#NationalStatisticsDay
📊📈➖➖➖➖➖➖➖➖
*భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు 'పి.సి.మహలనోబిస్' జయంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✳️ 🇮🇳జాతీయ గణాంక దినోత్సవం 📊✳️
★భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పి.సి.మహలనోబిస్ ప్రసిద్దిచెందారు.
*■ గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమీషన్ సభ్యుడిగా, 1949 లో కేంద్ర మంత్రి వర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు.*
*■1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపన లో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు.*
*■ 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా 'మహల నోబిస్ నమూనా 'గా
ప్రసిద్ధిగాంచింది.*
*☄బాల్యం, విద్యాభ్యాసం..*
■ 1893 జూన్ 29 న కోల్‌కత లో జన్మించిన మహలనోబిస్ పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. అతని పూర్వీకుల స్వస్థలం నేటి బంగ్లాదేశ్ ప్రాంతం. జీవనోపాధి కోసం మహలనోబిస్ తాత కోల్‌కత ప్రాంతానికి చేరి స్థిరపడ్డాడు.
*■ మహలనోబిస్ బాల్యం, విద్యాభ్యాసం కూడా కోల్‌కత లోనే కొనసాగింది. 1912 లో భౌతిక శాస్త్రం (ఆనర్స్)లో పట్టభద్రుడయ్యా డు. తర్వాత కేంబ్రిడ్జి, కింగ్స్ కళాశాలలలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం అభ్యసించాడు.*
*☄అధ్యాపకుడిగా...*
■ అభ్యసనం పూర్తి కాగానే మహలనోబిస్ కోల్ కతలోని ప్రెసిడెన్సీ కళాశాల లో భౌతిక శాస్త్రఅద్యాపకుడిగా ప్రవేశించాడు. 30 సంవత్సరాల పాటు సేవలందించి చివరగా ప్రిన్సిపాల్ గా రిటైరయ్యాడు.
*☄గణాంక శాస్త్రవేత్తగా..*
■ ప్రెసిడెన్సీ కళాశాల అద్యాపకుడిగా ఉన్నపుడే గణాంక శాస్త్రజ్ఝుడిగా ప్రసిద్ధిచెంది నాడు.
*■1950 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్అధ్యక్ష ఉపన్యాసంలో జాతీయ ప్రణాళిక విధానంలో గణాంక శాస్త్రం అంతర్భాగం అని పేర్కొన్నాడు.భారతీయ గణాంక సంస్థ
(ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్) స్థాపన లో ప్రముఖ పాత్ర వహించాడు.స్థూల జాతీయోత్పత్తి మరియు సంబంధిత ఇతర అంశాలను అంచనా వేయడం ఈ సంస్థ బాధ్యత. జాతీయాదాయ కమిటీ చైర్మెన్ గా మహలనోబిస్ జాతీయాదాయ లెక్కలకు ప్రాతిపదిక స్వరూపాన్ని రూపొందించారు.*
*★1933 లో భారత గణాంక శాస్త్ర పత్రిక సాంఖ్యప్రచురణను అతను ప్రారంభించాడు.*
*★1940' లలో శాంపిల్ సర్వే మీద అతను సాగించిన పరిశోధనల ఫలితంగా 1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపితమైంది.*
*☄ప్రణాళికా విధానకర్తగా...*
■ సోవియట్ యూనియన్ ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టు దశలో పి.సి.మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించాడు.
*■1950 లో ప్రణాళిక సంఘం స్థాపితమై నప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించాడు. 1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించ బడ్డాడు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళికరూపకల్పనలో పి.సి.మహలనోబిస్ పాత్ర అనిర్వచనీయం.
ఇది మహలనోబిస్ నమూనా గా ప్రసిద్ధి చెందినది.*
*◆ వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకర మైన ప్రమాణాలను మహలనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినాడు. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించాడు.*
*☄అవార్డులు..*
◆1944 : ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ మెడల్ పురస్కారం
◆1945 : లండన్ లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ సభ్యత్వం
◆1957 : అంతర్జాతీయ గణాంక సంస్థ గౌరవ అధ్యక్షుడిగా హోదా పొందాడు
◆1968 : భారత ప్రభుత్వము చే పద్మ విభూషణ్ పురస్కారం పొందినాడు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#SocialMediaDay2021 #SocialMediaDay#SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay #industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. #SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం. #cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.
#PVNarasimhaRao
పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. #PVNarasimhaRaoJayanthi #PVNarsimhaRao
భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా,
ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.