#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. #SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం. #cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
ప్రవేశించే అవకాశం కల్పించబడి ఉంటుంది. ఈ రంధ్రానికి వ్యతిరేక దిశలో చిత్రాన్ని భద్రపరచడానికి కావలసిన వస్తువులు ఉంటాయి. కెమెరాకు ఉండే రంధ్రానికి ముందు చాలా కెమెరాలకు కటకాలు అమర్చబడి ఉంటాయి. కటకం తరువాత ఒక డయాఫ్రమ్ ఉంటుంది, దీని ద్వారా రంధ్రం యొక్క పరిమాణాన్ని మార్చగలుగుతారు.
కొన్ని కెమెరాలకి స్థిరమైన సూక్ష్మరంధ్రం ఉంటుంది. ఫోటోని నిక్షిప్తం చేయటానికి పూర్వపు కెమెరాలు ఫోటోగ్రఫిక్ ఫిలింను వాడగా, డిజిటల్ విప్లవం తర్వాత వస్తూ ఉన్న ప్రస్తుత కెమెరాలు వైద్యుత ఇమేజ్ సెన్సర్లు ఫ్లాష్ మెమరీ పద్ధతిని అవలంబించి నిక్షిప్త పరుస్తున్నాయి.
ఒక స్టిల్ కెమెరా ఒకసారి షట్టర్ బటన్ నొక్కితే ఒక చిత్రాన్ని తీయగా (కంటిన్యువస్ మోడ్ లో లేనప్పుడు) ఒకే ఫోటోని తీయగా, ఒక సినిమా కెమెరా ఒక సెకనుకి 24 ఫ్రేముల చొప్పున రికార్డు చేస్తుంది.
డబ్బా కెమెరాలనుంచి.. డిజిటల్ స్పీడ్ దాకా...
ఫోటోగ్రఫిక్ కెమెరాలకి ముందు కెమెరా అబ్స్క్యూరాల పై చాలా పరిశోధన జరిగింది. క్రీ.పూ ఐదవ శతాబ్దంలోనే చైనీసు తత్త్వవేత్త అయిన మో టీ ఒక సూదిబెజ్జం ద్వారా కాంతి ప్రయాణించి చీకటి ప్రదేశం లోకి ప్రవేశించినపుడు తలక్రిందులైన,
స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచటం గమనించాడు. ఈ ప్రక్రియని అవలంబించిన మొట్టమొదటి వ్యక్తీ మో టీ నే. అయితే ఈ సిద్ధాంతాన్ని గురించి క్రీ.పూ నాల్గవ శతాబ్దంలోనే అరిస్టాటిల్ ప్రస్తావించాడు. క్రీ.పూ 330వ సంవత్సరంలో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చెట్టుకి ఉన్న ఆకుల మధ్యన ఉన్న
ఖాళీల గుండా సూర్యుని ప్రతిబింబం ఏర్పడటం వివరించాడు. పదవ శతాబ్దంలో అరబ్బీ పండితుడు అయిన ఇబ్న్ అల్-హైతం (అల్ హసన్) కూడా సూదిబెజ్జం ద్వారా పయనించిన సూర్యగ్రహణాన్ని గమనించి సూదిబెజ్జం యొక్క పరిమాణాన్ని తగ్గించటం ద్వారా ప్రతిబింబంలో స్పష్టత తీసుకురావచ్చని వివరించాడు.
ఆంగ్ల తత్త్వవేత్త రోజర్ బేకాన్ ఈ ఆప్టికల్ సిద్ధాంతాల గురించి పర్స్పెక్టివా అనబడు గ్రంథములో 1267లో రచించాడు. పదిహేనవ శతాబ్దం నాటికి కళాకారులు, శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియని తమ పరిశోధనలలో వాడటం ప్రారంభించారు. ఒక వైపు గోడకి సూదిబెజ్జం చేసిన ఒక చీకటి
గదిలోనికి ఒక మనిషి ప్రవేశించి ఎదురుగా ఉండే గోడపై ఏర్పడే తలక్రిందులైన ప్రతిబింబాన్ని గమనించే వారు. ల్యాటిన్ లో చీకటి గదులని కెమెరా అబ్స్క్యూరా అంటారు.
కెమెరా అబ్స్క్యూరా అని మొట్టమొదట సంబోధించినది గణిత, నక్షత్ర శాస్త్రజ్ఞడు అయిన జోహెన్నెస్ కెప్లర్. 1604 లో తన అడ్ విటెల్లియోనెం ప్యారాలిపోమెనాలో ఈ సంబోధన జరిగింది. దీనికి ఒక కటకాన్ని చేర్చి ఈ ఉపకరణాన్ని ఒక గుడారంలో నిర్మించటంతో దీనిని కావలసిన చోటుకి తీసుకెళ్ళే సౌలభ్యము కలిగినది.
1660 లలో బ్రిటీషు శాస్త్రవేత్త రాబర్ట్ బోయిల్, అతని సహాయకుడు అయిన రాబర్ట్ హుక్లు చేతిలో ఇమిడే కెమెరా అబ్స్క్యూరాని తయారు చేశారు.
వాడుకకి అనువుగా చేతిలో ఇమిడే చిత్రపటాలను రూపొందించేందుకు వీలుపడే కెమెరాని మొట్టమొదట 1685లో జోహాన్ జాహ్న్ రూపొందించాడు. నిల్వ ఉంచే దారి లేకపోవటంతో అప్పట్లో ఏర్పడిన ప్రతిబింబాన్ని చిత్రపటంగా మరల గీసేవారు. అయితే సూర్యరశ్మి సోకినచో రంగులు వెలిసిపోవటం లేదా రంగులు ముదరటం అప్పటికే
మానవాళికి తెలుసు. కెమెరా అబ్స్క్యూరాలో కాంతి తాత్కాలితంగా గీసే ఈ చిత్రలేఖనాలతో ప్రేరణ చెందిన చాలామంది ప్రయోగకర్తలు వీటిని శాశ్వతంగా ముద్రించటానికి కావలసిన పదార్థాలని కనుగొనే ప్రయత్నంలో పడ్డారు.
ఫొటోగ్రఫీకి ప్రాణమైన కెమెరాలు మొదట్లో చాలా పెద్దసైజులో డబ్బా అంత ఉండేవి. ఆ పరికరాల ధర తక్కువే అయినా మానవ కృషి, నైపుణ్యంపైనే ఫొటోగ్రఫీ ఆధారపడి ఉండేది. మొదట్లో ఎయిమ్ ఆండ్ షూట్ కెమెరాలు వాడుకలో ఉండేవి. ఇవి ఆకారంలో పెద్దగా ఉన్నా కొద్ది దూరంలోని వస్తువులనే కెమెరాలో బంధించగలిగేవి.
తర్వాత ఫీల్డ్ కెమెరాలు వచ్చా యి. ఇవే నల్లగుడ్డతో ముసుగు వేసుకొని ఫొటో తీసే కెమెరాలు. కేవలం రెండు ఫిల్ములు మాత్రమే ఉండి, అవి కూడా పల కలంత సైజులో ఉండటం వల్ల కేవలం రెండు ఫొటోలు మాత్రమే తీసేందుకు వీలుండేది. దీనివల్ల మోతబరువు తప్ప ఫొటోల నాణ్య త కూడా అంతంత మాత్రంగానే ఉండేది.
ఆ తర్వాత టీఎల్‌ఆర్ (ట్వి న్‌లెన్స్ రిఫ్లెక్టర్) కెమెరాలు వచ్చాయి. మెడలో కెమెరా వేసు కొని కిందికి చూస్తూ ఫొటోలు తీసే వారు. ఎస్‌ఎల్‌ఆర్ (సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్) కెమెరాలు వచ్చిన తర్వాత 35 ఫొటోలు తీసే సామ ర్థ్యం వచ్చింది.ఇందులో లెన్స్ మార్చుకునే సదుపాయమూ వచ్చిం ది.
1920లలో కనుగొన్న ఎలెక్ట్రానిక్ వీడియో కెమెరా ట్యూబ్ అనేక అభివృద్ధులకు దారి తీసి 21వ శతాబ్దపు ఆరంభం నాటికి ఫిలిం కెమెరాల స్థానం డిజిటల్ కెమెరాలు ఆక్రమించేలా చేసింది.
ఆ తర్వాత డిజిటల్ కెమెరాల రాకతో ఫొటోగ్రఫీకి నిర్వచనమే మారిపోయింది. చిన్న సైజు మెమొరీ కార్డుతో వందలాది ఫొటోలు తీసే సామర్థ్యం, స్పష్టమైన రంగు ల్లో అద్భుతమైన ఫొటోలు తీసే నైపుణ్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ay
వైడ్, టెలి లెన్స్ రెండింటికీ డిజిటల్ టెక్నాలజీ జో డించి ఛాయాచిత్రాలను నిమిషాల్లో అంద జేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. డిజిటల్ సాంకేతిక విప్లవం ఫలితంగా ఇప్పుడది సెల్‌ఫోన్‌లో ఒదిగిన కెమరాలు, పాకెట్ కెమెరాల రూపాల్లో సామాన్యుడి చేతిలో ఇమిడిపోతోంది. #NationalCameraD
డేగకన్నులాంటి సీసీకెమెరా
కాపలాకి నిఘానేత్రమేయది
ఆఫీసుల్లోనూ, షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ
హోటల్స్ లోనూ, హాస్పిటల్స్ లోనూ
రోడ్ల కూడల్లో, గుళ్ళల్లో ,ఇళ్లల్లో
ఎక్కడ చూసినా కన్ను తెరిచే చూస్తుంది
చూసి చూసి తనలో జీర్ణించుకున్న నిజాల్ని
బట్టబయలు చేస్తూ... #cctvfootage
#DoctorsDay 🥼⚕️👨⚕️👩⚕️🏥💊🚑
శుశృతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. #NationalDoctorsDay@dravsreddy
ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.
అత్యవసర మైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు.
#MeteorWatchDay 🌠☄️
ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి మినుకు మినుకు మంటూ వేలాది చుక్కలు మనకు దర్శనమిస్తాయి. కొన్ని సార్లు ఈ చుక్కలు నేలమీదికి రాలుతున్నట్లు కనిపిస్తాయి. అవి జారిపడేటప్పుడు ఒక వెలుతురు చారను వెనక్కు వదులుతున్నట్లు కనిపిస్తుంది.
ఇలా వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుండి రాలేవి నక్షత్రాలు కాదు ఉల్కలు. ఉల్కలు పగలూ, రాత్రీ రాలుతుంటాయి. కాని రాత్రిపూట మాత్రమే మనకు కనిపిస్తాయి.ఉల్క రాలుతుంటే మనం మనసులో ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అనే మూఢ నమ్మకం కూడా ఉంది. ఇలా ఏదైనా కోరుకున్నది జరిగితే అది కాకతాలీయమే.
#SocialMediaDay2021 #SocialMediaDay#SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay #industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.