#DoctorsDay 🥼⚕️👨⚕️👩⚕️🏥💊🚑
శుశృతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. #NationalDoctorsDay@dravsreddy
ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.
అత్యవసర మైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు.
అర్థరాత్రివేళ సుశ్రుతుడు నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రొదిస్తూ కనిపించాడు. అతడి ముక్కు విరిగి వుండడం సుశ్రుతుడు గమనించాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకు వెళ్ళాడు.
ఆరోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు. మూలికా రసంతో అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర (మధ్యం) ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగా, వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు, సూదులతో చికిత్స ప్రారంభించాడు.
ఒక ఆకుతో అతని ముక్కును కొలిచారు. అతి చిన్నది, పదునైన కత్తిని వేడిచేసి, దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు.
దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చారు. ముక్కు ఆకారాన్ని సరిచేసి, బియ్యపు పిండిని అద్ది, చందనపు (గంధం) పట్తు వేసారు. దానిమీద బూరుగు దూదిని పెట్టి, ఔషధ నూనెను పోసి, చక్కగా కట్టు కట్టారు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది.
రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో ఏయే మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు.
ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంతభాగం తీసి తెగిన చోట అమర్చి పుర్వ రూపానికి తీసుకువావడమే ప్లాస్టిక్ సర్జరీ! ప్లాస్టిక్ సర్జరీలో, రైనోప్లాస్టీ (ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం) మీద
ప్రఖ్యాతి చెందిన, సాధికార గ్రంథం "సుశ్రుత సంహిత" రాసాడు.
ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతి సున్నితమైన శరీరభాగాల నుండి చర్మాన్ని వేరుచేసి కొత్త చర్మంతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం,
పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశ్రుత మహర్షి తన "సుశ్రుత సంహిత" గ్రంథంలో!
పాశ్చాత్య అల్లోపతీ విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి, ఆధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరుపు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి.
క్షార సూత్రం చికిత్స ఫిస్టులా వ్యాధికి ఉద్దేశించారు. ఈ వ్యాధిని భగందరం, లూటీ వ్యాధి, రాచపుండు మొ. పేర్లతో పిలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్రంలో "ఫిస్టులా ఇన్ ఆనో"గా పేర్కొంటారు. ఫిస్టులాను క్షారములుగా విభజించారు. క్షార సూత్ర చికిత్స ఫిస్టులా వ్యాధికేకాక అర్స మొలలు (పైల్స్),
నాడీ వ్రణం మొ. వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో విశదీకరించారు.
ముందుగా దారమును తీసుకొని దానికి 21 సార్లు క్షారయుక్తమైన ఔషధాలతొ సమ్మిళితం చేస్తారు. దీనిఏ క్షార సూత్రమని అంటారు. దినిని ఉపయోగించి అయిదారు వారాలలో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు. రక్తస్రావం లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు.
మధుమేహ రోగులకు, రక్త పోటు ఉన్నవారికి కూడా ఈ క్షార సూత్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.
భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం Doctors day జూలై 1 న జరుపుకుంటారు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (1882 జూలై 1 - 1962 జూలై 1) జయంతి (మరియు వర్ధంతి) అయిన జూలై ఒకటవ తేదీని భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1, 1882 న జన్మించాడు 1962 లో అదే తేదీన మరణించాడు.మరియు 80 సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 4, 1961లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది. #NationalDoctorsDay
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#MeteorWatchDay 🌠☄️
ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి మినుకు మినుకు మంటూ వేలాది చుక్కలు మనకు దర్శనమిస్తాయి. కొన్ని సార్లు ఈ చుక్కలు నేలమీదికి రాలుతున్నట్లు కనిపిస్తాయి. అవి జారిపడేటప్పుడు ఒక వెలుతురు చారను వెనక్కు వదులుతున్నట్లు కనిపిస్తుంది.
ఇలా వెలుగులు విరజిమ్ముతూ ఆకాశం నుండి రాలేవి నక్షత్రాలు కాదు ఉల్కలు. ఉల్కలు పగలూ, రాత్రీ రాలుతుంటాయి. కాని రాత్రిపూట మాత్రమే మనకు కనిపిస్తాయి.ఉల్క రాలుతుంటే మనం మనసులో ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అనే మూఢ నమ్మకం కూడా ఉంది. ఇలా ఏదైనా కోరుకున్నది జరిగితే అది కాకతాలీయమే.
#SocialMediaDay2021 #SocialMediaDay#SocialMedia
సోషల్ మీడియా లేదా సామాజిక మాధ్యమం అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్ మరియు నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను, మరియు చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి, లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా
కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణాలు.సామాజిక మాధ్యమం ప్రజల చేతిలో ఆయుధం.మంచి-చెడు, ఆనందం-విషాదం, ఉద్యమం-ఉద్వేగం, కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదికవుతోంది సోషల్ మీడియా. ప్రపంచ గమనంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పౌరులు వారి అభిప్రాయాలకు సామాజిక మాద్యమం వేదికగా మారాయి. సామాజిక మాద్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి.
పారిశ్రామిక రూపకల్పన దినోత్సవం జూన్ 29న ప్రపంచ రూపకల్పన సంస్థ స్థాపనకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం.సంస్థ యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా 2007 లో ప్రారంభించారు. #IndustrialDesignDay #industrialdesign
పారిశ్రామిక రూపకల్పన ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను భారీ వస్తువుల ఉత్పత్తికి తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఉత్పత్తి కన్నా ముందే రూపకల్పన ప్రక్రియ మొదలవుతుంది, వస్తువు రూపం, లక్షణాలు, ముందుగా నిర్వచించి దానికి కంప్యూటరీకరణ చెయ్యాలి.
అన్ని ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా రూపకల్పన పర్యావసానమే. ఇది వ్యక్తిగతంగానూ, సమూహములోను చెయ్యవచ్చు. సమూహములో చెయ్యడం వలన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల జ్ఞానము, విజ్ఞానము ఉపయోగించవచ్చు ఉదాహరణ గా పారిశ్రామిక రంగంలో రూపకర్తలు, ఇంజనీర్లు , వ్యాపార రంగంలో నైపుణ్యంకు
#WorldCameraDay
📷📸🤳📹🎥🎦📹
కెమెరా (ఆంగ్లం: #Camera) అనగా స్థిర చిత్రాలను లేదా అలాంటి స్థిర చిత్రాల క్రమాన్ని చలన చిత్రంగా గాని, వీడియోలుగా గాని తీయడానికి ఉపయోగపడే ఒక వైద్యుత (ఎలక్ట్రానిక్) పరికరం. #SmilePlease 🙂
ఈ పదం లాటిన్ భాషలోని కెమెరా అబ్స్క్యురా (camera obscura) అనే పదం నుండి ఆవిర్భవించింది. కెమెరా అబ్స్క్యురా అనగా చీకటి గది అని అర్థం. ప్రారంభ దశలో మొత్తం గదిని చిత్రాలను తీయడానికి వాడేవారు.ఈనాడు మనం చూస్తున్న అత్యాధునిక కెమెరాలకి కెమెరా అబ్స్క్యూరా నే మూలం. #cameraday
కెమెరాలు మామూలు కాంతి (సాధారణ కంటికి కనిపించే వర్ణాలు) లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణము (Electromagnet radiation) ను ఉపయోగించి పనిచేస్తాయి. కెమెరాలో సాధారణంగా ఒక మూసి ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానికి ఒక వైపున ఒక సూక్ష్మరంధ్రం ద్వారా కాంతి ఆ ఖాళీలోకి
Indian Railways: రైళ్ల కోచ్‌లకు పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Indian Railways: మనందరం ట్రైన్స్ ఎక్కుతాం, దిగుతాం... కానీ... వాటిపై ఉండే పసుపు, తెలుపు గీతలను పట్టించుకోం.
Indian Railways: 1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి.
మొదటి రైలు... ముంబై నుంచి థానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం కానీ... ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు.
ఇందుకు ప్రత్యేక కారణం ఉంది.
మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చులో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్... ఆసియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్, ప్రపంచంలో రెండో అతి పెద్దది.
InternationalMudDay
నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు.రైతు జీవితమంతా మట్టితో పెనవేసుకునే వుంటుంది. మట్టిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. 'మట్టితో, పంటలతో అనుబంధమున్న రైతు నడుస్తుంటే, బాటకిరువైపులా పంట చేలు మన తోటే కదులుతూ
సంగీత సవ్వడులు చేస్తున్నాయి' అంటాడో కవి.మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు.బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను మృణ్మయ పాత్రలు అంటారు. వీటిని చేయడాన్ని కుమ్మరం అంటారు.
గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు
కూజ .ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి.