Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
రైళ్లలో ప్రతి అంశానికీ, ప్రతి సైన్ బోర్డుకూ, ప్రతీ వస్తువుకూ ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది. ప్రయాణికులకు ఇలాంటి ఆలోచించే తీరిక ఉండదు. ఎవరి బిజీలో వారు ఉంటారు. ఐతే... కొన్ని విషయాలు తెలుసుకుంటే... ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. రైళ్ల కోచ్‌లకు ఉండే గ్రీన్, ఎల్లో, వైట్ గీతలు అలాంటివే.
వాటికి ప్రత్యేక గుర్తు ఉంది.
ఇండియాలో ఎక్స్‌ప్రెస్, హైస్పీడ్ రైళ్లకు బ్లూ కలర్ ఉంటుంది. ఈ రైళ్లకు ఉండే విండోలపై కనిపించే వైట్ లైన్ అర్థం... ఆ కోచ్‌లు రిజర్వ్ కాని కోచ్‌లు అని అర్థం. అందువల్ల ఆ కోచ్‌లలో ప్రయాణికులు ఎవరైనా కూర్చోవచ్చు.
పసుపు రంగు గీతలు ఉంటే... అది ప్రత్యేకమైన కోచ్ అని అర్థం. దాన్ని దివ్యాంగులు, అనారోగ్యంతో ఉండేవారి కోసం కేటాయించారని అర్థం.
అదే విధంగా గ్రీన్, బ్లాక్ లైన్స్ గనక ఉంటే... ఆ కోచ్‌లు ప్రత్యేకంగా మహిళల కోసం అని అర్థం. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు...
కోచ్ ఎక్కక ముందే అది ఏ కోచో తెలుసుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వేస్ ఈ గీతల విధానం తెచ్చింది. కానీ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందువల్ల చాలా మంది వాటిని పట్టించుకోకుండానే ప్రయాణిస్తున్నారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#DoctorsDay 🥼⚕️👨⚕️👩⚕️🏥💊🚑
శుశృతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. #NationalDoctorsDay@dravsreddy
ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.
అత్యవసర మైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు.
#MeteorWatchDay 🌠☄️
ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి మినుకు మినుకు మంటూ వేలాది చుక్కలు మనకు దర్శనమిస్తాయి. కొన్ని సార్లు ఈ చుక్కలు నేలమీదికి రాలుతున్నట్లు కనిపిస్తాయి. అవి జారిపడేటప్పుడు ఒక వెలుతురు చారను వెనక్కు వదులుతున్నట్లు కనిపిస్తుంది.
ఇలా వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుండి రాలేవి నక్షత్రాలు కాదు ఉల్కలు. ఉల్కలు పగలూ, రాత్రీ రాలుతుంటాయి. కాని రాత్రిపూట మాత్రమే మనకు కనిపిస్తాయి.ఉల్క రాలుతుంటే మనం మనసులో ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అనే మూఢ నమ్మకం కూడా ఉంది. ఇలా ఏదైనా కోరుకున్నది జరిగితే అది కాకతాలీయమే.
#SocialMediaDay2021 #SocialMediaDay#SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay #industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. #SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం. #cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.