ఆంధ్ర రాష్ట్రంలో 'వ్యవసాయ ఉత్పత్తుల' విభాగంలో కేవలం మూడు వస్తువులకు మాత్రమే ప్రతిష్టాత్మక భౌగోళిక గుర్తింపు (GI tag)ఉంది. అందులో కేవలం ఒకటి మాత్రమే పండు.. అది పండ్లలో రారాజైన బనగానపల్లి / బేనీషా మామిడిపండు.
#సీమరుచులు #కర్నూలు
మామిడిపండ్లలో అనేక రకాలు ఉన్నా బంగినపల్లి మామిడి పండ్ల రుచే వేరు. పెద్ద పరిమాణం, పసిడి వర్ణం, మధురమైన రుచి, వైవిధ్య సువాసన వీటి ప్రత్యేకత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగినపల్లి మామిడిపండ్లకు భౌగోళిక గుర్తింపు కు దరఖాస్తు చేశారు.