మనం మరచిన ధర్మదాతలు

The man who once saved Bellary from an epidemic - Right Honorable Kolachalam Venkatrao

శ్రీ కోలాచలం వెంకట్రావు స్వాతంత్ర సమరయోధులు, ధర్మదాత, ప్రముఖ న్యాయవాది, ది లయన్ ఆఫ్ ది బార్, సంఘ సంస్కర్త, భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నాయకులలో ఒకరు,
రాజనీతి దురంధరులు, బళ్ళారి మాజీ మున్సిపల్ ఛైర్మన్. విజయనగర సామ్రాజ్య ఆస్థానంలోని విద్వాంసులు మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి వంశంలో కోలాచలం వెంకట్రావు గారు 1850 ఫిబ్రవరి 28న బళ్ళారి లో జన్మించారు. వీరి తండ్రి కోలాచలం సేతుపతి శాస్త్రి అనెగొంది సంస్థానంలో దివాన్ గా ఉండేవారు.
వీరి సోదరులు ఆంధ్రచరిత్రనాటకపితామహుడు కోలాచలం శ్రీనివాసరావు గారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, అనంతపురం- బళ్ళారిలలో తొలి వైద్యురాలల్లో ఒకరు అయిన డా. నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి వీరి భార్యకు మేనకోడలు.

1902 వ సంవత్సరంలో బళ్లారిలో ప్లేగు వ్యాధి దావానలంలా వ్యాపించింది.
అదే సమయంలో బళ్లారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కాబడ్డ వెంకట్రావు గారు రాత్రనక పగలనక కృషిచేసి బళ్ళారి లో ప్లేగు వ్యాధి నిర్మూలనకు పాటుపడ్డారు. ప్లేగు వ్యాధి నివారణకు కు తన స్వంత ఆదాయాన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. అ సమయంలో నిరాశ్రయులకు తన ఇంటి ఆవరణలో ఆశ్రయం ఇచ్చారు.
ఉన్నత విద్యావంతులైన వెంకట్రావు గారు ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. దివ్యజ్ఞాన సమాజం సభ్యులు. అలాగే బ్రహ్మసమాజ ప్రచారకులైన మన్నవ బుచ్చయ్య పంతులు, మహా సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు వంటి వారితో వీరికి సాన్నిహిత్యం ఉండేది. ఆనాటి సనాతనుల భావాలకు భిన్నంగా బళ్లారిలో తన సొంత ఖర్చుతో,
తన బంగళా ఆవరణలోనే వితంతు పునర్వివాహాలు చేయించారు. చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అన్న విధంగా ముందుగా చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన తన భార్య మేనకోడలు లక్ష్మీదేవిని తన వద్ద అసిస్టెంట్గా ఉన్న మృత్యుంజయ శాస్త్రికి ఇచ్చి దగ్గరుండి వివాహం జరిపించాడు.
అలా వితంతు పునర్వివాహ చేయించి అయినవారి ఆగ్రహానికి గురయ్యారు. సముద్రయానం చేసినందుకు, వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించినందుకు ఆయనను సనాతనులు బహిష్కరించారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన సంబంధం మొదలియార్ తో కలిసి బళ్లారిలో దేవదాసి పద్ధతి,
దేవాలయ ఉత్సవాలు మరియు వివాహ వేడుకలలో భోగం మేళాలు ఏర్పాటుచేసే దురాచారానికి వ్యతిరేకంగా పోరాడారు.

వెంకట్రావు గారు ధర్మదాత. ప్లేగు సమయంలో సొంత ఖర్చుతో అనేక మందికి ఆశ్రయం ఇవ్వడమే కాక వారి దానధర్మాల చిట్టా చాలా పెద్దది. తన నెలవారి ఆదాయంలో నాలుగవ వంతు దానధర్మాలకు వినియోగించేవారు
వీరేశలింగం పంతులు స్థాపించిన వృద్ధాశ్రమానికి ఐదు వేల రూపాయలు భూరి విరాళం ఇచ్చాడు. కాశీ విశ్వవిద్యాలయానికి కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. 50 వేల రూపాయల వ్యయంతో బళ్లారిలో టౌన్ హాల్ కట్టించారు. 70 వేల రూపాయలు వెచ్చించి 30 వేల గ్రంథాలు ఉన్న గ్రంథాలయాన్ని నెలకొల్పారు.
ఉచిత వైద్యశాలను నిర్మించారు. హిందూ బాలబాలికల కోసం 20 వేల రూపాయలతో ఒక అనాధ శరణాలయం కట్టించారు బళ్లారిలో థియోసోఫికల్ సోసైటీ భవన నిర్మాణానికి భూరి విరాళం ఇచ్చారు. బళ్ళారిలోని అనేక ప్రజోపయోగకరమైన భవనాలకు విరాళాలు ఇచ్చారు.

వెంకట్రావు గారు స్వాతంత్ర సమరయోధులు.
నాటి జాతీయ కాంగ్రెస్ ప్రముఖులైన బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్, గోపాలక్రిష్ణ గోఖలే,పండిత మదన మోహన మాలవ్య వంటి వారు వీరికి సన్నిహితులు. 1916లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ని అరెస్టు చేసినందుకు నిరసనగా తన రైట్ హానరబుల్ బిరుదును త్యజించారు.
మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి జరిగిన ఎన్నికలలో ఆంధ్ర భీష్మగా పేరెన్నికగన్న న్యాపతి సుబ్బారావు గారి అభ్యర్థి కృత్తివెంటి పేర్రాజు గారిని ఓడించి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

సోర్స్: తిరుమల రామచంద్ర గారి హంపీ నుండి హరప్పా దాకా

#సీమరత్నాలు #సీమచరిత్ర

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

Jan 25
Chronogram - ఒక విశిష్ట సాహితీ శాసన ప్రక్రియ
ఈ కింది పద్య పదాలను చూడండి

అద్రిగజాగ్నిసోములన్‌
లుడు దేవనిధినయనేందు
రసర్తు నయనేందుభిః

ఈ మూడు పద్య పాదాలు వరుసగా క్రీ. శ 1465, క్రీ.శ 1369, క్రీ.శ 1344 సంవత్సరాలను సూచిస్తాయి.
ఈ విధంగా కాలాన్ని/ సంవత్సరాలను అంకెలలో కాక సంకేత పదాలతో వాక్యాలతో తెలియజేయడాన్ని chronogram అంటారు.

శాసనాలలో / కావ్యాలలో మొదట సంవత్సరం / కాలం సూచించేవారు కాదు. ఆ తరువాత పలానా రాజు పట్టాభిషిక్తుడై పలనా సంవత్సరాలు అయిన తరువాత అని వాడేవారు. ఆ తరువాత ‘శక’ సంవత్సరాలు మొదలయ్యాయి.
శాసనాలలో శాలివాహక శకంతో పాటు 1126, 1232 అంటూ అంకెలు పేర్కొని ఆయా కాలాన్ని సూచించేవారు.

అయితే కొందరు కవులు, శాసన కర్తలు తమ కావ్యాలలో, శాసనాలలో కాలాన్ని నేరుగా అంకెలలో సూచించకుండా పైన చెప్పిన విధంగా Chronograms వాడి వాక్యాలలో తెలియజేసేవారు.
Read 10 tweets
Jan 24
#సీమశాసనాలు #సీమచరిత్ర

పశ్చిమ చాళుక్య / కళ్యాణి చాళుక్య రాజు మూడవ సోమేశ్వరుడి పెద్దతుంబలం శాసనం

Sōmēśvara III inscription from Pedda Tumbaḷam,Kurnool District, Andhra Pradesh

ASI received photograph of this inscription from Sri. S. Ravikumar Reddy, engraved on a slab
found in a ruined Narasimha temple in the village Pedda Tumbaḷam, Adoni mandalam, Kurnool district, Andhra Pradesh.

It is written in Kannaḍa language and characters, dated Year 12, Pingala, Bhādrapada, amāvāsya, Solar eclipse = 1137 C.E. November 15.
It records the gift of the village Bādambeyyamgēri in Tumbaḷu 30 as sarvamānya to the god Narasimhadēva of Tuṁbaḷabīḍu in Sindavāḍi-paṭṭana by Hiriyadaṇḍanāyaka Kādimayya for the renovation of the temple, provide food offerings, conduct worship, burn the perpetual lamps
Read 4 tweets
Jan 9
గండికోట ఏకైక పాలకురాలు - మదీనా బీబీ

సుమారు వెయ్యి సంవత్సరాల గండికోట చరిత్రలో అనేక మంది పాలకులు గండికోటను పాలించారు. ఒకప్పుడు స్వతంత్ర కాయస్థ రాజ్యానికి రాజధానిగా ఉండి విజయనగర సామ్రాజ్యంలోని శత్రుదుర్భేద్యమైన దుర్గాలలో ఒకటిగా నిలిచిన గండికోటను పాలించిన ఏకైక మహిళ మదీనా బీబీ.
మదీనా బీబీ కడప సుబాను పాలించిన అతిగొప్ప మాయాణా నవాబు అబ్దుల్ నబీ ఖాన్ కోడలు మరియు కడప నవాబు అయిన మోచ మియ్యా భార్య. మదీనా బీబీ గండికోట పాలనపై కడప కైఫియత్తు మరియు గండికోట కైఫియత్తుల కథనాలలో కొంచెం వైరుధ్యం ఉంది.
అయినప్పటికీ దాదాపు రెండు కైఫియత్తులు గండికోట జాగీర్దార్ గా మదీనా బీబీని, ఆమె చేసిన యుద్ధాలను స్పష్టం చేస్తున్నాయి

విజయనగర సామ్రాజ్యం పతనానంతరం కడప మొదట గోల్కొండ ఆ తరవాత మొఘలుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది. కడప సుబాలో మాయణా నవాబులుగా పిలవబడ్డ కడప నవాబులు పాలన మొదలయ్యింది.
Read 14 tweets
Jan 8
#సీమశాసనాలు #సీమచరిత్రలోస్త్రీలు #సీమచరిత్ర

వెలుగులోకి వచ్చిన రాణి లక్ష్మీదేవి (లక్కుమదేవి) గుండ్లూరు (చిత్తూరు జిల్లా) శాసనం -13 వ శతాబ్దం

రాణి లక్ష్మీదేవి చంద్రగిరి రాజధానిగా చిత్తూరు ప్రాంతాన్ని పాలించిన యాదవరాయ వంశం వారి ఆడపడుచు. నెల్లూరు చోడరాజు తిక్కచోడుడి భార్య
Yādavarāya king Vīra-Nārasingadēva inscription from Gunḍlūru, Andhra Pradesh

This inscription is engraved on a slab kept in front of the Chēnnakēśava temple in Gunḍlūru,Kalikiri Mandalam,Chittoor district,AP.
It is written in Tamil language and characters dated Śaka 1167 (1245 C.E),Vīśvāvasu, Makarasaṅkrānti.

It records the gift of taxfree lands in the village Araisamputtai to the god Kēśavaperumāḷ in Gunḍalūr of Kilaimarayarpaḍi-nāḍu in Iraṭṭapāḍikoṅḍa Chōḷa maṇḍalam by
Read 5 tweets
Oct 7, 2021
Vijayanagara inscription of Sadāśivarāya from Errakottavāripalli, Andhra Pradesh

It is engraved on a boulder lying near the village Errakottavāripalli in Kalakada mandalam, Chittoor district, Andhra Pradesh.
It is in Telugu language and characters, dated in cyclic year Śobhakṛit, Kārttīka śu. 15 and mentions the rule of mahāmaṇḍalēśvara Jillela Narasiṁharājayyadēva, a subordinate of Vijayanagara king Sadāśivadēvarāya.
Based on this the cyclic year Śobhakṛit falls in Śaka 1465 and the date corresponds to 1543 CE, November 11, Sunday.

It records the gift of dasavadanaṁ and some taxes for the maintenance of a tank constructed at Mustūri by mahāmaṇḍalēśvara Jillēla Narasinghrājayyadēva.
Read 4 tweets
Apr 8, 2021
మనం మరచిన ధర్మదాతలు - యాదాల్ల నాగమ్మ

కడప పట్టణానికి చెందిన ధర్మాత్మురాలు. వైశ్య ప్రముఖులు. (వీరి వంశం పేరనే కడపలో YV స్ట్రీట్ కి ఆ పేరు వచ్చింది). వీరి గురించి పరిశోధించే క్రమంలోనే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో పరిచయం ఏర్పడింది.
యాదాల్ల వారు బళ్లారి చెందిన ప్రముఖ వర్తక కుటుంబమట. అప్పట్లోనే బర్మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారట. ఏ కారణంతో వలస వచ్చారో తెలీదు కానీ బళ్లారి నుండి కడపాకు వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో యాదాల్ల నాగమ్మ గారు , యాదాల్ల రంగమ్మ గారు ధర్మదాతలుగా పేరుపొందారు.
నాగమ్మ గారు చేతికి వెన్నెముక లేనట్టు దానాలు చేసేవారని, పేద పిల్లల చదువులకి భూరి విరాళాలు ఇచ్చారని, కరువుకాటకాల సమయంలో పేదలను భోజనం పెట్టి ఆదుకున్నారని చెప్తారు. నేటికీ కడప చుట్టుపక్కల పల్లెలలో యాదాల్ల నాగమ్మ గారి పేరు చెబితే పెద్దలు తమ జ్ఞాపకాలు చెబుతారు.
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(