#MoleDay మోల్ దినోత్సవం🐀
ఇంగ్లీషులో "మోల్" అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కావలసిన అర్థం శాస్త్రీయ పరిభాషకి సంబంధించిన అర్థం మాత్రమే. రసాయన శాస్త్రంలో "మోల్" అనే భావం చాలా కీలకమైనది. ఈ మాట అర్థం కాక విద్యార్ధులు చాల తికమక పడుతూ ఉంటారు.
#MoleDay2021
#mole
#Avogadro
బజారుకి వెళ్లి సరుకులు కొన్నప్పుడు కొన్ని కొలమానాలు వాడతాం. డజను అరటి పళ్లు, వంద మామిడి పళ్లు, కుంచం బియ్యం, శేరు పాలు, వీశ వంకాయలు, బుట్టెడు రేగు పళ్లు, ఇలా ఉండేవి పాత రోజుల్లో కొలమానాలు. ఇంట్లో వంట వండేటప్పుడు చేరెడు బియ్యం, చిటికెడు పసుపు, ఇండుపగింజంత ఇంగువ,
అంటూ మరొక రకం కొలమానం వాడేవారు. అదే విధంగా రసాయన శాస్త్రంలో అణువులు (atoms), బణువులు (molecules), వగైరా రేణువులు ఎన్ని ఉన్నాయో కొలవడానికి "మోల్" అనే కొలమానం వాడతారు.

డజను అంటే 12 వస్తువులు, జత అంటే 2 వస్తువులు, పుంజీ అంటే 4 వస్తువులు, అయినట్లే
మోల్ అంటే 602x1023 వస్తువులు లేదా ఇది మన ఊహకి అందనంత పెద్ద సంఖ్య. ఉదాహరణకి ఒక మోలు చింతపిక్కలని పోగు పోసి, ఉండలా కడితే ఆ ఉండ మన భూమి అంత పెద్ద గోళం అవుతుంది.
అవగాడో సంఖ్య(602x1023) కు గుర్తుగా
ఈ రోజు 23/10 ఉదయం 6:02 నుండి సాయంత్రం 6:02 వరకు మోల్ దినోత్సవం జరుపుకుంటారు
#Avogardo

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

24 Oct
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం
#UnitedNationsDay Image
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. Image
అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా మరియు ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
Read 5 tweets
24 Oct
#MotherInLawDay #motherinlaw
అత్తగారు అనగానే చాలామందికి కోడల్ని తిడుతూ నిష్ఠూరాలాడే సూర్యకాంతం పాత్ర కళ్లముందు కదులుతుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. మరిప్పుడు అమ్మతో ఉండే సాన్నిహిత్యం, అక్క దగ్గరుండే చనువూ అత్తగారితోనూ ఏర్పడుతున్నాయి. మెట్టినిల్లూ పుట్టినిల్లుగా మారిపోతోంది. Image
ఈరోజు అత్తగార్ల దినోత్సవం సందర్భంగా అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు.
తల్లి సోదరుడి భార్యను, నాన్న సోదరిని కూడా అత్త అంటారు.నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.
సంబంధాలు:-
మేనత్త తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
Read 21 tweets
23 Oct
పరాయి దేశానికి చెందిన హ్యూలెట్ పాకర్డ్ (hp) కంపెనీ తన ప్రింటింగ్ మెషిన్ యాడ్ ను ఎంతో సభ్యత సంస్కారాలతో తయారుచేసింది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, దీపావళి పండుగకు దేశీయ ఉత్పత్తులు కొనమంటూ ఈ యాడ్ నడుస్తుంది.
@ivak99

తన ఉత్పత్తిని ప్రమోట్ చేసుకోవడానికే ఈ యాడ్ తయారుచేసుకున్నా, Go Local అంటూ పిలుపునిచ్చింది. ఇంకా ఈ యాడ్ లో ....
#VocalForLocal

మన నిరక్షర గ్రామీణ వృద్ధురాలిని అందంగా చూపించారు.

ఎవరూ కొనడం లేదనే ఆమె బాధను మౌనంగా చూపించారు.
తల్లి నిర్లక్ష్యం చేసినా, పసి మనసులో ఉన్న ఔన్నత్యమైన మానవత్వాన్నిచూపించారు...

ఆ పిల్లవాడి మనసులో ఏదో చేయాలన్న తపన చూపించారు...

అతనిలో ఉన్న క్రియేటివిటీని, మార్కెటింగ్ స్కిల్స్ ని చూపించారు.

తాతమ్మ వయసున్న ఆమెను ఆటపట్టించడం చూపించారు...
Read 7 tweets
23 Oct
#SnowLeopardDay ❄🐆 #Snow
మీరు చిరుత పులుల గురించి వినే ఉంటారు.కానీ మంచు చిరుతల గురించి ఎప్పుడైనా విన్నారా? భారత దేశంలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీటి అరుదైన దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. @LakshmiManchu @HeroManoj1 @iVishnuManchu
మంచు చిరుతలు

'ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్‌ ఇదే'...
ఇండియాలో కనిపించిన మంచు చిరుత...

ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్‌' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి.
మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి.
కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఈ అందమైన మంచు చిరుత పులుల యొక్క దృశ్యాలను భారత విదేశాంగ సేవ అధికారి ఆకాశ్ కుమార్ వర్మ తన ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.
Read 9 tweets
23 Oct
*సంగటి ముద్ద..!!

"పంత పొయ్యిమీద కుండపెట్టి..
దాంట్లో నీళ్లు పోసి..
రెండుగలాసులు కందివాళ్లుపోసి..
కోసిన టమోటాలు, వట్టి మెరపకాయలేసి...
చిటెకెడు పసుపు, రెండేళ్లతో ఉప్పు వేసి...
బ్యాల్లపుల్చుకలు వేచ్చాండ.
తపేలాలో..
పటికి పటికి మని బియ్యం ఉడికి...
గంజి బుడగలు ఎగిరెగిరి చిందుతొక్కుతాంటనే...
బూపుల్లతో కలపెబెట్టేది.
కుండలోని బ్యాల్ల నీళ్లు...
మూకటి మూతికి పసుపు పూసుకునేది.

బువ్వ గంజిపడ్తాంటే...
సిల్వర డబ్బాలోని ఓ పిరికెడు రాగిపిండిని...
ఆ తపాల్లో వేసేది..
బాగా కల్పుకున్నాక..
టైముచూసి పొయ్యిమీదనుంచి దింపేసి...
సంగటి తెడ్డుతో గెలికేది.
మా నాయినకో ముద్ద...

టోపీ గిన్నెలో నాకు రెండు సంగటిముద్దలేసశేది..
ఆతర్వాత మా చెల్లెలికి...
చివరన మాయమ్మ చిన్న పల్లెంలోకి
రాగి సంగటి వేసేది.
నిమ్మట్లోకి బ్యాల్లపుల్పు చేసేది.
Read 7 tweets
23 Oct
#CradleDay #Cradle
ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.

ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.
Read 6 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(