My Authors
Read all threads
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దర్శనం చేసుకుని ఈ మార్గం గుండా ప్రయనిస్తుండగా, తన తల్లి నాగమాంబ (నాగలా దేవి, నాగల ) కోరిక మేరకు ఈ ఆలయాన్ని పునరుద్ధరించనట్లు చరిత్ర చెప్తుంది

వేదనారాయణస్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ 👇

కూర్మావతారం:

కూర్మావతారంఅనగానే సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం గుర్తుకు వస్తుంది.కానీ రాయలసీమలో కూడా శ్రీమహావిష్ణువుకు కూర్మావతారంలో ఒక ఆలయం ఉంది.ఆ ఆలయమే చిత్తూరుజిల్లా పలమనేరు మండలం లోని కురుమోయి (కూర్మై)? గ్రామంలోని శ్రీ కూర్మ వరదరాజస్వామి అలయం.
వరాహావతారం:

హిరణ్యాక్షుడి వలన పాతాళలోకం లోకి వెళ్లిన భూమండలాన్ని రక్షించడానికి బ్రహ్మ నాసిక నుండి ఉద్భవించిన అవతారం వరాహావతారం. భూవరాహస్వామి ఆలయం తిరుమలలో స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్నది. వేంకటేశ్వర స్వామి తిరుమల చేరేనాటికే భూవరాహస్వామి తిరుమల కొండపై కొలువైనాడు.
అందుకే తిరుమలను ఆదివరాహ క్షేత్రం అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమలలో నివాసముండేందుకు భూవరాహస్వామి స్థలము ఇచ్చినందుకు ప్రతిగా తిరుమలలో మొదటి దర్శనం, మొదటి నైవేద్యం వరాహ స్వామికే చెందే విధంగా వేంకటేశ్వర స్వామి మాటఇచ్చాడు.
అందుకే సంప్రదాయం ప్రకారం తిరుమల వచ్చే భక్తులు మొదట భూవరాహస్వామి వారిని దర్శించేకున్న తరువాతనే శ్రీవారి దర్శనం చేసుకోవాలి.
నృసింహావతారం

హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్యకశిపుడిని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు ఉగ్రనరసింహ అవతారం ఎత్తాడు. అయితే నరసింహస్వామి కర్నూలుజిల్లా అహోబిల క్షేత్రంలోని ఉగ్రస్థంభం నుండి ఉద్భవించాడని ప్రతీతి. అందుకనే రాయలసీమలో మనకు అనేక నరసింహాలయాలు కనిపిస్తాయి.
అహోబిలక్షేత్రంలోనే నవనారసింహ ఆలయాలు కూడా ఉన్నాయి. రాయలసీమలో అనేక ప్రసిద్ధిచెందిన నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి.కదిరిలోనిశ్రీ ఖాద్రీ నరసింహ స్వామి ఆలయం, ఉరవకొండవద్దగల పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం,
కడపజిల్లా, పెండ్లిమఱ్ఱి మండలం వెయ్యినూతుల కోనలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం, చిత్తూరు జిల్లా తరిగొండలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, కర్నూలు జిల్లాలోని ఉరుకుంద ఈరన్నఆలయం, మద్దిలేటి నరసింహస్వామి ఆలయం మొ. అందులో కొన్ని.
వామనావతారం

శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని వామనావతారంలో మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని,తక్కిన జగత్తును నింపి మూడు అడుగు బలిచక్రవర్తి తలపై ఉంచి అతడిని పాతాళానికి తొక్కిన కథ అందరికీ తెలిసిందే.
అయితే ప్రత్యేకంగా వామనావతారంలోని శ్రీమహావిష్ణువుకు ఆలయాలు అధికంగా కేరళ, తమిళనాడులో ఉన్నాయి కానీ రాయలసీమలో ఉన్నట్టుగా తెలియరాలేదు. కానీ వామనుడి త్రివిక్రమావతారం పుష్పగిరి వంటి అనేక ఆలయాల్లో మలచబడింది.

పరుశురామావతారం

దశావతారాల్లో ఆరవ అవతారం పరశురామావతారం.
పరశురామ ఆలయాలు కూడా అత్యంతఅరుదుగా ఉంటాయి. కడప జిల్లా, రాజపంపేట సమీపంలోని అత్తిరాల (హత్యారాల) క్షేత్రంలో పరశురామ (పరశురామేశ్వర) ఆలయం ఉన్నది. అత్తిరాలనే పరశురామ క్షేత్రంగా కూడా భావిస్తారు. పరశురాముడు మాతృహత్యా పాతకం / బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందిన చోటు అత్తిరాల.
అలానే కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూడా పరశురాముడి ఆలయం, రేణుకాదేవి ఆలయం ఉన్నాయి.

అత్తిరాలక్షేత్రం గురించి మరిన్ని వివరాలు 👇

రామావతారం

“రామో విగ్రహవాన్ ధర్మః అన్నాడు మారీచుడు”. అంటేమూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడుఅని అర్థం. రాయలసీమలో ప్రతీగ్రామంలో రామాలయం ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఒంటిమిట్టలోని జాంబవత ప్రతిష్టిత శ్రీ కోదండరామస్వామి ఆలయం (ఆంధ్రా భద్రాచలంగా పరిగణనించబడుతోన్న క్షేత్రం),
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయం, కర్నూలు జిల్లా పెద్దతుంబళంలోని రామాలయాలు మొ. బాగా ప్రసిద్ధి చెందిన రామాలయాలలో కొన్ని

ఒంటిమిట్ట ఆలయం గురించి మరిన్ని విశేషాలు 👇



బలరామావతారం

కొందరు శ్రీకృషుడి అగ్రజుడైన బలరాముడికి దశావతారాలలో ఒక అవతారంగా భావిస్తే
మరికొందరు బుద్ధుడిని దశావతారాలలో విష్ణువు అవతారంగా భావిస్తారు. శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగానూ, అయన సోదరుడుబలభద్రుడు / బలరాముడిని, సోదరి సుభద్రను కలిపి పూజించే సంప్రదాయం సాధారణంగా ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా ఒరిస్సాలో కలదు. ఒరిస్సా, ఉత్తర భారతదేశంతో పోలిస్తే బలరాముడి ఆలయాలు
రాయలసీమలో తక్కువనే చెప్పాలి.

చిత్తూరు జిల్లా తిరుచానూరులో శ్రీకృష్ణబలరామ ఆలయం / శ్రీకృష్ణ ఆలయం(అళగియ పెరుమాళ్ ఆలయం) ఉన్నది. ఈ ఆలయంలో కృష్ణుడితో పాటు బలరాముడు కూడా కొలువై ఉన్నాడు.

అలాగే కర్నూలులోని ఇస్కాన్ మందిరంలో కూడా కృష్ణుడితో పాటు సుభద్ర, బలరాముడు పూజలు అందుకుంటున్నారు.
కృష్ణావతారం

రాయలసీమలో( ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో )అనేక ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని

రుక్మిణీసత్యభామా సమేత వేణుగోపాల స్వామి ఆలయం, కార్వేటినగరం చిత్తూరు జిల్లా
వేణుగోపాల స్వామి ఆలయం, తిరుమల
ఇస్కాన్ ఆలయం, తిరుపతి
ఇస్కాన్ ఆలయం, అనంతపురం
ఇస్కాన్ మందిరం, కర్నూలు
శ్రీకృష్ణబలరామ ఆలయం / శ్రీకృష్ణ ఆలయం(అళగియ పెరుమాళ్ ఆలయం), తిరుచానూరు

బుద్ధుని అవతారం

ఇతర మతాలలాగే ఒకప్పుడు రాయలసీమలో కూడా బౌద్ధమతం ఫరిఢవిల్లింది. కడప జిల్లా నందలూరు వద్దగల అడపూరు, పులివెందులవద్ద గల భైరవాచలం,

చిత్రం : మోపూరు భైరవేశ్వర ఆలయం (భైరవాచలం)
కర్నూలు జిల్లాలోని బెలూం గుహల ప్రాంతాలలో ఒకప్పుడు బౌద్ధమత ప్రభావం అధికంగా ఉండేది. బెలూం గుహల్లో బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేవారట. ప్రస్తుతం బెలూం గుహలవద్ద పెద్ద బుద్ధ విగ్రహాన్ని దర్శించవచ్చు. అలాగే కడప జిల్లాలోని అత్తిరాల ఒకప్పుడు బౌద్దక్షేత్రమని ప్రతీతి.
ఈసారి ఆయా ప్రాంతాలను సందర్శిస్తే కచ్చితంగా ఈ ఆలయాలను దర్శించుకోండి

సర్వేజనా సుఖినోభవంతు

#Ravishing_Rayalaseema #Rayalaseema_Temples #Rayalaseema_Tourism
#Kadapa #Kurnool #Chittoor #Anantapur #Kadapa_Temples #Kurnool_Temples #Chittoor_temples #Anantapur_temples
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Enjoying this thread?

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!