ఈ తేదీని మొట్టమొదట 1995లో గుర్తించారు. (దేశంలో "పల్స్ పోలియో" కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం). 16 మార్చి 1995న దేశవ్యాప్తంగా 'జోనస్ సాల్క్ కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా 'ఓరల్ పల్స్ పోలియో డ్రైవ్ ప్రారంభమైంది.
భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతియేట 16 మార్చిన “జాతీయ వ్యాక్సినేషన్ దినం (నేషనల్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ డే్రే'ను పాటించుట ఆనవాయితీగా మారింది. జాతీయ టీకా దినం-2022 నినాదంగా 'అందరికీ అందుబాటులో టీకాలు
(వ్యాక్సీన్ వర్కస్ ఫర్ ఆల్” అనబడే అంశాన్ని తీసుకొని, టీకాలకు భయపడే వారితో పాటు టీకాలను వ్యతిరేకించే
వారిని కూడా టీకా పరిధిలోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు ప్రమాదకర
వ్యాధులను జీవితకాలం నిరోధించడానికి,
ప్రజారోగ్య పరిరక్షణకు, ఆరోగ్య నియంత్రణకు,
ప్రాణాలు కాపాడటానికి టీకాలే దివ్య బెషధాలని ఐరాస -- డబ్ల్యూహెచ్ఓ పిలుపునిస్తున్నది.
టీకాలతో ఆరోగ్య, ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని, వ్యాధులు సోకకుండా నాటి నేటి వరకు భారతీయుల ఆరోగ్య కవచంగా
నవజాత శిశువు నుండే వయోవృద్ధుల వరకు టీకాలు పలు రోగాల పట్ల
వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడం, జీవితకాలం వ్యాధులు సోకకుండా కట్టడి చేయడం చూస్తున్నాం. గత రెండు ఏండ్లుగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా టీకాలు మానవ జాతికి వరాలుగా ఆవిష్కరించబడ్డాయి.”
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.
శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం.
ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మండు వేసవిలో పరవళ్లుతొక్కే నీటి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాన్ని తప్పక దర్శించాలి .
బయో ఇంధనాలు బయోమాస్ ల నుంచి పరిశ్రమల్లో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఆహార పదార్థాల ఉత్పత్తులు తయారయ్యేటపుడు వచ్చే వ్యర్థాలనుంచి లేదా వంటనూనె, వనస్పతులను లను తిరిగి ఉప ఉత్పత్తులుగా పెట్రోలియం తయారౌతాయి.బయో ఇంధనాల్లో పెట్రోలియం లేకపోయినా,వాటిని ఏ మోతాదుల్లొనైనా కలిపి #Biodiesel #Diesel
ఒక బయో ఇంధన మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న మిశ్రమాన్ని మనయంత్రాల్లో పెద్ద మార్పులవసరం లేకుండానే వాటిని డీజిల్ ఇంజన్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.బయో ఇంధనాలని వాడటం సులభం,వదిలించుకోవడం సులభం, విషరహితం.దీనిలో గంధకం ఉండదు. పైగా ఇది వాసన లేనిది. #BiodieselDay 🌱🌵⛽🛢️
ప్రస్తుతం విచ్చలవిడిగా అవసరానికి మించి వాడుతున్న నేలబొగ్గు (భూమిగర్భం నుండి త్రవ్వితీసిన బొగ్గు) మరియు ముడిపెట్రోలియం నుండి ఉత్పత్తి కావించు ఖనిజ నూనెలు, వాయువులు, పెట్రోలియం బావుల నుండి ప్రారంభంలో వెలువడు సహజ వాయువు వంటివి అన్నియు శిలాజ ఇంధనాలు.
#summervibes#SummerHealth#Tips#Summer2022
వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రానురాను ఉష్ర్ణోగతల వల్ల జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ఎండలతో పాటు ఈ సీజన్లో వచ్చే వ్యాధులు జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలో ఎక్కువ సమయం గడిపిన, సమయానికి ఆహారం తీసుకోకపోయిన, కలుషిత నీరు తదితర కారణాల వల్ల వ్యాధులు వచ్చే సూచన ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అతిసారం, నీళ్ల విరేచనలు, చికెన్‌ఫాక్స్, హైపటైటేస్ వంటి వ్యాధులు వస్తాయి.
ముందు జాగ్రత్తలు తీసుకుని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని వైద్యులు కొన్ని చిట్కాలను సూచించారు.
హీట్ ఫెరాసియా(ఎండ వేడితో వచ్చే జ్వరాలు)ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయాల్లో శరీర ఉష్ణోగ్రత పెరిగి హీట్ ఫెరాసియా వ్యాధి వస్తుంది.
#holi 🔫🔵🔴🟢🟡🟠💜💕👣
హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో ఆడుకునే రోజు. అసలు ఈ రంగులకేళీ ఎప్పటి నుంచి జరుపుకొంటున్నారు ? ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా నిర్వహిస్తారో తెలుసుకుందాం…
శిశిరరుతువు పోతూ వసంతం రావడానికి మరో పదిహేను రోజులు మిగిలిన ఈ సందర్భంలో ఈ పండుగను నిర్వహిస్తారు. శిశరంలో ఆకులు రాలిపోయి.. లేలేత రంగుల్లో వివిధ వర్ణాల్లో చెట్లు ఒక విచిత్రమైన శోభను సంతరించుకునే సంధి సమయం ఇది. ప్రకృతిలో పండిపోయిన ఆకులు, కొత్తగా చిగురిస్తున్న ఆకులు..
బంగారు వర్ణం.. లేత ఆకుపచ్చ..ఇలా ఇన్నెన్నో వర్ణాల మిశ్రతంగా కన్పించే అరుదైనకాలంలో వచ్చే పండుగ హోళీ.
హోళీ ఎందుకు చేస్తారు?
ఈ పండుగను పూర్వం నుంచి దుష్టశక్తులపై విజయానికి సంకేతంగా నిర్వహిస్తున్నారు. ప్రాచీనగాథల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు అయిన