మే దినోత్సవం లేదా మే డే (#MayDay)
ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, #అంతర్జాతీయ_కార్మిక_దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. #InternationalLabourDay
భారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను సరఫరా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి
కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం
తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం
తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రికయుగం రాకముందు మనిషి
గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే
కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు.
కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి మన దేశంలో 'మే డే'ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి 'మే డే'ను పాటించడం
జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి 'మే డే'ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల
అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక
చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది.
పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం.
ఈ కాలంలో తిరిగి పని గంటల భారం పెరుగుతున్నది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం ఉద్యోగులు పనిచేయవలసి
వస్తున్నది. సెలవు రోజుల్లో కూడా కొన్ని ప్రైవేటు కంపెనీలు, కాలేజీలు, స్కూళ్ళ పని చేస్తున్నాయి. కార్మిక హక్కులను కాల రాస్తున్నారు. కాబట్టి మే దినోత్సవ ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నది.
☑️రోజుకు 8 గంటలు మాత్రమే కార్మిక, కర్షక కూలీలు పనిచేయాలి.
బాల కార్మికులను పనుల్లో పెట్టుకోకూడదు. వారు వుండాల్సిన చోటు పాఠశాలు మాత్రమే. బడి మానివేసిన ప్రతిపిల్లవాడు, బాలిక బాల కార్మికులే.
☑️కార్మిక కర్షక కుటుంబాలకు విద్య, వైద్యం ఉచితంగా అందాలి.
☑️ప్రపంచంలోని కార్మికులందరి కష్టమూ ఒకే విధంగా వుంటుంది. కాబట్టి తమ హక్కులు సాధించుకోవడానికి ప్రపంచకార్మికులు ఐక్యం కావాలి.
☑️శ్రామిక శక్తి దేశానికి సంపదను ఆర్ధించి పెడుతుంది.
వ్యక్తిత్వం కొనసాగింపే అతడు లేక ఆమె చేసే 'పని'. ఆ పని ద్వారానే వారు తమను తాము నిర్వచించుకుంటారు. పని అతడి లేక ఆమె విలువను, మానవత్వాన్ని చాటి చెపుతుంది. పని ఒక వ్యక్తి సాధించే విజయం. పనిలోనే ఆనందం పొందే వ్యక్తులనే మనం శ్రామికులంటాము.
విద్యారులుగా శ్రమను గౌరవించే తత్వం అలవర్చుకోవాలి. చదువు శ్రమ విలువను తెలుపాలి. శ్రమించనిదే ఏదీ మన దరికి రాదనీ, చేతికి అందదనీ తెలుసుకోవడంలోనే శ్రామిక దినోత్సవ గొప్పదనం ఉంది.
శ్రమ మాత్రమే మానవుని అంగసౌష్టవం అందం పెంచుతుంది. శ్రమ మాత్రమే మానవ మేధస్సుకి పదును పెడుతుంది. శ్రమ మాత్రమే మనిషిని ముందుకు నడిపిస్తుంది..
#WorldLaughterDay 😆
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి.
ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం
నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు.దాంతో లాఫ్టర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు.
మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు.
#BabyDay 🍼👼🚼
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు,
క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.
👶చంటిపిల్లలకు తల్లిపాలు ఆరు నెలల వరకు సరిపోతాయి. తల్లిపాలతో పాటు అదనపు ఆహారం 6 నెలల నుండి ప్రారంభించాలి, మొదటిగా పండ్లరసం వంటి ద్రవాలు తరువాత ఆకుకూరలు, కూరగయలు ,పప్పులు ,ధాన్యాలు కలగలిపినటువంటి గుజ్జు పదార్థాలు, క్రమేపి ఇడ్లి , అన్నం వంటి ఘనపదార్థాలు ఇవ్వాలి .
#SchoolPrincipalsDay #HeadMasterDay
ఈ మధ్య కాలం లో ఒక వ్యక్తికి రెండు చేతులూ జోడించి నమస్కరించాలని ఉంది.....ఎవరో కాదు....ప్రధానోపాధ్యాయుడు గా ఉంటూ... మానందరిలో ఉన్నా...కుటుంబసభ్యులతో ఉన్నా...ఏవో ఆలోచిస్తూ...ఎంతో కొంత ఆందోళనతో...కాస్తా అసహనంతో.... @telugumaster
బైటికి చెప్పుకోలేని ఒత్తిడి లో ఉంటున్న ప్రధానోపాధ్యాయుడా నీకు వేల దండాలు.....🙏🙏🙏🙏 నీ ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోగలరు.... *చిక్కుముడుల అమ్మ ఒడి...తరగని సముద్రంలా...నాడు..నేడు...తరుముకొస్తున్న...డ్రై రేషన్...నిను వీడని నీడను నేనే అనేట్టు...
దీక్షా ట్రైనింగ్...MDM, STMS, పోర్ట్ ఫోలియో ల అప్డేట్స్....* ఏమని చెప్పను...ఎన్నెన్ని చెప్పాను...HM ల తిప్పలు....ఒకప్పుడు సమర్థుడైన HM పాఠశాలని... ని స్టూడెంట్స్ ని నిరంతరం పరిశీలిస్తూ...పాఠశాలను ఒక క్రమపద్ధతిలో ఉంచేవారు.
భూగోళంపై అడవుల క్షీణత మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వృక్ష సంపద తరిగేకొద్దీ కరవు కాటకాలు, తుపాన్లు, వరదలు, ఇతర వాతావరణ మార్పులు మానవాళికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎదుర్కొనబోయే ఘోర పరిస్థితులు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి.
కొన్నేళ్లుగా భారత్‌లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కార్చిచ్చు పెద్దయెత్తున అడవులను భస్మీపటలం చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా కార్చిచ్చును నియంత్రించడం అభివృద్ది చెందిన దేశాలకు సైతం కష్టతరంగా మారుతోంది.
#MaharastraDay
1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర, (మరాఠీ: #महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరువాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ
సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.
మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకము అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది.
#FatherOfIndianCinema#DadaSahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది.వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి
దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.