పెద్దరాయడు వెలుగోటి పద్మనాయకుడు.
బొబ్బిలి జమీందార్ల చరిత్ర ను గ్రంథస్థం చేసిన బొబ్బిలి జమీందారు సర్ వెంకట శ్వేతాచలపతి రంగారావు బహదూర్, ఆ పెద్దరాయడు వెలిగోటి వారిలో 15వ తరానికి చెందిన నిర్వాణ రాయప్ప గా తీర్మానించారు.
అయితే వెలుగోటి వారి వంశావలి మరియు ఇతర చారిత్రక ఆధారాల ప్రకారం వెలుగోటి నిర్వాణ రాయప్పకు బొబ్బిలి వ్యవస్థాపకుడు పెద్దరాయడి కాలానికి దాదాపు 100 -130 సంవత్సరాల వ్యత్యాసం ఉంది.
వెంకటగిరి రాజుల చరిత్ర ప్రకారం వెలుగోటివారిలో 19వ తరం రాజు అయిన వెలుగోటి కస్తూరి రంగప్ప నాయుడు పెద్దకుమారుడు వెలుగోటి కుమార రంగప్ప నాయుడు బొబ్బిలి వంశ మూల పురుషుడు కాగా, మరో కుమారుడు పెద్ద యాచమ నాయుడు వెంకటగిరిసంస్థానం పాలకులలో 20వ తరంగా పరిగణింపబడుతున్నాడు.
బొబ్బిలి రాజ్య స్థాపన చేసింది వెలుగోటి రాజు అన్నది నిర్వివాదాంశం. నిర్దుష్టంగా బొబ్బిలి వంశ మూలపురుషుడు ఎవరుఅన్నది చెప్పలేకపోయినప్పటికీ, వెలుగోటివారిలో 20-22 వ తరం రాజులు బొబ్బిలి సంస్థానానన్ని స్థాపించారని అనేక ఆధారాలను బట్టి స్పష్టం అవుతుంది.
వెలుగోటి వారు - వెంకటగిరి
వెంకటగిరి అసలుపేరు ‘కలిమిలి’.ఈ కలిమిని గొబ్బూరి పాలెగాళ్ళు పాలించేవారు. ఆరవీటి (రెండవ) వెంకటపతి రాయలు భార్యలలో ఒకరు గొబ్బూరివారి ఆడపడుచు. 17వ తరానికి చెందిన వెలుగోటి యాచమ నాయుడి సోదరుడి కుమారుడు వెంకటాద్రినాయుడు.
ఈ వెంకటాద్రి నాయుడు గొబ్బూరి పాలెగాళ్లను ఓడించి కలిమిని స్వాధీనం చేసుకుని ఆ ఊరిని తనపేరున వెంకటగిరిగా మార్చాడు. విజయనగర చివరి రోజులలో వెలుగోటివారు చిత్తూరు జిల్లాలోని ఉత్తర మల్లూరులను రాజధానిగా చేసుకుని పాలించేవారు.
మొఘలుల సర్దారు జుల్ఫీకర్ ఉత్తర మల్లూరు లో బంగారు యాచమ నాయుడిని (22వ తరం) కుట్రపన్ని వధించాడు . తదనంతరం బంగారు యాచమనాయుడి కుమారుడు సర్వజ్ఞ కుమార యాచమ నాయుడికి ఔరంగజేబు వేంకటగిరిని జాగీరుగా ఇచ్చాడు. ఆనాటి నుండి వెలుగోటి వారు వెంకటగిరి పాలకులుగా ఉన్నారు.
వెలుగోటి వారు వైష్ణవులు. ఇటీవల SVBC చైర్మన్ గా నియమింపబడ్డ సాయికృష్ణ యాచేంద్ర గారు వేంకటగిరి రాజవంశానికి చెందినవారే. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నాణ్యమైన చీరలకు ప్రసిద్ధి
A FAMILY HISTORY OF VENKATAGIRI RAJAS WRITTEN BY ALLADI JAGANNATHAySAstRI
A REVISED AND ENLARGED ACCOUNT OF THE BOBBILI ZEMINDARI COMPILED BY
MAHA-RAJAH SAHEB MEHARBAN-I-DOSTAN, MAHA-RAJAH SRI RAO SIR VENKATA SWETACHALAPATl RANGA-RAO BAHADUR, G.C.I.E., MAHARAJAH OF BOBBILI
MANUAL Of THE KURNOOL DISTRICT IN THE PRESIDENCY OE MADRAS, COMPILED BY
NARAHARI GOPALAKBISTNAMAH Chetty
MANUAL Of THE District of Vizagapatnam IN THE PRESIDENCY OE MADRAS, COMPILED and edited BY D F Carmichael
Sources of Vijayanagara History
చిత్రాలు : వికీపీడియా
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ మనకు ఎన్నో చారిత్రక విషయాలు చెబుతుంది. అవేంటో చూద్దాం
1. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు
2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.
3. కడప జిల్లా - ఇప్పుడు కడప జిల్లా చిన్నగా రాష్ట్ర / దేశ సరిహద్దు
లేని జిల్లా కానీ 1840లలో కడప చాలా పెద్ద జిల్లా. ఒకవైపు మైసూరు, మరోవైపు ఆర్కాటు రాజ్యం /గుంటూరు, నెల్లూరు సరిహద్దుగా విస్తరించిన జిల్లా. ఇప్పుడు అనంతపురం లో ఉండే కదిరి, చిత్తూరు జిల్లాలో ఉండే మదనపల్లి, వాయలపాడు, పుంగనూరు, కర్నూలు జిల్లాలో ఉండే కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలోని కంభం,
శీతలా దేవి సర్వ రోగ ప్రశమని. జ్వరం, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు ఇలా ఏ జబ్బు వచ్చినా, అంటువ్యాధులు వచ్చి ఊర్లకు ఊర్లు వాటి బారిన పడినా ప్రజలను ఆదుకునే తల్లి శీతలా దేవి. 'శీతల' అంటే చల్లదనాన్ని చేకూర్చునది అని అర్థం.
చిత్రం : సీతాలమ్మ తల్లి /యంత్రపు రాయి
శీతలా దేవిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మనం అమ్మవారినే అంకాలమ్మ, నూకలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ వంటి పేర్లతో గ్రామదేవతలుగా పూజిస్తూ ఉంటాం. శీతాలాదేవికి విగ్రహాలు ఉంటాయి కానీ చాలా చోట్ల గ్రామదేవతలకు / అక్కదేవతలకు విగ్రహాలు ఉండవు.
ఒక్కో దేవత ప్రతిమగా ఒక్కో రాయిని పెట్టి, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు.
ఈ గ్రామ దేవతలు ఊరిలోకి ఏ చీడ పీడలు రాకుండా అంటువ్యాధులు కలుగ జేసే ఏ మహమ్మారులు పొలిమేర దాటకుండా ఊరికి రక్షణగా ఉంటారు. అందుకే వీరి గుడులు ఊరి పొలిమేర వద్ద ఉండేవి.
తరువాత సీమ ఫ్యాక్షన్ నేపథ్యమే కథగా సినిమాలు తీయడం ప్రారంభించారు (కథానాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరూ సీమవారే)
ఆ తరువాత కేవలం విలన్ నేపథ్యాన్ని రాయలసీమకు పరిమితం చేస్తూ సినిమాలు తీశారు
(ఇటువంటి సినిమాల్లో సాధారణంగా విలన్ రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా ఉంటాడు, హీరో సీమేతర వ్యక్తిగా ఉంటాడు). సీమకు చెందిన విలన్ సీమేతర హీరో చేతిలో బకారా అవ్వడమో, తుక్కుతుక్కుగా తన్నులు తినడమో చేస్తుంటాడు
అప్పటికీ ఎవరూ అడ్డుచెప్పకపోయే సరికి హద్దులు దాటి చిత్రవిచిత్ర వేషధారణతో, యాసతో సీమ విలన్లను నరరూప రక్షసులుగా, సైకోలుగా చూపడం మొదలుపెట్టారు. సీమ పాత్రలను వెకిలి హాస్యానికి వాడుకున్నారు.
ఇంకొందరు మరింత మసాలా దట్టించి సీమ ఆడవారిని గయ్యాలుగా, హత్యలకు ప్రోత్సహించేవారిగా చూపారు
గురువు గారు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో నా పరిచయం
కడప పట్టణానికి చెందిన ధర్మదాత యాదాల్ల నాగమ్మ గారి గురించి పరిశోధన చేసే క్రమంలో గురువుగారు పరిచయం అయ్యారు. అప్పుడే వారి గురించి తెలిసింది అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారని మరియు అన్నమయ్య కీర్తనలు, కైఫీయత్తులు, కడప
చరిత్ర మీద వారికి ఎంతో ఆసక్తి మరియు పట్టు ఉంది అని. 'యాదాల్ల' వారి చరిత్ర సేకరించడంతో పాటు నేను తయారుచేసిన 'అన్నమాచార్య సర్క్యూట్' ఆలోచనను వారికి వినిపించాను.
అన్నమాచార్య సర్క్యూట్ : తాళ్ళపాక అన్నమయ్య తిరుమల శ్రీవారి మీద కాకుండ చెప్పలి, సాంబటూరు, నందలూరు, వెయ్యినూతుల కోన..
ఇలా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణాదిన దాదాపు 40 క్షేత్రాలు పర్యటించి ఆయా దేవుళ్లపై కీర్తనలు రచించారు. అన్నమయ్య దర్శించిన 'చెప్పలి' వంటి క్షేత్రాల్లో నిధులు లేక కూలిపోయిన గోపురం బాగుచేయించలేని పరిస్థితి. కొందరు చరిత్రకారులకు, పరిశోధకులకు తప్ప ఆయా ఆలయాలను అన్నమయ్య దర్శించారని
మనకూ ఉంది ఒక త్రికూట ఆలయం-అనేక విశేషాల సమాహారం పుష్పగిరి త్రికూటేశ్వర ఆలయం
సాధారణంగా ఆలయాలలో ఒక ప్రధాన గర్భాలయం వాటికి అనుబంధంగా ఉపాలయాలు ఉంటాయి. అలాకాకుండా ఒకే ఆలయంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన గర్భాలయాలు ఉంటే వాటిని ద్వికూట, త్రికూట మొ. ఆలయాలుగా సంబోధిస్తారు #Pushpagiri
ఒకే ఆలయంలో మూడు గర్భాలయాలు ఉంటే ఆ ఆలయాన్ని త్రికూట ఆలయం అంటారు. చాళుక్యుల, హోయసలుల, కాకతీయుల శిల్పకళా రీతిలో ఈ అధికంగా కనిపిస్తాయి
వరంగల్ లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి త్రికూట ఆలయం. తెలంగాణలో త్రికూట ఆలయాలు చాలా ఉన్నా, రాయలసీమలో త్రికూట ఆలయాలు అత్యంత అరుదు #rayalaseema_Temples
అటువంటి త్రికూట ఆలయం, కడప జిల్లా పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయం. ఇక్కడి త్రికూట ఆలయంలో 3 గర్భాలయాలో స్వామి ఉమామహేశ్వరుడు , త్రికూటేశ్వరుడు మొ.పేర్లతో పూజలు అందుకుంటున్నాడు. ఈ మూడు గర్భాలయలు వేరే వేరే వ్యక్తులు కట్టించడం విశేషం.
రాయలసీమ ఆపద్భాందవుడు శ్రీనివాసుడు - రాయలసీమ అభివృద్ధిలో తితిదే పాత్ర - SV యూనివర్సిటీ, ఒక చరిత్ర
తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆంధ్ర మహా సభ ఏర్పడిన తరువాత, ఆంధ్రోద్యమంలో రెండవ విజయం తెలుగువారి కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం.
(మొదటి విజయం ప్రత్యేక PCC ఏర్పాటుకు అంగీకారం). అప్పటివరకు మద్రాస్ విశ్వవిద్యాలయం ఒకటే మద్రాసు రాష్ట్రంలోని అన్ని భాషల ప్రజలకు అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయం. అనేక తర్జనభర్జనల తరువాత ఆంధ్రవిశ్వకళాపరిషత్తు తాత్కాలిక ప్రధాన కేంద్రాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు.
బెజవాడ తాత్కాలిక కేంద్రంగా ఏర్పడిన ఆంధ్రవిశ్వకళాపరిషత్తు (ఆంధ్రా విశ్వవిద్యాలయము ) శాశ్వత ప్రధాన కేంద్రం ఎక్కడికి మార్చాలి అని చర్చ జరుగుతున్న రోజులవి. బెజావాడ వాళ్లు, రాజమహేంద్రవరం వాళ్లు వాల్తేరు (విశాఖపట్నం ) వాళ్ళు తమ నగరంలో ప్రధాన కేంద్రం ఉండలాంటే తమ నగరంలో ఉండాలని కోరారు.