దేశవ్యాప్తంగా పెన్షనర్లు, వారి సంఘాలు ప్రతి సంవత్సరం డిసెంబరు 17న పెన్షనర్స్ డేను నిర్వ హిస్తున్నారు. మధ్యతరగతి పెన్షనర్సు చొరవతో ప్రారంభమై ఈనాడు పరిశ్రమల పెన్షనర్లు కూడా ఈ పెన్షనర్స్ డే పాటిస్తున్నారు. 17.12. #PensionersDay #Pension
1982న మన దేశ ఉన్నత న్యాయ స్థానం పెన్షన్ అంశంపై ప్రకటించిన తీర్పే ఈ పెన్షనర్స్ డేకు మూలం. సమాజంలోని పలు రుగ్మతలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కోణాల నుంచి చర్చలు జరుగుతున్నకాలమది. న్యాయ స్థానాల నుంచి కూడా పలు చారిత్రాత్మకమైన తీర్పులు వెలువడిన కాలమది.
ఉదాహరణకు 180రోజులు పూర్తిచేసిన క్యాజువల్ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, కనీస జీతమివ్వలేని యాజమాన్యాలు, కర్మాగారాలూ నడపటానికి అనర్హులన్నటువంటి తీర్పులు వచ్చిన కాలమది.
17.12.1982 తీర్పులో ఒకే పెన్షను విధానంలో వివిధ గ్రూపులుండరాదన్న అంశమేకాకుండా
పెన్షను హక్కు, యాజమాన్యాల బాధ్యత వంటి అంశాలను సవివరంగా తీర్పులో వక్కాణించారు. #PensionersDay
పెన్షను రూల్సు-1972కు ప్రభుత్వం, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షను) రూల్సు 1972 సవరించిన ఫలితంగా ఒనగూరే ప్రయోజనాలను భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తాయని సవరించారు.
ఈ అంశం న్యాయ వ్యతిరేకమనీ, సహజ చట్టాలను వమ్ముచేస్తున్నదనీ డి.ఎస్.నకారా, ఇతరులు న్యాయస్థానంలో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యం ఫలితంగా పెన్షను దాని పుట్టుపూర్వోత్తరాలతోపాటు, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి పరిశీలించి, విశ్లేషించి ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. '
''రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సోషలిస్టు, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యం'' ధ్యేయాలతోకూడిన రాజ్యంలో ప్రజలకు, కార్మికులకు ఉద్యోగులకు సంక్షేమ విధానాలను, ఆశయాలను, అమలు చేయాలన్న పూర్వరంగంలో ఈ తీర్పు వచ్చింది. ఉద్యోగులకు, కార్మికుల సమస్యలపై వచ్చిన తీర్పులలో తలమానికమైనది.
కార్మికుల, ఉద్యోగుల, పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎంతో ఇనుమడింపచేసింది ఈ తీర్పు.
ధర్మాసనం తన తీర్పులో ప్రభుత్వం 1979 ఏప్రిల్ 1 నుంచి పెన్షన్ సవరించుటవల్ల కలిగే ప్రయోజనాలను 1979 ఏప్రిల్‌కు ముందు లేక తరువాత రిటైరైన వారు కూడా పొందుతారు అని తీర్పునిచ్చింది.
ఈ తీర్పునిచ్చే క్రమంలో వేతన సంఘాల సిఫార్సుల ద్వారా జరిగే వేతన సవరణవల్ల కలిగే ప్రయోజనాలు, ఆ గడువు తేదీకి ముందు, గడువు తేదీ తరువాత ఉద్యోగులు ప్రయోజనాలు పొందే విధంగా పెన్షనర్లకు కూడా గడువు తేదీకి ముందు, తరువాత పెన్షనర్లకు ప్రయోజనాలు పొందాలని ధర్మాసనం చెప్పింది.
17 డిసెంబరు 1982 సుప్రీమ్‌కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ప్రతీఏడాది డిసెంబర్ 17ను 'పెన్షనర్స్ డే'గా నిర్వహించుకొంటున్నారు. ఈ 'పెన్షనర్స్ డే' సందర్భంగా కోర్కెల సాధనకు పెన్షనర్లు నడుము కట్టాల్సి ఉంది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్న
వృద్ధాప్య, ఆసరా పెన్షన్ పొందేవారిలో పలువురు అసంఘటిత రంగంలో పనిచేసిన వారు. కాని వారు పొందే వేయి, రెండువేలు ఏ మూలకూ చాలవు. పెన్షనర్స్ డేతోపాటు ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని సమర్థిస్తూ అక్టోబరు ఒకటిన అంతర్జాతీయ పెన్షనర్ల, పెద్దల,
వయోవృద్ధుల హక్కుల పోరాట దినంగా పాటించాలన్న డబ్ల్యూఎఫ్‌టీయూ పిలుపును కూడా అమలుచేయాలి.పెన్షనర్లను సమీకృతం చేయటంలోను, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పలు పెన్షనర్ల సంఘాల సమన్వయంతోపాటు రెగ్యులరు కార్మిక సంఘాలు తోడ్పాటు పొందాలి.
అంతేకాకుండా, మెరుగైన పెన్షను తక్కువ పెన్షనును, ఏ పెన్షనులేని వారి మధ్య, లక్షలాది అసంఘటిత రంగాల రిటైరీస్‌లను సమీకృతం చేయాలి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
తేనీరు (ఆంగ్లం Tea) ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు(టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. #InternationalTeaDay ☕#TeaDay 🥃
4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి,ఎండబెట్టి,ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడిచేసి,వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు.ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు.టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ,ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే
15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి మరియు అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది.
నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…
కవి సామ్రాట్టు విశ్వనాథ వారి మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఒక చిన్ని ఉదాహరణ చాలు..ఓ రోజు ఓ కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి బందరు నుండి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని
మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. అది అసలే ఎండాకాలం, అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది.ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ
ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే
ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన.
ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో
ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.
ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.
#EnglishLanguageDay#English #ఆంగ్లభాషదినోత్సవం#ఇంగ్లీష్
మనం ఈ నాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి. వాటిలో ప్రజలని ఇంగ్లీషు వాళ్లు, బ్రిటన్ వాళ్లు, స్కాట్ వాళ్లు, పిక్ట్ వాళ్లు, లేటిన్ వాళ్లు అని పిలచేవారు. వీరు వేర్వేరు భాషలు మాట్లాడేవారు.
వీరందరిలోను ముందు ఈ దీవులలో నివసించటానికి వచ్చిన వాళ్లు బ్రిటన్ లు; అందుకనే ఈ దేశానికి బ్రిటన్ అనే పేరు సిద్ధించింది. తరువాత సా. శ. 43 లో రోము నుండి చక్రవర్తి క్లాడియస్ పంపిన వలస ప్రజలు వచ్చి బ్రిటన్ లో స్థిరపడటం మొదలు పెట్టేరు. చూరు కింద తలదాచుకుందుకని వచ్చి ఇంటినే ఆక్రమించిన
తీరులో రోమకులు బ్రిటన్ ని ఆక్రమించి ఐదు శతాబ్దాలు పాలించేరు. అప్పుడు గాత్ అనే మరొక తెగ వారు రోమకులని ఓడించి దేశం నుండి తరిమేశారు. అప్పుడు ఈ గాత్ తెగని పడగొట్టటానికి పిక్ట్ లు, స్కాట్ లు ప్రయత్నించేరు. వీళ్లని ఎదుర్కొనే శక్తి లేక బ్రిటన్ మళ్లా రోమక ప్రభువులని ఆశ్రయించక తప్ప లేదు.
ఒక చోట చదివాను.చార్లీ చాప్లిన్ ఒక మారు స్విట్జర్లాండ్ వెళ్ళాడట. అక్కడ చాప్లిన్ వేషం వేసుకున్న వారికి పోటీ జరుగుతోందట. అంటే ఎవరు అచ్చం చాప్లిన్ లాగా నటించగలుగుతారో వారికి బహుమానం ఇచ్చే పోటీ అన్నమాట. #ChaplinDay
ఉత్సాహం ఆపుకోలేక చాప్లిన్ కుడా ఆ పోటీ లో పాల్గొన్నాడట.కానీ ఆశ్చర్యమేమిటంటే,ఆ పోటీలో చాప్లిన్ కు 7 వ స్థానం లభించిది.
దీని అర్థం ఏమిటబ్బా అని కాస్తా ఆలోచించాను. నాకు ఈ విషయాలు తెలిసొచ్చాయి. మనలని ప్రపంచం తనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుంటుంది.
అంతేకాన, మనమేమిటో సరిగ్గా తెలిసినది మనకు మాత్రమే.ఒక్క చాప్లిన్ కు మాత్రమే తెలుసు చాప్లిన్ అంటే ఎవరు, చాప్లిన్ ఎందుకోసం జీవించాడు ,చాప్లిన్ ఏవిధంగా ఆలోచించేవాడు అని. 'చూడండి, నా
ఉద్దేశ్యమిది, నేనీ విషయాన్ని ఇలా ఆలోచించాను ,
#RamanaMaharshi
శ్రీ రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు
బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నారు.
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. #Arunachalam
వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి #Tiruvannamalai