ఈరోజు మనం వ్యక్తిత్వ లోపాల గురించి తెలుసుకుందాం , వీటినే పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు . అంటే ఒక వ్యక్తి స్వాభావిక ప్రవర్తన అక్కడి కాల మాన పరిస్థితుల కు అనుకూలంగా కాకుండా దీర్ఘకాలం పాటు వారు ఇతరులతో మసలుకునే తీరులో తీవ్రమైన ఇబ్బందులు ఉండటం. ఈ ఇబ్బంది వారికి కానీ లేదా వారి +
చుట్టూ ఉన్నవారికి కానీ. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి అబ్సెసివ్ పర్సనాలిటీ దీనినే చాదస్తం అనొచ్చు. అలాగే పారనాయిడ్ - అనుమానం జాస్తి , ఎమోషనల్లీ అన్ స్టేబుల్ - భావోద్వేగాలను నియంత్రించ లేకపోవటం ఇలా చెప్తూ పోతే ఒక పది పన్నెండు ఉన్నాయి. వీటిలో ఒకరిలోనే రెండు మూడు రకాలు
కలిసి ఉండొచ్చు . అందుకనే ఈ మధ్య ఈ పేర్లన్నీ తీసేసి కేవలం వ్యక్తిత్వ లోపం అని ఒక్కటే ఉంచారు. ఇవి ఇంతవరకు చేసిన అధ్యయనాల ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉంటుంది అని తేలింది అయితే వీటి తీవ్రతతో తేడా ఉండటం వలన అందరూ మనకు కనిపించరు. ఈ లోపాలు అనేవి స్వల్ప స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు
ఉండొచ్చు.ఇవి ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇంకావాళ్ళతో ఉన్న వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేస్తూ ఉంటారు. అసలు వాళ్లలో అదొక లోపం అని వాళ్ళకి తెలీదు పైగా వాళ్ళతో ఉన్నవాళ్లు కూడా ఇవి సమాజంలో చాలా సాధారణం అయి ఉండటం మూలానా ఇదొక లోపం అని గుర్తించరు.పైగా చాలా మంది మీకు పెర్సొనాలిటీ డిసార్డర్
అని ఉంది అని చెప్పినా ఒప్పుకోరు , అందువలన వీరికి వైద్యం కష్టం , ఒకవేళ చేసినా కూడా ఫలితం ఆశించినంత ఉండక పోవచ్చు. కానీ స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్యం తీసుకునే వాళ్లలో ఫలితం ఉంటుంది. అంటే ఉదాహరణకి వీరి ప్రవర్తన వలన వీరితో ఉన్న భార్య లేదా భర్త విడిచిపెట్టినపుడు వీళ్ళకి దిగులు వచ్చి
మానసిక వైద్యుడ్ని కలిసి నపుడు దిగులుతో పాటు వీరికి వ్యక్తిత్వ లోపం కూడా ఉందని వైద్యుడు చెప్పినపుడు వైద్యానికి అంగీకరిస్తారు. అయితే ఈ డిసార్డర్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ? మనలను మనం రక్షించుకునేందుకు అలాగే ఈ విధమైన డిసార్డర్ ఉన్నవాళ్ళకి సహాయ పడేందుకు. ఈ డిసార్డర్ ఉన్నవాళ్లు
మన కుటుంబంలోనో , మన యజమాని గానో లేదా మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులు గానో ఉండొచ్చు . అటువంటి వారిని గుర్తించి సహాయపడటం, వీలు కాదు అనుకున్నప్పుడు దూరంగా ఉండటం చాలా అవసరం . వీరితో ఒకసారి బంధం ఏర్పరుచుకున్నాక విడిపోవటం చాలా కష్టం అందువలన గృహహింస అనుభవిస్తున్నవాళ్ళు ఎందరో .
అయితే అన్ని పర్సనాలిటీ డిసార్డర్స్ ప్రమాదకరం కావు కానీ కొన్ని ఉదాహరణకి నార్సిస్టిక్ మరియు యాంటీ సోషల్ పేరాసనాలిటీ డిసార్డర్స్ ప్రమాదకరం . అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో ఈ డిసార్డర్స్ అధికం . వీటి గురించి ఇంకా వివరంగా మరో తీగలో రాస్తాను .
చెప్పటానికి ఎంతో ఉంది వీటి గురించి కానీ సమయాభావం వలన కుదరటం లేదు . సందేహాలు ఉంటే అడగండి వీలు చూసుకుని బదులిస్తాను .

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with మనసులో మాట

మనసులో మాట Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @miryalasrikanth

5 Jun
మీకు తెలుసా దిగులు ( depression) వ్యాధి, మధుమేహం (diabetes) కంటే సాధారణ మైన వ్యాధి అని? అలాగే ఇది నూటికి ఎనభై మందిలో నయం అవుతుందని తెలుసా? కొన్ని విషయాలు గమనిద్దాం.
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ర్యాంకింగ్స్లో గుండెజబ్బులకు తలదన్ని డిప్రెషన్ మొదటి స్థానంలో ఉంది, అంటే ఒక వ్యాధి ప్రపంచ ప్రజల్ని ఎంత పీడిస్తోంది అన్నదానికి ఒక సూచిక ఇది. అలాగే ఉత్పాదక వయసులో ఉన్నవాళ్ళలో (20-60) రోడ్డుప్రమాదాల తర్వాత అత్యధిక మరణాలు ఆత్మహత్యల వలన జరుగుతున్నాయి.
డిప్రెషన్ లో స్వల్ప స్థాయి/తీవ్ర స్థాయి అని రెండు రకాలు ఉంటాయి. ప్రతీ రోగికి ఉండే లక్షణాల తీవ్రతని బట్టి ఇది ఉంటుంది.దీనికి వైద్యం మూడు రకాలు.
1. కౌన్సిలింగ్
2. మందులు
3. జీవనవిధానంలో మార్పులు
4. ECT- ఎలక్ట్రో కన్స్వుల్సివ్ థెరపీ ( షాక్ ట్రీట్మెంట్)-ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు.
Read 8 tweets
21 May
స్కిజోఫ్రీనియా అవగాహన వారం.
ఇదొక మానసిక వ్యాధి. వెయ్యి మందిలో ఒకరిద్దరి కి వస్తుంది. కాబట్టి చాలా సాధారణమైన వ్యాధి. చికిత్సతో దాదాపు డెబ్భై శాతం మంది కోలుకుని బాగవుతారు. వ్యాధిని ఎంత ముందుగా కనిపెట్టి వైద్యం చేస్తే అంత బాగయ్యే అవకాశం ఉంది. దీనికి ఇదే కారణం అంటూ ఏమీ లేదు.
వంశపారంపర్యం,తల్లికి గర్భంతో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం, వైరల్ ఇన్ఫక్షన్లు, నెలలు నిండక ముందే పుట్టడం, కాన్పు కష్టమయి బిడ్డకి ఆక్సిజన్ అందకపోవడం, జన్యు లోపాలు, తలకి గాయం అవటం, హార్మోన్లు హెచ్చు తగ్గులు, చిన్నవయసులో లైంగిక పరమైన , శారీరక పరమైన దాడికి గురవటం ఇలా చాలా మటుకు విషయాలు
స్కిజో ఫ్రీనియా రావటానికి దారి తీస్తాయి. అలాగే మూర్ఛ రోగం, గంజాయి, కొకైన్, మద్యం మొదలైనవి కూడా. ఈ వ్యాధి సాధారణంగా 15-25 ఏళ్ల మధ్య మొదలవుతుంది. ముఖ్య లక్షణాలు భయం, అనుమానం, ఒంటరిగా ఉన్నప్పుడు మాటలు వినిపించడం, శుభ్రంగా ఉండకపోవటం, మతిమరుపు, అసందర్భంగా మాట్లాడటం, నిరాసక్తి, దిగులు
Read 5 tweets
28 Feb
శ్రేయస్సు కోసం ఐదు మార్గాలు.
1. చురుకుగా ఉండండి
2. కొత్తవి నేర్చుకోండి
3. సాయం చేయండి
4. కలుపుగోరుగా ఉండండి
5. పరిసరాలను గమనించండి

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ లో ప్రచురితమైన ఒక వ్యాసంలో వీటి గురించి వివరంగా చర్చించారు. ఆస్ట్రేలియా లో వీటిని జనబాహుళ్యంలో కి తీసుకురావటానికి
ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. ఇవి చాలా సులభంగా అందరూ పాటించదగినవి. వీటివలన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నిరూపితం అయింది. వీటిని ఆంగ్లంలో ఫైవ్ వేస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు.
1. చురుకుగా ఉండటం - అంటే శారీరక శ్రమ కలిగిన, ఏదైనా ఉల్లాసవంతమైన పని చెయ్యటం. ఉదాహరణకు స్నేహితులతో ఆడటం, వ్యాహ్యాళికి వెళ్ళటం. పిల్లలతో బయట ఆడటం. వ్యాయామం చెయ్యటం. వీటివలన విటమిన్ డి స్థాయి పెరగటం, ఎముకలు దృఢం అవ్వటం, మనసు తేలిక పడటం మొదలైన లాభాలు ఉన్నాయి.
Read 8 tweets
26 Jan
డేల్యుజనల్ డిజార్డర్ - ఒక వ్యక్తి బలీయమైన,దుర్భేద్యమైన ఒక అపనమ్మకం పెంపొందించుకుని,ఆ నమ్మకం దృష్ట్యా ప్రవర్తించటం.ఇదొక మానసిక వ్యాధి. దీనికి వైద్యం ఉంది.ఉదాహరణకి,సాధారణంగా అనుమానం జబ్బు కొంతమందికి ఉంటుంది.భార్య ఏతప్పూ చేయనప్పుడుకూడా ఎటువంటి ఆధారం లేకుండా అనుమానించే భర్తలు ఉంటారు.
వీళ్ళు భార్య సెల్ ఫోన్లో నంబర్లను, సందేశాలను అనుమతి లేకుండా చూడడం, వెంబడించటం, నిఘా పెట్టించటం, నిజం చెప్పమని నిలదీయటం, మరీ మితి మీరితే హింసించడం, చివరకు హతమార్చడం జరుగుతుంది. ఆల్కహాల్ కి అలవాటు పడ్డవారిలో ఇది కొంచెం ఎక్కువ. దీనినే ఒథెల్లో సిండ్రోమ్ అని కూడా అంటారు.
వీరికి ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వారి అపనమ్మకం గానీ, అనుమానం గానీ మార్చుకోరు. ఈ మానసిక వ్యాధి రావటానికి చదువు, స్థాయి, డబ్బు, ఉద్యోగం ఏవీ అడ్డంకి కావు. ఎవరికైనా రావచ్చు. ఒంటరి జీవితం, అభద్రతా భావం, ఆత్మన్యూనత మొదలైనవి కారణాలు కాకపోయినా అవి ఈ జబ్బు కి దోహద పడొచ్చు.
Read 11 tweets
14 Oct 20
Long thread ahead.
Maternity is one of the sacred roles that women achieve. So is the bone in the pelvis where the foetal head lies named as "Sacrum". Going through the ordeal of giving birth makes the mother tired, but also pushes her into new role of carer for newborn.
Now thisrole is one of the most complex transition in human life because this is the foundation for life of another human being.After delivery there is sudden drop of hormone levels and the urgency to shift to the role of being mother puts immense stress on mother's mental state
A mixed state of joy of becoming mother and being stressed about taking care of new born baby, will put new mothers vulnerable for mental illness. This often manifests as post partum blues characterized by anxiety, withdrawn behaviour, crying spells, easily becoming irritable etc
Read 13 tweets
18 Jul 20
భారత దేశం - ఆరోగ్య వ్యవస్థ ఒక ఆలోచన.
1. ముందుగా మనదేశం మొత్తం బడ్జెట్ లో ఆరోగ్యం కోసం రెండు శాతం కంటే తక్కువ కేటాయిస్తారు. దీనివలన ప్రజలే వాళ్ళ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టుకోవాలి.
2. నాయకత్వ లేమి - మన దేశంలో వైద్యం ఎలా చెయ్యాలి? అన్న దాని గురించి వైద్యుల కన్నా మిగిలిన వాళ్లే
ఎక్కువ మాట్లాడతారు. ఐ ఎ యస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీసు ని ప్రారంభించామని అరవై ఏళ్ల క్రితం మొత్తుకున్నా ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు. ఎంబీబీఎస్ సిలబస్ లో కూడా నాయకత్వ లక్షణాలు నేర్పే పాఠం ఒక్కటీ ఉండదు. దానివలన వైద్యులు ప్రాథమిక అరోగ్య కేంద్రం నుంచి, వైద్య విద్యా సంచాలకులు
వరకు ఎక్కడా నాయకత్వ లక్షణాలు చూపలేక వారి అభిప్రాయాన్ని గట్టిగా చెప్పలేక పోతున్నారు.
3. తీవ్రమైన ఆర్థిక, భౌగోళిక, సంకృతిక, భాషా పరమైన భేదాలు ఒక ఐక్య ప్రణాళికను అమలు పరిచేందుకు తీవ్ర అడ్డంకి గా మారాయి.
4. భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాలను బట్టి
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(