అప్పుడే ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరాను,బస్సులో యూట్యూబ్ లో అప్పటికే సిద్ధం చేసుకున్న బాలు రాజా తమిళ పాటల మాలిక ఎంచుకునేలోపు, సూర్యప్రకాష్ ఐఏఎస్ (పేరు మార్చాను)నుంచి సందేశం,"సార్,మీక్కొంచెం సమయం ఉంటే రెండు నిముషాలు మాట్లాడాలి" నేను సరేనండీ అంటే ఫోన్ చేసి అరగంట మాట్లాడారు.
దాదాపు ఐదేళ్లక్రితం పదహారేళ్ళ వాళ్ళ అబ్బాయిని విశాఖపట్నంలో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు తీసుకొచ్చారు. అబ్బాయికి తీవ్రమైన ఓసీడి. రోజులో దాదాపు చాలా సమయం గదిలోనే ఉండటం, టీవీ సినిమా చూసేటప్పుడు శృంగారభరితమైనవి చూసేస్తానేమో, అవి చుస్తే చెడ్డవాడ్ని అయిపోతానేమో అనే భయం.స్నేహితులు లేరు,
అమ్మాయిలంటే ఆమడ దూరం. అతి శుభ్రం. వీటివలన కాలేజీ కి వెళ్లలేకపోవటం, మూడేళ్ళ నుంచి ఇలా ఉంది. అప్పటికే నలుగురు మానసిక వైద్యులకు చూపించటం అది కాస్తా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఎవరో నా పేరు చెప్తే తీసుకొచ్చారు. మందులతో, కౌన్సెలింగ్ తో వైద్యం ప్రారంభించాను. ప్రతివారం క్రమం
తప్పకుండా తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చేవారు. ప్రతిసారీ అపాయింట్మెంట్ తీసుకునే వచ్చేవారు. అప్పట్లో నా క్లినిక్ అద్దె ఐదు వేలు, కాబట్టి వచ్చే పేషెంట్స్ బయట కూర్చునే స్థలం అంత బాగుండేది కాదు. ఇనుప కుర్చీలు ఉండేవి, ఏసీ పనిచేసేది కాదు. వాళ్ళ అబ్బాయికి కౌన్సెలింగ్ అయ్యే గంటసేపు
అక్కడే కూర్చునేవారు. ఆయన కావాలంటే క్లినిక్ బయట ఆయన కార్లో కూర్చోవచ్చు కానీ నేనెప్పుడైనా ఆయన్ని పిలుస్తానేమో అని అక్కడే వేచి ఉండేవారు. వాళ్ళ అబ్బాయికి గురించిన ప్రతి పూచికపుల్ల విషయం కూడా ఆయనకి తెలుసు, ఆ అబ్బాయే ఆయన ప్రపంచం, అతనికి వాళ్ళ అబ్బాయి ఐఐటీ లో సీటు సాధించాలని ఉండేది.
నాకది కొంచెం అసాధ్యం గానూ, అనారోగ్యం గానూ అనిపించేది. అయినప్పటికి నా సలహాతో ఇంటివద్దే అన్ని పాఠాలు చెప్పే లెక్చరర్స్ ని పిలిచి చదువు చెప్పించేవారు. నన్నెప్పుడూ అలా పిలవలేదు ఇంటికి. నా అనుభవంలో అంతకు ముందు సీనియర్ రెసిడెంట్ గా పనిచేస్తున్నప్పుడు మా అసిస్టెంట్ ప్రొఫెసర్లను జడ్జీలు
ఇంటికి పిలిచి వైద్యం చేయించుకోవడం చుసాన్నేను. సంవత్సరం పాటు చికిత్స సాగింది, ఓసీడి బాగా తగ్గుముఖం పట్టింది, అబ్బాయి తెలివైనవాడే అయినా ఈ మానసిక వ్యాధి వలన ఐఐటీ లో సీట్ రాలేదు, కానీ ఇతనికి తర్వాత ప్రమోషన్ మీద వెళ్లే ఊర్లో మంచి ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ వచ్చింది.
అప్పటికి నేను ఆస్ట్రేలియా పయనం అవ్వటానికి ఇంకా నెలరోజులుంది.ఆ నెలరోజుల అపాయింట్మెంట్ కి అన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చేవాళ్ళు, ఒకవైపు వాళ్ళ అబ్బాయికి తగ్గిందన్న సంతోషం,ఇంకో వైపు నేను ఉండననే ఆందోళన వాళ్ళకి. నేను వెళ్లే ముందు నాతో గంట మాట్లాడారు,ఏవో పుస్తకాలూ అవీ ఇవీ ఇచ్చారు
నేనిక్కడికి వచేసాక కనీసం రెండు నెలలకొకసారి ఇలాగే సమయం అడిగి మాట్లాడేవారు, ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేరాడు, ఓసీడి పూర్తిగా తగ్గింది, స్నేహితుల్ని ఏర్పరుచుకున్నాడు, రోజూ కాలేజీకి వెళ్ళేవాడు, అమ్మాయిలు కూడా స్నేహితులు అయ్యారు, ఐఐటీ మద్రాసులో ఇంటర్న్‌షిప్ చేసి బహుమతి పొందాడు, ఫ్రెంచి,
జర్మన్ భాషలు నేర్చాడు, వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేకపోతే శుశ్రూష చేసాడు, ఇంజనీరింగ్ పూర్తయ్యేలోపు సివిల్ సర్వీసు పరీక్షకు సన్నద్ధం అయ్యి ఆంథ్రోపాలజీ, జనరల్ స్టడీస్ చదివేసి నోట్స్ రాసుకున్నాడు, సంవత్సరాల కొద్దీ ఇల్లు వదలకపోవటం వలన, మందుల వలన వచ్చిన బరువును గత సంవత్సర కాలంలో
అకుంఠిత క్రమశిక్షణతో ఇరవై కేజీలు తగ్గి ఆరోగ్యాంగా ఉన్నాడు. ఆ అబ్బాయి పోరాటపటిమ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళ నాన్న కనబరిచిన శ్రద్ధ, వారిద్దరి మధ్య పాశం ఈ విధంగా కోలుకోవడానికి దోహద పడిందని నేను గాఢంగా నమ్ముతాను, ఇదే విషయం నేను చెప్తే అతను తిరిగి ఇదంతా నా వల్లే అంటారు.
నేను వైద్యం చేయకపోయుంటే మా అబ్బాయి ఏమైపోయేవాడో అని అంటారు. ప్రతిసారి ఫోన్లో ఆయన ఈ మాట అనేటప్పుడు ఒక ఆర్ద్రత వినిపిస్తుంది. అది నాలో అహంభావాన్ని కలిగించకూడదు అని భగవంతుడ్ని వేడుకుంటాను.
ఈ ఐదేళ్ళలో ఆయన దగ్గర్నుండి ఒక తండ్రిగా ఎలా ఉండాలన్నది నేర్చుకున్నాను, అలాగే చిన్నప్పుడు నాన్న రాసే ఉత్తరాల్లో "నా మనసెప్పుడూ నీ చుట్టూనే ఉంటుంది " అని ఎందుకు రాసేవారో నాకు అర్ధం అయింది. కొన్ని పరిచయాలు భగవదనుగ్రహం.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
డాక్టర్ కరణ్ (పేరు మార్చాను )- హలోసార్, ఎలాఉన్నారు?
నేను -హాయ్ కరణ్,బాగున్నా,ఏంటి సంగతులు?
క-మెగా హాస్పిటల్స్ వాడు ఇక్కడ నాలుగు హాస్పిటల్స్ మూయించేసి వాటిని తీసేసుకుని నాలుగు హాస్పిటల్స్ స్టార్ట్ చేసాడు సార్,నన్ను తీస్కుంటా అన్నాడు. నేను రానన్నాను,నేను కరక్టా కాదా అని మీకు చేశా.
నే-ఇంతకీ ఏమంటాడు వాడు?
క-మొత్తం చెప్తాను సార్,వాడిక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ అందర్నీ లాగేసాడు సార్,భారీ ప్యాకేజీ ఇస్తూ,మన పల్మొనోలోజిస్ట్ గారికి 12లాక్స్ పర్ మంత్ ఇస్తున్నాడు. వాడేంటంటే అన్ని స్పెషలిటీస్ బయట క్లోజ్ చేసి వాడి దగ్గర మాత్రమే అన్నీ దొరికేలా మోనోపోలీకి చూస్తున్నాడు.
చిన్న చిన్న నర్సింగ్ హోమ్ కి ఆఫర్స్ ఇస్తున్నాడు పేషెంట్స్ ని రెఫెర్ చేస్తే కట్స్ ఇస్తానని,అలాగే పేషెంట్స్ ని పంపే ఆరెంపీ లకి నెలకి లక్ష ఇస్తున్నాడు. వీడి దెబ్బకి ఇన్నాళ్లు బాగా నడిచిన కేర్,సెవెన్‌హిల్స్ మూతకొచ్చాయ్. వీడి ఉద్దేశ్యం ఏంటంటే ఇదంతా చేసి షేర్స్ ఓపెన్ చేసి
తుమ్ము అనేది మన శ్వాస వ్యవస్థ పై భాగంలో ఏదైనా చికాకు కలిగించేదానిని బయటకు పంపేందుకు ఉండే ఒక రక్షణ చర్య. అలాగే దగ్గు కూడా శ్వాస వ్యవస్థలో కింది భాగంలో అడ్డంకులు, అలాగే పేరుకుపోయిన కఫాన్ని పంపేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండూ సహజమైనవి. కొన్ని రకాల ఎలర్జీ లో తుమ్ములు అదేపనిగా వస్తుంటాయి
వాటివలన ఉపయోగం లేదు, అందుకని మందులు వేసి తగ్గిస్తాం, అలాగే ఉపయోగం లేని దగ్గుకి కూడా చికిత్స చేస్తాం. ఊపిరి తిత్తుల చుట్టూ ఛాతిలో పక్కటెముకలమధ్యలో మూడు రకాల కండరాలుంటాయి. అలాగే ఊపిరితిత్తుల కిందన విభాజక పటలం అని ఉదరాన్ని, ఛాతీని వేరుచేస్తూ అట్టలాంటి పెద్ద కండరం ఉంటుంది.
ఇవి కాక మెడ కింద కొన్ని కండరాలు కూడా ఉంటాయి.తుమ్ము వచ్చే ముందు ఊపిరితిత్తుల నిండా సాధారణం కంటే ఎక్కువ గాలి చేరుతుంది, ఈ చేరినది అంతా ఒకే సారి బలంగా బయటకు రావటానికి ఈ కండరాలన్నీ ఒక్కసారి సంకోచిస్తాయి, దాంతో ఊపిరితిత్తులపై అపారమైన ఒత్తిడి పడి అందులోని గాలి ఒక్కసారిగా బయటకు వస్తుంది
హెరాయిన్ గురించి తెలుసుకుందాం. మాదకద్రవ్యాలు అవి పనిచేసే తీరుని బట్టి మూడు రకాలు. ఒక రకం ఉత్ప్రేరకాలు అంటే పొగాకు,కాఫీ,కొకైన్ లాంటివి, ఇంకోరకం మత్తు కలిగించేవి అంటే గంజాయి,సారా,హెరాయిన్ వంటివి, మూడోరకం మతిభ్రమించేవి అంటే లైసెర్జిక్ ఆమ్లం, మ్యాజిక్ పుట్టగొడుగులు మొదలైనవి.
అసలు హెరాయిన్ తయారుచేసింది మార్ఫీన్ ని చూసి, ఇది మధ్యధరా ప్రాంతంలో పెరిగే పపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి ఐదు వేల ఏళ్ళ క్రితమే తీశారు.ఇవి తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి దిగుమతి చేయబడ్డాయి, తద్వారా ఆ కంపెనీ వారు బాగా సంపాదించారు కూడా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం
మార్ఫీన్, కోడీన్ సహజంగా దొరికే ఓపియం మత్తు పదార్ధాలు అయితే వాటిని చూసి శాస్త్రవేత్తలు హెరాయిన్,ఫెంటానీల్,ఆక్సీ కోడోన్,మెథడోన్ అనే మొదలైన కృత్రిమమైనవి తయారు చేసారు.ఇవన్నీ ఒకప్పుడు గానీ,ఇప్పుడు గానీ మందులుగా వాడుతున్నవే.కాన్సర్ వైద్యంలో,నొప్పి నివారణగా,శస్త్ర చికిత్సలో ఇవి వాడతారు.
ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం ఈ సందర్బంగా గుండెని పదిలంగా ఉంచుకోడానికి కొన్ని చెప్తాను. అవి చెప్పేముందు గుండెజబ్బు గురించి కొన్ని విషయాలు. అసలు గుండె అనేది ఒక కండరం. ఈ కండరం లోపల ఖాళీలో రక్తం ఉంటుంది అది పెద్ద ధమనుల ద్వారా ఒంట్లో అవయవాలకి, ఊపిరితిత్తులకు పంపబడుతుంది.
ఈ గుండె కండరం పని చెయ్యటానికి హృదయ ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇవి చాల సున్నితమైనవి పైగా సన్నటివి. గుండె నిరంతరం పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడుకి 0.6సెకండ్ల విశ్రాంతి తీసుకుంటుంది, ఆ సమయంలో దానికి కావాల్సిన రక్తం తీసుకుంటుంది, అయితే మనం పరిగెత్తినపుడు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా
శృంగారంలో పాల్గొన్నప్పుడు గుండె వేగం పెరిగి గుండె విశ్రాంతి తీసుకునే సమయం 0.2సెకండ్లకి పడిపోతుంది అంటే ఆ సమయంలోనే దానికి కావలసిన రక్తాన్ని ఈ సన్నటి ధమనులు ఇస్తాయి. ఈ ధమనులు ఆరోగ్యముగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ వాటి లోపల కొవ్వు పేరుకుపోయి ఇరుకు అయినప్పుడు గుండె కి కావాల్సినంత
సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి. 2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం. 5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.
జననాంగాల గురించి తెలుసుకుందాం
వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో పని చేస్తాయి. ఇవి శుక్రకణాలను తయారు చెయ్యడమే కాకుండా మగ వారి లైంగిక పటుత్వానికి అలాగే మిగిలిన క్రియలకు అవసరం అయిన టెస్టోస్టెరోన్ హార్మోను ని ఉత్పత్తి చేస్తాయి.
ఇందుకోసం ఇవి శరీరం బయట వదులైన సంచిలో ఉంటాయి .అయితే చాలా మంది బిగుతైన లోదుస్తులు వేసుకువడం , ఒడిలో లాప్టాప్ పెట్టుకుని ఎక్కువసేపు పని చెయ్యటం వంటి వాటి వలన వృషణాల పనితీరు తగ్గుతుంది. ఇది సంతాన లేమికి దారి తీయొచ్చు. గత ఇరవై ఏళ్లలో వీర్యం నాణ్యత దాదాపు సగానికి పడిపోయింది.
అయితే ఒత్తిడి , కాలుష్యం, ఆహారం ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఇతమిద్దంగా ఇవే అని తెలీదు. ఇక పోతే అంగాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ముందు చర్మం వెనక్కి లాగి శిశ్నము దగ్గర పేరుకుపోయిన స్మేగ్మాని కడగాలి. స్మెగ్మా అనేది చనిపోయిన కణాలు, మట్టి, వీర్యం మొదలైన