బంధువైన వైద్యుడితో ఉచిత వైద్యం ఎందుకు చేయించుకోకూడదు?
1.వాళ్ళు జబ్బుకి సంబంధించి అన్ని ప్రశ్నలు అడగరు,వాళ్ళకి తెలుసని నువ్వనుకుంటావ్,వాళ్ళకి తెలుసని వాళ్ళనుకుంటారు. దాంతో ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉండదు.
2.తొంభై శాతం శారీరక పరీక్ష జరగదు,కన్సల్టేషన్ ఫోన్లోనే ముగుస్తుంది
3.వైద్యుడు బంధువైతే నువ్వు టెస్టులు చేపించుకోవు, మందులు కొనుక్కోవు ఎందుకంటే వైద్యుడితో మాట్లాడేసాం మరేం ఫర్వాలేదు,ఇంకా ఎక్కువైతే అతనే చూసుకుంటాడు అని. 4. ఉచిత వైద్యం వలన ఆ వైద్యుడికి ఖాళీ దొరికే వరకు ఆగి అప్పుడు ఫోన్ చెయ్యాలి,అప్పటివరకు నొప్పిని పంటి కింద బిగించాలి.
5.రెండుసార్లు ఫోన్ ఎత్తిన డాక్టర్,మూడోసారి నుంచి ఎత్తడు,ఒకవేళ ఎత్తినా అసిస్టెంట్ మాట్లాడి డాక్టర్ గారు థియేటర్లో ఆపరేషన్ బిజీలో ఉన్నారు అని చెప్పిస్తారు. అప్పటికే సగం వైద్యం అయిన నువ్వు రేనోవేషన్ కోసం ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణలో కొట్టేసిన గుమ్మంలా ఎదురుచూస్తూ ఉంటావు.
6.నువ్వేది గోప్యంగా చెప్పినా,ఎంత గోప్యంగా చెప్పినా రాత్రి పది అయ్యేలోపు డాక్టర్ వాళ్ళ భార్య లేదా భర్తతో చెప్పేస్తారు,వాళ్ళు పొద్దున్న పది అయ్యేలోపు చుట్టాలందరికి చెప్పేస్తారు,మళ్ళీ రాత్రి పదికల్లా ఆ విషయం నీ భార్యకో,భర్తకో తెలిసిపోతుంది.
7.ఒకసారి నువ్వు ఆ డాక్టర్ కి పేషెంట్ అయ్యాక మరి బంధువు కానట్టే, ఇక అక్కడ్నుంచి ఆఫీసు సూపరింటెండెంట్ కి కొత్తసంవత్సరం యాపిల్ పళ్ళు పట్టుకెళ్ళే గుమస్తా లాగా డాక్టర్ పెంచుకునే కుక్క చావు కర్మకి కూడా వెళ్లక తప్పదు. ఇక డాక్టర్ గారి పిల్లల్ని వాళ్ళు కూడా డాక్టర్లు అవుతారని పొగడకతప్పదు
8.పోనీఇంతాచేస్తే ఆడాక్టర్కి అన్నీ తెలీవు,ఎవరి స్పెషాలిటీ వాళ్ళది,ఒకవేళ తెలీకపోతే ఇంకోడాక్టర్ దగ్గరికి పంపితే నువ్వేమనుకుంటావో అని మొహమాటానికి పంపడు,దాంతో పోయేది నీ ఆరోగ్యమే.ఒకవేళ ధైర్యం చేసి ఇంకొకరి దగ్గరికెళ్లమంటే నువ్వు ఆ డాక్టర్ కి పొగరనో,ఏం తెలీదనో,డబ్బు వ్యామోహమనో అనుకుంటావ్
9.అయితే మరి బంధువైన డాక్టర్ ని ఎలా ఉపయోగించుకోవాలి ?
-సెకండ్ ఒపీనియన్ అడగవచ్చు,ఇంకో వైద్యుడు మీకు ఫలానా వైద్యం అవసరమనో లేక సర్జరీ అవసరమనో చెప్తే ఆ అభిప్రాయం సరైందో కాదో అడగొచ్చు.
- అత్యవసర సమయంలో
- మంచి స్పెసలిస్ట్ వైద్యులు వాళ్ళకి తెలిసినవారి రెఫరల్ కోసం
అందుకని ఇకనుంచి ఏ ఆరోగ్య సమస్యకైనా వేరే వైద్యుడి దగ్గరికెళ్లి వాళ్ళకివ్వాల్సిన రెండొందలో ,మూడొందలో ఇచ్చి సరైన వైద్యం చేయించుకోండి.నిశ్చింతగా ఉండండి. డబ్బులిచ్చారు కాబట్టి వాళ్ళని మీ ఆరోగ్యం గురించి ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, అది ప్రభుత్వ వైద్యుడినైనా సరే ,అది మీ హక్కు.
మా అమ్మానాన్న కి నేను వైద్యం చెయ్యను, వాళ్ళకి ఐదుగురు స్పెషలిస్ట్ వైద్యులున్నారు, ప్రతి రెండునెలలకి ఒకసారి వెళ్లి కలుస్తారు,ఫీజు ఇస్తారు. రిపోర్టులు ,మందులు నేను సరి చూస్తాను. ఆ ఐదుగురు వైద్యులకు నేను ఫోన్ చేసి విసిగించను. నేను నిశ్చింతగా ఉంటాను నా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల.
నేను,మా శ్రీమతి ఇద్దరం వైద్యులం అయినా మేము వైద్యం కోసం వేరే వైద్యుడి దగ్గరికెళతాం. కాబట్టి మీరు కూడా ఇది పాటించి నిశ్చింతగా ఉండండి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
డాక్టర్ కరణ్ (పేరు మార్చాను )- హలోసార్, ఎలాఉన్నారు?
నేను -హాయ్ కరణ్,బాగున్నా,ఏంటి సంగతులు?
క-మెగా హాస్పిటల్స్ వాడు ఇక్కడ నాలుగు హాస్పిటల్స్ మూయించేసి వాటిని తీసేసుకుని నాలుగు హాస్పిటల్స్ స్టార్ట్ చేసాడు సార్,నన్ను తీస్కుంటా అన్నాడు. నేను రానన్నాను,నేను కరక్టా కాదా అని మీకు చేశా.
నే-ఇంతకీ ఏమంటాడు వాడు?
క-మొత్తం చెప్తాను సార్,వాడిక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ అందర్నీ లాగేసాడు సార్,భారీ ప్యాకేజీ ఇస్తూ,మన పల్మొనోలోజిస్ట్ గారికి 12లాక్స్ పర్ మంత్ ఇస్తున్నాడు. వాడేంటంటే అన్ని స్పెషలిటీస్ బయట క్లోజ్ చేసి వాడి దగ్గర మాత్రమే అన్నీ దొరికేలా మోనోపోలీకి చూస్తున్నాడు.
చిన్న చిన్న నర్సింగ్ హోమ్ కి ఆఫర్స్ ఇస్తున్నాడు పేషెంట్స్ ని రెఫెర్ చేస్తే కట్స్ ఇస్తానని,అలాగే పేషెంట్స్ ని పంపే ఆరెంపీ లకి నెలకి లక్ష ఇస్తున్నాడు. వీడి దెబ్బకి ఇన్నాళ్లు బాగా నడిచిన కేర్,సెవెన్‌హిల్స్ మూతకొచ్చాయ్. వీడి ఉద్దేశ్యం ఏంటంటే ఇదంతా చేసి షేర్స్ ఓపెన్ చేసి
అప్పుడే ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరాను,బస్సులో యూట్యూబ్ లో అప్పటికే సిద్ధం చేసుకున్న బాలు రాజా తమిళ పాటల మాలిక ఎంచుకునేలోపు, సూర్యప్రకాష్ ఐఏఎస్ (పేరు మార్చాను)నుంచి సందేశం,"సార్,మీక్కొంచెం సమయం ఉంటే రెండు నిముషాలు మాట్లాడాలి" నేను సరేనండీ అంటే ఫోన్ చేసి అరగంట మాట్లాడారు.
దాదాపు ఐదేళ్లక్రితం పదహారేళ్ళ వాళ్ళ అబ్బాయిని విశాఖపట్నంలో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు తీసుకొచ్చారు. అబ్బాయికి తీవ్రమైన ఓసీడి. రోజులో దాదాపు చాలా సమయం గదిలోనే ఉండటం, టీవీ సినిమా చూసేటప్పుడు శృంగారభరితమైనవి చూసేస్తానేమో, అవి చుస్తే చెడ్డవాడ్ని అయిపోతానేమో అనే భయం.స్నేహితులు లేరు,
అమ్మాయిలంటే ఆమడ దూరం. అతి శుభ్రం. వీటివలన కాలేజీ కి వెళ్లలేకపోవటం, మూడేళ్ళ నుంచి ఇలా ఉంది. అప్పటికే నలుగురు మానసిక వైద్యులకు చూపించటం అది కాస్తా ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఎవరో నా పేరు చెప్తే తీసుకొచ్చారు. మందులతో, కౌన్సెలింగ్ తో వైద్యం ప్రారంభించాను. ప్రతివారం క్రమం
తుమ్ము అనేది మన శ్వాస వ్యవస్థ పై భాగంలో ఏదైనా చికాకు కలిగించేదానిని బయటకు పంపేందుకు ఉండే ఒక రక్షణ చర్య. అలాగే దగ్గు కూడా శ్వాస వ్యవస్థలో కింది భాగంలో అడ్డంకులు, అలాగే పేరుకుపోయిన కఫాన్ని పంపేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండూ సహజమైనవి. కొన్ని రకాల ఎలర్జీ లో తుమ్ములు అదేపనిగా వస్తుంటాయి
వాటివలన ఉపయోగం లేదు, అందుకని మందులు వేసి తగ్గిస్తాం, అలాగే ఉపయోగం లేని దగ్గుకి కూడా చికిత్స చేస్తాం. ఊపిరి తిత్తుల చుట్టూ ఛాతిలో పక్కటెముకలమధ్యలో మూడు రకాల కండరాలుంటాయి. అలాగే ఊపిరితిత్తుల కిందన విభాజక పటలం అని ఉదరాన్ని, ఛాతీని వేరుచేస్తూ అట్టలాంటి పెద్ద కండరం ఉంటుంది.
ఇవి కాక మెడ కింద కొన్ని కండరాలు కూడా ఉంటాయి.తుమ్ము వచ్చే ముందు ఊపిరితిత్తుల నిండా సాధారణం కంటే ఎక్కువ గాలి చేరుతుంది, ఈ చేరినది అంతా ఒకే సారి బలంగా బయటకు రావటానికి ఈ కండరాలన్నీ ఒక్కసారి సంకోచిస్తాయి, దాంతో ఊపిరితిత్తులపై అపారమైన ఒత్తిడి పడి అందులోని గాలి ఒక్కసారిగా బయటకు వస్తుంది
హెరాయిన్ గురించి తెలుసుకుందాం. మాదకద్రవ్యాలు అవి పనిచేసే తీరుని బట్టి మూడు రకాలు. ఒక రకం ఉత్ప్రేరకాలు అంటే పొగాకు,కాఫీ,కొకైన్ లాంటివి, ఇంకోరకం మత్తు కలిగించేవి అంటే గంజాయి,సారా,హెరాయిన్ వంటివి, మూడోరకం మతిభ్రమించేవి అంటే లైసెర్జిక్ ఆమ్లం, మ్యాజిక్ పుట్టగొడుగులు మొదలైనవి.
అసలు హెరాయిన్ తయారుచేసింది మార్ఫీన్ ని చూసి, ఇది మధ్యధరా ప్రాంతంలో పెరిగే పపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి ఐదు వేల ఏళ్ళ క్రితమే తీశారు.ఇవి తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశానికి దిగుమతి చేయబడ్డాయి, తద్వారా ఆ కంపెనీ వారు బాగా సంపాదించారు కూడా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం
మార్ఫీన్, కోడీన్ సహజంగా దొరికే ఓపియం మత్తు పదార్ధాలు అయితే వాటిని చూసి శాస్త్రవేత్తలు హెరాయిన్,ఫెంటానీల్,ఆక్సీ కోడోన్,మెథడోన్ అనే మొదలైన కృత్రిమమైనవి తయారు చేసారు.ఇవన్నీ ఒకప్పుడు గానీ,ఇప్పుడు గానీ మందులుగా వాడుతున్నవే.కాన్సర్ వైద్యంలో,నొప్పి నివారణగా,శస్త్ర చికిత్సలో ఇవి వాడతారు.
ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం ఈ సందర్బంగా గుండెని పదిలంగా ఉంచుకోడానికి కొన్ని చెప్తాను. అవి చెప్పేముందు గుండెజబ్బు గురించి కొన్ని విషయాలు. అసలు గుండె అనేది ఒక కండరం. ఈ కండరం లోపల ఖాళీలో రక్తం ఉంటుంది అది పెద్ద ధమనుల ద్వారా ఒంట్లో అవయవాలకి, ఊపిరితిత్తులకు పంపబడుతుంది.
ఈ గుండె కండరం పని చెయ్యటానికి హృదయ ధమనులు రక్తాన్ని తీసుకెళ్తాయి. ఇవి చాల సున్నితమైనవి పైగా సన్నటివి. గుండె నిరంతరం పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడుకి 0.6సెకండ్ల విశ్రాంతి తీసుకుంటుంది, ఆ సమయంలో దానికి కావాల్సిన రక్తం తీసుకుంటుంది, అయితే మనం పరిగెత్తినపుడు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా
శృంగారంలో పాల్గొన్నప్పుడు గుండె వేగం పెరిగి గుండె విశ్రాంతి తీసుకునే సమయం 0.2సెకండ్లకి పడిపోతుంది అంటే ఆ సమయంలోనే దానికి కావలసిన రక్తాన్ని ఈ సన్నటి ధమనులు ఇస్తాయి. ఈ ధమనులు ఆరోగ్యముగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ వాటి లోపల కొవ్వు పేరుకుపోయి ఇరుకు అయినప్పుడు గుండె కి కావాల్సినంత
సామజిక మాధ్యమాలు వాడేటప్పుడు మానసిక ప్రశాంతత కాపాడుకోవటం ఎలా ?
1.ముందు ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్ మొ. వాటికి నోటిఫికేషన్స్ తీసేయాలి. అవి మోగినప్పుడు కాకుండా మీకు నచ్చినప్పుడు వాటిని తెరవాలి. 2. మీకున్న అభిరుచులు ఉన్నవారితో పరిచయం ఏర్పాటు చేసుకోండి. గోప్యత విషయంలో జాగ్రత్త.
3.మన అభిరుచులకు, విలువలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవారు ఉంటారు అని గమనించండి. వీరితో వీలైతే సంవాదం చేయండి.వారి తరుఫు నుంచి వారు సరి అని గుర్తించండి.బూతులకు,వ్యక్తిగత విమర్శకు తావు ఇవ్వొద్దు, ఇతరులనుండి వాటిని సహించవద్దు. అవసరం అయితే వారిని బ్లాక్ చెయ్యండి.
4. ఈ మాధ్యమాల పట్ల జాగరూకత అవసరం, ఎంత సమయాన్ని గడుపుతున్నారు అన్నది ఎప్పటికప్పుడు స్వీయ విశ్లేషణ అవసరం. 5. ఆన్లైన్ పరిచయాలు వ్యక్తిగత పరిచయాలుగా దారి తీయటానికి సమయం తీసుకోండి .తొందరపాటు నిర్ణయాలు వద్దు.
6.నొప్పించే వ్యాఖ్యలు చెయ్యొద్దు, వీలైతే క్షమాపణ చెప్పండి లేదా తొలగించండి.