మనుషులందరూ ఒకేలా ఉండరు… అలా ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.మన చుట్టూతా ఉండే వాల్లల్లో కొంతమంది అంతర్ముఖులు (introverts) గా ఉంటారు. అంటే తక్కువగా మాట్లాడుతారు,కేవలం తక్కువ మంది తోనే మాట్లాడుతారు.తమతో తాము ఎక్కువ సంభాషిస్తారు.
#introvert #introvertlife
#worldintrovertday
3. చాలా అవకాశాలను కోల్పోతూ ఉంటారు .ఎందుకంటే అంతర్ముఖులను చాలా తక్కువ మంది అర్థం చేసూకుంటారు.
5. చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు, ఎవరితోనూ అంత చనువుగా ఉండరు..! అందరితో కలిసి ఆటలు ఆడరు.
1. ఏదైనా పూర్తిగా తెలిస్తేనే మాట్లాడుతారు.
మాట్లాడే ప్రతీ మాటను ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడతారు.
2. తమకు నచ్చిన విషయాల గురించి ఆలోచించడానికి, నచ్చిన పనులు చేయడానికి ఎక్కువ స్వేచ్ఛ, సమయం ఉంటాయి(ఎవరూ డిస్టర్బ్ చేయరు కాబట్టి)
ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించరు.ఆత్మాభిమానం కలిగి ఉంటారు.
4. ఉత్తమ లక్షణం ఏంటంటే ఎక్కువ వింటారు,తక్కువ మాట్లాడతారు.
6. బందాలకు ఎక్కువ విలువిస్తారు.(Relationships ను చాలా serious గా తీస్కుంటారు).
7. పది మంది అల్లాటప్పా స్నేహితుల కంటే ఒక విలువైన స్నేహితుడు చాలు అనుకుంటారు.
8. ప్రేమ విషయం లోనూ అంతే, వీరు ఎవరికీ నచ్చరు,వీరికి ఎవరూ నచ్చరు,ఒకవేళ అలా జరిగితే ఆ ప్రేమను చివరి వరకూ నిలుపుకుంటారు.నిజాయితీ గా ప్రేమిస్తారు..!
మొహమాటాన్ని జయించాలని
ప్రయత్నించినప్పుడల్లా ఓడిపోతూనే ఉంటాను!
ఎదుట ఎవరున్నా.
మాట పెదవులు దాటక
బాధ ఎంతున్నా బైటపడక
అంతరంగాన ఆవేదనతో రగిలిపోతూనే ఉంటాను!!
ఎవరినీ నొప్పించక
ఎక్కడకూ తప్పించుకు తిరగలేక
'నన్ను' నేను ఒప్పించుకుని
'ఈసారికిలా కానిచ్చేద్దాం'
అనుకుంటూ నెట్టుకొస్తూనే ఉంటాను!
కాబోయేదేదైనా మంచికే అవుతుంద'ని
వేదాంత ధోరణిలో లేని తృప్తిని నటిస్తూ ఉంటాను!
మనసుకు..చేతలకు