ఈ ఇది డిజిటల్ టోకెన్, ఇది 2013 లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బిల్లీ మార్కస్ మరియు జాక్సన్ పామర్
బిట్‌కాయిన్‌కు (పేరడీగా) ప్రత్యామ్నాయంగా రూపొందించారు.
ఇది వ్యంగ్యంగా లేదా ఆ సమయంలో పుట్టుకొచ్చిన అనేక మోసపూరిత క్రిప్టో నాణేలపై 'సరదా' కోసం ప్రారంభించబడింది.
ఆ ఇది చాలా సంవత్సరాల క్రితం వైరల్ అయిన షిబా ఇను అనే పోటి నుండి దాని లోగోను తీసుకొన్నారు.
ఈ డోగే / డోజూ అనది 2013 లో ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ పోటి.ఈ పోటిలో సాధారణంగా షిబా ఇను కుక్క యొక్క చిత్రం ఉంటుంది.
బిట్‌కాయిన్‌ల మాదిరిగా దీనికి ఎగువ పరిమితి లేదు, బిట్ కాయిన్ గరిష్ట సంఖ్య 21 మిలియన్లుగా
నిర్ణయించబడింది (2040 నాటికి).
డాగ్‌కాయిన్ సంఖ్య ఇప్పటికే 100 బిలియన్లకు పైగా చేరుకుంది.
డాగ్‌కోయిన్ పెరగడానికి కారణం ఏమిటి?
ఈ ప్రధాన కారణం ఈ వారంలో యుఎస్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన వర్చువల్ కరెన్సీ మార్పిడి(ఎక్షేంజ్) అయిన కాయిన్‌బేస్ జాబితా లో చేరడమే.
ఈ కాయిన్‌బేస్ మార్కెట్ క్యాప్ క్లుప్తంగా 100 బిలియన్లను తాకింది మరియు బిట్‌కాయిన్, ఎథెరియం పెరగడం తో డాగ్‌కాయిన్ విలువలను పెంచింది.
ఈ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ వంటి పెద్దదిగజం లతో ఇది ప్రచార ప్రయోజనం పొందింది అనే చెప్పాలి.
క్రిష్టోకరన్సీలకు సంబంధించి వ్యాపార సమూహాలలో
ఉత్సాహం ఎక్కువ అయ్యింది. క్రిప్టోకరెన్సీ ఉపయోగం గురించి ఆందోళనలు కుడా ఉన్నాయి
డాగ్‌కోయిన్ యొక్క పెరుగుదల బబుల్‌కు దారి తీస్తుంది, ఎందుకంటే కొనుగోలుదారులు
డిజిటల్ టోకెన్ యొక్క అర్ధవంతమైన విలువను చూడలేరు మరియు
దాని విలువ పెరిగినప్పుడు మాత్రమే దాని వైపు ఆకర్షితులవుతారు.
అవి చాలా అస్థిరతను కలిగి ఉంటాయు మరియు త్వరలో క్రాష్ కావచ్చు.పెద్ద సంఖ్యలో వర్చువల్ కరెన్సీని చెలామనణిలో ఉంచే చిన్న సమూహాలచే వారు అకస్మాత్తుగా తారుమూరు చేసే అవకాశం ఉంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఏంటి? నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు.ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని
లౌకికంగా చెబుతారు.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.
అద్భుత ఫలం అరటి పండు🍌 #BananaDay#Banana
అరటి పండంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. పసిపాపకు తొలిసారి తినిపించే అమృతఫలం. వయస్సుతో పనిలేకుండా, పేదా గొప్పా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సునాయాసంగా తీసుకోగలిగే అద్భుత ఫలం అరటి పండు.
ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో దీన్ని పండిస్తున్నారు.
బియ్యం, గోధుమ, మొక్కజొన్న తర్వాత స్థానాల్లో వున్న ప్రధాన ఆహారపంట ఇదే. దీని స్వస్థలం మాత్రం ఆసియా దేశాలే.
విత్తనాలు ఉండకపోవడానికి కారణమేమిటి?
పండ్లన్నింటిలోనూ చిన్నదో పెద్దదో గింజ ఉంటుంది. కానీ అరటిపండులో మాత్రం గింజలుండవు. నిజానికి మొదట్లో అరటిపండులోనూ గింజలుండేవి.
దాన్నే "అడవి అరటి” అని అంటారు. గట్టి విత్తులుండే ఆ పండు తినడానికి పనికివచ్చేది కాదట, అయితే దాదాపు పదివేల సంవత్సరాల క్రిందట దీని జన్యువుల్లో కొన్ని మార్పులు చేసుకోవడంతో మొలిచిన ఓ చెట్టు వంధ్యంగా మారి విత్తులేని ఫలాన్ని కాసిందట.. అదే అరటి పండుగా నేడు మనందర్ని అలరిస్తోంది.
#CivilServicesDay
పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులందరికీ పౌర్ సేవల దినోత్సవ శుభాకాంక్షలు ✨
జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.
భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016,
ఏప్రిల్ 21 ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది.
1947,ఏప్రిల్ 21వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశ మొదటి సివిల్ సర్వీసు బ్యాచ్ సమావేశంలో ప్రసంగించారు. సివిల్ సర్వీస్ దేశ ఉక్కు కవచం అని ఆయన అభివర్ణించారు. #పౌరసేవలదినోత్సవం 🇮🇳
సేవ చేసి డబ్బులు తీసుకున్నా... ప్రతి ఫలం పొందినా దాన్ని స్వచ్ఛంద సేవ అనలేం.. స్వచ్ఛంద సేవా అనేది దేన్నీ ఆశించకుండా చేసే పని.
సమాజం పై ప్రేమ బాధ్యత ఉన్నవాళ్లు తోటివారికి సహాయ పడాలన్న ఆలోచన ఉన్నవారు ఎవరి బలవంతము లేకుండా స్వతహాగా వాలంటీర్లు గా పనిచేస్తుంటారు...
స్వచ్ఛంద సేవ(#Volunteering)లోని సారం జీవితాన్ని ఇష్టపూర్వకంగా జీవించడమే. మన జీవితంలో ప్రతీ అంశంలో కూడా మనం ఒక వాలంటీర్ గా ఉండడం.
ఒక వాలంటీర్ అంటే... అతన్ని ఎవరో ఇక్కడ వల వేసి పట్టుకున్నారు కాబట్టి వారు ఈ పనులన్నీ చెయ్యడం లేదు. వీరు అందుకు సుముఖంగా ఉన్నారు. వేరు నా కోరిక ఏమిటీ ... అని ఆలోచించరు. అతను ఏది అవసరమో అది చేస్తారు. అలాంటి పరిస్థితుల వల్ల మీరు స్వేచ్ఛా జీవిగా మారతారు...
#GarlicDay
వెల్లుల్లి (#Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం;
నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. వెల్లుల్లిని "తెల్లగడ్డ" " ఎల్లిగడ్డ" వెల్లుల్లి కి ఉన్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని "పాకహర్షం" గా వర్ణించవచ్చు.
భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.
#BiCycleDay
🚲🚴🚴♀️🚵♀️🚵♂️🚴♂️🚵🚴🚳
సైకిలు (ఆంగ్లం #Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. #Bicycle
విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు.