ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ "అఖిల భారతీయ విద్యార్థి పరిషత్" ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #NationalStudentsDay

ఏబీవీపీ అనే నాలుగు అక్షరాలు తెలియని విద్యార్థి కళాశాల క్యాంప స్‌లో ఉండడు.
@ABVPVoice @Abvp_Andhra @ABVPTelangana #StudentsDay
#NationalStudentDay #youth Image
73 ఏళ్ళుగా విద్యార్థి లోకంతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండటమే దీనికి కారణం. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై, నేడు దేశంలో 33 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. Image
ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (#ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ కూడా.
ఈ కారణంగానే ఎక్కడైతే విద్యార్థి పరిషత్ అడుగిడిందో అక్కడి వారిలో జాతీయ భావం ప్రబలంగా పెరిగింది. అంతేకాక అంతర్జాతీయ మరియు దేశానికి విఘాతం కలిగించే సమూహాల మాయాజాలం సమాప్తం కావడం ప్రారంభమైంది. Image
ఈరోజు జమ్మూకాశ్మీర్ లోని పూంచ్, రాజౌరీ, కిష్ త్ వాడ్ (దోడా) మొదలైన తీవ్రవాద ప్రభావిత క్షేత్రాలలో పరిషత్ క్రియాశీలంగా ఉందంటే కారణం అది అక్కడ ఉన్న యువకుల మనస్సులో దేశం ఐకమత్యంగా ఉండాలనే సంకల్ప సంఘటిత శక్తియే కారణం.
పరిషత్ 1990లో శ్రీనగర్ లో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగితే దానికి జవాబుగా “ఎక్కడైతే త్రివర్ణ పతాకానికి అవమానం జరిగిందో, అక్కడే దానికి సన్మానం చేస్తాం” అని నినదించింది.
నిర్వాసితులైన విద్యార్థినీ, విద్యార్థులను పరిషత్ దేశం నలుమూలలకు పంపి తమకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థుల ముందుంచడానికి అవకాశం ఇవ్వడంతో, వారి బాధాపూరితమైన గాథలు విన్న విద్యార్థులు ఆక్రోషితులై ఐకమత్యంతో వారికి అండగా నిలబడి దేశవ్యాప్తంగా ఆందోళనలు, జన జాగరణలు నిర్వహించి
ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడితెచ్చారు. 11 సెప్టెంబర్ 1990లో జరిగిన చారిత్రాత్మకమైన ర్యాలీ, తీవ్రవాద ప్రాబల్యం ఉన్నా, దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది విద్యార్థులు శ్రీనగర్ వైపు దూసుకొని పోయారు.
1965లో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అరుణాచల్ ప్రదేశ్ వెళ్లారు. దూర ప్రాంతానికి వెళ్లడం, అనేక కష్టాలను ఎదుర్కోవడంతో పాటు మానసికంగా కూడా అక్కడి ప్రజలతో కలవడానికి కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడి ప్రజలు కూడా ఇక్కడ నుండి వెళ్లిన వారితో త్వరగా పరిచయాలు ఏర్పరచుకోలేకపోయారు.
కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దీనిని ఎలాగైనా పరిష్కరించాలనుకొని తలంపుతో అంతర్జాతీయ ఛాత్ర్ జీవన్ దర్శన్ ( SEIL ) ప్రకల్పాన్ని ప్రారంభించారు.
దీనిలో భాగంగా 1966 నుండి అక్కడి నుండి విద్యార్థులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సాంస్కృతిక ఐక్యతను అనుభవిస్తూ భావాత్మకంగా లీనం చెందారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నది. చైనా నిరంతరం అరుణాచల్ ప్రదేశ్ పై
వివాదాలు చేస్తూ అక్కడి యువకులను ప్రలోభానికి గురిచేస్తూ వారిని భ్రమలోకి నెడుతూ భారత్ వ్యతిరేకులుగా తయారు చేయాలని సంకల్పించినప్పుడు, విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్న ఛాత్ర్ జీవన్ దర్శన్ ( SEIL ) ప్రేరణతో అక్కడి విద్యార్థులు భారత్ కు వ్యతిరేకంగా గలమెత్తలేకపోయారు.
SEIL నిర్వహిస్తున్న మహత్వపూర్ణమైన భూమిక కారణంగానే ఇది సాధ్యపడింది.

విద్యార్థి పరిషత్ పని అండమాన్, నికోబార్ మరియు లోహలో కూడా ఉంది. ఇది జాతీయ ఐక్యతను పెంపొందిస్తుంది. విద్యార్థి పరిషత్ యొక్క ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా దేశానికి విఘాతం కలిగించే శక్తులకు స్థానం లేకుండా పోయింది.
నేడు సిక్కిం విద్యార్థులలో పరిషత్ యొక్క పనుల ప్రభావం నిరంతరం పెరుగుతున్నది. దీంతో పొరుగునే ఉన్న నేపాల్ లోని మావోయిస్టుల అనుకూల ప్రభావం వారిపై పడడం అసంభవంగా మారింది.
విద్యార్థి పరిషత్ నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషించారు. విద్యార్థి పరిషత్ నేతృత్వంలో అనేక విద్యార్థి ఆందోళనలు రోజుల్లో నిర్వహించబడ్డాయి. ఎంతోమంది పరిషత్ కార్యకర్తలు లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు, పోలీస్ చర్యలను
ఎదుర్కొన్నారు. ఈ విధంగానే జార్ఖండ్ మరియు తెలంగాణలో జరిగిన ఆందోళనలో పరిషత్ కార్యకర్తల క్రియాశీల భాగస్వామ్యం కారణంగా హింసావాదులైన నక్సల్స్ మరియు విఘటనకారీ శక్తుల చేతుల్లోకి ఈ ఉద్యమాలు వెళ్లకుండా కాపాడపడ్డాయి.
జాతీయ సమస్యలపై ఆందోళనలు చేస్తూనే సకారాత్మకమైన దేశభక్తి భావాన్ని జాగృతం చేయడంలో పరిషత్ ఎన్నో వ్యయప్రయాసలను అనుభవించింది.

వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా, డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సమరసతా దినంగా ప్రతి సంవత్సరం వేలాది విద్యాలయాలలో విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్నది.
ఇవే కాకుండా భగత్ సింగ్, సావార్కర్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎందరో మహా పురుషుల ఆలోచనధారపై సాహిత్యాన్ని తయారు చేసి విద్యార్థులలో వాటిని ప్రచారం చేస్తూ అనేక కార్యక్రమాలు, స్పర్ధలు నిర్వహిస్తూ వారిని పరిషత్ కార్యంలో భాగస్వాములను చేస్తున్నది.
1857 స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన మహత్వపూర్వమైన స్మృతులను 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిషత్ ఆనాటి వీరోచిత గాథలతో సాహిత్యాన్ని ముద్రించి ప్రచారం కోసం గాను దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించింది. వందేమాతరం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వందలాది మహా
విద్యాలయాలలో స్వాతంత్య్ర సముపార్జన కోసం జరిగిన గౌరవపూర్వకమైన గాధలను వివరించడం జరిగింది. అంతేగాక సామూహికంగా వందేమాతరం గీతాన్ని భవ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పాడించడం జరిగింది.
జాతీయ స్వాభిమానం లాంటి అనేక విషయాలపై పరిషత్ జనజాగరణ మరియు సంఘర్షణల మాధ్యమంగా పలు తరాలను దేశభక్తులుగా చేసే అమూల్యమైన కార్యాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నది.

(జూలై 9 – జాతీయ విద్యార్థి దినోత్సవం) Image
40 దేశాలల్లో ఏబీవీపీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. దీని ఆవిర్భావ దినోత్సవాన్ని ‘జాతీయ విద్యార్థి దినోత్సవం’గా దేశమంతటా నిర్వహించడం సంతోషకరం.
జాతీ పునర్నిర్మాణంలో తమ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విద్యార్థులకు మరియు యువకులందరికీ "జాతీయ విద్యార్థి దినోత్సవం" సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🚩🚩🚩

మీ
H.పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

11 Jul
#KalidasDivas #KalidasJayanti
కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించారు.
#Kalidas Image
రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు. Image
కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి. ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు. ఐదవ శతాబ్ది వారని అనుకుంటారు.
Read 24 tweets
10 Jul
#DontStepOnABeeDay
#BeeFriendly 🐝🍯
భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత
ముఖ్యమైన, విలువైన జీవి 'తేనెటీగ' అని రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్దారించారు.ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని ప్రకటించారు. Image
ఇటీవలి అధ్యయనాలు దాదాపుగా 90% తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించాయని తెలిపారు. అడవుల నరికివేత, గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం, పురుగు మందుల వాడకం, నేలల్లో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్టు వెల్లడించారు. ImageImageImageImage
వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్‌ సహకారంతో అపికల్పర్‌ ఎంట్రపెన్యూర్‌షిప్‌ సెంటర్‌ ఆఫ్‌ యూనివర్సదద్‌,అపికల్చర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ చిలే సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తేనెటీగల గురించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్దారించింది. ఈ భూగోళంపై ఉన్న జీవ జాతుల్లో కేవలం తేనెటీగలు మాత్రమే.. ImageImageImageImage
Read 9 tweets
10 Jul
#GlobalEnergyIndependenceDay
స్థిరమైన మరియు పరిశుభ్రమైన శక్తి ఉత్పాదనకోసం సౌరశక్తి, గాలి, మొక్కలు, నీరు వంటి తరగని ప్రాకృతిక వనరులను పునర్వినియోగ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలు:
#GlobalEnergy
♻️🌀🌊☢️🌞 Image
♻️గ్రీన్ హౌస్ వాయు రహితంగా మరియు వాయు కాలుష్యం తగ్గిస్తూ ఇంధన ఉత్పాదన.
♻️ ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని ఇంధన వైవిధ్యం తగ్గిస్తుంది.
♻️ఆర్థిక అభివృద్ధి మరియు మ్యాన్ఫ్యాక్చరింగ్, ఇనస్టలేషన్ ఇతరత్రా ఉద్యోగాలు.

పునర్వినియోగ ఇంధన వనరులు Image
🌞సౌరశక్తి అనేది సూర్య కాంతిని వినియోగించుకుని చేసే విద్యుచ్ఛక్తి. దీనిని వేడి పుట్టించడానికి, నీళ్లను మరిగించడానికి, చల్లబరచడానికి వాడవచ్చు. ఇంకా పలు విధాలైన వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. Image
Read 11 tweets
10 Jul
నికోలా టెస్లా (ఆంగ్లం : #NikolaTesla #Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఒక ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్, తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు. Image
ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా మరియు ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు.19వ శతాబ్దాంతంలో మరియు 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్ మరియు అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త. Image
నికోలా టెస్లా పేటెంట్లు మరియు పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.
1894లో వైర్‌లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో Image
Read 4 tweets
9 Jul
#KebabDay #kebab #kabab
కబాబ్ అంటే గతంలో మటన్‌తో చేసేది అని అర్థం. ఇప్పుడు చికెన్ కబాబ్... ప్రాన్స్ కబాబ్ అని రకరకాల కబాబులు రెడీ అయిపోతున్నాయి. పూర్తి స్థాయి వంట చేసుకోవడానికి వీల్లేని రోజుల్లో సైనికులు మాంసాన్ని ఎండబెట్టి దాచుకొని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు. Image
ఈ ఎండు మాంసమే కబాబ్ మారింది. ఇప్పుడు ఇన్‌స్టాంట్ కబాబులు వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా కాకపోయినా కబాబ్‌లకు రాచరికపు హోదా దక్కింది. కబాబ్‌లు వడ్డించారంటే అదో పెద్ద హోదా కిందే ఇప్పటికీ. కబాబ్ ను ఏ సందర్భంలోనైనా తయారు చేసుకోవచ్చు. ImageImageImageImage
ముఖ్యంగా వర్షాకాలంలో వేజిటేరియన్ స్నాక్స్ తో పాటు, కబాబ్ లు కూడా చాలా ప్రసిద్ధి. వర్షాకాలంలో నోటికి రుచికరంగా వేడి వేడిగా కబాబ్ తింటే ఎలా ఉంటుంది. చాలా మందికి మాంసాహార ప్రియులు కబాబ్ లను ఇష్టపడుతారు.

అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు. ImageImageImageImage
Read 12 tweets
9 Jul
సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 1938 – 6 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. వీరు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. వీరు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి Image
ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.
సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించబడేవాడు)
#Sholay #SanjeevKumar
వీరు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం సూరత్‌లో గడచింది.తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది.
అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందారు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డారు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు.షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నయాదిన్ నయీరాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించారు.
Read 8 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(