#DontStepOnABeeDay #BeeFriendly 🐝🍯
భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత
ముఖ్యమైన, విలువైన జీవి 'తేనెటీగ' అని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్దారించారు.ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని ప్రకటించారు.
ఇటీవలి అధ్యయనాలు దాదాపుగా 90% తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించాయని తెలిపారు. అడవుల నరికివేత, గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం, పురుగు మందుల వాడకం, నేలల్లో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్టు వెల్లడించారు.
వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్ సహకారంతో అపికల్పర్ ఎంట్రపెన్యూర్‌షిప్ సెంటర్ ఆఫ్ యూనివర్సదద్,అపికల్చర్ కార్పోరేషన్ ఆఫ్ చిలే సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తేనెటీగల గురించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్దారించింది. ఈ భూగోళంపై ఉన్న జీవ జాతుల్లో కేవలం తేనెటీగలు మాత్రమే..
రోగాలను వ్యాప్తి చేయని జీవులని నిర్దారించారు.ఫంగస్,బాక్టీరియా,వైరస్ వంటి వాటిని తేనెటీగలు వ్యాప్తి చెందించవని అధ్యయనంలో వెల్లడైంది. #bee
తేనెటీగల వల్ల కేవలం తేనె మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
మనం పండిస్తున్న 100 పంటల్లో దాదాపు 70 రకాలు తేనెటీగల వల్లే పరాగసంసర్కం జరిగి ఫలదీకరణం చెందుతాయని చెబుతున్నారు తేనెటీగలు అంతరించిపోతే.. సమస్త జీవ జాతులకు భవిష్యత్‌ల్తో తిండి దొరకడం కష్టమంటున్నారు.
ప్రఖ్యాత శాస్తువేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రకారం.. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు బతికేది కేవలం నాలుగేళ్లు మాత్రమే అని చెప్పారు.దీన్నిబట్టి మానవ మనుగడ తేనెటీగలతో ఎంతలా ముడిపడి ఉందో అర్ధం చేసుకోవచ్చు.
స్విట్టర్లాండ్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలిపిన వివరాల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడం కూడా తేనెటీగలు అంతరించడానికి ఒక కారణంగా తెలిపారు.సెల్‌ఫోన్ సిగ్నల్స్ తరంగాల కారణంగా తేనెటీగలు అయోమయానికి గురవుతాయని..
తద్వారా అవి తమ దారిని మరిచిపోయి... అంతిమంగా వాటి జీవితం ప్రమాదంలో పడిపోతుందని వెల్లడించారు. అడవుల నరికివేతను అరికట్టడం,పురుగు మందులను నిషేధించడం,సహజ వ్యవసాయ ప్రక్రియనుప్రోత్సహించడం, తేనెటీగల ఉనికిపై ఎప్పటికప్పుడు
అధ్యయనాలు చేపట్టడం వంటి చర్యల ద్వారా
వాటిని అంతరించిపోకుండా కాపాడవచ్చునన్నారు.
దయచేసి మన ఊరిలో ప్రతీ ఒక్కరూ సహజమైన పురుగు మందులని వాడండి...
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#KalidasDivas#KalidasJayanti
కాళిదాసు ఒక సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించారు. #Kalidas
రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే మూడు మహాకావ్యాలు, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.
కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి. ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు. ఐదవ శతాబ్ది వారని అనుకుంటారు.
#GlobalEnergyIndependenceDay
స్థిరమైన మరియు పరిశుభ్రమైన శక్తి ఉత్పాదనకోసం సౌరశక్తి, గాలి, మొక్కలు, నీరు వంటి తరగని ప్రాకృతిక వనరులను పునర్వినియోగ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలు: #GlobalEnergy
♻️🌀🌊☢️🌞
♻️గ్రీన్ హౌస్ వాయు రహితంగా మరియు వాయు కాలుష్యం తగ్గిస్తూ ఇంధన ఉత్పాదన.
♻️ ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని ఇంధన వైవిధ్యం తగ్గిస్తుంది.
♻️ఆర్థిక అభివృద్ధి మరియు మ్యాన్ఫ్యాక్చరింగ్, ఇనస్టలేషన్ ఇతరత్రా ఉద్యోగాలు.
పునర్వినియోగ ఇంధన వనరులు
🌞సౌరశక్తి అనేది సూర్య కాంతిని వినియోగించుకుని చేసే విద్యుచ్ఛక్తి. దీనిని వేడి పుట్టించడానికి, నీళ్లను మరిగించడానికి, చల్లబరచడానికి వాడవచ్చు. ఇంకా పలు విధాలైన వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు.
నికోలా టెస్లా (ఆంగ్లం : #NikolaTesla#Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఒక ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్. నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్, తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు.
ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా మరియు ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు.19వ శతాబ్దాంతంలో మరియు 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్ మరియు అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త.
నికోలా టెస్లా పేటెంట్లు మరియు పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.
1894లో వైర్‌లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో
#KebabDay#kebab#kabab
కబాబ్ అంటే గతంలో మటన్‌తో చేసేది అని అర్థం. ఇప్పుడు చికెన్ కబాబ్... ప్రాన్స్ కబాబ్ అని రకరకాల కబాబులు రెడీ అయిపోతున్నాయి. పూర్తి స్థాయి వంట చేసుకోవడానికి వీల్లేని రోజుల్లో సైనికులు మాంసాన్ని ఎండబెట్టి దాచుకొని అప్పటికప్పుడు నిప్పుల్లో కాల్చుకొని తినేవారు.
ఈ ఎండు మాంసమే కబాబ్ మారింది. ఇప్పుడు ఇన్‌స్టాంట్ కబాబులు వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువా కాకపోయినా కబాబ్‌లకు రాచరికపు హోదా దక్కింది. కబాబ్‌లు వడ్డించారంటే అదో పెద్ద హోదా కిందే ఇప్పటికీ. కబాబ్ ను ఏ సందర్భంలోనైనా తయారు చేసుకోవచ్చు.
ముఖ్యంగా వర్షాకాలంలో వేజిటేరియన్ స్నాక్స్ తో పాటు, కబాబ్ లు కూడా చాలా ప్రసిద్ధి. వర్షాకాలంలో నోటికి రుచికరంగా వేడి వేడిగా కబాబ్ తింటే ఎలా ఉంటుంది. చాలా మందికి మాంసాహార ప్రియులు కబాబ్ లను ఇష్టపడుతారు.
అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు.
సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 1938 – 6 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. వీరు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. వీరు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి
ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.
సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించబడేవాడు) #Sholay#SanjeevKumar
వీరు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం సూరత్‌లో గడచింది.తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది.
అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందారు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డారు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు.షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. నయాదిన్ నయీరాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించారు.
73 ఏళ్ళుగా విద్యార్థి లోకంతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండటమే దీనికి కారణం. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై, నేడు దేశంలో 33 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది.
ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (#ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ కూడా.