హెరాయిన్ గురించి తెలుసుకుందాం. మాదకద్రవ్యాలు అవి పనిచేసే తీరుని బట్టి మూడు రకాలు. ఒక రకం ఉత్ప్రేరకాలు అంటే పొగాకు,కాఫీ,కొకైన్ లాంటివి, ఇంకోరకం మత్తు కలిగించేవి అంటే గంజాయి,సారా,హెరాయిన్ వంటివి, మూడోరకం మతిభ్రమించేవి అంటే లైసెర్జిక్ ఆమ్లం, మ్యాజిక్ పుట్టగొడుగులు మొదలైనవి.
అసలు హెరాయిన్ తయారుచేసింది మార్ఫీన్ ని చూసి, ఇది మధ్యధరా ప్రాంతంలో పెరిగే పపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి ఐదు వేల ఏళ్ళ క్రితమే తీశారు.ఇవి తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి దిగుమతి చేయబడ్డాయి, తద్వారా ఆ కంపెనీ వారు బాగా సంపాదించారు కూడా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం
మార్ఫీన్, కోడీన్ సహజంగా దొరికే ఓపియం మత్తు పదార్ధాలు అయితే వాటిని చూసి శాస్త్రవేత్తలు హెరాయిన్,ఫెంటానీల్,ఆక్సీ కోడోన్,మెథడోన్ అనే మొదలైన కృత్రిమమైనవి తయారు చేసారు.ఇవన్నీ ఒకప్పుడు గానీ,ఇప్పుడు గానీ మందులుగా వాడుతున్నవే.కాన్సర్ వైద్యంలో,నొప్పి నివారణగా,శస్త్ర చికిత్సలో ఇవి వాడతారు.
అయితే దురదృష్టవశాత్తు కొంతమంది వీటికి అలవాటు పది బానిసలవుతారు. ఇలా అయ్యేది ఎక్కువమంది కుర్రవాళ్లే. వీళ్ళు సాధారణంగా హెరాయిన్ ని నరాల్లో సిరంజిలతో ఎక్కించుకోవడం,కాల్చి పీల్చడం లేదా ముక్కుతో పొడుం పీల్చినట్టు పీల్చడం చేస్తారు. అయితే ఇలా చేయడం వలన చాలా అనర్ధాలు ఉన్నాయి
చేతిలో నరాలు గట్టిపడి అవి దొరక్క కాలు, తొడలు , మీద నరాల్లో పొడిచి ఎక్కిస్తారు, అవి కూడా గట్టిపడి నప్పుడు డైరెక్టుగా చర్మంలోకి ఎక్కిస్తారు. ఈ సూదుల వలన హెచ్ ఐ వి, హెపటైటిస్ మొదలైన వ్యాధులు సులువుగా వస్తాయి, అలాగే నరాలకు ఇన్ఫెక్షన్ సోకి గుండెలో,మెదడులో పుళ్ళు ఏర్పడతాయి.
అలాగే కాలు,చేతులపైతీవ్రమైన మానని పుళ్ళు ఏర్పడతాయి.ముక్కులో పీల్చడం వలన ముక్కు దూలంలో రంధ్రం ఏర్పడటం,ఊపిరితిత్తులకు న్యుమోనియా రావటం జరుగుతుంది.హెరాయిన్ వాడకం వలన లైంగిక పటుత్వం తగ్గుతుంది,అంగ స్తంభన ఉండదు. స్త్రీలలో నెలసరి గాడి తప్పుతుంది.ఇదికాక మోతాదు ఎక్కువైతే కోమాతో చనిపోతారు.
హెరాయిన్ తీసుకున్న వాళ్ళు కొన్ని గంటలు స్తబ్దుగా ఉండిపోతారు, వాళ్ళు పిలిచినా తక్కువ స్పందిస్తారు, మాట తొఱ్ఱుపాటు ఉంటుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, పక్కన ఏం జరుగుతోంది అన్న ధ్యాస ఉండదు. వాళ్ళు చేసేదానిపై వాళ్ళకి నియంత్రణ ఉండదు.
ఆ కొన్ని గంటల తరువాత మెల్లిగా విత్డ్రావల్ లక్షణాలు బయటపడతాయి. ఇవి ఏంటంటే ఒళ్ళంతా నొప్పులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, రోమాలు నిక్కబొడుచుకోవడం,కళ్ళలోంచిముక్కులోంచి నీరు రావడం,కీళ్ల నొప్పులు, ఆవలింతలు ఎక్కువగా రావడం మొదలైనవి, ఇవి భరించడం చాల కష్టం అందువలన ఎంతకుతెగించి అయినా మళ్ళీ
హెరాయిన్ వాడతారు.ఈ హెరాయిన్ వాడకం గురించి దాని దుష్ఫలితాల గురించి ఆంగ్ల చిత్రాలైన పల్ప్ ఫిక్షన్, ట్రెయిన్ స్పాట్టింగ్ వాటిల్లో బాగా చూపిస్తారు. హెరాయిన్ వ్యక్తుల యువతను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని హరిస్తుంది. నేరాలకు ఉసిగొల్పుతుంది, రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తుంది.కుటుంబాన్ని
విచ్చిన్నం చేస్తుంది. హెరాయిన్ వ్యసనానికి వైద్యం ఉంది, మందుల ద్వారా, కౌన్సెలింగ్ ద్వారా నయం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హెరాయిన్ సరఫరాపై కట్టుదిట్టమైన చట్టాలు చేసి వాటిని అమలు పరిచే బాధ్యత ప్రభుత్వం పైఉంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం ఈ సందర్బంగా గుండెని పదిలంగా ఉంచుకోడానికి కొన్ని చెప్తాను. అవి చెప్పేముందు గుండెజబ్బు గురించి కొన్ని విషయాలు. అసలు గుండె అనేది ఒక కండరం. ఈ కండరం లోపల ఖాళీలో రక్తం ఉంటుంది అది పెద్ద ధమనుల ద్వారా ఒంట్లో అవయవాలకి, ఊపిరితిత్తులకు పంపబడుతుంది.
ఈ గుండె కండరం పని చెయ్యటానికి హృదయ ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇవి చాల సున్నితమైనవి పైగా సన్నటివి. గుండె నిరంతరం పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడుకి 0.6సెకండ్ల విశ్రాంతి తీసుకుంటుంది, ఆ సమయంలో దానికి కావాల్సిన రక్తం తీసుకుంటుంది, అయితే మనం పరిగెత్తినపుడు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా
శృంగారంలో పాల్గొన్నప్పుడు గుండె వేగం పెరిగి గుండె విశ్రాంతి తీసుకునే సమయం 0.2సెకండ్లకి పడిపోతుంది అంటే ఆ సమయంలోనే దానికి కావలసిన రక్తాన్ని ఈ సన్నటి ధమనులు ఇస్తాయి. ఈ ధమనులు ఆరోగ్యముగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ వాటి లోపల కొవ్వు పేరుకుపోయి ఇరుకు అయినప్పుడు గుండె కి కావాల్సినంత
సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి. 2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం. 5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.
జననాంగాల గురించి తెలుసుకుందాం
వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో పని చేస్తాయి. ఇవి శుక్రకణాలను తయారు చెయ్యడమే కాకుండా మగ వారి లైంగిక పటుత్వానికి అలాగే మిగిలిన క్రియలకు అవసరం అయిన టెస్టోస్టెరోన్ హార్మోను ని ఉత్పత్తి చేస్తాయి.
ఇందుకోసం ఇవి శరీరం బయట వదులైన సంచిలో ఉంటాయి .అయితే చాలా మంది బిగుతైన లోదుస్తులు వేసుకువడం , ఒడిలో లాప్టాప్ పెట్టుకుని ఎక్కువసేపు పని చెయ్యటం వంటి వాటి వలన వృషణాల పనితీరు తగ్గుతుంది. ఇది సంతాన లేమికి దారి తీయొచ్చు. గత ఇరవై ఏళ్లలో వీర్యం నాణ్యత దాదాపు సగానికి పడిపోయింది.
అయితే ఒత్తిడి , కాలుష్యం, ఆహారం ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఇతమిద్దంగా ఇవే అని తెలీదు. ఇక పోతే అంగాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ముందు చర్మం వెనక్కి లాగి శిశ్నము దగ్గర పేరుకుపోయిన స్మేగ్మాని కడగాలి. స్మెగ్మా అనేది చనిపోయిన కణాలు, మట్టి, వీర్యం మొదలైన
తలనొప్పి - రోగులు వైద్యుల దగ్గరికి వచ్చే ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ తలనొప్పి రెండు రకాలు - ప్రాథమిక ( ఎటువంటి ఇతర కారణం లేనివి ) లేదా పర్యవసాన ( ఇతర కారణాల వలన). అయితే ఈ తలనొప్పికి భయపడాలా ! వద్దా !
జలుబుతో వచ్చే తలనొప్పి చాల సాధారణం కానీ ప్రమాదం లేనిది అలాగే
ప్రాణాపాయ తలనొప్పి అరుదు కానీ దానిని గుర్తించి వెంటనే చికిత్స చెయ్యాలి. ఎలా గుర్తించాలి ఇటువంటివి అంటే కింద తలనొప్పి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి అశ్రధ్ధ చెయ్యకుండా.
1.హఠాత్తుగా వచ్చిన తలనొప్పి ( అంటే సెకండ్ల వ్యవధిలో )
2.మొదటిసారి వచ్చిన తీవ్రమైన తలనొప్పి
3.ఇంతవరకు వచ్చిన తలనొప్పుల్లో ఇదే అధమం అయినప్పుడు
4.రోజులు లేదా వారం వ్యవధిలో అంతకంతకు పెరిగే తలనొప్పి
5.వంగినప్పుడు,బరువులెత్తినపుడు,దగ్గినప్పుడు వచ్చే తలనొప్పి
మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది, ఈసారి గుండె గట్టిగా
కొట్టి ఒక స్పందన లో పంపే రక్తం పరిమాణం పెరుగుతుంది. ఆ పెరిగిన పరిమాణం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి తట్టుకోడానికి మొదట్లో రక్త నాళాలు వ్యాకోచిస్తాయి, కానీ దీర్ఘకాలంలో గట్టిపడతాయి దానివలన సాగే గుణం కోల్పోతాయి. దాని వలన ఈసారి గుండె ఇంకా గట్టిగా, వేగంగా
కొడుతుంది. దాంతో అప్పటికే సాగటం మానేసిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. రక్తనాళం వ్యాసార్థం తగ్గినపుడు బెర్నౌలి నియమం ప్రకారం ఒత్తిడి నాలుగు రేట్లు పెరుగుతుంది. అందుకని పెరిగిన ఒత్తిడి వలన ఎక్కువ రక్తం మూతపిండాల్లో వడకట్టబడుతుంది. అప్పుడు ఆ ఉప్పు మూత్రం లోంచి వెళుతుంది.
లైటర్
మాస్టారు అగ్గిపెట్టుందా ?
ఏం ఏ కొంపకి నిప్పెట్టేద్దామనీ ? అన్నాన్నేను అది వినగానే ...
అదేంటండీ అలా అంటారు ? మీక్కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువే , పళ్ళు రాలిపోకుండా చూసుకోండి అని జేబులో సిగరెట్టు తీసి సుతారంగా అప్పటికే నల్లబడిపోయిన పెదాల చివర నొక్కి పట్టాడు . వెధవకి నిండా
పాతికేళ్ళు లేవు.
సర్లేవోయ్ , నేనేదో సరదాకి అన్నాను , కుర్రాడివి కదా తట్టుకోలేకపోయావ్ . సరే ఇంద అని జేబులోంచి లైటర్ తీసి సప్ మని వెలిగించి అతని సిగరెట్ కి నిప్పు అందించాను . అతను ఒకసారి బాగా లోపలికి లాగి బిగబట్టి హా అని వదిలాడు . నా వంక చూసాడు, అతని కళ్ళలో ఒక రిలాక్సేషన్ .
కింగ్స్ పాకెట్ తీసి నాకొకటి ఇవ్వబోయాడు . నేనిప్పుడే ఒకటి తాగా అని చెప్పి మరో గంట తర్వాతే అని వద్దన్నాను . మళ్ళీ లోపల పెట్టేశాడు . ఏదైనా నాలుక జివ్వున లాగుతున్నప్పుడు సిగరెట్టు తాగితే వచ్చే కిక్కు వేరు, ఒక అమ్మాయి పెట్టే తొలి ముద్దు లా ! అన్నాన్నేను.