#ప్రకాశం
#Prakasham
#AndhraPradesh
కరువుతోటి, కడగండ్లతోటి కదులుతున్న జిల్లా మా ప్రకాశం జిల్లా ... అయినా పరువుతోటి అణువణువు
స్పూర్తితో వెలుగుతున్న జిల్లా మా ప్రకాశం జిల్లా .....
సాగర తిరం మాకొక హారం, గ్రానైట్ కొండల పేలుడు భారం ...
నెల్లూర్ గుంటూర్ కర్నూల్ ఆనుకొని ఉన్నా
రాయలసీమ, కోస్తాంధ్రల సంస్కృతి కలుసుండడమే మా గొప్పతనం... ఎర్రనేలలు, ఇసుక దిబ్బలు కలయికల
సమాహారం .....
చీరాల చీరలు, మార్కాపురం పలకలు, అద్దంకి ఇటుకలు,ఒంగోలు గిత్తలు, చేపల చెరువులు, పాల ఉత్పత్తులు,ఉలవపాడు సపోటా, పందిళ్ళపల్లి మామిడి, మిరప, పత్తి,
జిల్లాలోనే ఉపధినియ్యండి .....
చీరాల, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధి
జిల్లాలో జలరవాణాకి వేస్తుంది నాంది ... వెలిగొండ
ప్రాజెక్టును త్వరితగతిన చేస్తే పూర్తి, మా జిల్లాలో
ఇంటింట నిండును వెలుగుల సంక్రాంతి ... కృష్ణపట్నం,విశాఖ కారిడార్ మా సాగరునికి తలమానికము, దొనకొండ ఇండస్ట్రియల్ హబ్ మా జిల్లా యువతకు అవసరము
అంతకు మించి ఎదిగేందుకు మేము అత్యాశపరులము