డాక్టర్ కరణ్ (పేరు మార్చాను )- హలోసార్, ఎలాఉన్నారు?
నేను -హాయ్ కరణ్,బాగున్నా,ఏంటి సంగతులు?
క-మెగా హాస్పిటల్స్ వాడు ఇక్కడ నాలుగు హాస్పిటల్స్ మూయించేసి వాటిని తీసేసుకుని నాలుగు హాస్పిటల్స్ స్టార్ట్ చేసాడు సార్,నన్ను తీస్కుంటా అన్నాడు. నేను రానన్నాను,నేను కరక్టా కాదా అని మీకు చేశా.
నే-ఇంతకీ ఏమంటాడు వాడు?
క-మొత్తం చెప్తాను సార్,వాడిక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ అందర్నీ లాగేసాడు సార్,భారీ ప్యాకేజీ ఇస్తూ,మన పల్మొనోలోజిస్ట్ గారికి 12లాక్స్ పర్ మంత్ ఇస్తున్నాడు. వాడేంటంటే అన్ని స్పెషలిటీస్ బయట క్లోజ్ చేసి వాడి దగ్గర మాత్రమే అన్నీ దొరికేలా మోనోపోలీకి చూస్తున్నాడు.
చిన్న చిన్న నర్సింగ్ హోమ్ కి ఆఫర్స్ ఇస్తున్నాడు పేషెంట్స్ ని రెఫెర్ చేస్తే కట్స్ ఇస్తానని,అలాగే పేషెంట్స్ ని పంపే ఆరెంపీ లకి నెలకి లక్ష ఇస్తున్నాడు. వీడి దెబ్బకి ఇన్నాళ్లు బాగా నడిచిన కేర్,సెవెన్హిల్స్ మూతకొచ్చాయ్. వీడి ఉద్దేశ్యం ఏంటంటే ఇదంతా చేసి షేర్స్ ఓపెన్ చేసి
ఒక సంవత్సరంలో మూసేస్తాడు సార్,ఈలోపు వచ్చినోడికి వచ్చినంత.
నే-మరి పేషెంట్స్?
క -ఆళ్ల సంగతి మరీ ఘోరం, ఏదానికి అడ్మిట్ అయినా మినిమం లక్షబిల్లు. యాభై అయ్యే దగ్గర లక్ష అవుతుంది, మరి ఈల్లందరికీ ఇవ్వాలి ఆడు తినాలి కదా సార్.
నే -ఇంతకీ దీనికి ఓనర్ ఎవరు?
క-సార్ మన డాక్టర్స్కి ఇంత సీన్లేదు
ఇదంతా వెనకనుంచి పొలిటిషన్స్ చేయిస్తున్నారు, ఇంత భారీగా అవ్వాలంటే ఆళ్ళు లేనిదే అవ్వదు. అసలు నాకు తెలిసి మన కేజీహెచ్ లో కాటన్ లేదంటే ఇంక మార్చురీ కివెళ్ళేవాడు తప్ప ఎవడు అక్కడికి ఎల్లడు,ఉన్నవన్నీ అమ్మేసుకుని ఈడిదగ్గర చేరిపోడమే. గొప్ప ఘోరంగా ఉంది సార్ పరిస్థితి.
నే- ఇంతకీ నీకేం ఆఫర్ చేసాడు ?
క- ఆడేం ఆఫర్ చేసాడో పక్కన పెట్టండి, ఆడు నన్ను నా ప్రాక్టీస్ వదిలేసి మొత్తం వచ్చేయమన్నాడు,అక్కడ వాడికి సైకియాట్రీ డిపార్ట్మెంట్ డెవలప్ చేసివ్వాలట. నేను మరి బయటెక్కడా చూడకూడదన్నాడు, మొత్తం అందరు పేషెంట్స్ ని నేనే చూడాలట, అక్కడ తప్ప ఇంకెక్కడా
అడ్మిట్ చెయ్యకూడదట. అయినా మనోళ్ళకి మళ్ళీ మళ్ళీ అడ్మిషన్స్ అవసరం అవుతాయి,చిన్న నర్సింగ్ హోముల్లో వాడికి పదివేలతో అయిపోద్ది,అదే వీడి దగ్గర చేరిస్తే జన్మలో మళ్ళీ అడ్మిట్ అవ్వలేడు,మరింక డబ్బులుండవ్ కదా, తీరా ఇంతా చేస్తే నెలకి మూడు లక్షలు ఇస్తానంటున్నాడు, నాకిప్పుడొస్తుంది దానికి
తక్కువే గాని ఆడు మరీ అనెథికల్ అనిపిస్తోంది, నేను పోరా బాబు అన్నాను, మన రాజేష్ దగ్గరికెళ్ళాడు,ఆయనకింకా తక్కువ ఆఫర్ చేసాడు,ఆయనా పోరా అన్నాడు. ఆడికెవరైనా చెప్పాలి బాబూ అంత పెద్ద హాస్పిటల్ లో ఆ డిపార్ట్మెంట్ నడిపించాలి అంటే ఒక్కడు సరిపోడు అని, అయినా ఆడి దగ్గర చేరినా
ముందు రెండు నెలలు ఇస్తాడు , ఆ తరువాత మన నుంచి డబ్బులు జెనెరేట్ అవ్వకపోతే జీతం నొక్కేస్తాడు. మనం ఏదైనా ఈఎమ్మై కి దొరికిపోయామంటే అంతే సంగతులు. ఇప్పుడైతే ఎదో మనకొచ్చే పేషెంట్స్ నెల నెలా వస్తారు మూడొందలిస్తారు, ఆళ్ళు హ్యాపీ నేను హ్యాపీ, తగ్గితే మన పేరు ఒక పది మందికి చెప్తారు,
వీడేంటి సార్ పేషెంట్స్,డాక్టర్స్ ఇద్దరి దగ్గర రసం తీసేస్తున్నాడు. సిస్టం బాగా పాడైపోయింది సార్. ఇంతకీ నేను వెళ్ళకపోవడం మంచిదే కదా.
నే- (షాక్ నుంచి తేరుకోలేక అప్రయత్నంగా)మంచిదే.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Dr Srikanth Miriyala

Dr Srikanth Miriyala Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @miryalasrikanth

27 Oct
అప్పుడే ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరాను,బస్సులో యూట్యూబ్ లో అప్పటికే సిద్ధం చేసుకున్న బాలు రాజా తమిళ పాటల మాలిక ఎంచుకునేలోపు, సూర్యప్రకాష్ ఐఏఎస్ (పేరు మార్చాను)నుంచి సందేశం,"సార్,మీక్కొంచెం సమయం ఉంటే రెండు నిముషాలు మాట్లాడాలి" నేను సరేనండీ అంటే ఫోన్ చేసి అరగంట మాట్లాడారు.
దాదాపు ఐదేళ్లక్రితం పదహారేళ్ళ వాళ్ళ అబ్బాయిని విశాఖపట్నంలో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు తీసుకొచ్చారు. అబ్బాయికి తీవ్రమైన ఓసీడి. రోజులో దాదాపు చాలా సమయం గదిలోనే ఉండటం, టీవీ సినిమా చూసేటప్పుడు శృంగారభరితమైనవి చూసేస్తానేమో, అవి చుస్తే చెడ్డవాడ్ని అయిపోతానేమో అనే భయం.స్నేహితులు లేరు,
అమ్మాయిలంటే ఆమడ దూరం. అతి శుభ్రం. వీటివలన కాలేజీ కి వెళ్లలేకపోవటం, మూడేళ్ళ నుంచి ఇలా ఉంది. అప్పటికే నలుగురు మానసిక వైద్యులకు చూపించటం అది కాస్తా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఎవరో నా పేరు చెప్తే తీసుకొచ్చారు. మందులతో, కౌన్సెలింగ్ తో వైద్యం ప్రారంభించాను. ప్రతివారం క్రమం
Read 13 tweets
15 Oct
తుమ్ము అనేది మన శ్వాస వ్యవస్థ పై భాగంలో ఏదైనా చికాకు కలిగించేదానిని బయటకు పంపేందుకు ఉండే ఒక రక్షణ చర్య. అలాగే దగ్గు కూడా శ్వాస వ్యవస్థలో కింది భాగంలో అడ్డంకులు, అలాగే పేరుకుపోయిన కఫాన్ని పంపేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండూ సహజమైనవి. కొన్ని రకాల ఎలర్జీ లో తుమ్ములు అదేపనిగా వస్తుంటాయి
వాటివలన ఉపయోగం లేదు, అందుకని మందులు వేసి తగ్గిస్తాం, అలాగే ఉపయోగం లేని దగ్గుకి కూడా చికిత్స చేస్తాం. ఊపిరి తిత్తుల చుట్టూ ఛాతిలో పక్కటెముకలమధ్యలో మూడు రకాల కండరాలుంటాయి. అలాగే ఊపిరితిత్తుల కిందన విభాజక పటలం అని ఉదరాన్ని, ఛాతీని వేరుచేస్తూ అట్టలాంటి పెద్ద కండరం ఉంటుంది.
ఇవి కాక మెడ కింద కొన్ని కండరాలు కూడా ఉంటాయి.తుమ్ము వచ్చే ముందు ఊపిరితిత్తుల నిండా సాధారణం కంటే ఎక్కువ గాలి చేరుతుంది, ఈ చేరినది అంతా ఒకే సారి బలంగా బయటకు రావటానికి ఈ కండరాలన్నీ ఒక్కసారి సంకోచిస్తాయి, దాంతో ఊపిరితిత్తులపై అపారమైన ఒత్తిడి పడి అందులోని గాలి ఒక్కసారిగా బయటకు వస్తుంది
Read 11 tweets
29 Sep
హెరాయిన్ గురించి తెలుసుకుందాం. మాదకద్రవ్యాలు అవి పనిచేసే తీరుని బట్టి మూడు రకాలు. ఒక రకం ఉత్ప్రేరకాలు అంటే పొగాకు,కాఫీ,కొకైన్ లాంటివి, ఇంకోరకం మత్తు కలిగించేవి అంటే గంజాయి,సారా,హెరాయిన్ వంటివి, మూడోరకం మతిభ్రమించేవి అంటే లైసెర్జిక్ ఆమ్లం, మ్యాజిక్ పుట్టగొడుగులు మొదలైనవి.
అసలు హెరాయిన్ తయారుచేసింది మార్ఫీన్ ని చూసి, ఇది మధ్యధరా ప్రాంతంలో పెరిగే పపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి ఐదు వేల ఏళ్ళ క్రితమే తీశారు.ఇవి తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి దిగుమతి చేయబడ్డాయి, తద్వారా ఆ కంపెనీ వారు బాగా సంపాదించారు కూడా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం
మార్ఫీన్, కోడీన్ సహజంగా దొరికే ఓపియం మత్తు పదార్ధాలు అయితే వాటిని చూసి శాస్త్రవేత్తలు హెరాయిన్,ఫెంటానీల్,ఆక్సీ కోడోన్,మెథడోన్ అనే మొదలైన కృత్రిమమైనవి తయారు చేసారు.ఇవన్నీ ఒకప్పుడు గానీ,ఇప్పుడు గానీ మందులుగా వాడుతున్నవే.కాన్సర్ వైద్యంలో,నొప్పి నివారణగా,శస్త్ర చికిత్సలో ఇవి వాడతారు.
Read 10 tweets
17 Sep
ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం ఈ సందర్బంగా గుండెని పదిలంగా ఉంచుకోడానికి కొన్ని చెప్తాను. అవి చెప్పేముందు గుండెజబ్బు గురించి కొన్ని విషయాలు. అసలు గుండె అనేది ఒక కండరం. ఈ కండరం లోపల ఖాళీలో రక్తం ఉంటుంది అది పెద్ద ధమనుల ద్వారా ఒంట్లో అవయవాలకి, ఊపిరితిత్తులకు పంపబడుతుంది.
ఈ గుండె కండరం పని చెయ్యటానికి హృదయ ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇవి చాల సున్నితమైనవి పైగా సన్నటివి. గుండె నిరంతరం పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడుకి 0.6సెకండ్ల విశ్రాంతి తీసుకుంటుంది, ఆ సమయంలో దానికి కావాల్సిన రక్తం తీసుకుంటుంది, అయితే మనం పరిగెత్తినపుడు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా
శృంగారంలో పాల్గొన్నప్పుడు గుండె వేగం పెరిగి గుండె విశ్రాంతి తీసుకునే సమయం 0.2సెకండ్లకి పడిపోతుంది అంటే ఆ సమయంలోనే దానికి కావలసిన రక్తాన్ని ఈ సన్నటి ధమనులు ఇస్తాయి. ఈ ధమనులు ఆరోగ్యముగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ వాటి లోపల కొవ్వు పేరుకుపోయి ఇరుకు అయినప్పుడు గుండె కి కావాల్సినంత
Read 13 tweets
11 Sep
సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి.
2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం.
5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.
Read 6 tweets
27 Aug
జననాంగాల గురించి తెలుసుకుందాం
వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో పని చేస్తాయి. ఇవి శుక్రకణాలను తయారు చెయ్యడమే కాకుండా మగ వారి లైంగిక పటుత్వానికి అలాగే మిగిలిన క్రియలకు అవసరం అయిన టెస్టోస్టెరోన్ హార్మోను ని ఉత్పత్తి చేస్తాయి.
ఇందుకోసం ఇవి శరీరం బయట వదులైన సంచిలో ఉంటాయి .అయితే చాలా మంది బిగుతైన లోదుస్తులు వేసుకువడం , ఒడిలో లాప్టాప్ పెట్టుకుని ఎక్కువసేపు పని చెయ్యటం వంటి వాటి వలన వృషణాల పనితీరు తగ్గుతుంది. ఇది సంతాన లేమికి దారి తీయొచ్చు. గత ఇరవై ఏళ్లలో వీర్యం నాణ్యత దాదాపు సగానికి పడిపోయింది.
అయితే ఒత్తిడి , కాలుష్యం, ఆహారం ఇవన్నీ కారణాలు కావచ్చు కానీ ఇతమిద్దంగా ఇవే అని తెలీదు. ఇక పోతే అంగాన్ని ఎప్పటికప్పుడు చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ముందు చర్మం వెనక్కి లాగి శిశ్నము దగ్గర పేరుకుపోయిన స్మేగ్మాని కడగాలి. స్మెగ్మా అనేది చనిపోయిన కణాలు, మట్టి, వీర్యం మొదలైన
Read 12 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(