భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా అసమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. #HappyLohri #Lohri
ఈ పండగలను చేసుకొనే తీవ్రత మరియు విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, పండుగలో ఉన్న సారాంశం మరియు పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి.
దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా దేశం ఏదైనా, పంటకోత సందర్భంగా పండుగలు చేసుకోకపోతే అది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఎందుచేతనంటే, వ్యవసాయం చేసేవారు పంటకోత సమయంలో వారికి వచ్చే దిగుబడి మరియు రాబడికి గాను
ఎంతో కృతజ్ఞతతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పండగ చేసుకుంటారు.
ఉత్సహపూరితమైన రాష్ట్రాల్లో ముందుండే పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు, లోహ్రి అనే వ్యవసాయానికి సంబంధించిన పండుగను జరుపుకుంటాయి. ఈ పండుగ యొక్క విశిష్టతల గురించి ఈ క్రింద సవివరంగా వివరించబడింది.
లోహ్రి యొక్క శబ్దవ్యుత్పత్తి :
లోహ్రి అనే పదం ఉద్భవించడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈ పదం ' లోహ్ ' అనే పదం తో ఉద్భవించిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ' లోహ్ ' అంటే ఇనుము అని అర్ధం. మందమైన ఇనుము బాండీలను పండుగ సందర్భంగా రకరకాల మసాలాలు తయారుచేయడంలో భాగంగా ఉపయోగిస్తుంటారు.
ఇక్కడి నుండే ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. జానపద కథలు చెప్పేవారు మాత్రం పూర్వం ఇద్దరు తోబుట్టువులు ఉండేవారని వారి పేరు హోళికా మరియు లోహ్రి. హోళికా హోలీ సందర్భంగా వేసిన మంటల్లో చిక్కుకొని చనిపోయిందట, లోహ్రి బ్రతికిపోయాడట.
ఆలా లోహ్రి బ్రతికిపోవడంతో ఆ ఆనందాన్నే ఇలా పండగ రూపంలో జరుపుకుంటున్నారని చెబుతారు.
వ్యవసాయం విజయవంతమవడం :
భారతదేశం వ్యవసాయం పై ఆధారపడ్డ దేశం. ఇది పంజాబ్ మరియు హర్యానా వంటి భూసారవంతమైన నేలలు కలిగిన ఈ రాష్ట్రాల్లో ఈ మాట మరింత నిజమైనది అని అనిపించకమానదు.
ఇలాంటి ప్రదేశాల్లో తాము పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికిగాను చివరిగా వచ్చే పంట దిగుబడి మరియు పంటకోత సమయంలో వచ్చే రాబడి, ఇక్కడివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుపుకొనే పండగనే లోహ్రి అంటారు.అందుచేతనే పంజాబీ ప్రజల గుండెల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
తరువాతి తరాలకు సాంస్కృతిక సమగ్రతను పరిరక్షిస్తున్నారు:
లోహ్రి పంగడలో ముఖ్యమైన భాగం ఏమిటంటే, ఈ పండగ సందర్భంగా చిన్నపిల్లలు ఇంటింటికి వెళ్లి జానపద పాటలు పాడుతారు. వీరు ఇలా పాడుతున్నందుకు గాను, ఆ ఇంటివాళ్ళు బెల్లం, గింజలు, డబ్బు మరియు ఈ రోజుల్లో చాకోలెట్స్ ని వారికి
బహుమతిగా ఇస్తున్నారు.ఇలా చేయడం ద్వారా పిల్లలకు ప్రోత్సాహకం లభిస్తుండటంతో వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.ఇలా చేయడం ద్వారా, వీరు వీరి యొక్క సంస్కృతి మరియు విలువల గురించి ఎంతగానో నేర్చుకుంటున్నారు.వీటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది.
అందుచేతనే సంప్రదాయకమైన పంజాబీ కుటుంబాలన్నీ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ని ఇస్తాయి.
బంధాలన్నీ బలపడే సమయం :
లోహ్రి పండుగ సందర్భంగా కుటుంబంలో ఉన్న స్త్రీ, పురుషులు అందరూ ఇంటి నుండి బయటకు వచ్చి పంజాబీ జానపద నృత్యాలు చేస్తారు. భోగి మంటను మధ్యలో పెట్టి వీరు ఆ నృత్యం చేయడం ఆనవాయితీ.
సాధారణంగా స్త్రీలు గిద్ద అనే నృత్యం చేయగా, పురుషులు బాంగ్రా అనే నృత్యం చేస్తారు. పాటలు పాడటం, నృత్యం చేయడం మరియు ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్కొంటూ, రాత్రంతా అక్కడివారంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ఆ భోగి మంటలు అలా మండుతూ ఉండటం కోసమై పల్లీ పట్టీని, పాప్ కార్న్, వేరు సెనగకాయలను ఇలా మరికొన్ని వాటిని ఆ భోగి మంటలో వేస్తారు. వీరు చేసే ఈ పనులన్నీ పిల్లల్లో మరియు కుటుంబ సభ్యుల్లో మరియు సమాజంలో మతసామరస్యం పెంపొందించడంలో ఎంతగానో కీలక పాత్ర పోషిస్తాయి.
రుచికరమైన ఆహారాలు తినటం :
సాధారణంగా భారతీయులు వారు తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు మరియు ఏదైతే ఉత్తమంగా ఉంటుందో దానిని తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక పండుగా సమయంలో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పననవసరం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రజలు మరొక్క అడుగు ముందుకేసి,
మరింత రుచికరమైన ఆహారాన్ని తినటానికి ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలాంటి ఒక సందర్భం అయిన, ఈ పంటకోత పండుగ సందర్భంగా చేసే సర్సొన్ డా సాగ్, మక్కి ది రోటి మరియు ఖీర్ గురించి ప్రస్తావించకపోతే అస్సంపూర్తిగా ఈ పండుగ గురించి చెప్పినట్లు అవుతుంది.
ఇవి ఈ పండుగ యొక్క సారాంశాన్ని మరియు స్వచ్ఛమైన రూపాన్ని అందరికి తెలియజేస్తాయి.
సూర్యదేవునికి సమర్పణలు :
మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, సరైన పంట దిగుబడి రావాలంటే సరైన వెలుగు కూడా అవసరం. అందుచేతనే ఈ పండుగ, ఈ విషయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతని ఇస్తుంది
అందుకు అనుగుణంగా జరుపుకుంటారు. సూర్యదేవునికి సమర్పణలు చేయడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చని, అందుకు ప్రతిఫలంగా మొక్కజొన్న పొలాలు మరింత దిగుబడిని సాధిస్తాయని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.
చివరకు ఇదంతా మనుష్యులు మరియు జంతువులు ఈ భూమి పై ఆనందంగా ఉండటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
చల్లని శీతాకాలాలు :
జనవరి మాసం మధ్యలో లోహ్రి పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో సూర్యుడు మకరరాశి నుండి తప్పుకొని, ఉత్తరం వైపుకు జరుగుతాడు.
ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సందర్భాన్నే ఉత్తరాయన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమయం అయిన శీతల కాలంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. ఈ అతి చల్లని శీతలకాలం కారణంగానే భోగిమంట కేంద్రంగా లోహ్రి పండగను జరుపుకోవడం జరుగుతుంది. అలా భోగిమంటకు, శీతల కాలానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ముడిపడి ఉంది.
ఆత్మ సంతృప్తి :
కావాల్సిన మేర ఆహారాన్ని ఆరగించడం మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఈ లోహ్రి పండుగ జరుపుకున్న అందరిలో ఒకరకమైన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఇది ఈ పండుగ యొక్క ప్రత్యేకమైన, అతిముఖ్యమైన విశిష్టత.
లోహ్రి సందర్భంగా ప్రజలు ఎంతో శాంతంగా వారి వారి కుటుంబ సభ్యులతో, ఒక మంచి భావంతో ఈ పండగను జరుపుకుంటారు. మరొక నిజం ఏమిటంటే, సిక్కులు మరియు పంజాబీలు భోగి మంట చుట్టూ చేరి గురు గ్రంథ్ సాహిబ్ నామస్మరణ చేస్తారు మరియు భోగి మంట ముందు ధ్యానం కూడా చేస్తారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మీ పిల్లలు ఎప్పుడు చూసినా సంగీతం ఇష్టపడుతున్నారా? డ్యాన్స్ అనగానే స్టెప్పులేస్తున్నారా? పెయింటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారా? అయితే అవి కాలయాపన కోసం మాత్రం అనుకోకండి. అవి తమ అభిరుచుల్ని వ్యక్తపరచే స్వభావాలు అని గ్రహించాలి. #KidInventorsDay 💡
పిల్లలు పిడుగుల దినోత్సవం💡🚸
పిల్లల ప్రతిభను ఎలా గుర్తుంచుకోవాలో ముందు తెలుసుకోండి!
పర్యవేక్షణ:
మొక్కై వంగనిది మానై వంగునా? అందుకే పిల్లలకు ఏదైనా చెప్తే వినే స్టేజ్‌లోనే అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెప్పడమంటే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం కాదు. వారిని నిరంతరం పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ..
సూక్ష్మ పరిశీలన:
ఏదో కాలయాపనకోసం కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తే.. వాళ్లు ఏ దారిన నడిచేందుకు ఇష్టపడుతున్నారో.. ఏ పనులంటే ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది.
సాధారణంగా భారతీయు వంటగది సుగంధ పరిమళాలతో నిండి వుంటుంది. ఎందుకంటే మసాలా, స్పైసీ ఎక్కువగా వండుతారు. తింటారు కాబట్టి. మీరు కొత్తగా వంటగదిలోకి అడుగు పెడుతన్నా లేదా వంటల గురించి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నా ముఖ్యంగా వంటకు ఉపయోగించే వస్తువులపై అవగాహన #internationalhotandspicyfoodday
కలిగి వుండాలి. కొన్ని సాధారణంగా అందరికీ తెలిసి ఉంటాయి. అయితే మరికొన్ని స్పైసీ వస్తువులు కొంతమందికి తెలిసి ఉండవు. కాబట్టి వంటగదిలో ఎలాంటి స్పైసీ ఐటమ్స్ ను నిల్వచేసుకోవాలో తెలుసుకోవాలి. ఇండియన్ ఫుడ్ తయారు చేయడంలో వంటకు ఉపయోగించే వస్తువులు కొన్ని వందల్లో ఉన్నాయి.
కొన్ని వస్తువులు లేకుండా వంట అనేది పూర్తి కాదు. అందుకోసం ఇక్కడ కొన్ని స్పైసీ వంట దినుసులను మీకోసం తెలియ చేస్తున్నాం. అలాగే వాటి వల్ల ఉపయోగం ఏమిటి వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం...
రోడ్డు పై గుంతలు/ పాట్ హోల్స్ కొత్తేమీ కాదు, వాస్తవానికి, వాటి పేరు రోమన్ సామ్రాజ్యం యొక్క కాలంలో నిర్మించిన రోమన్ రోడ్ల నుండి వచ్చింది. ఆ రోజుల్లో రోడ్లు బంకమట్టి పేర్చి వాటి మీద కంకరతో నిర్మించబడేవి.వాటిపై మరోసారి కాల్చిన ఇటుకలతో నిర్మించేవారు. #PotHoleDay 🕳️
ఇక్కడ కుమ్మరులు(Potters) కుండల తయారీ కోసం రహదారి ఉపరితలం తెరిచి నాణ్యమైన పాటింగ్ బంకమట్టి తీసేవారు. ఆ విధంగా ఏర్పడిన గుంతలను పాట్ హోల్స్ గా పిలిచేవారు. #PotHole
చాలా వరకు రోడ్డుపై గుంత/గొయ్యి భారీ వర్షాలకు నీటి ప్రవాహం వలన ఏర్పుడుతుంది. కానీ నేడు గుంతలు ముఖ్యంగా నాణ్యత లోపం వలన చిన్నపాటి వర్షాలకు ఏర్పడుతున్నవి. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు గతుకులు/గుంతలు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.వీటి ద్వారా చాలా ప్రమాదాలు సంభవిస్తాయి.
అనేక పద్దతుల్లో అహింసా పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెడితె ... ప్రజాసా్మ్య భారతాన్ని మనదేశ సైనికులు కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు. #IndianArmyDay #IndianArmyDay2021
1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ ' సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ ' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్-చీప్ గా లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు . అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం " జనవరి 15 వ తేదీన " - " ఆర్మీ డే " ని నిర్వహిస్తారు.
ఆ రోజున దేశ రాజధానిలో ఆరు ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో పెరేడ్లు , ఇతర మిలటరీ షోలు నిర్వహిస్తారు. #IndianArmyDay
మనదేశ ప్రజల పరిరక్షణకోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు ఈ సందర్భం గా నివాళులర్పిస్తారు.
సంక్రాంతి పండుగ రోజు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పతంగుల పండుగను ఆనందంగా గడుపుతారు. సాధారణంగా ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కోసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం (#Kite). #InternationalKitesDay
పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది. గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది.
ఆకాశమే హద్దుగా వివిధ రకాల పతంగులను ఎగరేస్తూ ఇంద్రధన్సుల్లోని వర్ణాలను ఆకాశంలో నిలుపుతారు. సంక్రాంతి పండుగ రోజు పతంగులను ఎగురేసేందుకు ప్రత్యేకమైన దారాలను తయారు చేయడం, మాంజాలుగా రూపుదిద్ది పోటీల్లో పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా పెన్షనర్లు, వారి సంఘాలు ప్రతి సంవత్సరం డిసెంబరు 17న పెన్షనర్స్ డేను నిర్వ హిస్తున్నారు. మధ్యతరగతి పెన్షనర్సు చొరవతో ప్రారంభమై ఈనాడు పరిశ్రమల పెన్షనర్లు కూడా ఈ పెన్షనర్స్ డే పాటిస్తున్నారు. 17.12. #PensionersDay #Pension
1982న మన దేశ ఉన్నత న్యాయ స్థానం పెన్షన్ అంశంపై ప్రకటించిన తీర్పే ఈ పెన్షనర్స్ డేకు మూలం. సమాజంలోని పలు రుగ్మతలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కోణాల నుంచి చర్చలు జరుగుతున్నకాలమది. న్యాయ స్థానాల నుంచి కూడా పలు చారిత్రాత్మకమైన తీర్పులు వెలువడిన కాలమది.
ఉదాహరణకు 180రోజులు పూర్తిచేసిన క్యాజువల్ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, కనీస జీతమివ్వలేని యాజమాన్యాలు, కర్మాగారాలూ నడపటానికి అనర్హులన్నటువంటి తీర్పులు వచ్చిన కాలమది.
17.12.1982 తీర్పులో ఒకే పెన్షను విధానంలో వివిధ గ్రూపులుండరాదన్న అంశమేకాకుండా