#BiCycleDay
🚲🚴🚴♀️🚵♀️🚵♂️🚴♂️🚵🚴🚳
సైకిలు (ఆంగ్లం #Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇది మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. దీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనాలో సైకిలు ఉపయోగం ఎక్కువగా ఉంది. #Bicycle
విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామం లో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిలు
1813 లో ఒకరోజు మాన్ హీమ్ అనే జర్మనీ వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనంలో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు.
ముంజేతులను ఇనుప కడ్డీలపై ఉంచాడు. ముందు చక్రానికి సంబంధించిన కొయ్య కడ్డీని చేతులతో తిప్పితే పోదలచుకున్న మార్గంలో అతడు వెళ్ళగలుగుతున్నాడు. వీధిలో పిల్లలు కేరింతలు పెడుతూ, వాహనం వెంట పరుగెడుతున్నారు. తోటి ప్రజలు పెనుబొబ్బలు పెడుతూ అట్టహాసం చేస్తున్నారు.
వీటిని లెక్కపెట్టకుండ 28 ఏళ్ళ ఆ యువకుడు మాత్రం పిచ్చివాడిలా ముందుకు సాగిపోతున్నాడు. అతడు బేడన్ ప్రభుత్వం లోని ఒక పెద్ద అధికారి కొడుకు. తన కొడుకు ఆఫీసర్ కావాలని తండ్రి ఆశించాడు. కానీ ఎక్కువ బాధ్యతలు నెత్తిన వేసుకోవటం ఇష్టంలేక బేరన్ డ్రే మామూలు గుమస్తాగా చేరాడు.
అతనికి కొత్త విషయాలు కనుక్కోవాలనే తపన ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాల్లో అభిరుచి, ఉత్సుకత ఉన్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావటం వల్ల యాంత్రిక శాస్త్రం చదవలేకపోయాడు. ఈ నిరాశ అతనిలో మొండి పట్టుదలను పెంచింది.
వీధుల్లో కొత్త వాహనాన్ని ప్రదర్శించటం మూలాన అతని ఉద్యోగం ఊడటమే కాకుండా అతని పట్ల అంతటా ఉపేక్ష, తిరస్కార భావం ఏర్పడ్డాయి. 16 గంటల్లో వెళ్ళే దూరాన్ని కొత్త వాహనం సహాయంతో 4 గంటల్లోనే వెళ్ళగలిగాడు. ఈ నమూనా వాహనాలను తయారుచేయటానికి బేడన్ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందాడు.
కానీ ఎవరూ ఇతణ్ణి గురించి పట్టించుకోలేదు. సొంత ఊరిలో కూడా ఇంతే. 1851 లో దుర్భర దారిద్ర్యంలో అతడు మరణించేసరికి ఇతడు కనిపెట్టిన వాహనాన్ని రైలు పట్టాలపై వెళ్లి మరమ్మత్తులు చేయటానికి, కార్యకలాపాలు పర్యవేక్షించటానికీ, మాత్రమే ఉపయోగిస్తుండేవారు.
అయితే ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పెద్ద అంగలు వేసుకుంటూ ఈ వాహనం చాలా ముందుకు సాగిపోయింది.
మనిషి నడిచేటప్పుడు తన బరువును ఒక కాలి నుంచి మరో కాలికి మార్చటంలో ఎక్కువ శక్తిని వినియోగిస్తాడు. ముందుకు వెళ్ళుతున్నపుడు శరీరాన్ని ఒకే స్థితిలో స్థిరంగా ఉంచగల సాధనం నిర్మించటానికి
వీలవుతుందా అని అతడు తన్ను తాను ప్రశ్నించుకొన్నాడు. ఇలాంటి వాహనాన్ని తయారుచేయాలన్న ఆలోచనే ఇదివరకు తట్టినట్టు లేదు. నిటారుగా ఉండటం అసాధ్యమని అందరూ అనుకునేవాళ్ళు. నిటారుగా ఉంచడం అనుకున్న దానికంటే చాలా తేలిక అని అతడు నిరూపించాడు. ఈ కారణం గానే ఈ "వింత వాహనం" .
ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల దృష్టిని ఆకర్షించింది.
హాబీ గుర్రాలు లేదా డాండీ గుర్రాలు అని పిలువబడే వాహనాలు పారిస్ నగర వీధుల్లోనూ, లండన్ హైడ్ పార్క్ లోనూ అసంఖ్యాకంగా తిరగటం మొదలైంది. తీరిక సమయాల్లో యువకులు, స్త్రీలు వీటిని వాడసాగారు. యువరాజు కూడా ప్రత్యేక వాహనాన్ని తయారుచేయించుకొని
బహిరంగంగా దానిపై విహరించ సాగాడు. చూస్తుండగానే ఈ వాహనాల తయారీ గొప్ప పరిశ్రమగా రూపొందింది. ఇంగ్లండ్, అమెరికా పట్టణాల్లో ఈ కొత్త ఆట కోసం ప్రత్యేకంగా మందిరాలు నిర్మించారు. ప్రజలకు దీనిపట్ల మోజు విపరీతంగా పెరిగింది. దీన్ని గురించి హాస్య రచయితలు వ్యాసాలు రాశారు.
కార్టూనిష్టులు బొమ్మలు గీశారు. అంత జరిగినా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే కొత్త రవాణా సాధనంగా దీన్ని మలిచే ప్రయత్నం ఎవరూ చేయలేదు..
సైకిలుని మరింత చిన్నగానూ, వేగంగా పోయే లాగానూ చేయటంలో లాసన్ అనే ఇంగ్లండు దేశీయుడు కృతకృత్యుడయ్యాడు.
రెండు చక్రాల నడుమ క్రాంక్ నీ, ఫెడల్ నీ తొలిసారిగా అమర్చింది ఇతడే. ఫెడల్ ని తొక్కినప్పుడు తొక్కేవాడి కాళ్ళ శక్తిని ఫెడల్ లకు అమర్చిన గేర్ చక్రం నుంచి వెనక ఇరుసు వద్ద ఉన్న చిన్న గేర్ చక్రానికి అందించటం కోసం స్వీడన్ కి చెందిన హాన్స్ రెనాల్డ్ ఒక గొలుసును వాడాడు.
క్రమంగా చక్రాలకు స్ఫోక్ లు, బాల్ బేరింగులు, గేర్ లు, కూర్చోవడానికి స్ప్రింగ్ సీటు కనుక్కోబడ్డాయి. 1890 లో పెద్ద ఎత్తున సైకిళ్ళను తయారుచేయటం మొదలయ్యే సరికి అవి ఇంచుమించు ప్రస్తుతం వాడుతున్న నమూనా ప్రకారమే ఉండేవి. అయితే వాటికి అప్పట్లో టైర్లు మాత్రం లేవు
ప్రముఖ చిత్రకారుడు లియొనార్డొ డావిన్సీ సైకిలును పోలిన రఫ్ స్కెచ్ లు కొన్ని గీశాడు. 1690 లో ఫ్రాన్సు జాతీయుడు దిసివ్రాక్ సైకిలులాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించాడు. దాన్ని "హాబీ హార్స్" అని పిల్చేవారు. దానికి పెడల్స్ లేవు. 1840 లో స్కాట్లాండు జాతీయుడైన
కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ ను జతచేసి నిజమైన సైకిలు రూపును కల్పించాడు. తర్వాత కొన్ని మార్పులకు గురిఅయి 1900 సంవత్సరంలో ఆధునికమైన సైకిలు తయారైంది. ఇది ఇప్పటి సైకిలు మాదిరే ఉండేది
ఐక్యరాజ్య సమితి లోని వియన్నా కన్వెన్షన్, 1968 ప్రకారం సైకిలును ఒక వాహనంగా,
నడిపేవానిని చాలకునిగా గుర్తించారు. చాలా దేశాలలో దీని ప్రకారం లైసెన్సులు కూడా అమలులో ఉన్నాయి. చీకటిలో రహదారి మీద వెళ్ళేటప్పుడు ముందు, వెనక డైనమో సహాయంతో వెలిగే దీపాలు ఉండాలి. కొన్ని దేశాలలో పాదచారులు, బండ్లు, ఇతర వాహనాల కోసం గంట కూడా తప్పనిసరి.
సైకిలు బొమ్మను ఒక ఎన్నికల గుర్తుగా భారతదేశంలో ఎన్నికల సంఘం వాడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్ వాది పార్టీ లకు ఎన్నికల గుర్తుగా సైకిలు బొమ్మ ఇవ్వబడింది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#GarlicDay
వెల్లుల్లి (#Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం;
నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. వెల్లుల్లిని "తెల్లగడ్డ" " ఎల్లిగడ్డ" వెల్లుల్లి కి ఉన్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని "పాకహర్షం" గా వర్ణించవచ్చు.
భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.
#WorldLiverDay 🎗️ #Liver
కాలేయం మానవుని శరీరంలో చర్మం తర్వాతి రెండవ అతి పెద్ద అవయవం(గ్రంథి) కాలేయమే! దాదాపు 1,500 గ్రాముల బరువుండే కాలేయం పని తీరు కూడా భారీగానే ఉంటుంది. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది.
అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది.కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
కాలేయం వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. విషాలను హరిస్తుంది, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది.శరీరం మొత్తంలో పెరిగే గుణం కలిగిన ఒకే ఒక అవయవం ‘కాలేయం’. విషాలను హరించటం మొదలుకుని దాదాపు 500 రకాల జీవక్రియలను నిర్వర్తించే శక్తి కాలేయానికి ఉంది.
కాలమిస్ట్, వ్యాసాలు రాసే పత్రికా రచయిత, పత్రికకు క్రమం తప్పక వ్యాసాలు రాచే రచయిత. #columnist
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు,
గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి.
రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.
#LinemanAppreciationDay 🔌💡
ప్రతిరోజూ మన జీవితాలను రక్షించడానికి, మరియు ఆధునిక జీవన సౌకర్యాలన్నింటినీ తీసుకురావడానికి అపాయంలోకి ప్రవేశించే పురుషులు మరియు మహిళలు ఉన్నారు. వారు ప్రమాదకరమైన పట్టీలపై భూమికి వందల అడుగుల ఎత్తులో వేలాడుతూ విద్యుత్ వైర్‌ల మధ్య నృత్యం చేస్తారు,
అవి సరిగ్గా నిర్వహించబడకపోతే, భారీ విద్యుత్ తీగలు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
ఆధునిక జీవనంలో విద్యుత్తు ఒక ప్రామాణిక భాగంగా ఉన్నంత కాలం లైన్‌మెన్‌లు ఉంటారు. వారు లేకుంటే మన ఇళ్లకు, వ్యాపారాలకు విద్యుత్తు తీసుకెళ్లే విద్యుత్ లైన్లు ఉండవు.
లైట్లు నిరంతరం వెలగడానికి కర్మాగారాల్లో (విద్యుత్)కొలిమి వెలిగడానికి మన అహ్లాదానికి దోహదం చేస్తున్న టివీలు అంతరాయం లేకుండా పని చేయడానికి లైన్‌మెన్‌లను తరచుగా తమ పనులను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో, అసాధారణ వాతావరణ సవాళ్ళను ఎదుర్కొంటూ శ్రమిస్తారు.
#WorldHeritageDay
🌉🌆🗼🌍
ఆదిమానవుడి కాలం నాటి కొండ గుహలు, అరుదైన రేఖా చిత్రాల నుంచి నేటి కట్టడాల వరకు ప్రతిఅంశమూ మానవ జీవిత పరిణామక్రమంలో వారసత్వ సంపదే. వేల సంవత్సరాల మానవ పరిణామక్రమంలో మానవ మేధస్సుతో, సాంకేతిక ఉషస్సుతో నిర్మించిన వన్నె తగ్గని నిర్మాణాలు, #HeritageDay
కట్టడాలు విలువ కట్టలేని వారసత్వ సంపద. మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చారిత్రక స్పహ కలిగిన మేధావుల సూచనల మేరకు ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో,
ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే రక్తం కారుతుంది. కారుతున్న రక్తం కొద్దిసేపటికి గడ్డ కట్టి ఆగిపోతుంది.ఈ తరహా చాలా మందిలో కనిపిస్తోంది.కానీ కొందరిలో రక్తం నిరంతరం కారుతునేఉంటుంది.కొందరిలో రక్తనా ళాలు చిట్లి కూడా రక్త స్రావం అవుతునే ఉంటుంది. #WorldHemophiliaDay #WorldHaemophiliaDay
ఎక్కడైనా రక్తం గడ్డ కట్టకపోతే ఆ గాయం మానదు. ఇది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా ! లేక గాయం వల్ల బయటకు వచ్చినప్పుడు దారాళంగా కారుతుంటే అది మనిషి మనుగడకే ముప్పు. ఇలాంటి వారిని హిమోఫీలియో వ్యాధిగ్రస్తులు గా వైద్యులు పరిగణిస్తారు.
తల్లిదండ్రులకు ఉంటే జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.రక్త నాళాలు చిట్లితే...