అంతులేని విషప్రచారం

మొదట కథ కోసం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని వాడారు

తరువాత సీమ ఫ్యాక్షన్ నేపథ్యమే కథగా సినిమాలు తీయడం ప్రారంభించారు (కథానాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరూ సీమవారే)

ఆ తరువాత కేవలం విలన్ నేపథ్యాన్ని రాయలసీమకు పరిమితం చేస్తూ సినిమాలు తీశారు
(ఇటువంటి సినిమాల్లో సాధారణంగా విలన్ రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా ఉంటాడు, హీరో సీమేతర వ్యక్తిగా ఉంటాడు). సీమకు చెందిన విలన్ సీమేతర హీరో చేతిలో బకారా అవ్వడమో, తుక్కుతుక్కుగా తన్నులు తినడమో చేస్తుంటాడు
అప్పటికీ ఎవరూ అడ్డుచెప్పకపోయే సరికి హద్దులు దాటి చిత్రవిచిత్ర వేషధారణతో, యాసతో సీమ విలన్లను నరరూప రక్షసులుగా, సైకోలుగా చూపడం మొదలుపెట్టారు. సీమ పాత్రలను వెకిలి హాస్యానికి వాడుకున్నారు.

ఇంకొందరు మరింత మసాలా దట్టించి సీమ ఆడవారిని గయ్యాలుగా, హత్యలకు ప్రోత్సహించేవారిగా చూపారు
అది చాలదు అన్నట్టు కక్షలకోసం సొంత కొడుకులను, చంపుకుంటారు అంటూ చిత్రీకరించారు

మరికొందరు పూర్తిగా విలువలు, వలువలు విప్పేసి సీమ నేపథ్యంలో విలన్లను కుల తోకలను జత చేయడం మొదలుపెట్టారు (సీమనేపథ్యంలోని సినిమా అయినా హీరో ఒక కులపు పేరు, విలన్ కు వేరే కులం పేరు పెట్టడం మొదలుపెట్టారు)
చివరగా మరో రకం. సినిమా అంతా సీమ ఫ్యాక్షనిజం చూపించి చివరలో హీరో ఫ్యాక్షనిజం మాని జనజీవన స్రవంతిలో కలవాలి అని ధర్మబోధ చేస్తాడు. ఇటువంటి సినిమాలు progressive, సీమను ఉద్ధరించే సినిమాలు అని అభిప్రాయం ఒకటి.
పెద్ద ప్రొడక్షన్ హౌసులు, స్టార్ డైరెక్టర్ లు, టాప్ హీరోలు, నిర్మాతలు, రచయితలు ఎవ్వరికీ ఇవి తప్పు అనిపించలేదు. సినిమా పేరుతో ఒక ప్రాంతం మీద ఎంత విషం చిమ్ముతున్నారో తెలిసిరాలేదు. తెలిసినా డబ్బే ప్రధానం అనుకున్నారు కావొచ్చు, ఎవరూ అభ్యంతరం కూడా చెప్పలేదు.
ఈ జాడ్యం వెండితెర నుండి బుల్లితెరకు, డిజిటల్, ప్రింట్ మీడియాకు ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా పాకింది

సినిమా అన్నది ప్రజలను ప్రభావితం చేయగలిగిన ఒక బలమైన సాధనం. అందువల్లనే ఏమి చూపాలి ఏమి చూపకూడదు అని ముందే సర్టిఫికేషన్ పొందాలి (సెన్సార్ నుండి).
కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను తీవ్రంగా దుర్వినియోగ పరుస్తూ సినిమాలు, మీడియా ఒక ప్రాంతం మీద విషం చిమ్మడం 20 ఏళ్లుగా నిర్విరామంగా సాగుతోంది.

తొలి ఫ్యాక్షన్ సినిమా వచ్చేనాటికి సీమలో నిజంగానే ఫ్యాక్షన్ ఉంది. ఎవరూ కాదనలేని నిజం అది(1990లలో). తరువాత కాలం వేగంగా మారింది.
మనుషుల్లో స్వార్థం పెరిగింది. ఎవరి నాయకత్వం / ఎవరి లాభం కోసమో నేనుందకు బలి అవ్వాలి అనే భావన ప్రజల్లో బలంగా వచ్చింది. ఒకప్పటి సీమ ఫ్యాక్షనిస్టుల ఇంటర్వ్యూలు అన్నీ iDream వారు తీశారు. అందులో అందరూ ముక్తకంఠంతో చెప్పేది ఒకటే. ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది ఇప్పుడు ఆపేశాం అని.
తెలియని వారికి చెప్పొచ్చు. తెలిసినా కావాలని చేస్తున్నవారికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు?

మనల్ని కించపరుస్తున్నారని తెలిసీ వాటికి కోట్లు కోట్లు కలెక్షన్లు ఇచ్చి మనమే ప్రోత్సహిస్తున్నప్పుడు ఇంకెవరిమీదో బాధపడి ఏమి లాభం ?

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

9 Oct
మ్యాప్ చెప్పే చరిత్ర

1840ల నాటి ఈ రాయలసీమ మ్యాప్ మనకు ఎన్నో చారిత్రక విషయాలు చెబుతుంది. అవేంటో చూద్దాం

1. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ - 1928లో రాయలసీమ అనే పేరు పెట్టకముందు వరకు ఈ ప్రాంతాన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలాలు అని పిలిచేవారు Image
2.రెండు జిల్లాలు - చిత్రంలో కేవలం బళ్లారి మరియు కడప జిల్లాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పటికి కర్నూలు పూర్తి జిల్లాగా ఏర్పడలేదు. అనంతపురం బళ్లారి జిల్లాలో భాగం మరియు చిత్తూరు ఆర్కాటు రాజ్యంలో ఉండేది.

3. కడప జిల్లా - ఇప్పుడు కడప జిల్లా చిన్నగా రాష్ట్ర / దేశ సరిహద్దు
లేని జిల్లా కానీ 1840లలో కడప చాలా పెద్ద జిల్లా. ఒకవైపు మైసూరు, మరోవైపు ఆర్కాటు రాజ్యం /గుంటూరు, నెల్లూరు సరిహద్దుగా విస్తరించిన జిల్లా. ఇప్పుడు అనంతపురం లో ఉండే కదిరి, చిత్తూరు జిల్లాలో ఉండే మదనపల్లి, వాయలపాడు, పుంగనూరు, కర్నూలు జిల్లాలో ఉండే కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలోని కంభం,
Read 10 tweets
8 Oct
శీతలా దేవి - సీతాలమ్మ

శీతలా దేవి సర్వ రోగ ప్రశమని. జ్వరం, చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు ఇలా ఏ జబ్బు వచ్చినా, అంటువ్యాధులు వచ్చి ఊర్లకు ఊర్లు వాటి బారిన పడినా ప్రజలను ఆదుకునే తల్లి శీతలా దేవి. 'శీతల' అంటే చల్లదనాన్ని చేకూర్చునది అని అర్థం.

చిత్రం : సీతాలమ్మ తల్లి /యంత్రపు రాయి Imageసీతాలమ్మ తల్లి / యంత్రపు రా...
శీతలా దేవిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మనం అమ్మవారినే అంకాలమ్మ, నూకలమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ వంటి పేర్లతో గ్రామదేవతలుగా పూజిస్తూ ఉంటాం. శీతాలాదేవికి విగ్రహాలు ఉంటాయి కానీ చాలా చోట్ల గ్రామదేవతలకు / అక్కదేవతలకు విగ్రహాలు ఉండవు.
ఒక్కో దేవత ప్రతిమగా ఒక్కో రాయిని పెట్టి, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు.
ఈ గ్రామ దేవతలు ఊరిలోకి ఏ చీడ పీడలు రాకుండా అంటువ్యాధులు కలుగ జేసే ఏ మహమ్మారులు పొలిమేర దాటకుండా ఊరికి రక్షణగా ఉంటారు. అందుకే వీరి గుడులు ఊరి పొలిమేర వద్ద ఉండేవి.
Read 8 tweets
23 Sep
గురువు గారు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో నా పరిచయం

కడప పట్టణానికి చెందిన ధర్మదాత యాదాల్ల నాగమ్మ గారి గురించి పరిశోధన చేసే క్రమంలో గురువుగారు పరిచయం అయ్యారు. అప్పుడే వారి గురించి తెలిసింది అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్ గా చేశారని మరియు అన్నమయ్య కీర్తనలు, కైఫీయత్తులు, కడప Image
చరిత్ర మీద వారికి ఎంతో ఆసక్తి మరియు పట్టు ఉంది అని. 'యాదాల్ల' వారి చరిత్ర సేకరించడంతో పాటు నేను తయారుచేసిన 'అన్నమాచార్య సర్క్యూట్' ఆలోచనను వారికి వినిపించాను.

అన్నమాచార్య సర్క్యూట్ : తాళ్ళపాక అన్నమయ్య తిరుమల శ్రీవారి మీద కాకుండ చెప్పలి, సాంబటూరు, నందలూరు, వెయ్యినూతుల కోన.. Image
ఇలా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణాదిన దాదాపు 40 క్షేత్రాలు పర్యటించి ఆయా దేవుళ్లపై కీర్తనలు రచించారు. అన్నమయ్య దర్శించిన 'చెప్పలి' వంటి క్షేత్రాల్లో నిధులు లేక కూలిపోయిన గోపురం బాగుచేయించలేని పరిస్థితి. కొందరు చరిత్రకారులకు, పరిశోధకులకు తప్ప ఆయా ఆలయాలను అన్నమయ్య దర్శించారని Image
Read 11 tweets
21 Sep
మనకూ ఉంది ఒక త్రికూట ఆలయం-అనేక విశేషాల సమాహారం పుష్పగిరి త్రికూటేశ్వర ఆలయం

సాధారణంగా ఆలయాలలో ఒక ప్రధాన గర్భాలయం వాటికి అనుబంధంగా ఉపాలయాలు ఉంటాయి. అలాకాకుండా ఒకే ఆలయంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన గర్భాలయాలు ఉంటే వాటిని ద్వికూట, త్రికూట మొ. ఆలయాలుగా సంబోధిస్తారు #Pushpagiri Thousand Pillar Temple, Han...Trikuteswara Temple, Pushpa...
ఒకే ఆలయంలో మూడు గర్భాలయాలు ఉంటే ఆ ఆలయాన్ని త్రికూట ఆలయం అంటారు. చాళుక్యుల, హోయసలుల, కాకతీయుల శిల్పకళా రీతిలో ఈ అధికంగా కనిపిస్తాయి

వరంగల్ లోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి త్రికూట ఆలయం. తెలంగాణలో త్రికూట ఆలయాలు చాలా ఉన్నా, రాయలసీమలో త్రికూట ఆలయాలు అత్యంత అరుదు
#rayalaseema_Temples Image
అటువంటి త్రికూట ఆలయం, కడప జిల్లా పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయం. ఇక్కడి త్రికూట ఆలయంలో 3 గర్భాలయాలో స్వామి ఉమామహేశ్వరుడు , త్రికూటేశ్వరుడు మొ.పేర్లతో పూజలు అందుకుంటున్నాడు. ఈ మూడు గర్భాలయలు వేరే వేరే వ్యక్తులు కట్టించడం విశేషం. Image
Read 6 tweets
21 Sep
రాయలసీమ ఆపద్భాందవుడు శ్రీనివాసుడు - రాయలసీమ అభివృద్ధిలో తితిదే పాత్ర - SV యూనివర్సిటీ, ఒక చరిత్ర

తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆంధ్ర మహా సభ ఏర్పడిన తరువాత, ఆంధ్రోద్యమంలో రెండవ విజయం తెలుగువారి కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకారం. Image
(మొదటి విజయం ప్రత్యేక PCC ఏర్పాటుకు అంగీకారం). అప్పటివరకు మద్రాస్ విశ్వవిద్యాలయం ఒకటే మద్రాసు రాష్ట్రంలోని అన్ని భాషల ప్రజలకు అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయం. అనేక తర్జనభర్జనల తరువాత ఆంధ్రవిశ్వకళాపరిషత్తు తాత్కాలిక ప్రధాన కేంద్రాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు.
బెజవాడ తాత్కాలిక కేంద్రంగా ఏర్పడిన ఆంధ్రవిశ్వకళాపరిషత్తు (ఆంధ్రా విశ్వవిద్యాలయము ) శాశ్వత ప్రధాన కేంద్రం ఎక్కడికి మార్చాలి అని చర్చ జరుగుతున్న రోజులవి. బెజావాడ వాళ్లు, రాజమహేంద్రవరం వాళ్లు వాల్తేరు (విశాఖపట్నం ) వాళ్ళు తమ నగరంలో ప్రధాన కేంద్రం ఉండలాంటే తమ నగరంలో ఉండాలని కోరారు.
Read 13 tweets
20 Sep
కడప చరిత్రలో ఒక చీకటి దినం-బుగ్గవంక వరదలు

19 ఏళ్ల తరువాత నిండిన కడప బుగ్గవంక ప్రాజెక్టు - 19 ఏళ్ల ముందు 2001లో బుగ్గ వంక వరదలు సృష్టించిన భీభత్సం జిల్లా వాసులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎన్నో చేదుజ్ఞాపకాలు మిగిల్చిన 2001 బుగ్గవంక వరదల గురించి కథనం👇

#సీమచరిత్ర #Kadapa #Buggavanka Image
కడప పట్టణంగా గుండా ప్రవహించే నది బుగ్గవంక. పెన్నా నదికి ఉపనది అయిన బుగ్గవంక పై ఆనకట్ట కూడా ఉంది. కడపలో ప్రాణ నష్టం సంభవించే వరదలు అత్యంత అరుదు. కానీ ఇటీవల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో కడపలో భీభత్సం సృష్టించిన అల్లర్లు అంటే మాత్రం 2001 బుగ్గవంక వరదల గురించే చెప్పుకోవాలి.
కడపవాసులకి 2001 బుగ్గవంక వరదలు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది.

బుగ్గవంక ఆనకట్ట కడప పట్టణానికి 7 కిమీల ఎగువన ఉంది. ఆనకట్ట కట్టినప్పటి నుండి పెద్ద వరద ఎప్పుడూ రాకపోవడం,ఇతర కారణాల వల్ల బుగ్గవంక నది కడప పట్టణంలో ఆక్రమణకు గురయ్యింది. నదీ తీరం మొత్తం గృహాలు, దుకాణాలు వెలిశాయి
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!