InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.
నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.నీళ్ల తొట్టి

మట్టితో చేసిన నీళ్లతొట్టి
గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే తొట్టి అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది.
అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే కుడితి అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడా ఈ తొట్టిని ఉపయోగించేవారు.
ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటుతో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి. ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.
పొంత
పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాశ్వతంగా వుండేటట్టు మట్టితో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని బాన లేదా దొంతి అనికూడ అంటారు.
కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.
బుడిగి
బుడిగి అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.
మన పూర్వీకులు అందరూ మట్టి పాత్రలు,మట్టి కుండ నీళ్లు త్రాగేవారు అందుకే వారు ఏ రోగాలు రాకుండానే సంపూర్ణ ఆరోగ్యంగా బతకగలిగారు..
మట్టిలోంచే సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక కారణమైనా..మట్టి వినాయకుని చేయాలంటే చెరువుల నుంచి బంకమట్టిని సేకరించాలి. ఇంటికో గంపెడు మట్టి తీయడంవల్ల, అందరూ తమకు తెలియకుండానే తలో చెయ్యివేసి, చెరువుల్లో పూడిక తీసినట్టవుతుంది.
చెరువుల్ని బాగు చేసినట్టవుతుంది.ఇదీ ఓ కారణమైనా..అసలు కారణం మరొకటి ఉంది. అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మేని నలుగు మట్టి నుంచే కదా. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకునే పూజించాలి. అప్పుడే...భక్తి..ముక్తి..శక్తి. అలాగే మట్టి వినాయకుడిని పూజించడం అంటే
మన ప్రకృతిని పూజించడంతో సమానం. మనకు జీవాన్ని, జీవితాన్ని, మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయకచవితి ద్వారా లభిస్తోంది. అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుడిని పూజించాలి. వినాయకచవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి వుంటుంది
వినాయకచవితికి ఉపయోగించే మట్టి వినాయకుడి ప్రతిమగానీ, పత్రిగానీ ప్రకృతికి ప్రతిరూపాలే. అదేవిధంగా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. వినాయకుడి బొమ్మని మట్టితోనే చేయాలని శాస్త్రం చెబుతోంది.
అయితే ఈమధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాదాపు అది విష పదార్ధంతోనే సమానం. మనకు అన్నీ ఇస్తున్న మట్టిని పూజించడం మానేసి విష పదార్ధాన్ని పూజించడం ఎంతవరకు సమంజసం? అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా
వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసే నీళ్ళు పూర్తిగా కలుషితమైపోతాయి. మట్టి వినయాకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే వుండదు. అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకీ మంచిది, పర్యావరణానికీ మంచిది.
పర్యావరణాన్ని ప్రేమించే వినాయకుడు కూడా తనను మట్టితో చేసేవారినే ఇష్టపడతాడు.
మట్టి మంచిదే..!
పిల్లలు నీళ్లలో, మట్టిలో ఆడుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. కానీ పిల్లలు కాలు కిందపెడితే చాలు తమ పిల్లలకు మట్టి అంటుతుందేమోనని తెగ భయపడిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు.
తరచూ శానిటైజర్‌లు ఉపయోగించి మరీ వాళ్ల చేతులు శుభ్రం చేసుకోమని చెబుతుంటారు. అలా అసలు మురికీ, మట్టీ అంటనివ్వకుండా వాళ్లను పెంచుదామనుకోవడం పొరబాటు అంటోంది ఓ అధ్యయనం. ఎందుకంటారా? మట్టిలో మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అది చిన్నారుల్లోని మానసిక అలజడులను అదుపులో ఉంచుతుంది.
మెదడుని ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా పిల్లలు చురుగ్గా మారతారట. ఇప్పటికే శాస్త్రవేత్తలు దానికి సంబంధించి ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో వాటికి దూరం చేయడం తప్పదు.
ముల్తానీ మట్టి.. అందం కోసం పరితపించేవారికి దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చర్మానికి మేలు చేసే ఈ మట్టి లేనిదే బ్యూటీ ప్రొడక్ట్సే లేవు. ఎలాంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన మట్టిలో ఉండే సహజ ఖనిజాలే.. చర్మానికి రక్షణ కలిగిస్తాయి

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

30 Jun
#SocialMediaDay2021
#SocialMediaDay #SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా Image
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్‌ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
Read 7 tweets
29 Jun
#WorldIndustrialDesignDay #WIDD

పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay
#industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
Read 12 tweets
29 Jun
#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం.
#SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం.
#cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
Read 24 tweets
29 Jun
Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?

Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.

Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.

మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
Read 7 tweets
29 Jun
#NationalStatisticsDay
📊📈➖➖➖➖➖➖➖➖
*భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు 'పి.సి.మహలనోబిస్' జయంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✳️ 🇮🇳జాతీయ గణాంక దినోత్సవం 📊✳️

★భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పి.సి.మహలనోబిస్ ప్రసిద్దిచెందారు.
*■ గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమీషన్ సభ్యుడిగా, 1949 లో కేంద్ర మంత్రి వర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు.*
*■1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపన లో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు.*

*■ 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా 'మహల నోబిస్ నమూనా 'గా
Read 13 tweets
28 Jun
#PVNarasimhaRao
పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత.
#PVNarasimhaRaoJayanthi
#PVNarsimhaRao
భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా,
ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(