#GarlicDay
వెల్లుల్లి (#Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం;
నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. వెల్లుల్లిని "తెల్లగడ్డ" " ఎల్లిగడ్డ" వెల్లుల్లి కి ఉన్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని "పాకహర్షం" గా వర్ణించవచ్చు.
భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.
ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడా వెల్లుల్లి విలువని గుర్తించింది.
దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది.
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో
వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట.
అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఒక బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి 1890లో సేకరించిన "బోవర్ మేన్యుస్క్రిప్ట్ (Bower Manuscript) అనే భూర్జపత్ర గ్రంథం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బొడ్లియెన్ గ్రంథాలయంలో ఉంది. ఇది ఆరవ శతాబ్దంలో రాసిన మాతృకకి నకలుట.
ఈ గ్రంథంలో వెల్లుల్లి ప్రస్తావన అనేక సార్లు కనిపిస్తుంది.
మనలో చాలా మందికి తరచుగా జలుబు, ముక్కు దిబ్బడ, జ్వరం వస్తు ఉంటాయి .... వారు వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది . అర చెంచా నేతిలో వేయించియన రెండు వెల్లుల్లి పాయలను
క్రమం తప్పకుండా రోజూ తినాలి . మీ ముఖం, శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు, మసాలా వస్తువులు తినకూడదు .
ఒక వెల్లుల్లి పాయ తిని, రాగిచెంబులో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం, మనం తినే ఆహారంలో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది .
ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా? .. సగం నిమ్మకాయ రసంలో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము, సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయంలో కొవ్వుపదార్ధాలు, పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక).
అర్ధ రాత్రి చెవిపోటు వస్తే ... డాక్టర్, మందులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది . గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది .
రోజూ రెండు వెల్లుల్లి పాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సెర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది . మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
జాగ్రత్తలు :
వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది . వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి .
వీళ్ళు వెల్లుల్లి తినరాదు . ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు.
వెల్లుల్లి మసాల దినుసులు జాబితాలోకి వస్తాయి. దీనిని అన్ని రకాల కూరలోను రుచి కొరకు వేస్తారు. ముఖ్యంగా మసాలాలకు ఇది తప్పనిసరి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#BiCycleDay
🚲🚴🚴♀️🚵♀️🚵♂️🚴♂️🚵🚴🚳
సైకిలు (ఆంగ్లం #Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. #Bicycle
విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు.
#WorldLiverDay 🎗️ #Liver
కాలేయం మానవుని శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం(గ్రంథి) కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది.
అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది.కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
కాలేయం వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. విషాలను హరిస్తుంది, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది.శరీరం మొత్తంలో పెరిగే గుణం కలిగిన ఒకే ఒక అవయవం ‘కాలేయం’. విషాలను హరించటం మొదలుకుని దాదాపు 500 రకాల జీవక్రియలను నిర్వర్తించే శక్తి కాలేయానికి ఉంది.
కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత. #columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
#LinemanAppreciationDay 🔌💡
ప్రతిరోజూ మన జీవితాలను రక్షించడానికి, మరియు ఆధునిక జీవన సౌకర్యాలన్నింటినీ తీసుకురావడానికి అపాయంలోకి ప్రవేశించే పురుషులు మరియు మహిళలు ఉన్నారు. వారు ప్రమాదకరమైన పట్టీలపై భూమికి వందల అడుగుల ఎత్తులో వేలాడుతూ విద్యుత్ వైర్‌ల మధ్య నృత్యం చేస్తారు,
అవి సరిగ్గా నిర్వహించబడకపోతే, భారీ విద్యుత్ తీగలు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
ఆధునిక జీవనంలో విద్యుత్తు ఒక ప్రామాణిక భాగంగా ఉన్నంత కాలం లైన్‌మెన్‌లు ఉంటారు. వారు లేకుంటే మన ఇళ్లకు, వ్యాపారాలకు విద్యుత్తు తీసుకెళ్లే విద్యుత్ లైన్లు ఉండవు.
లైట్లు నిరంతరం వెలగడానికి కర్మాగారాల్లో (విద్యుత్)కొలిమి వెలిగడానికి మన అహ్లాదానికి దోహదం చేస్తున్న టివీలు అంతరాయం లేకుండా పని చేయడానికి లైన్‌మెన్‌లను తరచుగా తమ పనులను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో, అసాధారణ వాతావరణ సవాళ్ళను ఎదుర్కొంటూ శ్రమిస్తారు.
#WorldHeritageDay
🌉🌆🗼🌍
ఆదిమానవుడి కాలం నాటి కొండ గుహలు, అరుదైన రేఖా చిత్రాల నుంచి నేటి కట్టడాల వరకు ప్రతిఅంశమూ మానవ జీవిత పరిణామక్రమంలో వారసత్వ సంపదే. వేల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో మానవ మేధస్సుతో, సాంకేతిక ఉషస్సుతో నిర్మించిన వన్నె తగ్గని నిర్మాణాలు, #HeritageDay
కట్టడాలు విలువ కట్టలేని వారసత్వ సంపద. మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చారిత్రక స్పహ కలిగిన మేధావుల సూచనల మేరకు ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో,
ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే రక్తం కారుతుంది. కారుతున్న రక్తం కొద్దిసేపటికి గడ్డ కట్టి ఆగిపోతుంది.ఈ తరహా చాలా మందిలో కనిపిస్తోంది.కానీ కొందరిలో రక్తం నిరంతరం కారుతునేఉంటుంది.కొందరిలో రక్తనా ళాలు చిట్లి కూడా రక్త స్రావం అవుతునే ఉంటుంది. #WorldHemophiliaDay #WorldHaemophiliaDay
ఎక్కడైనా రక్తం గడ్డ కట్టకపోతే ఆ గాయం మానదు. ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా ! లేక గాయం వల్ల బయటకు వచ్చినప్పుడు దారాళంగా కారుతుంటే అది మనిషి మనుగడకే ముప్పు. ఇలాంటి వారిని హిమోఫీలియో వ్యాధిగ్రస్తులు గా వైద్యులు పరిగణిస్తారు.
తల్లిదండ్రులకు ఉంటే జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.రక్త నాళాలు చిట్లితే...