అనేక పద్దతుల్లో అహింసా పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెడితె ... ప్రజాసా్మ్య భారతాన్ని మనదేశ సైనికులు కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు. #IndianArmyDay #IndianArmyDay2021
1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ ' సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ ' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్-చీప్ గా లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు . అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం " జనవరి 15 వ తేదీన " - " ఆర్మీ డే " ని నిర్వహిస్తారు.
ఆ రోజున దేశ రాజధానిలో ఆరు ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో పెరేడ్లు , ఇతర మిలటరీ షోలు నిర్వహిస్తారు. #IndianArmyDay
మనదేశ ప్రజల పరిరక్షణకోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు ఈ సందర్భం గా నివాళులర్పిస్తారు.
భారత దేశ ప్రజాస్వామ్యం కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఎంతటి ముఖ్యమయిన పాత్రనయితే పోషించారో , భారత సైన్యము కూడా అంతే సమానపాత్ర వహించినది . జనరల్ కోదండర మాదప్ప కరియప్ప స్వదేశీయులతోను , బ్రిటిషర్లతోనూ సత్సంబంధాలు కలిగివుండి
జనరల్ రాయ్ బచ్చర్ నుంచి తొలికమాండర్ ఇన్-చీప్ గా బాధ్యతలు స్వీకరంచిన తర్వాత సైన్యము సరిహద్దుల్లోను , ప్రకృతి వైపరీత్యాలలోనూ అనేకవిధాల పోరాడింది.పోరాడుతూనే ఉంది
భారతీయ సైన్యము చరిత్ర కొన్ని వేల సంవత్సరాలకు పైబడిందే. మహాభారత కాలాల్లో కురుక్షేత్ర సంగ్రామం లోదాదాపు నాలుగు లక్షల మంది యుద్ధం లో పాల్గొన్నారు . రధాలు , గురాలు , ఏనుగులపై నుంచి యుద్ధం సాగించడమే కాకుండా నేలపై నుంచి కూడా యుద్ధం చేసారు .
అప్పట్లో విశ్వశాంతి , ధర్మ పరిరక్షణల కోసం అనేక యుద్దాలు జరిగాయి. క్రమ క్రమం గా నాగరికత పెరిగేకొద్దీం వాయవ్య దిశ గా హిందూకుష్ పర్వతాల ద్వారా చొరబాట్లు పెరిగాయి . ఎన్నో శతాబ్దాల పాటు ఇక్కడ పర్యవేక్షణ లేదు . ఆ తరువాత చొరబాట్లకు అనేక మార్గాలు ఏర్పడ్డాయి.
వీటిని ఎదుర్కొనేందుకు గాను ఆయా ప్రదేశాల రాజ్యాధినేతలు యుద్ధాలు చేయాల్సివచ్చేది . స్వదేశీతెగల్లోని సైన్యం ప్రధాన ఆయుధాలు విల్లు , బాణాలు . ఆనాటి యుద్ధ కారణాలు చాలావరకు పరిమితంగా ఉండేవి . మనుగడ , చొరబాట్లకు సంబంధించినవే ఎక్కువ . భారతీయ రాజకీయ చరిత్రలో చెపుకోదగ్గ తొలి చొరబాటు
క్రీ.పూ.327 లో అలెగ్జాండర్ అధ్వర్యం లో గ్రీకులది.
ప్రాచీన బారతీయ సాహిత్యంలో , రాజకీయాల్లో యుద్ధాల ప్రస్తావనలు ప్రముఖం గా కనిపిస్తాయి . చంద్రగుప్త మౌర్యులు కాలంలోని సైన్యాన్ని ఈ సందర్భముగా ప్రస్తావించుకోవాలి .
ఆనాటి సైనిక చరిత్రకు ' అర్ధశాస్తం ' ఓ ప్రముఖ దర్పణం లాంటిది . కళింగ రాజుల కాలంలో యుద్ధభూమిలోకి ఏనుగులు వచ్చాయి. ఇవి 17 వ శతాబ్దిదాకా సాగాయి. మౌర్యులు కాలంలో శాంతి స్థాపన జరిగినది . గుప్తుల కాలంలో మన దేశానికి ప్రపంచ గుర్తింపు లబించినది
ఈ విదంగా రాజ్యాల రక్షణ కోసం సైన్యము , సైనిక అవసరాలు , ఆయుదాలు పెరుగుతూ వచ్చాయి . బ్రిటిష్ ఆదిపత్యం పెరిగింది ... అనేక స్వాతంత్ర్యియ సమరాల అనంతరం బ్రిటిషర్ల నుంచి స్వేచ్చ పొందిన నేటి భారత సైన్యము పరిధి భాగా పెరిగినది
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు పణంగా పెడుతూ దేశాన్ని అన్నివిధాలా కాపాడుతూ ఆ పదల్లో ఆదుకునే భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో .. వారిని గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు ను జరుపుకుంటారు.
మీ పిల్లలు ఎప్పుడు చూసినా సంగీతం ఇష్టపడుతున్నారా? డ్యాన్స్ అనగానే స్టెప్పులేస్తున్నారా? పెయింటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారా? అయితే అవి కాలయాపన కోసం మాత్రం అనుకోకండి. అవి తమ అభిరుచుల్ని వ్యక్తపరచే స్వభావాలు అని గ్రహించాలి. #KidInventorsDay 💡
పిల్లలు పిడుగుల దినోత్సవం💡🚸
పిల్లల ప్రతిభను ఎలా గుర్తుంచుకోవాలో ముందు తెలుసుకోండి!
పర్యవేక్షణ:
మొక్కై వంగనిది మానై వంగునా? అందుకే పిల్లలకు ఏదైనా చెప్తే వినే స్టేజ్‌లోనే అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చెప్పడమంటే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం కాదు. వారిని నిరంతరం పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ..
సూక్ష్మ పరిశీలన:
ఏదో కాలయాపనకోసం కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని సూక్ష్మంగా గ్రహిస్తే.. వాళ్లు ఏ దారిన నడిచేందుకు ఇష్టపడుతున్నారో.. ఏ పనులంటే ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది.
సాధారణంగా భారతీయు వంటగది సుగంధ పరిమళాలతో నిండి వుంటుంది. ఎందుకంటే మసాలా, స్పైసీ ఎక్కువగా వండుతారు. తింటారు కాబట్టి. మీరు కొత్తగా వంటగదిలోకి అడుగు పెడుతన్నా లేదా వంటల గురించి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నా ముఖ్యంగా వంటకు ఉపయోగించే వస్తువులపై అవగాహన #internationalhotandspicyfoodday
కలిగి వుండాలి. కొన్ని సాధారణంగా అందరికీ తెలిసి ఉంటాయి. అయితే మరికొన్ని స్పైసీ వస్తువులు కొంతమందికి తెలిసి ఉండవు. కాబట్టి వంటగదిలో ఎలాంటి స్పైసీ ఐటమ్స్ ను నిల్వచేసుకోవాలో తెలుసుకోవాలి. ఇండియన్ ఫుడ్ తయారు చేయడంలో వంటకు ఉపయోగించే వస్తువులు కొన్ని వందల్లో ఉన్నాయి.
కొన్ని వస్తువులు లేకుండా వంట అనేది పూర్తి కాదు. అందుకోసం ఇక్కడ కొన్ని స్పైసీ వంట దినుసులను మీకోసం తెలియ చేస్తున్నాం. అలాగే వాటి వల్ల ఉపయోగం ఏమిటి వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం...
రోడ్డు పై గుంతలు/ పాట్ హోల్స్ కొత్తేమీ కాదు, వాస్తవానికి, వాటి పేరు రోమన్ సామ్రాజ్యం యొక్క కాలంలో నిర్మించిన రోమన్ రోడ్ల నుండి వచ్చింది. ఆ రోజుల్లో రోడ్లు బంకమట్టి పేర్చి వాటి మీద కంకరతో నిర్మించబడేవి.వాటిపై మరోసారి కాల్చిన ఇటుకలతో నిర్మించేవారు. #PotHoleDay 🕳️
ఇక్కడ కుమ్మరులు(Potters) కుండల తయారీ కోసం రహదారి ఉపరితలం తెరిచి నాణ్యమైన పాటింగ్ బంకమట్టి తీసేవారు. ఆ విధంగా ఏర్పడిన గుంతలను పాట్ హోల్స్ గా పిలిచేవారు. #PotHole
చాలా వరకు రోడ్డుపై గుంత/గొయ్యి భారీ వర్షాలకు నీటి ప్రవాహం వలన ఏర్పుడుతుంది. కానీ నేడు గుంతలు ముఖ్యంగా నాణ్యత లోపం వలన చిన్నపాటి వర్షాలకు ఏర్పడుతున్నవి. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు గతుకులు/గుంతలు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.వీటి ద్వారా చాలా ప్రమాదాలు సంభవిస్తాయి.
సంక్రాంతి పండుగ రోజు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పతంగుల పండుగను ఆనందంగా గడుపుతారు. సాధారణంగా ఒక చతురస్రాకారపు కాగితం, రెండు వెదురు బద్దలు, తగినంత దారం ఉపయోగించి వినోదం కోసం గాలిలోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు పతంగి లేదా గాలిపటం (#Kite). #InternationalKitesDay
పతంగులను ఆంధ్రులు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఎగురవేస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది. గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది.
ఆకాశమే హద్దుగా వివిధ రకాల పతంగులను ఎగరేస్తూ ఇంద్రధన్సుల్లోని వర్ణాలను ఆకాశంలో నిలుపుతారు. సంక్రాంతి పండుగ రోజు పతంగులను ఎగురేసేందుకు ప్రత్యేకమైన దారాలను తయారు చేయడం, మాంజాలుగా రూపుదిద్ది పోటీల్లో పాల్గొనడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా అసమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. #HappyLohri #Lohri
ఈ పండగలను చేసుకొనే తీవ్రత మరియు విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, పండుగలో ఉన్న సారాంశం మరియు పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి.
దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా దేశం ఏదైనా, పంటకోత సందర్భంగా పండుగలు చేసుకోకపోతే అది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఎందుచేతనంటే, వ్యవసాయం చేసేవారు పంటకోత సమయంలో వారికి వచ్చే దిగుబడి మరియు రాబడికి గాను
దేశవ్యాప్తంగా పెన్షనర్లు, వారి సంఘాలు ప్రతి సంవత్సరం డిసెంబరు 17న పెన్షనర్స్ డేను నిర్వ హిస్తున్నారు. మధ్యతరగతి పెన్షనర్సు చొరవతో ప్రారంభమై ఈనాడు పరిశ్రమల పెన్షనర్లు కూడా ఈ పెన్షనర్స్ డే పాటిస్తున్నారు. 17.12. #PensionersDay #Pension
1982న మన దేశ ఉన్నత న్యాయ స్థానం పెన్షన్ అంశంపై ప్రకటించిన తీర్పే ఈ పెన్షనర్స్ డేకు మూలం. సమాజంలోని పలు రుగ్మతలకు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక కోణాల నుంచి చర్చలు జరుగుతున్నకాలమది. న్యాయ స్థానాల నుంచి కూడా పలు చారిత్రాత్మకమైన తీర్పులు వెలువడిన కాలమది.
ఉదాహరణకు 180రోజులు పూర్తిచేసిన క్యాజువల్ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, కనీస జీతమివ్వలేని యాజమాన్యాలు, కర్మాగారాలూ నడపటానికి అనర్హులన్నటువంటి తీర్పులు వచ్చిన కాలమది.
17.12.1982 తీర్పులో ఒకే పెన్షను విధానంలో వివిధ గ్రూపులుండరాదన్న అంశమేకాకుండా